
దేశంలోనే కరోనా టెస్టులలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానములో నిలిచింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కోటికి పైగా కరోనా టెస్టులు చేయడం జరిగింది. 10.17 లక్షల కరోనా టెస్టులతో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచింది. దేశంలోనే అత్యధిక టెస్టులు నిర్వహించిన రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది. ఈ విషయంలో తెలంగాణా బాగా వెనుక బడింది. కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలలో ఒకటిగా ఉన్న తెలంగాణా కేవలం 1.15 లక్షల కరోనా టెస్టులు నిర్వహించినట్లు సమాచారం ఉంది. అంటే దేశవ్యాప్తంగా నిర్వచించిన కరోనా టెస్టులలో 1.15 శాతం టెస్టులు మాత్రమే తెలంగాణాలో జరిగాయి.
వైరస్ ల ఖార్ఖానాగా చైనా ఎందుకు మారుతుంది?
హైదరాబాద్ లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టెస్టుల విషయంలో ప్రభుత్వ అలసత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. ప్రతిపక్షం ఈ విషయంలో సీఎం కేసీఆర్ ని ఏకిపారేస్తుండగా… ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో రెండు నెలలకు ముందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొరియా నుండి లక్షల కిట్లు తెప్పించి పరీక్షలు విరివిగా నిర్వహించారు. వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుంటూ కరోనా కట్టడి చేయడంలో చాలా వరకు విజయం సాధించారు. కరోనా కేసుల విషయంలో తెలంగాణా ఆంధ్రప్రదేశ్ ని దాటి వేసింది. జులై 5వరకు 23,902 మందికి కరోనా సోకినట్లు వారిలో 12,703 కోలుకున్నట్లు 10,904 మంది చికిత్స తీసుకుంటున్నట్లు బులెటిన్ విడుదల చేశారు. అలాగే కరోనా వలన 295 మంది మరణించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో జులై 5వరకు 18697 మంది కరోనా బారిన పడగా 8442 మంది కోలుకున్నారు. 10043 మంది రోగులు చికిత్స తీసుకుంటున్నారు. ఇక కరోనా వలన మరణించిన వారి సంఖ్య 232గా ఉంది. ఒకప్పుడు ఆంధ్రా కంటే తెలంగాణా లో రోగులు సంఖ్య తక్కువగా ఉండడం గమనార్హం. నిన్న ఆంధ్రపదేశ్ లో 20,567 టెస్టులు నిర్వహించగా..తెలంగాణలో 5290 మాత్రమే నిర్వహించారు. ఏపీలో 20,567 టెస్టులకు 961 పాజిటివ్ కేసులు రాగా, తెలంగాణాలో 5290 టెస్టులకు 1,590 పాజిటివ్ కేసులు రావడం ఆందోళనకరం అంశం.
బాబుని చిత్తుచేసే జగన్ మరో ఎత్తు..!
ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కనీసం వెంటిలేటర్ సౌకర్యం లేక మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువైపోయింది. పేషేంట్లకు సరిపడా బెడ్లు లేక, ఆసుపత్రి వరండాలకు పరిమితం అవుతున్నారు. ఇక ప్రయివేటు ఆసుపత్రులలో దోపిడీ దారుణంగా ఉంది. రోజుకు లక్ష రూపాయలకు పైగా కరోనా పేషేంట్ నుండి వసూలు చేస్తున్నాయి కార్పొరేట్ ఆసుపత్రులు. చనిపోయిన వారి శవాలు అప్పగించడానికి లక్షలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి హృదయ విదారక పరిస్థితి కరోనా వలన హైదరాబాద్ లో దాపురించింది. మరో వైపు సీఎం కెసిఆర్ కి కరోనా సోకిందని…ఆయన తన ఫార్మ్ హౌస్ లో చికిత్స తీసుకుంటున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది.