Home Blog Page 8414

ఆశగా ఎదురుచూస్తున్న చైతు హీరోయిన్ !


సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ అనే ఒక రెగ్యులర్ డైలాగ్ ఒకటి ఉంది. అయితే ఛాన్స్ వచ్చినా.. అలాగే సక్సెస్ వచ్చినా.. ఒక్కోసారి లైఫ్ సెట్ అవ్వడం, ఇండస్ట్రీలో నిలబడటం అనేవి చాలా కష్టం. భారీ హిట్ అందుకున్నాక కూడా.. పైగా సంవత్సరం ఎదురుచూసినా కూడా అవకాశం రాకపోతే.. పోనీ యాక్టింగ్ రాదా అంటే.. సూపర్, సరే గ్లామర్ లేదా అంటే.. ఆ విషయంలో అసలు అనుమానమే లేదు. అన్నిటికీ మించి అమ్మడు అందాల బొమ్మ. మరి ఎందుకు అవకాశాలు రావడం లేదు ? ఇంతకీ ఖాళీగా కూర్చొన్న ఆ బ్యూటీ ఎవరు ? ఆమె బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ‘దివ్యాంశ కౌశిక్’. మజిలీ సినిమాలో క్రికెటర్ చైతుకు జోడిగా నటించి మెప్పించిన హీరోయిన్ అంటే అందరూ గుర్తు పడతారేమో.

జగన్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్న అధికారుల చేతివాటం

ముఖ్యంగా నార్త్ ఇండియన్ అమ్మాయిగా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ దివ్యాంశ బాగా చేసింది. కొన్ని సన్నివేశాల్లో చైతుని డామినేట్ కూడా చేసింది. ఆ సినిమా రిలీజ్ అప్పుడు ఈమెకు మంచి పేరు కూడా వచ్చింది. కానీ మజిలీలో హీరోయిన్ గా క్రెడిట్ మొత్తం సమంతకే వెళ్ళిపోవడం, ప్రమోషన్స్ లో, ఇంటర్వ్యూల్లో ఎక్కువగా సమంత మీదే ఫోకస్ చేయడంతో దివ్యాంశకు రావాల్సిన స్థాయిలో స్టార్ డమ్ రాకుండా పోయింది. దాంతో దివ్యాంశకు పెద్దగా ఆఫర్స్ కూడా రాలేదు. ఇప్పటికే మజిలీ టీం మొత్తం తమ తరువాత సినిమాలను కూడా ఆల్ మోస్ట్ పూర్తి చేసుకుంటే… దివ్యాంశకు చెప్పుకో తగ్గ ఒక్క సినిమా కూడా లేదు. ఇప్పటికీ మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తూనే ఉంది.

మంత్రి పదవీపై ఆశలు పెంచుకుంటున్న స్పీకర్..!

మరి ఏ స్టార్ హీరో కరుణిస్తాడో.. ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలందరికీ దివ్యాంశ కౌశిక్ సరిగ్గా సూట్ అవుతుంది. పైగా మంచి నటి కూడా.. అద్భుతంగా నటించగలిగిన హావభావాలు ఉన్న హీరోయిన్ కి ఛాన్స్ లు రాకపోవడం నిజంగా బాధ కరమే. మొత్తానికి దివ్యంశ కౌశిక్ పరిస్థితి.. సినిమా సూపర్ హిట్.. కలెక్షన్స్ మాత్రం ఫట్ అన్న మాదిరిగా తయారయిందట. ఒకపక్క సరైన హిట్ అండ్ యాక్టింగ్ లేని హీరోయిన్స్ కూడా మంచి ఆఫర్స్ తో ముందుకు పోతుంటే.. చైతు లాంటి హీరో పక్కన మెయిన్ లీడ్ గా చేసిన దివ్యంశ కౌశిక్ మాత్రం కెరీర్ మొదలుపెట్టిన చోటే ఆశగా ఎదురుచూస్తూ ఉంది.

లేట్ వయసులో పర్ఫెక్ట్ ఫిజిక్.. నెటిజన్లు స్టన్ !


ముదురు వయసులోనూ లేత అందాలు ఉన్న హాట్ బ్యూటీ ‘ఇషా గుప్తా’. వరుస హిందీ సినిమాలతో పాటు ఒకటి రెండు తెలుగు సినిమాలలో కూడా నటించి తన హాట్ హాట్ గ్లామర్ షోతో సౌత్ ప్రేక్షకులను కూడా ఒక ఊపు ఊపింది. దాంతో తెలుగు ప్రేక్షకులకు ఈ బ్యూటీని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే గత కొంతకాలంగా ఇషా హవా తగ్గినట్లు కనిపిస్తుంది. ఎంత స్క్రీన్ షో చేసినా.. బాలీవుడ్ లో ఆఫర్లు ఇచ్చేవారు కరువు అయిపోయారు. సీనియర్ హీరోయిన్ గా మారింది కాబట్టి క్రేజీ ఆఫర్లు రావడం లేదనేది ఒకటి అయితే, తన బాయ్ ఫ్రెండ్ తో ఫుల్ బిజీగా ఉంటుండటం కూడా మరో కారణం అట. ఏది అయితే ఏమి ఆటోమేటిక్ గా ఈ ముదురు బ్యూటీని సినిమాల అవకాశాలతో సేద తీర్చేవాళ్ళు లేకుండా పోయారు.

బ్రెజిల్ దేశాధ్యక్షుడిని కాపాడిన ఇండియన్ మెడిసిన్..!

అయినా ఇషా మాత్రం అస్సలు తగ్గడం లేదు.. తనలో దాగి ఉన్న అందాలను మాత్రం సోషల్ మీడియాలో ప్రదర్శించకుండా ఉండట్లేదు. ఫుల్ హాట్ ఫోటోషూట్స్ లో పాల్గొని ఆ ఫోటోలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా పై దండ యాత్ర చేస్తూనే ఉంది. దాంతో కుర్రాళ్ళు కూడా అమ్మడు ఫొటోలను చూస్తూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఫోటోలలో తన పై పార్ట్ బాగా ఎలివేట్ అయ్యేలా లూజ్ డ్రెస్ లతో.. కాస్త వెరైటీ ఫోజ్ లు ఇవ్వడంలో ఇషా మాస్టర్ డిగ్రీ చేసేసింది. మొత్తానికి వీలైనంత హాటుగా కనిపిస్తూ పోజులిస్తుంది.

https://www.instagram.com/p/CCafTgxpqBp/

అయినా ఇషా అందాల ప్రదర్శన ఎలా ఉన్నా.. రోజు రోజుకు పర్ఫెక్ట్ ఫిజిక్ తో స్లిమ్ గా తయారవుతుంది. ఈ మధ్యే ఇండస్ట్రీకి వచ్చిన యంగ్ బ్యూటీలా ఇషా అలా ఫిట్ గా ఎలా మెయింటైన్ చేయగలుతుందో అని నెటిజన్లు తెగ స్టన్ అయిపోతున్నారు. ముదురు వయసులో కూడా లేత అందాలను మెయింటైన్ చేయడం అంటే మాటలు కాదు, అది ఇషా గుప్తాకి తెలిసినంతగా మరో హీరోయిన్ కి తెలియదనడంలో ఎలాంటి మొహమాట పడాల్సిన పనిలేదు.

రామ్‌ ‘రెడ్’‌ మూవీకి ఓటీటీ ఫ్యాన్సీ ఆఫర్స్‌!


