Home Blog Page 8381

సైకిల్ గాలిపోతుంటే అక్కడేం చేస్తున్నావ్ బాబు..?

CBN in Hyderabad

CBN in Hyderabad
రాష్ట్రంలో టీడీపీకి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు అమరావతి ఉద్యమం ఆయనకు కొందరు నేతలను దూరం చేస్తుంది. ఇప్పటికే కరోనా విపత్తు సమయంలో ప్రతిపక్ష నేత పక్క రాష్ట్రంలో మకాం పెట్టడం అనేక విమర్శలకు దారితీస్తుంది. సామాన్యులు సైతం ఈ విషయంలో బాబును మరియు లోకేష్ ని ఎండగడుతున్నారు. అమరావతి కోసం ఆయన జూమ్ యాప్ లో చేస్తున్న ఉద్యమాలు, సవాళ్లు ఆయన పట్ల గౌరవం పెంచకపోగా ఇంకా చులక చేస్తున్నాయి. బాబు జూమ్ పోరాటాలు, లోకేష్ ట్విట్టర్ వ్యాఖ్యలు ప్రజలపై పనిచేయడం లేదు. దీనికి తోడు వైసీపీ నేతలు బాబును జూమ్ బాబా అని, లోకేష్ ని ట్విట్టర్ పిట్ట అని ఎద్దేవా చేస్తున్నారు. అమరావతి కోసం బాబు చేస్తున్న సోషల్ మీడియా ఉద్యమం ఆయనకు మేలు చేసే సూచనలు కనిపించడం లేదు.

Also Read: ఆంధ్రలో బిజెపి-జనసేన కూటమికి పవన్ కళ్యాణ్ నాయకత్వం?

మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ కొందరు నేతలు టీడీపీకి దూరం కానున్నారు. వైజాగ్ లో నాలుగు నియోజకవర్గాలను శాశించగల గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడడం పెద్ద దెబ్బే అని చెప్పాలి. త్వరలో ఆయన వైసీపీలో చేరిక ఖాయమే. రాయలసీమలో వైసీపీ ఎలాగూ బలంగా ఉంది. టీడీపీ కంచు కోటైన ఉత్తరాంధ్రలో పసుపు జెండాను కనుమరుగు చేయడం ద్వారా రాష్ట్రంపై పూర్తి పట్టు సాధించాలని వైసీపీ భావిస్తుంది. సీనియర్ టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా కమల దళంలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. రాను రాను టీడీపీ పరిస్థితి మరింత దిగజారుతుంటే బాబుకు మాత్రం అమరావతి ఉద్యమం మినహా ఏమీ కనిపించడం లేదు. క్షేత్ర స్థాయిలో జగన్ పాలనలో లోపాలు ఎత్తిచూపుతూ ప్రజాపోరాటం చేస్తే కొంచెమైనా నష్టనివారణ జరిగే అవకాశం ఉంటుంది.

Also Read: జిల్లాల పునర్యవస్ధీకరణకు తొలి అడుగు..!

బాబు రాజకీయం అమరావతే అజెండా సాగుతుండగా, రాష్ట్రంపై ఆధిపత్యం కోల్పోతున్నారు. ఇక ఆయన చేసిన రాజీనామాల సవాల్ కూడా నవ్వులపాలైంది. అమరావతిని రాజధానిగా కోరుకుంటున్న వాళ్ళు కూడా బాబు తన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీల చేత రాజీనామా చేయించొచ్చు కదా అనుకుంటున్నారు. ఆయన సవాల్ తరువాత ఎదో జరుగుతుందని బావించివారు కూడా తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రాయలసీమ నేత బిటెక్ రవి చేత మండలి సభ్యత్వానికి రాజీనామా చేయించిన బాబు, రాయలసీమ ప్రజలు కూడా అమరావతికి అనుకూలం అని భ్రమింపచేసే ఆలోచన చేశారు. దాని వలన జరిగిన ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. బిటెక్ రవి చేత రాజీనామా చేయించిన బాబు, కొడుకు లోకేష్ చేత కూడా చేయించొచ్చు కదా అని టీడీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. పదవులకు లోకేష్, త్యాగాలకు ఇతర నేతలా అని వాపోతున్నారు. మొత్తంగా రాజధాని ఉద్యమంలో టీడీపీ సర్వం కోపోతుంటే బాబు హైదరాబాద్ లో ఉంది చోద్యం చూస్తున్నాడు.

జిల్లాల పునర్యవస్ధీకరణకు తొలి అడుగు..!

AP Districts

AP Districts

రాష్ట్రంలోని 13 జిల్లాలను పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విభజించి 25 జిల్లాల ఏర్పాటు చేసే విషయంపై స్వపక్షం నుంచి వస్తున్న అభ్యంతరాలను సైతం లెక్క చేయడకుండా ప్రభుత్వం ముందుకు వెళుతుంది. గత నెల 15వ తేదీన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించిన ప్రభుత్వం జిల్లాల పునర్యవస్థీకరణకు చట్టపరమైన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం విధితమే. ఈ మేరకు కమిటీ నియమకానికి ఈ రోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఆరుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. కమిటీకి ప్రధాన కార్యదర్శి ఛైర్సన్ గా, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. సిఎంఓ నుంచి ఒక ప్రతినిధి, సిసిఎల్ఎ, జిఎడి కార్యదదర్శి, ప్లానింగ్ శాఖ కార్యదర్శి సభ్యులుగా వ్యవహరించనున్నారు.

Also Read: మళ్లీ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కనున్న జగన్ సర్కార్…!

ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసి మూడు నెలలోగా నివేదిక సమర్పించాల్సి ఉంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేస్తే కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని స్వయంగా వైసీపీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాను విభజన నుంచి మినహాయించాలని ఆ పార్టీ నాయకులు స్పీకర్ తమ్మినేని శీతారాం, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. అరకు నియోజకవర్గం విభజనలో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అనంతపురం, ప్రకాశం, కృష్ణా తదితర జిల్లాల్లో భౌగోళికంగా సమస్యలు ఉన్నాయి. హిందుపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ కోరారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కాకుండా భౌగోళిక పరిస్థితిని బట్టీ జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ వస్తున్నాయి.

Also Read: ప్రభుత్వానికి న్యాయపరమైన చిక్కులు తప్పవా?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాల ఏర్పాటుకే మొగ్గు చూపిస్తున్నారు. పార్టీ నాయకులు, మంత్రుల అభ్యంతరాలను సైతం ఆయన పక్కన పెట్టేయడంతో వైసీపీ నాయకులు ఈ విషయంలో మిన్నకుండి పోయారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లాల పునర్విభజన కమిటీకి ప్రజలు, ప్రజా సంఘాలు, వివిధ పార్టీలు తమ విధానాన్ని వివరించే అవకాశం ఉంది. ఇందుకు మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కమిటీ జిల్లాల వారీగా పర్యటించి ఆయా ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయం సేకరించనుందని సమాచారం.

