
సూపర్ హిట్ సినిమా తీసిన తరువాత కూడా ఛాన్స్ రాకపోతే.. అదీ స్టార్ హీరోలతో సినిమాలు చేసి హిట్లు కొట్టిన స్టార్ డైరెక్టర్ కి అంటే.. కచ్చితంగా అది ఆ డైరెక్టర్ కి అవమానమే. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అంటే… ‘మహర్షి’ డైరెక్టర్ వంశీ పైడిపల్లి. మొదట వంశీ తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలని బాగానే ప్రయత్నాలు చేశాడు. మహేష్ కూడా వంశీతో మంచి సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చాడు. కానీ పైడిపల్లి చెప్పిన కథ మహేష్ బాబుకు నచ్చకపోవడం, చివరికి ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారని వార్తలు వచ్చేయడం జరిగిపోయాయి. మొత్తానికి వంశీకి మహేష్ హ్యాండ్ ఇచ్చి.. పరుశురాంకి ఫిక్స్ ఆయిపోయాడు.
హైదరాబాద్ అంటే ఎందుకంత నిర్లక్యం!
ఇక చేసేదేం లేక వంశీ మహేష్ ని వదిలేసి మిగిలిన స్టార్ హీరోల చుట్టూ కథ పట్టుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ దగ్గర నుండి తారక్, రామ్ చరణ్ దాకా అందరి పేర్లు వినపడ్డాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం దర్శకుడు వంశీ పైడిపల్లి తన తరువాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోనే ప్లాన్ చేస్తున్నాడట. అయితే చరణ్ తో సినిమా అంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే. ఈ లోపు వెబ్ సిరీస్ చేయాలని చూస్తున్నాడు వంశీ.
ఇదీ చంద్రబాబు, దేవినేని ఉమ ఘనకార్యమట?
అయితే త్వరలోనే చరణ్ కి కథ చెప్పి ఒప్పించాలని వంశీ డిసైడ్ అయ్యాడట. అన్నట్టు ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా ఉండబోతోందని, ప్రత్యేకంగా క్రేజీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వంశీ పైడిపల్లి సినిమాని రూపొందించే ఆలోచనలో ఉన్నారట. ఇక వంశీ, చరణ్ కాంబినేషన్ అంటే భారీ అంచనాలే ఉంటాయి. పైగా వంశీ లాస్ట్ మూవీ ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించడంతో చరణ్ తో చేయబోయే సినిమా పై భారీ ఎక్స్ పెటేషన్స్ ఉంటాయి.