కరోనా దెబ్బకు థియేటర్లు మూత పడడం.. తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియకపోవడంతో టాలీవుడ్ సినిమాలు ఓటీటీల బాట పట్టాయి. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ లాంటి పెద్ద సంస్థ నిర్మించిన ‘కృష్ణ అండ్ హిజ్‌ లీల’ సైతం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ‘ భానుమతి అండ్ రామకృష్ణ’, ‘47 డేస్’ తదితర సినిమాలు కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కానీ, ఇవన్నీ చిన్న సినిమాలే. పెద్ద హీరోలు నటించిన, ఎక్కువ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాల విషయంలో నిర్మాతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. దాంతో ఇప్పటికే షూటింగ్, పోస్ట్‌ ప్రొడక్షన్ కూడా జరుగుపుకున్న సినిమాలు కూడా కొన్ని విడుదల కాకుండా ఆగిపోయాయి. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నప్పటికీ ముందడుగు వేయలేకపోతున్నారు. స్టార్ హీరోల మార్కెట్‌, ఫ్యాన్స్‌ను దృష్టిలో ఉంచుకొని నేరుగా థియేటర్లలోనే రిలీజ్‌ చేయాలని ఆలోచిస్తున్నారు. కానీ, ఇప్పట్లో థియేటర్లు ఓపెన్‌ అవడం కష్టమే. ఒకవేళ ఓపెన్‌ అయినా మునుపటిలా ప్రేక్షకులు వస్తారని చెప్పలేం. దాంతో, పెద్ద సినిమాల నిర్మాతలు, హీరోలు కూడా పునరాలోచనలో పడ్డారు.

జగన్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్న అధికారుల చేతివాటం

ఈ క్రమంలో ఎనర్జిటిక్ హీరో రామ్ తాజా చిత్రం ‘రెడ్‌’ ఓటీటీలో రిలీజయ్యే తొలి పెద్ద సినిమాలా నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ నుంచి ఈ మూవీకి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఓ సంస్థ నుంచి 25 కోట్ల ఆఫర్ రాగా, ఇప్పుడు మరో ఫ్లాట్‌ఫామ్‌ ఏకంగా 30 కోట్ల ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. దాంతో, ఆలస్యమైనా సరే థియేటర్లోనే విడుదల చేయాలని అనుకున్న నిర్మాతలు ఆలోచనలో పడ్డారని వినికిడి. ఇస్మార్ట్ శంకర్ విజయం తర్వాత రామ్ నటించిన చిత్రం కావడంతో ‘రెడ్‌’పై అంచనాలు భారీగా పెరిగాయి. తిరుమల కిశోర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాళవిక శర్మ, నివేదా పేతురాజ్‌ హీరోయిన్లుగా నటించారు.

నిత్యను పెళ్లికి ఒప్పించే పనిలో స్టార్ హీరో!


సౌత్‌లో అన్ని భాషల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిత్యా మీనన్ ఈ మధ్యే బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. అక్షయ్‌ కుమార్ సూపర్ హిట్‌ మూవీ ‘మిషన్‌ మంగల్‌’లో యువ సైంటిస్ట్‌గా నటించి మెప్పించింది. ఇప్పుడు అభిషేక్‌ బచ్చన్‌ లీడ్‌ రోల్‌ పోషించిన ‘బ్రీత్2 ఇన్ టూ ద షాడోస్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా యాక్ట్‌ చేసింది. సహజంగానే నిత్య మంచి నటి. కళ్లతోనే హావభావాలు పలికిస్తుంది. హైట్‌, అందం, మంచి శరీరాకృతి లేకున్నా కూడా తన నటనతోనే ఆమె ముందుకెళ్తోంది. ఒకవైపు సినిమాలు, మ‌రోవైపు వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతోంది. చూడ్డానికి చిన్నదిగా కనిపించినా ఆమె వయసు పెద్దదే. ఏప్రిల్‌లోనే 32వ బర్త్‌డే చేసుకుంది. దాంతో, పెళ్లెప్పుడు అని చాలా మంది ఆమెను అడుగుతున్నారు. ఈ విషయంపై ఆమె స్పందించింది. ప్రస్తుతానికి తనకు పెళ్లి చేసుకోవాల‌న్న ఆస‌క్తి లేద‌ని చెప్పింది. కానీ, ఓ స్టార్ హీరో మాత్రం వెంటనే పెళ్లి చేసుకొమ్మని తరచూ చెబుతున్నాడట.

బాబుకు సినిమా చూపిస్తానంటున్న విసారెడ్డి..!

ఆ స్టార్ మరెవరో కాదు మమ్ముట్టీ కొడుకు దుల్కర్ సల్మన్‌. ‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన దుల్కర్ దక్షిణాదిలో ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నాడు. నిత్య మీనన్‌తో కలిసి అతను ‘ఓకే కాదల్’లో నటించాడు. ఈ మూవీ తెలుగులో ఓకే బంగారం పేరుతో డబ్‌ అయింది. ఈ మూవీ చేస్తుండగానే నిత్యతో అతనికి మంచి ప్రెండ్షిప్‌ కుదిరింది. ఈ నేప‌థ్యంలో పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుంద‌ని తనకు చెబుతున్నాడని నిత్య చెప్పింది. చాలాసార్లు పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశాడ‌ని తెలిపింది. పెళ్లి చేసుకుంటే జీవితంలో వ‌చ్చే మార్పుల‌ను కూడా వివ‌రించాడ‌ని చెప్పింది. వివాహ బందం గురించి దుల్కర్ అంత గొప్పగా చెబుతుంటే ఒక్కోసారి తనకు కూడా పెళ్లి చేసుకోవాల‌నిపించింది అని తెలిపింది. కాగా, దుల్కర్ ఇప్పటికే ఓ ఇంటివాడయ్యాడు. అతను అమ‌ల్ సుఫియాను 2011లోనే వివాహం చేసుకోగా.. వీరికి అమీరా సల్మాన్ అనే కూతురు ఉంది. పెళ్లి తర్వాత జీవితాన్ని బాగా ఆస్వాదిస్తున్న దుల్కర్ అందుకే నిత్యకు కూడా పెళ్లి చేసుకోవాలని చెబుతున్నాడు. మరి, ఆమె ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

జగన్ కి చంద్రబాబు నేర్పిన గుణపాఠం!

Tdp vs Ysrcp
టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ సీఎం జగన్ కి ఒక గుణపాఠం నేర్పిస్తున్నాడు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన జన్మభూమి కమిటీలు ప్రపంచంలో ఏ ప్రభుత్వానికీ తీసుకురానంత చెడ్డపేరును చంద్రబాబుకు తెచ్చిపెట్టాయి. ఓ రకంగా 2019 ఎన్నికల్లో చంద్రబాబు సర్కారు ఓటమికి ప్రధాన కారణంగా నిలిచాయి. దీంతో వైసీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీల తరహాలోనే తెరపైకి వచ్చిన వాలంటీర్ల వ్యవస్ధకు అలాంటి చెడ్డపేరు రాకుండా చూడాలని భావిస్తోంది. ఈ పని ఎంత త్వరగా చేయగలిగితే 2024 ఎన్నికల్లో తమకు అంతగా ఉపయోగపడుతుందని జగన్ భావిస్తున్నారు. దీంతో ముందుగా ఏడాదిలో రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్ధ పనితీరుపై ఓ సమగ్ర సర్వే చేయించాలని అనుకుంటున్నారు. ఇప్పటికే వాలంటీర్లపై వస్తున్న ఫిర్యాదులు, టీడీపీ ఈ వ్యవస్ధపై చేస్తున్న ఆరోపణలు, అక్కడక్కడా నమోదవుతున్న కేసులు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఒకసారి గ్రామ, వార్డు వాలంటీర్ల పనితీరుపై ప్రభుత్వానికి సమగ్రంగా సర్వే వివరాలు అందితే ఆ తర్వాత ఏం చేయాలనే దానిపై ఓ క్లారిటీ వస్తుంది. అప్పుడు అదే పీకే టీమ్ ను వాలంటీర్ల వ్యవస్ధ సమన్వయం చేయడంతో పాటు వాటి పనితీరుపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వడం.. అంతిమంగా ప్రభుత్వానికీ, ప్రజలకు మధ్య గ్యాప్ తగ్గించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. సర్వే పూర్తయ్యాక వీటి ఫలితాల ఆధారంగా పీకే టీమ్ కు ఇవ్వాల్సిన బాధ్యతలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అప్పుడు వాలంటీర్ల వ్యవస్ధ మెరుగ్గా సేవలందించేందుకు థర్డ్ పార్టీ పేరుతో పీకే టీమ్ రంగంలోకి దిగి సమన్వయం చేస్తుంది. 2024 ఎన్నికల నాటికి వాలంటీర్ల వ్యవస్ధను ప్రజలకు పూర్తి స్ధాయిలో చేరువ చేసి ఇక జనానికి ప్రభుత్వ సేవలు అందించడంలో గ్యాప్ పూర్తిగా తొలగించాలనేది జగన్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది.