అలా లేకుంటే నన్నెవరూ ఆదరించరు: శ్రీదేవి కూతురు

Gunjan Saxena biopic

Gunjan Saxena biopic
అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ తన కెరీర్ను మలుపు తిప్పే విజయం కోసం ఆశిస్తోంది. తాను పైలట్‌గా నటించిన ‘గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌’ మూవీపై ఆమె గంపెడాశలు పెట్టుకుంది. కార్గిల్‌ వార్లో యుద్ధ విమానాలు నడిపిన మహిళా పైలట్‌ గుంజాన్‌ సక్సేనా జీవిత చరిత్రా ఆధారంగా రూపొందిన ఈ మూవీ ఈ నెలలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా రిలీజ్‌ కాబోతోంది. కాగా, ఈ మూవీపై సోషల్‌ మీడియాలో రకరకాల చర్చ నడుస్తోంది. అయితే, దీన్ని తాను పట్టించుకోవడం లేదని జాన్వీ అంటోంది. శ్రీదేవి, బోణీ కపూర్ కూతురుగా అందరికీ సుపరిచితం అయినప్పటికీ తాను ఎక్స్‌టార్డినరీగా ఉంటే తప్ప ప్రజలు తనను ఆదరించబోరని అంటోందామె. అందువల్ల తొందరగా సంతృప్తి పడనని, ఎక్కువ కష్టపడి మంచి పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తానని చెబుతోంది.

Also Read: తెలియని దానిలో వేలు పెడుతున్నావన్నారు: అనుపమా

ఇక, సుశాంత్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజంపై చర్చ నడుస్తోంది. స్టార్కిడ్‌ కావడంతో జాన్వీపై కూడా సోషల్‌ మీడియాలో నెగిటివ్‌ కామెంట్లు వస్తున్నాయి. దీనిపై స్పందించిన జాన్వీ ప్రజల సెంటిమెంట్లను గౌరవించాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఒక నటిగా తన వృత్తిని సమర్థంగా నిర్వర్తిస్తానని, తద్వారా తన తల్లిదండ్రులపై ప్రేమానురాగాలు చూపించిన ప్రజలకు తాను అదే ప్రేమను పంచాలని అనుకుంటున్నానని తెలిపింది. ‘నాకు ఈ అవకాశం తేలికగా లభించిందన్నది నిజం. కాబట్టి నన్ను నిరూపించుకోవడానికి నేను అదనంగా ఏదైనా చేయవలసి వస్తే, దానికి సిద్ధంగా ఉన్నాను. ప్రజల ప్రేమను సంపాదించడం నాకు ఎంతో విలువైనది. ఎందుకంటే ప్రజలు నా తల్లిదండ్రులపై చూపిన ప్రేమ వల్లే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నా. అందువల్ల నేను వాళ్లకు ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. దాన్ని నేను ఇష్టపడే వృత్తి ద్వారా ఇవ్వడమే ఉత్తమమైన మార్గం’ అంటూ 23 ఏళ్ల జాన్వీ తన వయసుకు మించిన పరిణతితో చెప్పింది. ఎంతైనా శ్రీదేవి కూతురు కదా. ఆమెలో ఈ క్లారిటీలో ఉంటే కచ్చితంగా తల్లి పేరు నిలబెట్టగలదు.

మళ్లీ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కనున్న జగన్ సర్కార్…!

జగన్ 3 రాజధానుల కల ఇప్పుడిప్పుడే నెరవేరేలా లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గత కొద్ది నెలల నుండి ప్రధాన ప్రతిపక్షంగా తయారయి షాకుల మీద షాకులు ఇస్తున్న హైకోర్టు…. గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత కూడా మూడు రాజధానుల పై స్టే విధించిన విషయం తెలిసిందే. గవర్నమెంట్ విడుదల చేసిన గజెట్ నోటిఫికేషన్ మీద స్టేటస్ క్యువో జారీచేసిన హైకోర్టుని ఛాలెంజ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టు మెట్లు ఎక్కడ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక వివరాల్లోకి వెళితే.. 3 రాజధానులకు మద్దతుగా రాజధాని వికేంద్రీకరణ బిల్లు మరియు సిఆర్డిఎ చట్టం రద్దు బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే చాలా కష్టపడింది. ఇక గవర్నర్ ఆమోదం వచ్చిన తర్వాత అమరావతి నుండి విశాఖపట్నానికి రాజధానిని తరలించడం…. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులతో వారికి పెద్ద షాక్ తగిలి…. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఈ విషయమై తమ ప్రభుత్వం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధం అని…. తాము సుప్రీంకోర్టుకు అయినా వెళ్లి తమ మూడు రాజధానులు బిల్లును ఆమోదింపజేసుకుంటామని ఛాలెంజ్ విసిరారు.

ప్రస్తుతానికి అయితే చంద్రబాబు చాలా నీచమైన రాజకీయాలు చేస్తున్నారని…. అలాగే అమరావతిని తన సొంత అవసరాల కోసం రాజధానిగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని నాని అన్నారు. ఇక అమరావతి ఉద్యమం అనేది రాజకీయంగా రగిల్చిన ఒక బూటకం అని,.. చంద్రబాబు కేవలం అతని అవసరాల కోసమే దీనిని రెచ్చగొడుతున్నారని అన్నారు. ఇక నాని అన్న మాటలు చూస్తుంటే త్వరలోనే ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టు మెట్లు ఎక్కనున్నట్లు అర్థమవుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే సుప్రీంకోర్టు…. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో జగన్ సర్కార్ కి షాక్ ఇచ్చింది. మరి అత్యున్నత ధర్మస్థానం మూడు రాజధానుల బిల్లుకి మద్దతు తెలుపుతుందా లేదా అమరావతి రైతుల వైపు మాట్లాడుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కారులో రగులుతున్న ‘కార్చిచ్చు’

Kamareddy TRS

Kamareddy TRS
కారులో నేతల ఓవర్ లోడ్ నేడు పార్టీ అధిష్టానికి కొత్తనొప్పులను తీసుకొస్తుంది. కామారెడ్డి జిల్లాల్లో నేతల మధ్య కార్చిచ్చు అంటుంది. కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరారు. దీంతో టీఆర్ఎస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన నేతకు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన నేత మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ ఇద్దరు నేతలు తొలి నుంచి ఎడామొఖం పెడముఖంగా ఉంటున్నారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణుల మధ్య వర్గపోరు మొదలైందనే ప్రచారం జరుగుతోంది.

Also Read: ‘బండి’ టార్గెట్ గా కొత్త రాజకీయాలు?

కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఎవరికీ వారు నియోజకవర్గంలో తామ మాటే నెగ్గాలనే చూస్తుండటంతో టీఆర్ఎస్ శ్రేణులు రెండువర్గాలు విడిపోతున్నాయి. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గాలుగా కార్యకర్తలు విడిపోవడం టీఆర్ఎస్ పెద్దలను కలవరానికి గురిచేస్తోందట. వీరువురి వర్గపోరు ప్రత్యర్థి పార్టీలు పుంజుకోవడానికి అవకాశం కల్పిస్తుంట. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రత్యర్థి పార్టీలు గట్టి పోటీ ఇవ్వడానికి నేతల మధ్య విబేధాలే కారణమని అదిష్టానం పెద్దలు భావిస్తున్నారట.

ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ టీఆర్ఎస్ చేరిన తర్వాత ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కార్యకర్తలు రెండు వర్గాలు చిలీపోయారట. ఎమ్మెల్యే సురేందర్ టీఆర్ఎస్ లో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న వారిని పక్కనపెట్టి తన వెంట వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ లోని సీనియర్ కార్యకర్తలు ఎమ్మెల్యే సురేందర్ పై అసంతృప్తితో రగిలిపోతున్నారట. తమను మాజీ ఎమ్మెల్యే వర్గీయులుగా ముద్రవేసి సభ్యత్వం నమోదులోనూ ప్రాధాన్యం ఇవ్వడంలేదని కనీసం టీఆర్ఎస్ కార్యక్రమాలకు పిలువడం లేదని పలువురు టీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.

