
గజరాజు(ఏనుగు).. పేరు తగ్గట్టుగానే ఎంతో ఠీవీగా దర్శనిమిస్తాయి. వినాయకుడి ప్రతిరూపంగా భారతీయులు గజరాజును కొలుస్తుంటారు. ఏనుగును చూడగానే తొలుత అందరికీ గుర్తుకొచ్చేది భారీ రూపం.. పెద్ద తొండం.. పెద్ద చెవులు.. చిన్న కళ్లు మాత్రమే.. అయితే ఇప్పుడు చెప్పబోయే గజరాజు మాత్రం చాలా స్పెషల్. ఈ ఏనుగుకు సింహంలా జులూ ఉండటం అందరినీ ఆకట్టుకుంటోంది. సూపర్ బాబ్ హెయిర్ కట్ తో దర్శనమిస్తున్న గజరాజు ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
చంద్రబాబుకి పచ్చకామెర్లు.. పవన్ కి కాదు!
ఏనుగులకు సాధారణంగా తలపై భాగం(కుంభస్థలం)లో జుట్టు ఉంటుంది. అయితే కొన్ని కారణాలతో ఆ జుట్టు రాలిపోతూ ఉంటుంది. కొన్ని ఏనుగుల మాత్రం ఆ జుట్టు అలాగే ఉంటుంది. అలా ఒక ఏనుగు తలపై భారీగా పెరిగిన జుట్టును చాలా స్టయిలీష్ గా హెయిర్ కట్ చేయించారు. బాబ్ హెయిర్ కట్ తో ముందుకు నీటుగా దువ్వారు. దీనికి బాబ్ హెయిర్ కట్ సెంగమలం పేరు పెట్టారు. ఏనుగు బాబ్ హెయిర్ కట్ తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టారు. గజరాజు తలపై జూలుతో మరింత అందంగా కన్పిస్తున్నాడు.
ఈ ఫొటోలను చూసిన జంతు ప్రేమికులు, ఫారెస్టులు అధికారులు ఖుషీ అవుతున్నారు. బాబ్ హెయిర్ కట్ సెంగమలం ఏనుగు పేరుతో సోషల్ మీడియాలో ఒకరికి ఒకరు షేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ గజరాజుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/SudhaRamenIFS/status/1279696616706859008