బ్రెజిల్ దేశాధ్యక్షుడిని కాపాడిన ఇండియన్ మెడిసిన్..!


చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. ఇక్కడ.. అక్కడ అనే తేడాలేకుండా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోటికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రతీరోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నారు. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. అగ్రరాజ్యాలు సైతం కరోనా దాటికి విలవిలలాడిపోతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టిన కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఇలాంటి సమయంలో ఇండియాలో తయారైన హైడ్రాక్సీ క్లోరోక్వినోన్ సంజీవని పని చేస్తుండటంపై పలుదేశాల అధినేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

‘పాజిటీవ్’ కేసుల్లో తెలంగాణ టాప్.. కానీ?

ఇప్పటికే హైడ్రాక్సీ క్లోరోక్వినోన్ ను అమెరికాలో అధికారికంగా కరోనా ట్రీట్మెంట్లో వినియోగిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియా ప్రధాని మోదీకి ఫోన్ చేసి మరీ ఈ మెడిసిన్ ను అమెరికాకు దిగుమతి చేసుకున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో హైడ్రాక్సీ క్లోరోక్వినోన్ కరోనా రోగులపై మంచి ఫలితాలు ఇస్తుండటంతో చాలాదేశాలు తమకు ఈ మెడిసిన్ పంపించాలని భారత్ ను విజ్ఞప్తి చేశారు. కేంద్రం కూడా హైడ్రాక్సీ క్లోరోక్వినోన్ మందు కావాలని అడిగిన ప్రతీ దేశానికి లేదనకుండా సరఫరా చేసింది. ఇప్పటికే వందకు పైగా దేశాలకు భారత్ ఈ మందును సరఫరా చేసినట్లు సమాచారం.

అయితే ఈ మందు వినియోగంపై పలువురు విమర్శలు గుప్పించారు. కరోనాకు ఈ మెడిసిన్ పనిచేయకపోగా వారికి ప్రాణాలకు మరింత ముప్పు కలుగుతుందని కొన్నిదేశాల్లో ఈ మందు వాడాకాన్ని తగ్గించారు. అయితే తాజాగా బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో హైడ్రాక్సీ క్లోరోక్వినోన్ మెడిసిన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసుల్లో ప్రస్తుతం ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉంది. వైరస్ పట్ల తొలినాళ్లలో అక్కడి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో కేసుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. మాస్కు కూడా పెట్టుకోకుండా తిరగడంతో బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో కూడా కరోనా బారినపడ్డారు.

బాబుకు సినిమా చూపిస్తానంటున్న విసారెడ్డి..!

ప్రస్తుతం తాను కరోనా నుంచి వారంరోజుల్లోనే రికవరీ అయినట్లు బ్రెజిల్ అధ్యక్షుడు ప్రకటించాడు. తాను ప్రతీరోజు ఒక హైడ్రాక్సీ క్లోరోక్వినోన్ మాత్ర తీసుకోవడం వల్లనే కరోనా నుంచి రికవరీ అయినట్లు చెప్పారు. ప్రస్తుతానికి హైడ్రాక్సీ క్లోరోక్వినోన్ కు ప్రత్యామ్నాయం మరొకటి లేదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నానని చెప్పారు. ఈ మెడిసిన్ ను విమర్శిస్తున్న వారంతా ప్రత్యామ్నాయం చూపించాలని ఆయన సవాల్ విసిరారు.

కరోనా సోకక ముందు ఎలాంటి మాస్క్ పెట్టుకోకుండా తిరిగిన అధ్యక్షుడు ప్రస్తుతం మాస్క్ పెట్టుకుంటూ అన్ని జాగ్రత్తలు పాటిస్తుండటం విశేషం. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం హైడ్రాక్సీ క్లోరోక్వినోన్ మెడిసిన్ ను సంజీవనిగా వర్ణించడాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఇండియాలో ఈ మందును మలేరియా నివారణలో ఉపయోగిస్తుండగా ప్రస్తుతం కరోనా నివారణలో ప్రధానంగా వాడుతుండటం గమనార్హం.

బిగ్‌బాస్‌-4లో ‘నగ్నం’ బ్యూటీ..!


రామ్‌ గోపాల్‌ వర్మ సినిమాలే కాదు.. వాటిలో యాక్ట్‌ చేసే నటీనటులు కూడా కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తారు. అప్పటిదాకా ఎలా ఉన్నా.. వర్మ మూవీలో మూవీస్‌లో నటించగానే వాళ్ల మాటతీరు మారిపోతుంది. ఆర్జీవీ గాలి సోకి అతనిలానే బోల్డ్‌గా మాట్లాడేస్తుంటారు. ఇట్టే జనలా దృష్టిని తమ వైపు తిప్పుకుంటారు. ఇండస్ట్రీకి చాలా మందిని పరిచయం చేసిన రాము.. ఈ మధ్యే కాస్టూమ్‌ డిజైనర్ శ్రీరాపానను స్వీటీ పేరుతో నటిగా ఇంట్రడ్యూస్‌ చేశాడు. ఆమె ప్రధాన పాత్రధారిగా అడల్డ్‌ కంటెంట్‌తో ‘నగ్నం’ అనే సినిమా తీశాడు. తన ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్లో రిలీజైన ఈ మూవీని చాలా మందే చూశారు. ఈ మూవీకి తన మార్కు మార్కెటింగ్‌ చేసిన రాము.. స్వీటీ అలియాస్‌ శ్రీరాపాకకు ఓవర్నైట్‌ స్టార్డమ్‌ తెచ్చిపెట్టాడు. కేవలం రెండు రోజులు మాత్రమే ‘నగ్నం’ షూటింగ్‌లో పాల్గొన్న స్వీటీ… అనూహ్య క్రేజ్‌ రావడంతో ఇప్పుడు దాన్ని పెంచుకొని క్యాష్ చేసుకునే పనిలో పడింది. నగ్నం రిలీజైన తర్వాత చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ప్రతీ యూట్యూబ్‌ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చేస్తోంది. ప్రతి ఇంటర్వ్యూలో ఏదో ఒక హాట్ టాపిక్ మాట్లాడి.. హైలెట్ అవుతుంది. అయితే ఆమె పని కట్టుకొని ఇంటర్వ్యూలు ఇవ్వడం వెనుక పెద్ద ప్లానే ఉందట.

టీడీపీ ట్రాప్లో వైసీపీ నేతలు పడ్డారు?