టీఆర్ఎస్ లో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యేల మధ్య టీఆర్ఎస్ క్యాడర్ నలిగిపోతుందట. దీంతో ఇప్పటికే నియోజకవర్గంలోని గాంధారి, ఎల్లారెడ్డి, లింగంపేట్, తాడ్వాయి, సదాశివనగర్, రామారెడ్డి, రాజంపేట్ మండలాల్లో టీఆర్‌ఎస్ రెండు విడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలు ఎవరికీ వారు నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఎదిగేందుకు యత్నిస్తుండటంతో టీఆర్ఎస్ శ్రేణులు ఎవరివైపు ఉండాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయట.

Also Read: మధుయాష్కి మళ్లీ ఎంట్రీ ఇస్తారా? ఇవ్వరా?

ఈ వ్యవహారం తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిండేంట్ కేటీఆర్ దగ్గరకు చేరడంతో ఇరువురి నేతలపై ఆయన సీరియస్ అయ్యారనే టాక్ విన్పిస్తోంది. అయితే ఈ నేతల్లో మార్పులేదని కార్యకర్తలు చెబుతున్నారు. పార్టీ అధిష్టానం ఎల్లారెడ్డిలో నెలకొన్న వర్గపోరుపై దృష్టిసారించకపోతే రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..!

అలా జైలు నుండి వచ్చాడు… ఇలా మళ్లీ లోపలికి వెళ్ళాడు! జేసీ నా మజాకా

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొని పక్కా ఆధారాలతో అరెస్టయి జైలుకు చేసిన విషయం తెలిసిందే. అతని పై సీబిఐ చాల పట్టు బిగించింది. బెయిల్ కోసం చాలా రోజులు పోరాడి ఎన్నో సార్లు భంగపడిన ప్రభాకర్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ ద్వారా బయటికి వచ్చారు. అయితే అతను వస్తున్న సందర్భంగా అనంతపురంలో అతని అభిమానులు ఎటువంటి భౌతిక దూరం పాటించకుండా వీరవిహారం చేసి సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు.

ఇదే క్రమంలో చాలా నెలలు తర్వాత జైలులో ఉండి బయటికి వచ్చిన అత్యుత్సాహం ఏమో తెలియదు కానీ ప్రభాకర్రెడ్డి వచ్చీరాగానే పోలీసుల పైన విరుచుకు పడ్డారు. దళిత సీఐ దేవేంద్ర ని ఇష్టం వచ్చినట్లు దూషించిన జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఐదు కేసులు తాడిపత్రి పోలీసులు నమోదు చేశారు. కడప నుండి తాడిపత్రి దాకా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి పై 506, 189, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే ఈ మాజీ ఎమ్మెల్యేపై డిజాస్టర్ మేనేజ్మెంట్ 52 కింద కేసు నమోదు చేశారు.

ప్రస్తుతానికి జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారు. ఇక దళిత సిఐ ని దూషిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న మాటలు వీడియో రూపంలో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా తాడిపత్రి లో 144 సెక్షన్ విధించారు. తాడిపత్రి లో భారీగా పోలీసులు బలగాలు మోహరించాయి. జైలు నుండి బయటకు వచ్చి 24 గంటలు కాకుండానే ప్రభాకర్ రెడ్డి మళ్ళీ పోలీసులు కస్టడీలోకి వెళ్లడం నిజంగా పెద్ద విశేషమనే చెప్పాలి.

తెలియని దానిలో వేలు పెడుతున్నావన్నారు: అనుపమా

Anupama

Anupama
అనుపమా పరమేశ్వరన్‌. పుట్టింది కేరళలో అయినా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన నటి. ‘ప్రేమమ్‌’ అనే మలయాళ సినిమాతో తెరంగేట్రం చేసినప్పటికీ టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుందామె. కేరళలో కంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్‌ అయింది. తెలుగు ప్రేమమ్‌తో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఆమె ‘అఆ’లో నెగిటివ్‌ రోల్‌ చేసింది. ఆపై, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘హలో గురు ప్రేమకోసమే’, ‘తేజ్ ఐ లవ్ యు’, ‘శతమానం భవతి’ సినిమాల్లో హీరోయిన్‌గా నటించి టాలీవుడ్‌లో సెటిలైంది.

Also Read: మా ఇంట్లో నలుగురికి కరోనా వచ్చింది : చిరంజీవి

ఇక్కడ మంచి పేరు రావడంతో తమిళ్‌, కన్నడ భాషల్లో నటిస్తూ బిజీగా మారింది. అయితే, మాతృభాష మలయాళంలో మాత్రం ఆమె ఎక్కువ సినిమాలు చేయలేదు. ఇప్పటిదాకా రెండు చిత్రాలే చేసింది. ప్రస్తుతం మరో మూవీలో నటిస్తోంది. అలాగని అవకాశాలు లేవని కాదు.. చాన్స్‌లు వస్తున్నా సరే మలయాళానికి దూరంగా ఉందామె. ఎవరికైనా ప్రాంతీయ అభిమానం ఉంటుంది. సొంత రాష్ట్రంలో వీలైనంత ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకోవాలని చూస్తారు. అవసరం అయితే ఇతర భాషా చిత్రాలను వదులుకుంటారు.

కానీ, ఈ కేరళ కుట్టి మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తోంది. మాతృభాషకు కావాలనే దూరమైందామె. ఇందుకు బలమైన కారణం కూడా ఉంది. తన మనసు గాయ పడడం వల్లే సొంత భాషకు దూరంగా ఉన్నానని చెప్పిందీ చిన్నది. తన మనసు ఎందుకు నొచ్చుకుందో కూడా ఆమెనే చెప్పింది. తొలి మూవీ ప్రేమమ్‌లో నటించిన అనుపమ ఆ మూవీ రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌ ‌‌‌కోసం చాలా ఇంటర్వ్యూలు ఇచ్చింది. అయితే, మూవీలో చిన్న పాత్ర చేసిన తాను సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంది అని విమర్శించారట. అయితే, వాటిని లెక్క చేయకుండా తన పని తాను చేసుకుపోవడంతో తనపై అహంకారి అని ముద్ర వేసి సోషల్‌ మీడియాలో బాగా ట్రోల్‌ చేశారని చెప్పింది.

Also Read: రమ్యకృష్ణ దెబ్బకు సక్సెస్ పోగొట్టుకున్న డైరెక్టర్ !

దాంతో తన మనసు నొచ్చుకుందని అనుపమ తెలిపింది. అందుకే కొన్నాళ్లు మలయాళ సినిమాలకి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో తమిళ్, తెలుగు చిత్రాలపై దృష్టిపెట్టానని వివరించింది. ఈ క్రమంలో భాష రాకపోయినా తెలుగులో ‘అ ఆ’ సినిమాలో నెగెటివ్ రోల్ చేశానని చెప్పింది. అప్పుడు చాలా మంది తెలియని దాంట్లో వేలు పెడుతున్నావని వెటకారం చేశారని, కానీ, చాలెంజింగ్‌‌‌‌గా తీసుకుని ఆ పాత్ర చేశానని ఆ తర్వాత తన కెరీర్ మలుపు తిరిగింది అని ఈ కేరళ కుట్టి చెప్పుకొచ్చింది. అఆ తర్వాత తెలుగులో అనుపమకు మంచి బ్రేక్‌ లభించింది. ఇప్పుడు తమిళ్‌, మలయాళంలో ఒక్కో మూవీ చేస్తున్న ఆమె.. తెలుగులో నిఖిల్‌ సిద్దార్థ్‌తో ఓ సినిమాకు ఓకే చెప్పింది.

