Homeఎంటర్టైన్మెంట్బర్త్‌డే వేడుకలు వద్దన్న మహేష్.. గిఫ్ట్‌ రెడీ చేస్తున్న తమన్‌

బర్త్‌డే వేడుకలు వద్దన్న మహేష్.. గిఫ్ట్‌ రెడీ చేస్తున్న తమన్‌

ఆగస్టు 9. సూపర్ స్టార్ మహేష్‌ బాబు అభిమానులకు పండగ రోజు. ఆ రోజు మహేష్‌ బర్త్‌డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని వారే కాదు ప్రపంచ వ్యాప్తంగా మహేష్‌ ఫ్యాన్స్‌ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. భారీ కటౌట్స్‌, కేక్‌ కటింగ్స్‌తో పాటు సేవా కార్యక్రమాలు చేయడం సహజంగా జరిగే దే. Also Read: రమ్యకృష్ణ దెబ్బకు సక్సెస్ పోగొట్టుకున్న డైరెక్టర్ ! మరో రెండు రోజుల్లో అంటే ఈ ఆదివారమే టాలీవుడ్‌ ప్రిన్స్‌ 44 […]

Mahesh Babu

ఆగస్టు 9. సూపర్ స్టార్ మహేష్‌ బాబు అభిమానులకు పండగ రోజు. ఆ రోజు మహేష్‌ బర్త్‌డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని వారే కాదు ప్రపంచ వ్యాప్తంగా మహేష్‌ ఫ్యాన్స్‌ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. భారీ కటౌట్స్‌, కేక్‌ కటింగ్స్‌తో పాటు సేవా కార్యక్రమాలు చేయడం సహజంగా జరిగే దే.

Also Read: రమ్యకృష్ణ దెబ్బకు సక్సెస్ పోగొట్టుకున్న డైరెక్టర్ !

మరో రెండు రోజుల్లో అంటే ఈ ఆదివారమే టాలీవుడ్‌ ప్రిన్స్‌ 44 సంవత్సరాలు పూర్తి చేసుకొని 45వ పడిలోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రిన్స్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ కోసం ఫ్యాన్స్‌ ఇప్పటికే చాలా ఏర్పాట్లు చేశారు. కామన్‌ డిస్‌ప్లే పిక్చర్ తో సోషల్‌ మీడియాలో అయితే నెల రోజు ముందు నుంచే హంగామా మొదలు పెట్టారు.

అయితే తన బర్త్ డే సందర్భంగా అభిమానులెవరూ వేడుకలు జరుపొద్దని సూపర్ స్టార్ రిక్వెస్ట్‌ చేశాడు. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నందున అందరూ కరోనా నిబంధనలను పాటించాలని కోరుతూ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండటం చాలా ముఖ్యమని, అందుకే ఈ సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా సామూహిక వేడుకలు నిర్వహించొద్దని అభిమానులను కోరాడు. ‘ప్రియమైన అభిమానులకు, మీరందరూ నాకు తోడుగా ఉండడం నా అదృష్ణం. నా పుట్టినరోజు, ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తుండాలని మీరు చేస్తున్న మంచి పనులకు చాలా సంతోషంగా ఉంది. అందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను. ప్రస్తుతం కరోనాతో మనమందరం చేస్తున్న ఈ యుద్ధంలో సురక్షితంగా ఉండడం అనేది అన్నింటికంటే ముఖ్యం. నా పుట్టిన రోజున అభినులందరూ సామూహిక వేడుకలకు దూరంగా ఉండి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేమతో మహేశ్‌ బాబు’ అని ట్వీట్‌ చేశాడు.

Also Read: విషాదపు ప్రేమ కథ.. ప్రతి పాత్ర వెనుక ఒక కథ !

సూపర్స్టార్ బర్త్‌డే వేడుకలు చేయలేకపోతున్నామని నిరాశ పడుతున్న ఫ్యాన్స్‌కు ‘సర్కారువారి పాట’ టీమ్‌ నుంచి సర్ప్రైజ్‌ గిఫ్ట్‌ రానుంది. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ ట్విట్టర్లో తెలిపాడు. ఈ మేరకు మహేష్‌ను వెనకాల నుంచి తీసిన ఓ ఫొటోను పోస్ట్‌ చేశాడు. దానిపై మ్యూజిక్‌ సింబల్‌, వీడియో సింబల్‌తో పాటు సూన్‌ అని రాసి ఉంది. మరో మూడు రోజులే.. రెడీగా ఉన్నారా అని ట్వీట్‌ చేశాడు. తమన్‌ ఇచ్చిన హింట్‌ను బట్టి సర్కారువారిపాట నుంచి మహేష్‌ ఫస్ట్‌లుక్‌ టీజర్ లేదంటే ఓ సాంగ్‌ను రిలీజ్‌ చేసే అవకాశం ఉంది. మహేష్ వాయిస్ మెసేజ్, టైటిల్ ట్రాక్ విడుదల చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. కాగా, పరశురాం తెరకెక్కిస్తున్న ఈ మూవీని 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత షూటింగ్‌ మొదలయ్యే చాన్సుంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Oktelugu Epaper