స్వీటీ తెలుగు బిగ్‌బాస్- 4 సీజన్‌కు ఎంపికైందట. ఆ షో కోసమే ఆమె ప్రతి రోజూ సోషల్‌ మీడియాలో ఉంటూ అటెన్షన్ క్రియేట్ చేస్తుందని టాక్‌. సెలెబ్రిటీలు, కాంట్రవర్సీలు క్రియేట్‌ చేసే వారిని తమ హౌజ్‌లోకి తీసుకునేందుకు బిగ్‌ బాస్‌ నిర్వాహకులు ముందుంటారు. నాలుగో సీజన్‌ కోసం కంటెస్టంట్స్‌ కోసం అన్వేషిస్తుండగానే నగ్నం రిలీజ్‌ అవడం.. ఇంటర్వ్యూలో స్వీటీ బోల్డ్‌గా మాట్లాడడంతో తమకు సరైన వ్యక్తి దొరికిందని భావించారట. దాంతో, స్వీటీకి ఆఫర్ ఇవ్వడంతో పాటు ఇంటర్వ్యూలు కొనసాగించాలని సూచించినట్టు తెలుస్తోంది. అయితే, ఇప్పటి వరకు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలలో బిగ్‌ బాస్‌ గురించి స్వీటీ ఎక్కడా ప్రస్తావించలేదు. కంటెస్టెంట్స్‌ విషయంలో బిగ్‌బాస్‌ యాజమాన్యం చివరి నిమిషం వరకూ గోప్యత పాటించాలని చూస్తుంది. కానీ, ఇప్పటికే వీళ్లే కంటెస్టెంట్స్‌ అంటూ సోషల్‌ మీడియాలో ఓ లిస్ట్‌ చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు ఆ లిస్ట్‌లో స్వీటీ అలియాస్‌ శ్రీరాపాక పేరు కూడా చేరింది. నిజంగానే ఆమెను ఎంపిక చేస్తే బిగ్‌బాస్‌ మరింత హాట్‌గా హీట్‌గా సాగడం ఖాయమే అంటున్నారు ప్రేక్షకులు.

హీరోలను ఎందుకు ప్రశ్నించరు.. నాని హీరోయిన్‌


శ్రద్ధా శ్రీనాథ్. నాని సూపర్ హిట్ మూవీ ‘జెర్సీ’లో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఫస్ట్‌ మూవీతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఈ మధ్య నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘కృష్ణ అండ్ లీల’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగులో మరిన్ని ఆఫర్లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులకు ఓ ప్రశ్న వేసింది. హీరోలను ప్రశ్నించగలరా? అంటోంది. సోషల్‌ మీడియా వేదికగా ఓ ఆసక్తికర చర్చకు తెరలేపింది. హీరోలు పెళ్లి తర్వాత కూడా శృంగార సన్నివేశాల్లో నటిస్తుంటారు. అలాగే పాత్రల ఎంపిక విషయంలోనూ ఎలాంటి మార్పూ అవసరంలేదు. కానీ హీరోయిన్ల పరిస్థితి వేరు. మ్యారేజ్‌ అయితే చాన్స్‌లు తగ్గిపోతాయి. సమంతా లాంటి ఒకరిద్దరిని మినహాయిస్తే చాన్స్‌లు రావన్న భయంతో చాలా మంది హీరోయిన్లు తమ పెళ్లిని వాయిదా వేసుకుంటున్నారు. అలాగే పెళ్లయ్యాక రొమాంటిక్ సీన్స్‌లో నటిస్తే చాలా మంది విమర్శకులు తమ గొంతు సవరిస్తారు. పెళ్లాయ్యాక అలాంటి సీన్స్‌ అవసరమా అంటారు.

టీడీపీ ట్రాప్లో వైసీపీ నేతలు పడ్డారు?

దీన్ని శ్రద్ధా శ్రీనాథ్‌ తప్పుపడుతోంది. ‘పెళ్లయ్యాక హీరోయిన్‌కి నిజంగానే డిమాండ్‌ తగ్గుతుందా? మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను’ అని ఫ్యాన్స్‌ను కోరింది.ఇది పది మార్కుల ప్రశ్న. దయచేసి చర్చించండి అని రిక్వెస్ట్‌ చేసింది. దానికి కారణం ఏమిటో కూడా ఆమె వివరించింది. తన స్నేహితురాలైన ఓ నటి త్వరలో పెళ్లి చేసుకోబోతోందని తెలిసి ఇండస్ట్రికి చెందిన ఓ వ్యక్తి పెళ్లి తర్వాత కూడా ఆమె నటిస్తుందా అని చాలా నిర్లక్ష్యంగా తనను అడిగాడని చెప్పింది. ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోవడంతో పాటు, చాలా కోపం వచ్చిందని తెలిపింది. అలాగే ఆ ప్రశ్న తనను ఆలోచనలో పడేసిందని, వివాహం అయిన నటులు రొమాంటిక్‌ సీన్స్‌లో నటిస్తున్నారు కదా? అలాంటి ప్రశ్నలు వారిని ఎందుకు అడగరో అర్థం కావడం లేదు అని చెప్పింది. ఈ విషయం గురించి మీ స్పందన తెలుసుకోవాలనుకుంటున్నా అని సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ను అడిగింది. ఆమె పోస్ట్‌కి పలువురు ఫాలోయర్స్‌ స్పందించారు. ‘మీరు చెప్పింది కరెక్ట్‌. హీరోలకి ఒక న్యాయం.. హీరోయిన్లకి ఒక న్యాయమా?’ అని అంటున్నారు.

‘పవర్ స్టార్’తో వర్మ లక్ష్యం నెరవేరుతుందా?


పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వ్యక్తి ఉండేరేమో అంటే అతిశయోక్తి కాదేమో.. మెగాస్టార్ తమ్ముడిగా పవన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కొద్దిరోజుల్లోనే తనకంటూ ఓ ప్రత్యేక స్టార్డమ్ సాధించుకున్నాడు. కోట్లలో అభిమానులు కలిగిన హీరోల్లో పవన్ కల్యాణ్ ఒకరు. అందరి హీరోల కంటే కూడా పవన్ కి  వీరభిమానులు ఎక్కువగా ఉంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. ఇతర హీరోల ఆడియో ఫంక్షన్లలోనూ పవన్ నామస్మరణ చేస్తూ పలుమార్లు వారికి విసుగుతెప్పించిన సంఘటనలు అనేక ఉన్నాయి.

టీడీపీ ట్రాప్లో వైసీపీ నేతలు పడ్డారు?

సినిమాల్లో నెంబర్ వన్ గా కొనసాగుతుండగానే మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. చిరంజీవి వెంట పవన్ కల్యాణ్ కూడా నడిచాడు. యువరాజ్యం అధినేతగా రాష్ట్రమంతటా పర్యటించాడు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం 18సీట్లు సాధించింది. ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ పవన్ మళ్లీ సినిమాల వైపు వెళ్లాడు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం.. చిరంజీవి కేంద్రమంత్రిగా పని చేయడం ఇదంతా అందరికీ తెల్సిందే..!

ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక ఏపీలోనూ రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఖైదీ-150తో ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ సత్తాచాటారు. ప్రస్తుతానికి చిరంజీవి క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రజలకు మంచిచేస్తే వారికి మద్దతుగా ట్వీట్ చేస్తున్నారు. ఇది తప్ప పెద్దగా రాజకీయాల జోలికి వెళ్లిన సంఘనలు మాత్రం ఇటీవలీకాలంలో ఎక్కడా కన్పించలేదు.