ఏం చేయలేకపోయారు.. బాబులో అంతులేని ఆవేదన

Chandrababu Naidu

Chandrababu Naidu
చంద్రబాబుకు వాళ్లిద్దరూ లెఫ్ట్ అండ్ రైట్. టీడీపీ ఆర్థిక సామ్రాజ్యానికి వాళ్లిద్దరూ మూల స్థంభాల్లాంటి వారు. అలాంటి వారిని చంద్రబాబు పూవుల్లో పెట్టి మరీ బీజేపీలోకి సాగనంపారు. అప్పుడే అందరికీ డౌటొచ్చింది. కానీ అప్పుడు బీజేపీకి అవసరం వచ్చింది. రాజ్యసభలో బలం లేక కాంగ్రెస్ ధాటికి నిలబడలేక బీజేపీ కూడా చంద్రబాబు పంపిన నలుగురు రాజ్యసభ ఎంపీలను ఆహ్వానించి అక్కున చేర్చింది.

Also Read: సోము వీర్రాజు దూకుడు వెనుక ఉన్న అసలైన టార్గెట్ వీరే…!

అయితే ఈ నలుగురు ఎంపీలతో మళ్లీ బీజేపీకి దగ్గరకావచ్చని.. బీజేపీతో చెలిమి చేయవచ్చని.. కేంద్రంతో కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని శాసించవచ్చని చంద్రబాబు ఎన్నో కలలుగన్నారు. కానీ ఇప్పుడు కలలన్నీ కల్లలయ్యాయి. బీజేపీ ఆటలో చంద్రబాబు అనుకూల ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ, గరికపాటిలు అరటిపండుగా మారిపోయారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టీడీపీ నుంచి జంప్ అయిన ఈ నలుగురు ఎంపీలను ఇప్పుడు బీజేపీ హైకమాండ్ పూర్తిగా పక్కనపెట్టిన వైనం కనిపిస్తోంది.. సుజనా చౌదరి అమరావతినే ఏపీ రాజధానిగా ఉంచాలని.. మార్చవద్దని పెద్ద ఉద్యమమే చేశాడు. బీజేపీలో ఉండే ఇలా గళమెత్తాడు. హైకమాండ్ అంతా చూస్తోందని సుజనా బెదిరించాడు.

కానీ స్వయంగా కేంద్రంలోని బీజేపీ స్పందించింది. ఏపీ రాజధాని విషయంలో తాము ఇన్ వాల్వ్ అవ్వమని కేంద్రం హైకోర్టులో స్పష్టం చేసింది.. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమని కుండబద్దలు కొట్టింది. ఈ ప్రకటన తర్వాత సుజనా చౌదరి నుంచి ఒక మాట రాలేదు. సుజనా సైలెంట్ అయ్యాడు.

Also Read: జేసీ రెడ్డప్ప.. ఇంత దూకుడు పనికిరాదప్పా?

చంద్రబాబు అమరావతిపై ఇన్నాళ్లు ఎంతో భరోసాగా ఉన్నాడు.. మన టీడీపీ నుంచి వెళ్లిన ఎంపీలంతా బీజేపీలో ఉన్నారు కదా వాళ్లు ఈ విషయంలో ఏదో పొడిచేస్తారని చాలా భావించాడట.. అమరావతిలో పెట్టుబడులు కూడా భారీగా టీడీపీ నేతలు పెట్టడంతో సుజనా చౌదరి సహా సీఎం రమేశ్ లు ఏదో చేస్తారని చంద్రబాబు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్లు ఏం చేయలేరని తేలిపోవడంతో చంద్రబాబు సహా టీడీపీ నేతలు గుండెలు బాదుకుంటున్నారని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.. మొత్తానికి బీజేపీ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ కు చంద్రబాబుకు దిమ్మదిరిగిపోయిందని.. నలుగురు ఎంపీలు కింగ్ మేకర్లు అనుకుంటే ఆటలో అరటిపండు మాత్రమేనని టీడీపీ నేతలకు తత్త్వం బోధపడింది. చంద్రబాబు పప్పులు ఇప్పుడు ఏపీలోనూ ఉడకవని.. అటు ఢిల్లీలో ఉడకవని ఒక్కదెబ్బతో బీజేపీ చూపించిందని అంటున్నారు. అందుకే నలుగురు ఎంపీలు బీజేపీలో ఉన్నా ఏం చేయలేకపోయారన్న ఆవేదన బాబులో ఉందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మా ఇంట్లో నలుగురికి కరోనా వచ్చింది : చిరంజీవి

Chiranjeevi

Chiranjeevi

కరోనా వస్తే భయపడాల్సిన అవసరం లేదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ మహమ్మారిని సులభంగా ఎదుర్కోవచ్చన్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు ప్లాస్మా దానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు.

సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన ప్లాస్మా దాతల సన్మాన కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 150 మంది ప్లాస్మా డోనర్లను ఆయన సన్మానించారు.

ప్లాస్మా డొనేషన్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేసిన సైబరాబాద్‌ సీపీ సజ్జనార్కు అభినందనలు తెలిపారు. కరోనాకు మందుగానీ, వ్యాక్సిన్‌ లేదని ఈ పరిస్థితుల్లో ప్లాస్మానే సంజీవనిలా పని చేస్తుందని చిరంజీవి అన్నారు. తమ బంధువుల కుర్రాడికి కూడా ప్లాస్మా ట్రీట్‌మెంట్‌ ఇప్పించి బ్రతికించుకున్నామని తెలిపారు .తన బంధువుకు ప్లాస్మా దానం చేసిన వ్యక్తి మరోవరో కాదని అఖిలభారత చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడు స్వామి నాయుడు అని చెప్పారు. తాను కోరగానే వచ్చి ఆయన ప్లాస్మా దానం చేశాడని తెలిపారు.

Also Read: చిరంజీవితో వీర్రాజు బేటీ.. కారణమిదేనా?

‘కరోనాను జయించిన వారంతా ప్లాస్మా దానం చేసి మానవత్వాన్ని చాటుకోవాలి. వ్యాక్సిన్‌ వచ్చే వరకు మానవత్వమే మందు. కరోనాకు వ్యాక్సిన్‌ తెచ్చేందుకు కృషి చేస్తున్న సైంటిస్టులకు, ప్లాస్మా దానంతో ప్రాణాలు నిలబెడుతున్న వారి మనవత్వానికి ఇప్పుడు పోటీ నడుస్తోంది. ఇందులో మానవత్వం ఉన్న మనుషులే విజయం సాధించాలి’ అని ఆకాంక్షించారు.

కరోనాకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ వైరస్‌ సోకితే తమకు ఏదో అయిపోతుందన్న భయంతో కొంత మంది ప్రాణాలు తీసుకుంటున్నారని తెలుసుకున్నానని చెప్పారు. కొన్నాళ్లు పోతే ఇది జలుబులాగా, దగ్గులాగా అయిపోతుందన్నారు. తన ఇంట్లోనే నలుగురు కరోనాను జయించారని తెలిపారు. ‘కరోనా గురించి అనవసర భయాలు వద్దు. జాగ్రత్తలు పాటిస్తే కచ్చితంగా కోలుకుంటారు. నా ఇంట్లోనే.. నా వద్ద పని చేసే నలుగురికి కరోనా సోకింది. మా వంట శ్రీను, అతని కుమారుడు, కూరగాయలు తరిగే మహిళ. స్విమ్మింగ్‌ పూల్‌ క్లీన్‌ చేసే లక్ష్మణ్‌కు నెల రోజుల కిందట కరోనా వచ్చింది.

Also Read: సోము వీర్రాజు దూకుడు వెనుక ఉన్న అసలైన టార్గెట్ వీరే…!

