
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం పై విచారణ గత కొన్ని రోజులుగా ఒక థ్రిల్లర్ సినిమా స్క్రీన్ ప్లేలా సాగుతూ ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. అసలు బాలీవుడ్ లాంటి మహా సముద్రంలో మునిగిపోకుండా తనకంటూ ఒక స్థాయిని క్రియేట్ చేసుకున్న సుశాంత్.. ఒక అనాముకుడిలా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ? నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా ? లేక ఎవరైనా ప్లాన్ చేసి హత్య చేశారా ? అనే విషయాలు ఎటూ తేలడం లేదు. చివరకు సీబీఐ కూడా రంగంలోకి దిగినా ఇంతవరకూ ఇది జరిగింది అని వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఇంకా సీబీఐ సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తోంది. మరి అసలు నిజాలను కొన్ని రోజులు విచారణ తరువాత అయినా బయటపెడుతుందా చూడాలి.
Also Read: ఆర్జీవీకి షాక్.. ‘మర్డర్’ రిలీజ్‌కు కోర్టు బ్రేక్
మరోవైపు రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మాత్రం సుశాంత్ కేసు పై ఎప్పటికప్పుడు ఏదొక ఆరోపణలు చేస్తూ.. అనేక అనుమానాలను రేకెత్తిస్తోన్నారు. ఇప్పటికే సుబ్రహ్మణ్య స్వామి.. సుశాంత్ మరణించడానికి కొన్ని గంటల ముందే దుబాయ్ డ్రగ్ డీలర్ అయూష్ ఖాన్ తో మాట్లాడారని.. పైగా అతన్ని సుశాంత్ చాలా సార్లు కలిశారని స్వామి ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ స్వామి ఇలాంటి ఆరోపణలు చేయడానికి ఆయనకున్న ఆధారాలు ఏమిటో ఆయన ఇంతవరకూ బయటపెట్టలేదు. అయితే స్వామి చెబుతున్నట్లు.. సుశాంత్ మరణానికి ముందు డ్రగ్ డీలర్ అయూష్ ఖాన్ ఎందుకు కలిసినట్లు.. ? ఈ విషయం పై తనకు కూడా క్లారిటీ లేదని సుబ్రహ్మణ్య స్వామి తెలిపినా.. ఒక డ్రగ్ డీలర్ తో సంబంధాలు ఉన్నాయంటే.. సుశాంత్ లైఫ్ స్టైల్ మీద ఇప్పుడు అనేక అనుమానాలు వస్తున్నాయి.
Also Read: ప్రభాస్ మూవీలో నిధి అగర్వాల్‌కు గోల్డెన్ చాన్స్!
కానీ, సీబీఐ మాత్రం సుశాంత్ కేసును ఇంకా సీరియస్ గా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి, దుబాయ్ కి మధ్య ఏదో లింక్ ఉందని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించిన ఆరోపణల పై సీబీఐ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సుశాంత్ అభిమానులు కోరుకుంటున్నారు. అసలు సుశాంత్ కేసుతో పాటుగా శ్రీదేవి మరణం మీద కూడా అభిమానులకు అనేక అనుమానాలు ఉన్నాయి. అసలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సెలబ్రిటీలు, స్టార్స్ కేసులనే మన వ్యవస్థ బయటపెట్టలేని అప్పుడు, ఇక మాములు జనానికి ఈ న్యాయ వ్యవస్థలో న్యాయం జరుగుతుందని ఎలా నమ్మగలం.