చిరంజీవి రాజకీయాల్లో నుంచి పూర్తిగా సైడయ్యాక పవన్ కల్యాణ్ ‘జనసేన’ పార్టీ పెట్టడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చింది. పవన్ మద్దతు ఇచ్చిన కూటమి అప్పుడు అధికారంలోకి వచ్చింది. పవన్ కల్యాణ్ టీడీపీ హయాంలో ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తూనే సినిమాల్లో నటించేవాడు. కాగా కిందటి ఎన్నికల్లో జనసేన వందకు పైగా సీట్లలో పోటీచేసి కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. పవన్ కల్యాణ్ రెండుచోట్ల పోటీచేసిన ఒక్కస్థానంలో గెలువకపోవడం ఆ పార్టీని కుంగదీసింది. అయినప్పటికీ పవన్ రాజకీయాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకొని ముందుకెళుతున్నాడు.

మంత్రి పదవీపై ఆశలు పెంచుకుంటున్న స్పీకర్..!

ప్రస్తుతం బీజేపీతో పొత్తుపెట్టుకొని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నాడు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి హవా ముందు టీడీపీ నిలువలేకపోతుంది. ఇలాంటి సమయంలోనే టీడీపీ నేతలు జనసేన, బీజేపీలోకి వలసలు కడుతున్నారు. వచ్చే ఎన్నికల వరకు జనసేన కూటమి బలపడాలని ఆలోచిస్తున్న తరుణంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ మూవీతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇంతకముందు మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను రాంగోపాల్ తీశాడు. ఎన్నికల సమయంలో ఆ సినిమాల విడుదల చేయాలని భావించినా సాధ్యంకాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ సినిమాను వర్మ రిలీజ్ చేసుకున్నాడు.

తాజాగా పవర్ స్టార్ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ‘పవర్ స్టార్’ మూవీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత కథ అంటూ పవర్ స్టార్ ఫస్టు లుక్ ను రిలీజ్ చేశాడు. పవర్ స్టార్ రెండు పదాల మధ్యలో పవన్ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ ను ఉంచడం చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీలో కేవలం పాలిటిక్స్ మాత్రమే కాకుండా చాలా విషయాలను మిక్స్ చేస్తున్నట్లు కన్పిస్తుంది. ఫస్ట్ లుక్ తోపాటు వర్మ విడుదల చేసిన స్టిల్స్ లో పవన్ తోపాటు చిరంజీవి, త్రివిక్రమ్ పాత్రధారులు, చీర కట్టుకున్న రష్యన్ అమ్మాయి కూడా వర్మ చూపించాడు.

పవన్ స్టార్ సినిమా ప్రకటించినపుడు పవన్ అభిమానులు వర్మను పెద్దగా పట్టించుకోలేదు. అయితే వర్మ మాత్రం పవన్ అభిమానుల సహనానికి పరీక్ష పెట్టేలా అతని చేష్టలున్నాయి. మొత్తానికి పవర్ స్టార్ సినిమా వర్మకు కావాల్సినంత వివాదాన్ని పంచేలా కన్పిస్తుంది. వరుసగా వివాదాస్పద అంశాలను సినిమాలుగా తెరకెక్కించి క్యాష్ చేసుకునే వర్మ పవర్ స్టార్ ఇమేజ్ ను కూడా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు. పవన్ అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా వర్మను చెడుగుడు ఆడుకుంటున్నారు. వర్మ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. వర్మ విషయంలో పవన్ వీరాభిమానులు ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. ఈ సినిమా వివాదంలో మున్ముందు ఎలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే..!

కేసీఆర్ ను డిఫెన్స్ లో పడేస్తున్న జగన్!


ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడమంటే ఇదే.. 2014లో ఇటు కేసీఆర్.. అటు చంద్రబాబు గెలవగానే కేసీఆర్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలను కాపీ కొట్టేవారు. రైతుబంధు నుంచి రైతు బీమా వరకు అన్నింటిని చంద్రబాబు మొదట కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టి హిట్ అయ్యాక ఏపీలోనూ పేరు మార్చి అమలు చేసేవారు.. కానీ 2019 ఎన్నికల్లో జగన్ గెలిచాక ట్రైన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు ప్రతీసారి జగన్ దూకుడుగా ముందుకెళ్తూ మొదట అమలు చేస్తుండగా.. అవి తెలంగాణ సీఎం కేసీఆర్ ను డిఫెన్స్ లో పడేస్తున్నారు.

‘పాజిటీవ్’ కేసుల్లో తెలంగాణ టాప్.. కానీ?

తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు మించి ఏపీలో జగన్ అమలు చేయడం ఇక్కడి టీఆర్ఎస్ నేతలకు కంటగింపుగా మారింది. ప్రతీసారి జగన్ అక్కడ గొప్ప పథకాలు ప్రవేశపెట్టడం.. ఇక్కడ ప్రజలకు తెలిసి ఇక్కడ అమలు చేయాలని కోరడం తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఇరుకునపెడుతోంది.

నవరత్నాలు, ఇంగ్లీష్ మీడియం లాంటి పథకాలు తెలంగాణలో కూడా అమలు చేయాలని పలు సార్లు విలేకరులు కేసీఆర్ ను అడగ్గా.. అంతకంటే మంచి పథకాలు తెలంగాణలో ఉన్నాయని ఆయన బదులిచ్చాడు తప్పితే అమలు చేస్తానని అనలేదు.

కరోనా టైంలో సీఎం జగన్ బాగా దూకుడుగా చర్యలు తీసుకుంటూ అరికట్టేస్తున్నారు. కానీ తెలంగాణలో కేసీఆర్ పట్టించుకోకపోవడంతో ఆరోగ్యవ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. ఈ క్రమంలోనే పలువురు ప్రభుత్వ వైద్యశాలల్లో పరిస్థితిపై వీడియోలు రిలీజ్ చేసి తెలంగాణలో పరిస్థితిని కళ్లకు కట్టారు.

మంత్రి పదవీపై ఆశలు పెంచుకుంటున్న స్పీకర్..!

కరోనా తీవ్రత పెరగడంతో సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి దాన్ని తెచ్చి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్సకు అవకాశం కల్పించారు. తెలంగాణలో అంతకంటే బాగా ప్రబలుతున్నా కేసీఆర్ చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేకపోవడంపై ఇప్పుడు విమర్శలు చెలరేగుతున్నాయి. సీఎం జగన్ ఏ ముహూర్తాన కరోనా చికిత్సలన్నింటిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాడో అప్పుడే తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఒత్తిడి మొదలైంది.కేసీఆర్ ఇంతటి కల్లోలం టైంలో తెలంగాణలో ఎందుకు ఇలా చేయడం లేదని అందరూ ప్రశ్నిస్తున్నారు.

ఇలా సమస్యలపై చురుకుగా స్పందిస్తూ ఏపీలో అమలు చేస్తున్న జగన్ దూకుడు వల్ల తెలంగాణ సీఎం కేసీఆర్ ఇరుకునపడుతున్నారు. ఏపీని పోల్చి చూస్తూ కేసీఆర్ ను చాలా మంది టార్గెట్ చేస్తున్నారు. అయితే ఎవ్వరు ఏమన్నా కానీ కేసీఆర్ మాత్రం సమస్యలపై పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది..

బాబుకు సినిమా చూపిస్తానంటున్న విసారెడ్డి..!

 

వైసీపీ ప్రభుత్వంపై నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలకు సమాధానమిస్తూ…రాజ్య సభ సభ్యడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ టీడీపీ నేతల గుండెల్లో గుబులు రేపుతోంది. ట్రైలర్ కే అదిరిపోతే ఎట్లా రానున్న నాలుగేళ్లలో సినిమా చూపిస్తాం అని ఆయన చేసిన ట్వీట్, టీడీపీ నేతలకు హెచ్చరికలుగా తోస్తున్నాయి. అనుభవజ్ఞుడని అధికారం ఇస్తే స్కాములతో దోచుకున్నారని, అవినీతి పరులంతా జైలుకు వెళ్ళవలసిందే అని తన ట్వీట్ లో పొందుపరిచారు. విజయ సాయి ట్వీట్స్ కేవలం టీడీపీ ఆరోపణలకు సమాధానం తప్ప, దీనిని అంతగా సీరియస్ గా తీసుకోవలసిన పనిలేదు అనుకుంటే పొరపాటే. రాష్ట్రంలో కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్న వారికి విజయ సాయి రెడ్డి మళ్ళీ ఎవరికో స్కెచ్ వేశాడనిపించక మానదు.