అజాగ్రత్త కారణంగానే వీరికి వైరస్‌ సోకింది. వాళ్లందరినీ ఒక ఫ్లాట్‌లో ఉంచి క్వారంటైన్‌ ఏర్పాటు చేశా. మందులేమీ లేకున్నా తగిన జాగ్రత్తలతో వైరస్‌ను జయించారు. కోలుకున్న తర్వాత ఇంట్లో తిరిగి పనికి పెట్టుకున్నాం. ఈ నలుగురిని ఇక్కడకు తీసుకొచ్చా. ఇప్పుడు ప్లాస్మా దానం చేస్తారు. ఒక్కరు ప్లాస్మా దానం చేస్తే ముగ్గురి ప్రాణాలను కాపాడొచ్చు. కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలకు నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు దయచేసి ప్లాస్మా దానం చేయండి’ అని చెప్పుకొచ్చారు. ఈ కష్టకాలంలో ముందుండి పోరాడుతున్న పోలీసులు, డాక్టర్లు, , పారిశుద్ధ్య సిబ్బందికి చిరు ధ‌న్యవాదాలు తెలిపారు.

అమెరికన్లను బెంబేలెత్తిస్తున్న ఉల్లి..!

Red Onions

కరోనా కాలంలో ఉల్లిని కూడా భయపడాల్సి రోజులు వస్తున్నాయి. ప్రధానంగా అగ్రరాజ్యంగా బీరాలుపలికే అమెరికా ఇప్పుడు ఉల్లి పేరు చెబితేనే ఉలిక్కి పడుతున్నారు. ఇప్పటికే కరోనాతో అష్టకష్టాలు ఎదుర్కొంటున్న అమెరికా.. ఇప్పుడు ఉల్లికి కూడా భయపడాల్సి వస్తుండటం శోచనీయంగా మారింది. ఇంతకీ అమెరికన్లు ఉల్లిని చూసి ఎందుకు భయపడుతున్నారో తెలుసుకుందాం..

Also Read: ‘బండి’ టార్గెట్ గా కొత్త రాజకీయాలు?

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే నానుడి ఎప్పటి నుంచి మనకు విన్పిస్తూనే ఉంది. ఏ కూరలోనైనా ఉల్లిని వాడటం తప్పనిసరి. ఉల్లితో కూరకు వచ్చే రుచే వారంటారు వంట తెల్సినవారు. అయితే అమెరికన్లు మాత్రం ఉల్లి పేరు చెబితేనే బెంబేలెత్తిపోతున్నారు. అమెరికాలో ఉల్లిపాయల వల్ల సాల్మోనెల్లా అనే వ్యాధి విజృంభిస్తుందట. ఇది కరోనా వైరస్ చూసిన ప్రభావం కంటే ఎక్కువగా ఉంటుందని అక్కడి వైద్యులు చెబుతుండటంతో అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు.

సాల్మోనెల్లా ప్రధానంగా పొట్టలోని పేగులపై ప్రభావం చూపుతుందని దీనివల్ల డయేరియా.. జ్వరం.. కడుపునొప్పి వంటివి వస్తాయని అమెరికా అంటు వ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది. సాల్మోనెల్లా బ్యాక్టీరియా వల్ల చాలామందిలో ఫుడ్‌ పాయిజన్‌ అవుతుందని పేర్కొంది. ఈ వ్యాధి సోకిన వారిలో వెంటనే లక్షణాలు కనిపించవని వైద్యులు చెబుతున్నారు. 8గంట నుంచి 72గంటల తర్వాతే లక్షణాలు బయటపడుతాయని చెబుతున్నారు.

Also Read: జేసీ రెడ్డప్ప.. ఇంత దూకుడు పనికిరాదప్పా?

ఈ వ్యాధి సోకిన వారిలో నాలుగు నుంచి వారంపాటు లక్షణాలు ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు. డయేరియా.. జ్వరం.. కడుపు నొప్పి.. వికారం.. వాంతులు.. తలనొప్పి లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ బ్యాక్టిరియా బారిన ఇప్పటికే 34రాష్ట్రాల్లో అనేకమంది పడ్డారట. అయితే ఈ వ్యాధి బారినపడిన వారు ఎక్కువగా మంచినీరు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నీటిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే కరోనాతో సతమతం అవుతున్న అమెరికన్లను ఉల్లి కూడా భయపెట్టిస్తుండటం గమనార్హం.

కమల్‌, శంకర్ పెద్ద మనసు.. వాళ్లకు 4 కోట్ల సాయం

Kamal Haasan

Kamal Haasan

విలక్షణ నటుడు, దక్షిణాది అగ్ర నటుడు కమల్‌ హాసన్‌, లెజెండరీ డైరెక్టర్ శంకర్ పెద్ద మనసు చాటుకున్నారు. తమ కాంబినేషన్లో వస్తున్న ‘ఇండియన్ 2’ సినిమా సెట్లో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కమల్, శంకర్ అండగా నిలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ఇండియన్ 2’ సినిమా కోసం చెన్నైలో వేసిన సెట్లో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చెక్కును ఈ రోజు అందజేశారు. గాయపడిన వారి కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం చేశారు. మూవీ నిర్మాతతో కలిసి మొత్తం రూ. 4 కోట్ల రూపాయలను అందజేశారు. మరణించిన అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ, ఆర్ట్ అసిస్టెంట్ చంద్రన్ , ప్రొడక్షన్ అసిస్టెంట్ మధుకు చెందిన ఒక్కొక్కరి కుటుంబాలకు కోటి రూపాయల చెక్కులు ఇచ్చారు. అలాగే, తీవ్రంగా గాయపడిన లైట్‌మ్యాన్‌కు పరిహారంగా రూ .90 లక్షల ఇచ్చారు. ప్రమాదంలో స్వల్ప గాయాలైన వారికి సైతం రూ .10 లక్షలు ఇచ్చి మంచి మనసు చాటుకున్నారు. ఈ మొత్తాన్ని కమల్‌, శంకర్, లైకా ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా సమకూర్చాయి.

Also Read: ప్రభాసే ముందుగా రెడీ అవుతోంది !

అనంతరం శంకర్తో కలిసి కమల్‌ మీడియాతో మాట్లాడాడు. ప్రమాదం జరిగిన సమయంలో దర్శకుడు, తాను అక్కడే ఉన్నామని చెప్పాడు.‘మాలో ఎవరికైనా ఆ ప్రమాదం జరిగి ఉండొచ్చు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత మాపై ఉంది. ప్రమాదం జరిగిన వారం తర్వాత మేమంతా సమావేశమై బాధితులకు ఏం చేయాలో చర్చించాం. కానీ, కరోనా కారణంగా ఆ తర్వాత మళ్ళీ కలుసుకోలేకపోయాం’ అని చెప్పాడు. చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్‌ సిటీలో ఇండియన్‌2 మూవీ చిత్రీకరణ జరుపుతుండగా ఫిబ్రవరి 19న భారీ లైటింగ్‌ పరికరాలను క్యారీ చేస్తున్న పెద్ద క్రేన్‌ విరిగి పడడంతో ముగ్గురు మృతి చెందగా, కొందరు గాయపడ్డారు. క్రేన్ కూలిన ప్రాంతానికి కొన్ని మీటర్ల దూరంలో ఉన్న శంకర్, తాను త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకున్నాని కమల్‌ పేర్కొన్నాడు.ఇకపై షూటింగులో పాల్గొనే ప్రతి ఒక్కరికీ బీమా కల్పించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లైకా ప్రొడక్షన్స్‌ ప్రొడ్యూసర్లను కోరాడు.

