తమిళ హీరో సూర్య వరుస సినిమాలతో బీజీగా ఉన్నాడు. తాజాగా సూర్య నటిస్తున్న మూవీ ‘ఆకాశం నీ హద్దురా’. ఈ మూవీని తెలుగు, తమిళంలో ఒకేసారి షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్స్, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. సూర్యకి జోడిగా అపర్ణ బాలమురళి నటిస్తోంది. ఇందులో మోహన్ బాబు కీలక రోల్స్ చేస్తున్నాడు. ఈ మూలోని ‘పిల్ల పులి.. పోరగాడే నీకు బలి’ సాంగ్స్ యూట్యూబ్లో ట్రెండింగ్ మారిన సంగతి తెల్సింది. ఈ మూవీ చేస్తూనే సూర్య తన 39వ మూవీని లైన్లో పెట్టారు. ఈ మూవీని ‘సింగం’ మూవీ డైరెక్టర్ హరి తెరకెక్కించనున్నాడు.
సూర్యకు తెలుగుతోపాటు తమిళంలో మంచి మార్కెట్ ఉంది. అందుకనే ఆయన సినిమాలను తమిళంతోపాటు తెలుగులోనూ డబ్బింగ్ అవుతుంటాయి. దర్శకుడు హరి- సూర్య కాంబినేషన్లలో ఇప్పటికే ఐదు మూవీలు తెరకెక్కాయి. ఇందులో ‘సింగం’ సీక్వెల్స్ భారీ విజయాలను సాధించాయి. అయితే తాజాగా మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో ఓ మూవీ రాబోతుంది.
సూర్య 39వ మూవీకి ‘అరువా’ అనే టైటిల్‌ను ఖరారైంది. ‘అరువా’ అంటే కత్తి అని అర్థం. ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది దీపావళికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Suriya hari new movie title aruvaa
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com