మంత్రి పదవీపై ఆశలు పెంచుకుంటున్న స్పీకర్..!

ఇప్పటికే రాష్ట్రంలో అనేకమంది టీడీపీ నాయకుల అరెస్టులు జరిగాయి. చింతమనేని ప్రభాకర్, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు మరియు కొల్లు రవీంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డి వంటి బడానేతలను అరెస్ట్ చేయం జరిగింది. ఈ అరెస్టులపై టీడీపీ నేతలు ఎంతగా గగ్గోలు పెట్టినా, ఏపీ ప్రభుత్వం అలానే ముందుకు పోతుంది. చివరకు బీసీ నేతల అరెస్టును, బీసీల అణచివేతలో భాగమే అని చంద్రబాబు మరియు ఆయన తనయుడు లోకేష్ బాబు నొక్కి వక్కాణించినా, జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. దానికితోడు బీసీ సంఘాలు కూడా నేరారోపణలున్న బీసీ నేతల తరుపున నిలబడేది లేదని చెప్పడం బాబు గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయ్యింది.

టీడీపీ ట్రాప్లో వైసీపీ నేతలు పడ్డారు?

టీడీపీ నేతల అరెస్టుల పట్ల ప్రజల్లో సానుభూతి, వ్యతిరేకత తీసుకువచ్చి భవిష్యత్ అరెస్టులకు అడ్డుకట్ట వేయాలని బాబు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కడం లేదు. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి హెచ్చరికలు తేలికగా తీసుకోలేని పరిస్థితి. ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఎంతటి నేతనైనా అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు. మరి ఈ ప్రక్రియ కొనసాగితే రానున్న నాలుగేళ్లలో టీడీపీ నేతలకు నిజంగానే సినిమా కనిపించడం ఖాయం. అందుకే జగన్ దూకుడుకు అడ్డుకట్ట వేసే పథక రచనలో బాబు ఉన్నారు. జగన్ ని దేవుడు కూడా ఆపలేడు మోడీ తప్ప అని జేసీ దివాకర్ రెడ్డి చెప్పిన మాట, గుర్తు చేసుకుంటున్న బాబుకి, మోడీ కటాక్షం లేక ఇబ్బందిపడుతున్నాడు. వ్యవస్థలను, వ్యక్తులను దారికి తెచ్చుకోవడంలో ఘనుడుగా పేరున్న బాబుకి మోడీని ప్రసన్నం చేసుకోవడం అంత కష్టమేమి కాదన్న మాట వినిపిస్తుంది.

మరోసారి సచివాలయం కూల్చివేతకు హైకోర్టు బ్రేక్..!

Treasure Under G Block


సీఎం కేసీఆర్ ఏ ముహూర్తానా తెలంగాణలో కొత్త సచివాలయం భవనాన్ని నిర్మించాలని భావించారో కానీ ఆ పనికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నారు. సీఎంగా కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశాక తెలంగాణలో ఆధునాతన హంగులతో నూతన సచివాలయాన్ని నిర్మించాలని భావించారు. ఈమేరకు సచివాలయ భవన నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణం కోసం రూ.500కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు, పలు ప్రజాసంఘాలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన హైకోర్టు జూన్ చివరి వారంలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

‘పాజిటీవ్’ కేసుల్లో తెలంగాణ టాప్.. కానీ?

సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం పనులు షూరు చేసింది. అత్యాధునిక టెక్నాలజీతో సచివాలయాన్ని కూల్చివేసేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈమేరకు ప్రభుత్వం ఆయా కంపెనీలకు పనులను అప్పగించడంతో మూడురోజులుగా కూల్చివేత పనులు వేగంగా జరుగుతున్నాయి. సచివాలయం వైపుకు వెళ్లే వాహనాలను దారిమళ్లించి పోలీస్ బందోబస్తు మధ్య పనులు సాగుతోన్నాయి. దీంతో ఇప్పటికే 60శాతం మేరకు కూల్చివేత పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ పనులకు హైకోర్టు బ్రేక్ వేసింది.

సచివాలయం కూల్చివేతను నిలిపివేయాలని నగరానికి చెందిన సామాజికవేత్త పీఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారించిన ధర్మాసనం జూలై 13(సోమవారం) వరకు సచివాలయ భవనాన్ని కూల్చొద్దంటూ మద్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి వివరాలతో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటికే సచివాలయం కూల్చివేత పనులు చాలావరకు పూర్తయినట్లు తెలుస్తోంది.

జగన్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్న అధికారుల చేతివాటం

ఇటీవలే కొత్త సచివాలయ డిజైన్ ప్రభుత్వం విడుదల చేసింది. రూ.500కోట్లతో భవన నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం చకచక పనులు చేపడుతూ ముందుకెళుతోంది. ఈమేరకు శ్రావణ మాసంలో కొత్త సచివాలయ పనులను ప్రారంభించాలని భావిస్తున్న తరుణంలో సడన్ గా హైకోర్టు పనులకు బ్రేక్ వేయడం చర్చనీయాంశంగా మారింది. సచివాలయ నిర్మాణానికి ప్రతీసారి అడ్డంకులు ఎదురవుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ ఎలా ముందుకెళుతారో వేచి చూడాల్సిందే..!

‘రేసు గుర్రం’కు సీక్వెల్‌.. హీరో బన్నీ కాదు..‌!


చాన్నాళ్లు ఫెయిల్యూర్ లో ఉన్న ఎనర్జిటిక్ స్టార్ పోతినేని రామ్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్’తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అప్పటిదాకా బ్యాడ్‌ ప్యాచ్‌లో ఉన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు కూడా ఈ మూవీ ఎంతో కిక్‌ ఇచ్చింది. మరో టాప్‌ దర్శకుడు సురేందర్ రెడ్డి… చిరంజీవితో కలిసి ‘సైరా నరసింహారెడ్డి’ తో హిస్టారికల్‌ మూవీ తీశాడు. తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజైన ఈ మూవీ మంచి పేరు తెచ్చుకుంది. సూరీకి మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం కిశోర్ తిరుమల డైరెక్షన్‌లో ‘రెడ్‌’ మూవీ తీస్తున్నాడు రామ్. షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఇప్పుడు సురేందర్ రెడ్డితో ఓ మూవీకి అతను గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. దీనిపై తాజాగా ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. మాస్‌ ఎంటర్టైనర్స్‌కు కేరాఫ్‌గా నిలిచే రామ్‌, సూరీ కాంబినేషన్లో వచ్చే ఈ మూవీ ‘రేసు గుర్రం’కు సీక్వెల్‌ అన్న ప్రచారం జరుగుతోంది. బన్నీ హీరోగా సురేందర్ రెడ్డి తీసిన రేసుగుర్రం ఎంత భారీ సక్సెస్‌ అయిందో అందరికీ తెలిసిందే.

‘పాజిటీవ్’ కేసుల్లో తెలంగాణ టాప్.. కానీ?