Also Read: బర్త్‌డే వేడుకలు వద్దన్న మహేష్.. గిఫ్ట్‌ రెడీ చేస్తున్న తమన్‌

ఇక, ఇండియన్‌ 2 షూటింగ్‌న తొందర్లోనే తిరిగి ప్రారంభిస్తామన్న కమల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పాడు. షూటింగ్‌ను ఇంతకాలం వాయిదా వేయడం వల్ల రోజు వారీ సినీ కార్మికుల కష్టాలు మరింత పెరుగుతాయన్నాడు. సెట్స్‌లో తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించాడు. కరోనా టైమ్‌లో ఫిల్మ్‌ సెట్స్‌లో ఎలా పని చేయాలనే విషయమై విదేశాల్లో కొంత మంది పరిశోధనలు చేసి కొన్ని మార్గాలను సూచించారని, వాటిని తాము పాటించే ప్రయత్నం చేస్తామని చెప్పాడు. కాగా, 1996లో వచ్చిన ఇండియన్‌ (తెలుగులో భారతీయుడు)కు సీక్వెల్‌గా వస్తున్న ఇండియన్‌ 2పై కమల్‌ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ మూవీలో కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సిద్దార్థ్‌ తదితరులు కూడా నటిస్తున్నారు.

‘బండి’ టార్గెట్ గా కొత్త రాజకీయాలు?

Bandi Sanjay

Bandi Sanjay
తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగేందుకు యత్నిస్తుంది. అందుకే టీఆర్ఎస్ చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై బీజేపీ దూకుడుగా వెళుతోంది. ప్రధాన ప్రతిపక్షం పోషించాల్సిన పాత్రను బీజేపీ భుజాన వేసుకొని టీఆర్ఎస్ కు రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయం అనే సంకేతాలను పంపుతోంది. కేంద్ర మంత్రులు, బీజేపీ అధిష్టానం తెలంగాణ నేతలకు పూర్తిగా మద్దతు ఇస్తుండటంతో తెలంగాణలో కమలం బలపడేందుకు శతవిధాలా యత్నిస్తుంది. 2024 ఎన్నికలే టార్గెట్ గా పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది.

2019 ఎన్నికల్లో తెలంగాణలో 16 ఎంపీ సీట్లు మావే అంటున్న బీరాలు పలికిన టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు షాకిచ్చారు. కాంగ్రెస్ మూడు సీట్లు కైవలం చేసుకొని బీజేపీ అనూహ్యంగా నాలుగు సీట్లు సాధించి సత్తాచాటింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలో బీజేపీ తిరుగులేని శక్తిగా మారేందుకు యత్నిస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ అధిష్టానం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియామకం అయ్యాక సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలపై దూకుడుగా వెళుతూ బీజేపీ నేతల్లో జోష్ నింపుతోన్నారు.

అయితే బండి సంజయ్ ఇప్పటివరకు తనకంటూ ఓ ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసుకోకపోయానే టాక్ విన్పిస్తుంది. దీంతో తాజాగా బండి సంజయ్ పార్టీ విస్త‌ర‌ణ‌పై దృష్టి పెట్టారు. అయితే రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు మాత్రమే బండి పెద్దపీఠ వేసి మిగతా జిల్లాలను పట్టించుకోలేదని పలువురు బండిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీకి గట్టి పట్టున్న ఆదిలాబాద్ జిల్లాకు ఎలాంటి పదవులు దక్కకపోవడంతో ఆ జిల్లా నేతలు బండిపై గుస్స అవుతున్నారు.

గత ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి ఎంపీగా సోయం బాబురావు గెలిచారు. ఆయన గెలుపు కోసం బీజేపీలోని కిందిస్థాయి నేతలు ఎంతో కష్టపడ్డారు. అయితే బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలోగానీ, ఇతర అనుబంధ సంఘాల్లోనూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలకు ప్రాధాన్యత దక్కకపోవడంతో స్థానిక నేతలు బండిపై మండిపడుతున్నారు. జిల్లాలో ఎందరో సీనియర్ నేతలు ఉన్నా ఏ ఒక్కరికీ అధిష్టానం చాన్స్ ఇవ్వకపోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై అధిష్టానంతో తేల్చుకునేందుకు జిల్లా శ్రేణులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ అధిష్టానం ఇచ్చే పిలుపుకు ఈ జిల్లా నేతలు పెద్దగా స్పందించకపోవడంతో పార్టీ పదవుల్లో వారికి అవకాశం దక్కలేదని టాక్ విన్పిస్తోంది.

కాంగ్రెస్, ఇతర పార్టీలోని సీనియర్లకు బీజేపీలోకి ఆహ్వానించి వారికి పదవులు ఇచ్చే ఆలోచనలు బీజేపీ అధిష్టానం ఉందనే టాక్ విన్పిస్తుంది. ఆదిలాబాద్ లో పార్టీ బలోపేతం చేయాల్సిన అధిష్టానం వారిలో అసంతృప్తిని రగిల్చేలా పదవుల పంపకం చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనిని కొందరు సీనియర్లు బండి సంజయ్ నాయకత్వంపై అసంతృప్తిని వెళ్లగక్కేందుకు వినియోగించుకోవాలని చూస్తున్నారట. ఈ సమస్యను బండి సంజయ్ ఎలా పరిష్కరిస్తారనేది వేచి చూడాల్సిందే..!

మధుయాష్కి మళ్లీ ఎంట్రీ ఇస్తారా? ఇవ్వరా?

Madhu Goud Yaskhi

Madhu Goud Yaskhi

ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన కాంగ్రెస్ నేతల్లో మధుయాష్కి ఒకరు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వద్ద, పార్లమెంటులో తెలంగాణ గళం విన్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వరుసగా రెండుసార్లు వరుసగా విజయం సాధించిన మాధుయాష్కి తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా ఎంపీగా రెండుసార్లు ఓటమిపాలవడం గమనార్హం. 2004, 2009 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన మధుయాష్కి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కవితకు కొంత పోటీ ఇచ్చినా ఆమె చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక 2019ఎన్నికల్లో ఏమాత్రం పోటీ ఇవ్వకుండా దారుణ పరాజయం పాలవడంతో నాటి నుంచి ఆయన నియోజకవర్గంలో పత్తాలేకుండా పోయారనే ప్రచారం జరుగుతోంది.

Also Read: కేసీఆర్.. మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేశాడా?

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉంది. ఈ కారణంగానే మధుయాష్కి రెండుసార్లు వరుసగా ఎంపీ అయ్యారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన వరుసగా ఓటమి పాలవుతూ వచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందనే సెంటిమెంట్ కాంగ్రెస్ కలిసొస్తుందని అనుకుంటే ఆ ఎన్నికల్లోనూ ఆయన కేసీఆర్ కూతురు కవిత చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ సీటు దక్కించుకున్నప్పటికీ మధుయాష్కి ప్రత్యర్థులకు కనీస పోటీ ఇవ్వకపోవడం విమర్శలు తావునిచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయన కవిత ఓటమే లక్ష్యంగా ఎక్కడ కూడా పెద్దగా ప్రచారం చేయకుండా బీజేపీకి సపోర్టు చేశారనే ప్రచారం జరిగింది. ఆ ఎన్నికల్లో డీఎస్ కుమారుడు అరవింద్ కు మద్దతు ఇచ్చారనే వార్తల్లో నిజం లేదని ఆయన గతంలో ఖండించారు.

