Home Blog Page 239

మండే ఎండల్లో చల్లని నీరు తాగుతున్నారా..

Summer Heat Hydration Tips
Summer Heat Hydration Tips

Summer Heat Hydration Tips: ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే అస్సాం వరకు ఇదే పరిస్థితి. ప్రతి ప్రాంతంలోనూ 45 కు మించిన డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఎండలు పెరిగితే సహజంగానే దాహం వేస్తూ ఉంటుంది. పైగా చెమట రూపంలో శరీరం నుంచి లవణాలు బయటికి వెళ్లిపోతుంటాయి. ఇలాంటప్పుడు శరీరం డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు హైడ్రేట్ కచ్చితంగా చేసుకోవాలి. దానికోసం నీరు తాగుతూనే ఉండాలి.

ఎండాకాలంలో మామూలు నీళ్లు తాగితే దాహం తీరినట్టు అనిపించదు. పైగా గొంతు నిత్యం పొడిబారుతూ ఉంటుంది. అలాంటప్పుడు చాలామంది చల్లటి నీళ్లను తాగుతూ ఉంటారు. చల్లని నీళ్లు తాగినప్పుడు శరీరానికి కాస్త ఉపశమనం లభించినట్టు అవుతుంది. ఆ తర్వాత మళ్లీ దాహం వేస్తూ ఉంటుంది. చల్లని నీళ్లు తాగినప్పుడు శరీరానికి తాత్కాలికంగా సాంత్వన లభిస్తుందని.. చల్లని నీళ్లు తర్వాత శరీరానికి అసౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అంతర్గతంగా వేడిని క్రమబద్ధీకరించేందుకు శరీరం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. బయట వేడి అధికంగా ఉన్నప్పుడు అంతర్గతంగా ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించేందుకు శరీరం కూల్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. దీనివల్ల మన దేహంలో ఉన్న స్వేద గ్రంధులు మొత్తం ఒక్కసారిగా అలర్ట్ అయిపోతాయి. రక్తనాళాలు వ్యాకోచం చెందుతాయి. శరీరం నుంచి వేడి బయటికి వెళ్లి పోతున్నప్పుడు చర్మం లవణాలను బయటకు విడుదల చేస్తూ ఉంటుంది.. అదే సమయంలో చెమట అనేది వస్తూ ఉంటుంది. రక్త ప్రవాహంలో కూడా వేగం పెరుగుతూ ఉంటుంది. శరీరం అంతర్గతంగా కూల్ అవ్వడానికి ద్రవాలను వేగంగా కోల్పోవడం మొదలుపెడుతుంది. దీనివల్ల డిహైడ్రేషన్ అనే సమస్య ఎదురవుతూ ఉంటుంది. అంతేకాదు శరీరంలో లవణాలు బయటికి వెళ్లిపోవడం వల్ల నీరసానికి గురికావాల్సి వస్తుంది.

ఎండలో ఏదైనా పని చేసినప్పుడు.. దాహం అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు చల్లని నీళ్లు తాగితే దేహంలో ఉన్న రక్తనాళాలు ముడుచుకుపోతాయి. మైగ్రేన్ లేదా సైనస్ వంటి ఇబ్బందులు ఉన్నవారు మరింత అవస్థలు పడవచ్చు. ముఖ్యంగా పొట్ట భాగంలో కండరాలు బిగిసిపోతాయి. దీనివల్ల జీర్ణ క్రియ వేగం తగ్గే అవకాశం ఉంది.

చల్లటి నీరు తాగడం వల్ల గొంతు అంతర్గత త్వరలో అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంది. తెమడ కూడా వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు గొంతు నొప్పి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొందరైతే తీవ్రమైన తలపోటుకు గురవుతారు. విపరీతమైన ఎండ వల్ల బాడీలో ప్రెజర్ పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు శీతలమైన నీళ్లు తాగితే శరీరం లో ఒక్కసారిగా మార్పు రావచ్చు. దానివల్ల అసౌకర్యం కూడా కలిగి అవకాశం ఉంది. టెంపరేచర్లో మార్పుల వల్ల గుండె కొట్టుకునే వేగం. ప్రభావితం కావచ్చు. అప్పుడప్పుడు కళ్ళు తిరిగే ప్రమాదం కూడా ఉంటుంది.