సాధారణంగా సీక్వెల్‌ అంటే సేమ్‌ హీరో అన్నది ఆనవాయితీ. ఆర్య, బాహుబలి, కిక్‌ సినిమాలను దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. బన్నీతోనే రేసు గుర్రం సీక్వెల్‌ తీయాలని అనుకున్నప్పటికీ.. అతను ప్రస్తుతం ‘పుష్ప’తో బిజీగా ఉండడం… కరోనా కారణంగా అది ఎప్పుడు పూర్తవుతుందో స్పష్టత లేకపోవడంతో సూరీ మనసు మార్చుకున్నాడట. సంప్రదాయాన్ని మారుస్తూ రామ్‌తో రేసుగుర్రం తీయాలని ప్లాన్‌ చేశాడట.పైగా బన్నీ మాదిరిగా రామ్‌ కూడా ఎనర్జిటిక్‌ హీరో, మాస్‌ అప్సీల్‌ ఉన్నవాడే కావడంతో అతనికి స్టోరీ చెప్పినట్టు తెలుస్తోంది. కథ నచ్చడంతో రామ్‌ కూడా ఒప్పుకున్నాడట. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నాడని తెలుస్తోంది. దీనిపై తొందర్లోనే అధికారిక ప్రకటన వచ్చే చాన్సుందని ఇండస్ట్రీలో టాక్.

టీడీపీ ట్రాప్లో వైసీపీ నేతలు పడ్డారు?


టీడీపీ అధినేత చంద్రబాబు తిమ్మిని బమ్మిని చేయగల సమర్థులని పేరుంది. ఆయన చేతిలో బలమైన మీడియా ఉంది. అధికార వైసీపీ కంటే బలమైన నాయకుల అండ ఉంది. అందుకే ఏడాదిగా వైసీపీ ప్రభుత్వాన్ని.. జగన్ ఆట ఆడించేశాడు.కానీ ఇప్పుడు సీఎం జగన్ ఆట మొదలుపెట్టేసరికి కాస్త డిఫెన్స్ లో పడ్డారు.

జగన్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్న అధికారుల చేతివాటం

ఇటీవల చోటుచేసుకున్న రెండు పరిణామాలతో టీడీపీ చేస్తున్న ప్రచారం.. వైసీపీ బీసీ నేతల్లో ఆలోచనలకు కారణమైందట.. అచ్చెన్నాయుడి అరెస్ట్ తర్వాత దాన్ని బీసీలపై దాడిగా అభివర్ణించిన టీడీపీ, దాని అనుకూల మీడియా వాదనకు జనాలు పెద్దగా స్పందించలేదు. వైసీపీ బాగానే తిప్పికొట్టింది. కానీ తాజాగా అరెస్ట్ అయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకుమార్ ఉదంతాన్ని కూడా ప్రతిపక్ష టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకుంది. బీసీ వర్గానికి జగన్ ప్రభుత్వం వ్యతిరేకమని ప్రచారం చేస్తోంది. రెడ్డిల ఆధిపత్యంలోని జగన్ ప్రభుత్వం బీసీలను అణగదొక్కుతోందని పెద్ద ఎత్తున తన అనుకూల మీడియా ద్వారా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.

నిజానికి ఇద్దరూ టీడీపీ బీసీ మాజీ మంత్రులు తప్పు చేసే అరెస్ట్ అయ్యారు. వారు తప్పు చేయకపోతే అరెస్ట్ చేసే సాహసం పోలీసులకు ఉండదన్నది వాస్తవం. కానీ ఈ విషయాన్ని టీడీపీ బాగా వాడుకుంటోంది. బీసీలపై ప్రేమను కురిపిస్తూ.. వైసీపీ నేతల్లోనూ సానుభూతి కలిగేలా టీడీపీ కొత్త ప్లాన్లు చేస్తోందని తెలిసింది.

‘పాజిటీవ్’ కేసుల్లో తెలంగాణ టాప్.. కానీ?

తాజాగా వైసీపీలోనూ ఈ బీసీ గళాలు వినిపించడం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ లాజిక్ ను గ్రహించలేక కొందరు వైసీపీలోని బీసీ నేతలు, ఎమ్మెల్యేలు తాజాగా ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని తెలిసింది.

తాజాగా ఖాళీ అవుతున్న రెండు బీసీ మంత్రుల పదవులను బీసీలకే కేటాయించాలని వైసీపీలో నంబర్ 2 అయిన విజయసాయిరెడ్డిని కలిసి కొత్తమంది వైసీపీ ఎమ్మెల్యేలు కోరారట.. ఈ మేరకు ఫిర్యాదులు చేశారట.. పదవిని ఆశిస్తోన్న వైసీపీ నేతలు ప్రస్తుతం ఈ కొత్త డిమాండ్ ను పార్టీలో రేపి కొత్త కుంపటి తెరతీశారని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యవహారంలో ఉదాసీనంగా వ్యవహరించి తలనొప్పులు తెచ్చుకున్న సీఎం జగన్ తాజాగా పార్టీలో గళమెత్తుతున్న వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై గుర్రుగా ఉన్నారని.. వారి విషయంలో ఉదాసీనత పనికిరాదని అదుపు చేయాలని అనుకుంటున్నట్టు తెలిసింది. టీడీపీ ట్రాపులో పడ్డ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని డిసైడ్ అయినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

మంత్రి పదవీపై ఆశలు పెంచుకుంటున్న స్పీకర్..!


ఏపీలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి ఇటీవలే ఏడాది పూర్తయింది. సీఎంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజానేతగా గుర్తింపు తెచ్చుకుంటూనే ప్రత్యర్థులకు జగన్మోహన్ రెడ్డి షాకిస్తున్నారు. రాజకీయాల్లో 40ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే టీడీపీ హయాంలో జరిగిన స్కాంలను ప్రభుత్వం వెలికితీస్తోంది. చంద్రబాబు హయాంలో మంత్రులు పనిచేసిన నేతలను అవినీతి ఆరోపణల కింద జైళ్లకు పంపిస్తుంది. దీంతో పలువురు టీడీపీ నేతలు ఇప్పటికే వైసీపీ పక్షంలో చేరిపోతున్నారు.

జగన్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్న అధికారుల చేతివాటం

వైసీపీ అధికారంలోకి వచ్చాక పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి చేసినవారు తమకు మంత్రి పదవీ దక్కుతుందని ఆశించారు. అయితే కొందరు మంత్రి దక్కగా మరికొందరికి నిరాశ ఎదురైంది. దీంతో పలువురు నేతలకు సీఎం జగన్ క్యాబినెట్ హోదా కలిగిన పదవులు అప్పగించి బుజ్జగించారు. మండలి రద్దు నిర్ణయంతో జగన్ క్యాబినెట్లో రెండు బెర్త్ ఖాళీ అయ్యాయి. దీంతో కొత్తవారికి అవకాశం దక్కనుండటంతో ఎవరికీ వారు లాయిబీయింగ్ మొదలుపెట్టారు. ఈనెల 22న ఏపీలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందని టాక్ విన్పిస్తుంది. కొత్తవారికి అవకాశం కల్పించడంతోపాటు పలు శాఖల్లో మార్పులు చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారని సమాచారం.

తొలి విడుతలో మంత్రి పదవీ ఆశించి భంగపడిన నేతలంతా మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తహతహలాడుతోన్నారు. ఈక్రమంలో పలువురి నేతల పేర్లు తెరపైకి వస్తున్నారు. క్యాబినెట్ విస్తరణ ముహుర్తం దగ్గరపడుతుండటంతో రోజుకో పేరు రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఏపీ స్పీకర్ వ్యవహరిస్తున్న తమ్మినేని సీతారం మంత్రి పదవీని ఆశిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మంచి వాగ్ధాటి కలిగి ఉండి ప్రత్యర్థులను బోల్తాకొట్టించడంలో తమ్మినేని ముందుంటారు. అయితే ఆయనకు మంత్రి పదవీ కాకుండా అనూహ్యంగా స్పీకర్ పదవీ దక్కింది.