అయితే పార్లమెంట్ పరిధిలో ఆయన ఎక్కడా కూడా పెద్దగా ప్రచారం చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో నాడు బరిలో నిలిచిన రైతులందరికీ కలిపి 98వేల ఓట్లు వస్తే యాష్కీకి కేవలం 68 వేల ఓట్లు మాత్రమే వచ్చారు. దీంతో ఆయన డిపాజిట్ కూడా దక్కలేదు. ఈ ఓటమి తర్వాత ఇప్పటివరకు ఆయన నిజామాబాద్‌లో ఏ కార్యక్రమంలో పెద్దగా పాల్గొనలేదు. కాంగ్రెస్ పిలుపు ఇచ్చిన ఏ కార్యక్రమంలో ఆయన కన్పించకపోవడంతో మదన్న ఎక్కడా కాంగ్రెస్ కార్యకర్తలే వెతుకుతున్నారట. సంవత్సర కాలంగా ఆయన నియోజకవర్గంలో ఎక్కడా కన్పించకపోవడంతో ఆయన రాజకీయాల్లో మళ్లీ ఎంట్రీ ఇస్తారా? లేదా అనే చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం నిజామాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల హవా కొనసాగుతోంది. కాంగ్రెస్ చెందిన నేతలంతా ఇతర పార్టీల్లోకి వెళ్లిపోవడం.. ఉన్న నేతలంతా సైలంటవడంతో క్యాడర్ నిస్తేజంగా మారుతోంది. జిల్లాలో కాంగ్రెస్‌ పరిస్థితి వెంటిలేటర్‌పై ఉందని ఆపార్టీ నేతలే సెటైర్లు వేసుకుంటున్నారు. అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే ఉన్నప్పటికీ ఆయా జిల్లాల నేతలు అడుపదడుప కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపే కార్యక్రమాలు చేస్తున్నారు.

Also Read: హోం ఐసోలేషన్ బాధితుల గోడు పట్టదా?

కానీ నిజామాబాద్ లో అలాంటి పరిస్థితులు కన్పించకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు భరోసా కల్పించాల్సిన నేతలే పత్తా లేకుండా పోవడం ఏంటనీ నిలదీస్తున్నారు. అయితే మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా? లేదా అనేది వేచి చూడాల్సిందే..!

జగన్ కేసీఆర్ ఒకేసారి మొదలెట్టారు… మరి ముగింపో…?

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నో సారూప్యతలు ఉన్నాయి. వీరిద్దరికీ ఉన్న కామన్ క్వాలిటీ దూకుడు. ఎలాంటి పరిస్థితినైనా లెక్కచేయని తత్వం. తాము అనుకున్నది సాధించే వరకు మడమ తిప్పని గుణం. ఆ పట్టుదలే వీరిద్దరినీ ‘జల వివాదం’ లో ఒకరిపై ఒకరు మిత్రత్వం మరిచి మరీ తీవ్ర ఆరోపణలు చేసుకునేలా చేసింది.

అయితే ఇప్పుడు జగన్ మరియు కేసీఆర్ ఇద్దరూ… ఒకేసారి తమ కలలను నెరవేర్చుకుంటున్నారు. ఆ దిశగా ఈ ఇద్దరు ఒకే సమయంలో కీలక అడుగు లను కూడా వేశారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆర్నెల్లు అయినా కూడా అత్యాధునిక హంగులతో సరికొత్త సచివాలయం నిర్మించడమనే అతని కలను సాకారం చేసుకునేందుకు ఇన్నేళ్లు పట్టింది. ఇక ఈ నెలలోనే కొత్త సచివాలయం కి సంబంధించిన భూమి పూజ కూడా జరగనుందని సమాచారం. అందుకు తగిన ఏర్పాట్లు అధికారులు చేసేస్తున్నారు కూడా. డిజైన్ విషయంలో కేసీఆర్ కు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నా కూడా ఈ విషయంలో సీఎం సాబ్ అయితే వెనక్కి తగ్గేది అయితే లేదు.

మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ది కూడా అదే దారి. ఒక ముఖ్య మంత్రికి ఒక రాజధాని నిర్మించడమే పెద్ద కల అయితే జగన్ ఏకంగా మూడు రాజధానుల పై కన్నేశాడు. ఒకేసారి మూడు రాజధానులు అభివృద్ధి చేసే అతని కలలను సాకారం చేసుకునేందుకు గవర్నర్ ఆమోదం తెచ్చుకున్న జగన్.. కేంద్రం నుండి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకున్నాడు. మొత్తానికి జగన్ మూడు రాజధానుల కలను ఆపడం ఇప్పుడు ప్రతిపక్షాలకు చాలా కష్టంగా ఉంది.

మొత్తానికి వీరిద్దరూ ఒకే సారి తమ కలలను సాకారం చేసుకొనే పనిలో పడగా దారిలో ఎన్ని ఆటుపోట్లు ఎదురవుతాయో లేదా మధ్యలో ఎటువంటి పరిణామాల మధ్య తమ పనులకు ఇబంది వస్తుందోనని ఆ పార్టీ మద్దతుదారులు టెన్షన్ లో ఉన్నారు. అన్నీ అధినేతలు అనుకున్నట్టు జరిగితే ఒకే సమయానికి తెలంగాణ నూతన సచివాలయం పూర్తి కావడం మరియు ఏపీలో స్థిరంగా మూడు రాజధానులు ఏర్పడడం జరగవచ్చు. అడుగు కలిసి ముందుకు వేశారు గమ్యానికి కూడా కలిసి ఒకేసారి చేరుతారా లేదా అన్నది ఇక్కడ ఆసక్తికరం.

ప్రభాసే ముందుగా రెడీ అవుతోంది !

Prabhas

Prabhas
కరోనా ప్రవాహంలో కొట్టుకుపోలేక షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చారు సినిమా వాళ్ళు. అయితే ఇప్పటికే నాలుగు నెలలు అయింది మేకప్ వేసుకుని మన స్టార్ హీరోలు. అందుకే స్లోగా షూటింగ్ కోసం కసరత్తులు చేస్తోన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో ఈ లిస్ట్ లో నేషనల్ రేంజ్ లో స్టార్ డమ్ సాధించిన ప్రభాసే ముందుగా చేరేలా ఉన్నాడు. తన ‘రాధే శ్యామ్’ కోసం షూట్ కి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో 6 కోట్ల రూపాయిలు పెట్టి ఇప్పటికే ఓ భారీ హాస్పిటల్ సెట్‌ వేశారు. ఇప్పుడు ఇదే సెట్ లో షూట్ చేయనున్నారు. అయితే చాలా తక్కువ సిబ్బంది ఉండేలా షూట్ ప్లాన్ చేస్తున్నారు.

Also Read: బర్త్‌డే వేడుకలు వద్దన్న మహేష్.. గిఫ్ట్‌ రెడీ చేస్తున్న తమన్

ఈ నెల 25 నుండి మొదలుకానున్న ఈ షెడ్యూల్ లో దాదాపు పది రోజుల పాటు ఇతర ఆర్టిస్ట్ ల పై షూట్ జరగనుంది. ఆ తరువాత ఈ హాస్పిటల్ సెట్‌ లోనే ప్రభాస్ పై కొన్ని కీలక యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తారట. ఈ సీన్స్ లో ప్రభాస్ పాత్ర వెరీ ఎమోషనల్ గా ఉంటుందని, అలాగే క్లైమాక్స్ కూడా చాలా భావోద్వేగంతో సాగుతూ ఎమోషనల్ గా ఉంటుందని.. సినిమాలో ప్రభాస్ వి రెండు క్యారెక్టర్స్.. అందులో ఒక క్యారెక్టర్ చనిపోతుందని మేము ఇంతకు ముందే రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సీన్స్ నే తీయబోతున్నారు.

Also Read: రమ్యకృష్ణ దెబ్బకు సక్సెస్ పోగొట్టుకున్న డైరెక్టర్ !

