
ప్రశాంతమైన వాతావరణం ఉన్న ప్రాంతంగా పేరు తెచ్చుకున్న విశాఖ జిల్లాలో గత కొంతకాలం నుంచి మనుషులను భయభ్రాంతులకు గురి చేసే ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా విశాఖలో ఒక వ్యక్తి మనిషి పుర్రెను కాల్చుకుంటూ తినడానికి ప్రయత్నించాడు. స్థానికులు పుర్రె తినడానికి ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తిని చూసి షాక్ కు గురయ్యారు. తన చుట్టూ జనం చేరడంతో ఆ వ్యక్తి వెంటనే ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు.
Also Read: కారును బైకులా మార్చి ప్రాణాలు దక్కించుకున్నాడు!
విశాఖలోని రెల్లి వీధిలో నేడు ఈ ఘటన చోటు చేసుకుంది. పాడుబడ్డ ఇంట్లో రావేలపూడి రాజు అనే సైకో మనిషి పుర్రెను కాల్చుకుని తినడానికి ప్రయత్నించడాన్ని స్థానికులు గమనించారు. స్థానికులను చూడటంతో భయపడి సైకో అక్కడి నుంచి పరుగు లంకించాడు. రాజు గత కొన్ని నెలల నుంచి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఒంటరిగా ఉంటూ చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు ఘటన అనంతరం పోలీసులు రాజును పట్టుకోవడానికి ప్రయత్నించారు.
Also Read: చెట్టును నరకడం ఇష్టం లేకా ఆ వ్యక్తి ఏం చేశాడంటే?
అయితే తృటిలో రాజు పోలీసులకు దొరకకుండా పరారయ్యాడు. పోలీసులు పుర్రెను స్వాధీనం చేసుకోగా ఈ ఘటనతో రెల్లి వీధి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులు రాజు ఇంట్లో ఉండే ఒక యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం రాజు తండ్రి అనారోగ్య సమస్యలతో మృతి చెందాడని అప్పటినుండి రాజు మానసిక పరిస్థితి బాగాలేదని స్థానికులు చెబుతున్నారు.