‘పాజిటీవ్’ కేసుల్లో తెలంగాణ టాప్.. కానీ?
ఏపీ స్పీకర్ గా తమ్మినేని సీతారం మంచిపేరు తెచ్చుకున్నప్పటికీ ఆయనకు మంత్రి పదవీపై ఆశపోలేదని తెలుస్తోంది. స్పీకర్ గా ఉండటం వల్ల దూకుడుగా వ్యవహరించలేక పోతున్నారని అసంతృప్తిలో ఉన్నారని టాక్ విన్పిస్తుంది. ఈసారి జగన్ తనను క్యాబినెట్లో తీసుకుంటే రాజకీయంగా దూకుడు చూపించాలని ఆయన భావిస్తున్నారట. మరోవైపు శ్రీకాకుళం నుంచి మంత్రిగా చేస్తున్న ధర్మాన కృష్ణదాస్ మెతకవైఖరి అవలంభిస్తుండటంతో టీడీపీ మళ్లీ పుంజుకుంటుందనే ప్రచారం జరుగుతోంది.

దీంతో శ్రీకాకుళంలో అచ్చెన్న వంటి నేతలు దూకుడు ఎక్కువైందని ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేతలకు చెక్ పెట్టాలంటే తమ్మినేనికి మంత్రి పదవి కట్టబెట్టాలనే స్థానిక నేతలు సీఎం దృష్టికి వెళ్లినట్లు సమాచారం. దీనిపై జగన్మోహన్ సానుకూలంగా స్పందించారని నేతలు చెబుతున్నారు. అయితే చివరి వరకు తమ్మినేని మంత్రి పదవుల రేసులో నిలుస్తారో? లేదో వేచిచూడాల్సిందే..!

‘పుష్ప’పై క్లారిటీ ఇచ్చిన ఆది పినిశెట్టి


హీరో, విలన్‌, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకన్నాడు ఆది పినిశెట్టి. భాషతో సంబంధం లేకుండా ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయే నటుడు అతను. తెలుగుతో పాటు తమిళ్‌లో గుర్తింపు సంపాదించుకున్నాడు. ‘రంగస్థలం’లో రామ్‌ చరణ్ కు అన్న క్యారెక్టర్లో అద్భుతంగా నటించిన ఆది.. అంతకుముందు ‘సరైనోడు’లో స్టయిలిష్‌ విలన్‌గా అదరగొట్టాడు. ‘నిన్ను కోరి’లో భావోద్వేగాలు నిండిన కీలక పాత్రలో తన నటనతో మెప్పించాడు. ఇప్పుడు అల్లు అర్జున్‌- సుకుమార్ కాంబోలో తెరెక్కుకుతున్న పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’లో కూడా ఆదికి చాన్స్‌ వచ్చిందన్న వార్తలు వచ్చాయి. గంధం చెక్కల స్మగ్లింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే మూవీలో బన్నీకి అన్నయ్యగా, గ్రామ సర్పంచ్‌ పాత్రలో కనిపిస్తాడని టాలీవుడ్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

సరైనోడు టైమ్‌లో బన్నీతో, రంగస్థలం మూవీ ద్వారా డైరెక్టర్ సుకుమార్ తో ఆదికి ఫ్రెండ్‌షిప్‌ కుదిరింది. ఈ ఇద్దరితో సన్నిహితంగా ఉండడంతోపాటు అద్భుతమైన నటుడు కావడంతో ‘పుష్ప’లో అతనికి చాన్స్ రావడంలో ఆశ్చర్యం లేదని అందరూ భావించారు. అయితే, ఈ మూవీలో తాను నటిస్తున్నానన్న వార్తలను ఆది ఖండించాడు. అవన్నీ పుకార్లే అంటున్నాడు. ‘పుష్ప’ సినిమా కోసం తనను ఎవరూ సంప్రదించలేరని స్పష్టం చేశారు. కానీ, చాన్స్‌ వస్తే మాత్రం అస్సలు వదులుకోనని చెప్పాడు. ప్రస్తుతం నగేశ్‌ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న ‘గుడ్‌ లక్‌ సఖి’ సినిమాలో ఆది హీరోగా నటిస్తున్నాడు. కీర్తి సురేశ్‌ హీరోయిన్‌. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో పాటు కొత్త దర్శకుడు పృథ్వీ ఆదిత్య తీస్తున్న ‘క్లాప్‌’ సినిమాలో కూడా ఆది యాక్ట్‌ చేస్తున్నాడు. ఇందులో అతను క్రీడాకారుడిగా కనిపిస్తాడు.

రొమాంటిక్‌ ‘రాధే శ్యామ్‌’


ప్రభాస్‌ ఫ్యాన్స్‌ నిరీక్షణ ఫలించింది. అభిమానులు ఎంత‌గానో ఎదురుచూసిన రెబల్‌ స్టార్ 20వ సినిమా ఫస్ట్‌లుక్ ఎట్టకేలకు వ‌చ్చింది. ఈ సినిమాకు ప్రచారంలో ఉన్న ‘రాధే శ్యామ్‌’ టైటిల్‌నే చిత్ర బృందం ఖారారు చేసింది. అంతేకాదు డార్లింగ్‌ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్‌ కూడా ఇచ్చింది. రెబల్‌ స్టార్ స్టార్డమ్‌ దృష్ట్యా ఏ యాక్షన్‌ లుక్‌నో వదులుతారని అనుకుంటే రొమాటింక్‌ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేసింది. రాయల్‌ లుక్‌లో ఉన్న ప్రభాస్‌.. హీరోయిన్‌ పూజా హెగ్డేను ద‌గ్గరగా అదిమిపట్టుకున్న ఫస్ట్‌లుక్‌ అదిరిపోయింది. ఖ‌రీదైన క్లాసిక్‌ దుస్తుల్లో ఉన్న ప్రభాస్‌, పూజ డ్యాన్స్‌ చేస్తూ ఇద్దరూ తన్మయత్వంతో ఉన్నారు. సిల్వర్ కలర్ కోటుతో ఉన్న ప్రభాస్‌తో.. గులాబీ కలర్ డ్రెస్‌ల ఉన్న హెగ్డే పర్ఫెక్ట్‌ జోడీలా ఉంది. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో ఇటలీ దేశంలోని ప్రధాన పర్యాటక ప్రదేశం అయినా కల్లోజియం కనిపిస్తుంది. రిలీజైన నిమిషాల్లనే వైరల్‌గా మారిన ఫస్ట్‌ లుక్‌ చూస్తుంటే సినిమాలో రొమాంటిక్ డోస్ ఎక్కువ‌గానే ఉన్నట్టు క‌నిపిస్తోంది.

కేసీఆర్ చరిష్మాకు.. కరోనా చెక్ పెట్టిందా?

‘జిల్’ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమాను గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్నాయి. తెలుగు, త‌మిళం, హింధీ, మ‌ల‌యాళ భాష‌ల‌లో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. హాస్యనటుడు ప్రియదర్శి తో పాటు సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, ‘ఎయిర్ టెల్‌ గర్ల్‌’ సాషా ఛేత్రి, బాలీవుడ్‌ నటుడు కునాల్ రాయ్ కపూర్, ‘భీష్మ’ ఫేమ్ సత్యన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రం 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటోంది. లాక్‌డౌన్‌కు ముందు వరకు జార్జియాలో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకోగా హైద‌రాబాద్‌లోని ప్ర‌ముఖ స్టూడియోలో రెండో షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారు.
మూవీలో రానా కూడా అతిథి పాత్రలో మెరుస్తారన్న టాక్‌ వినిపిస్తోంది.