కాగా హిట్ అండ్ ఫేమ్ కూడా లేని రాధాకృష్ణ కుమార్ అనే ‘జిల్’ మూవీ డైరెక్టర్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ పై ప్రభాస్ ఫ్యాన్స్ కి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అయింది. మరి రాధాకృష్ణ ఈ సినిమాని ఎలా తీస్తాడో చూడాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని నాలుగు భాషల్లో గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

బర్త్‌డే వేడుకలు వద్దన్న మహేష్.. గిఫ్ట్‌ రెడీ చేస్తున్న తమన్‌

Mahesh Babu

Mahesh Babu

ఆగస్టు 9. సూపర్ స్టార్ మహేష్‌ బాబు అభిమానులకు పండగ రోజు. ఆ రోజు మహేష్‌ బర్త్‌డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని వారే కాదు ప్రపంచ వ్యాప్తంగా మహేష్‌ ఫ్యాన్స్‌ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. భారీ కటౌట్స్‌, కేక్‌ కటింగ్స్‌తో పాటు సేవా కార్యక్రమాలు చేయడం సహజంగా జరిగే దే.

Also Read: రమ్యకృష్ణ దెబ్బకు సక్సెస్ పోగొట్టుకున్న డైరెక్టర్ !

మరో రెండు రోజుల్లో అంటే ఈ ఆదివారమే టాలీవుడ్‌ ప్రిన్స్‌ 44 సంవత్సరాలు పూర్తి చేసుకొని 45వ పడిలోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రిన్స్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ కోసం ఫ్యాన్స్‌ ఇప్పటికే చాలా ఏర్పాట్లు చేశారు. కామన్‌ డిస్‌ప్లే పిక్చర్ తో సోషల్‌ మీడియాలో అయితే నెల రోజు ముందు నుంచే హంగామా మొదలు పెట్టారు.

అయితే తన బర్త్ డే సందర్భంగా అభిమానులెవరూ వేడుకలు జరుపొద్దని సూపర్ స్టార్ రిక్వెస్ట్‌ చేశాడు. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నందున అందరూ కరోనా నిబంధనలను పాటించాలని కోరుతూ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండటం చాలా ముఖ్యమని, అందుకే ఈ సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా సామూహిక వేడుకలు నిర్వహించొద్దని అభిమానులను కోరాడు. ‘ప్రియమైన అభిమానులకు, మీరందరూ నాకు తోడుగా ఉండడం నా అదృష్ణం. నా పుట్టినరోజు, ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తుండాలని మీరు చేస్తున్న మంచి పనులకు చాలా సంతోషంగా ఉంది. అందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను. ప్రస్తుతం కరోనాతో మనమందరం చేస్తున్న ఈ యుద్ధంలో సురక్షితంగా ఉండడం అనేది అన్నింటికంటే ముఖ్యం. నా పుట్టిన రోజున అభినులందరూ సామూహిక వేడుకలకు దూరంగా ఉండి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేమతో మహేశ్‌ బాబు’ అని ట్వీట్‌ చేశాడు.

Also Read: విషాదపు ప్రేమ కథ.. ప్రతి పాత్ర వెనుక ఒక కథ !

సూపర్స్టార్ బర్త్‌డే వేడుకలు చేయలేకపోతున్నామని నిరాశ పడుతున్న ఫ్యాన్స్‌కు ‘సర్కారువారి పాట’ టీమ్‌ నుంచి సర్ప్రైజ్‌ గిఫ్ట్‌ రానుంది. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ ట్విట్టర్లో తెలిపాడు. ఈ మేరకు మహేష్‌ను వెనకాల నుంచి తీసిన ఓ ఫొటోను పోస్ట్‌ చేశాడు. దానిపై మ్యూజిక్‌ సింబల్‌, వీడియో సింబల్‌తో పాటు సూన్‌ అని రాసి ఉంది. మరో మూడు రోజులే.. రెడీగా ఉన్నారా అని ట్వీట్‌ చేశాడు. తమన్‌ ఇచ్చిన హింట్‌ను బట్టి సర్కారువారిపాట నుంచి మహేష్‌ ఫస్ట్‌లుక్‌ టీజర్ లేదంటే ఓ సాంగ్‌ను రిలీజ్‌ చేసే అవకాశం ఉంది. మహేష్ వాయిస్ మెసేజ్, టైటిల్ ట్రాక్ విడుదల చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. కాగా, పరశురాం తెరకెక్కిస్తున్న ఈ మూవీని 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత షూటింగ్‌ మొదలయ్యే చాన్సుంది.

సోము వీర్రాజు దూకుడు వెనుక ఉన్న అసలైన టార్గెట్ వీరే…!


బిజెపి నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు సరైన సమయంలో పగ్గాలు చేపట్టాడు అనే చెప్పాలి. మొదటి నుండి రాజకీయాల్లో తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తూ మంచి మాటకారి గా పేరు తెచ్చుకున్న వీర్రాజు అధ్యక్షుడిగా నియమించబడిన మరుక్షణం నుండి ప్రతి రోజూ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ముందుగా ఢిల్లీకి వెళ్లి బిజెపి పెద్దలను కలిసి తన నియామకంపై కృతజ్ఞతలు చెప్పిన ఆయన కన్నా లక్ష్మీనారాయణ కన్నా తక్కువ కాలంలోనే ఎక్కువ పేరును సంపాదించారు.

అయితే ఎవరూ ఊహించని రీతిలో వీర్రాజు మాజీ రాజకీయ నాయకుడు మెగాస్టార్ చిరంజీవి ను కలవడం పెద్ద సంచలనం అనే చెప్పాలి. “మిత్రపక్షం జనసేన తో కలిసి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి” అని చిరంజీవి సూచించినట్లు వీర్రాజు పేర్కొనడం రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి చిరంజీవి జగన్ కు సన్నిహితంగా ఉంటున్నాడు అన్న వార్తలు భారీగా వస్తున్నాయి. పైగా వైసీపీలో గంటా చేరిక వెనుక చిరు…. జగన్ తో మంతనాలు జరిపినట్లు అనేక వార్తలు బయటకు వచ్చాయి. ఈ సమయంలో మెగాస్టార్ చిరంజీవి తో వీర్రాజు భేటీ కావడం పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించినట్లు చెప్పడం నిజంగానే పెద్ద విషయం.

ఇదిలా ఉండగా వెంటనే అతను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశాడు. “నాకు పవన్ చాలా మంచి స్నేహితుడని…. అందరూ నన్ను సోము వీర్రాజు అని పిలిస్తే పవన్ కళ్యాణ్ మాత్రం సోమరాజు అని పిలుస్తారని…. తనకు ఆయనతో ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంద”ని వీర్రాజు పలుసార్లు చెప్పుకొచ్చారు. ఇకపోతే వీర్రాజు ఇలా అన్నదమ్ములనుఒకరి తర్వాత ఒకరిని వరుసబెట్టి కలవడానికి కారణం కాపు సామాజిక వర్గం ఓట్లను బీజేపీ ఇప్పుడు భారీగా టార్గెట్ చేసేందుకు నిర్ణయించుకోవడమే అని బయట పెద్ద టాక్ నడుస్తోంది.

అందుకే మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ తో పాటు అశేష ప్రజాధరణ కలిగిన హీరో చిరంజీవి ని కూడా కలిసి తమకు తగిన గుర్తింపు రాష్ట్ర ప్రజల వద్ద నుండి లభించిన మరుక్షణం ఈ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేలా ఇవన్నీ హింట్ లు అని అంటున్నారు. అలాగే..వైసిపి, టిడిపి రాజధాని విషయంలో కొట్టుకుంటున్న సమయంలో బిజెపి మాత్రం అదన్ చూసి వీర్రాజు తో సరైన రాజకీయం నడిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.