ఇలా చేస్తే ప్రయోజనం

ఎండలో తిరిగి వచ్చిన తర్వాత శరీరాన్ని కాసేపు కూల్ చేయాలి. ఆ తర్వాత నీళ్లు తాగాలి. కూల్ వాటర్ కంటే ముందుగా సాధారణ నీళ్లు తాగాలి. దీనివల్ల శరీరం త్వరగా హైడ్రేట్ అవుతూ ఉంటుంది. అవకాశం ఉంటే కొబ్బరి నీళ్లు తాగాలి. అందులో కొంత ఉప్పు.. నిమ్మరసం.. మజ్జిగ కలిపి తాగవచ్చు. దీనివల్ల శరీరానికి అసౌకర్యం కలగదు. అంతేకాదు దేహంలో ఎలక్ట్రోలైట్లు యాక్టివ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ కూల్ వాటర్ తాగాలనుకుంటే.. ముందుగా మామూలు నీళ్లతో శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. కొంత సమయం అలా కూర్చోవాలి.. ఆ తర్వాత కూల్ వాటర్ తాగాలి.

గమనిక

ఈ కథనం పాఠకుల సమాచారం కోసం వివిధ వేదికల వద్ద సేకరించాం. ఎట్టి పరిస్థితుల్లో దీనిని వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నాయంగా చూడవద్దని ఒకే తెలుగు పాఠకులకు సూచిస్తోంది.

ఆ ఇద్దరు దర్శకులతో సినిమా చేయడానికి అల్లు అర్జున్ ఏం చేశాడో తెలుసా..?

Allu Arjun
Allu Arjun

Allu Arjun Career Growth: గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు అల్లు అర్జున్… ఆ సినిమా సక్సెస్ అయిన కూడా అతనికి ఏమాత్రం హెల్ప్ కాలేదు. ఆ తర్వాత సుకుమార్ తో చేసిన ఆర్య సినిమాతో భారీ విజయాన్ని సాధించాడు. ఇక ఆయన చేసిన ఈ సినిమాతో యూత్లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకోవడమే కాకుండా ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకున్నాడు. అలాంటి అల్లు అర్జున్ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా వరకు ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఒకానొక సమయంలో అల్లు అర్జున్ కి సక్సెస్ లు వచ్చినా కూడా భారీ విజయాలైతే రాకపోవడంతో వల్ల నాన్న అయిన అల్లు అరవింద్ తో ఒక ఇద్దరు దర్శకులతో సినిమాలను సెట్ చేయమని చెప్పారట. ఇంతకీ ఆ దర్శకులు ఎవరు అంటే ఒకరు పూరి జగన్నాథ్ కాగా, మరొకరు గుణ శేఖర్ కావడం విశేషం…

వీళ్ళిద్దరికి అప్పట్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. దానివల్లే వాళ్లతో సినిమాలు చేయడానికి అల్లు అర్జున్ ఇంట్రెస్ట్ చూపించాడు. దేశముదురు సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఆయన హీరోగా మరో మెట్టు పైకి ఎక్కడనే చెప్పాలి.

అయితే గుణశేఖర్ తో చేసిన ‘వరుడు’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో అల్లు అర్జున్ కొంత వరకు డీలా పడిపోయాడు… మొత్తానికైతే ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియాలో స్టార్ హీరోగా వెలుగొందుతుందటం విశేషం… పుష్ప సినిమాతో ఎక్కడలేని క్రేజ్ ను సంపాదించుకున్న ఆయన ఇప్పుడు మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక మీదట కూడా ఆయన డిఫరెంట్ సినిమాలను చేయగలిగితే బాగుంటుంది.

లేకపోతే మాత్రం అయినా చాలా వరకు వెనుకబడి పోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఇప్పుడున్నా స్టార్ హీరోలకు పోటీని ఇవ్వాలంటే ఆయన తన నటనలో వైవిధ్యాన్ని చూపించాల్సిన అవసరమైతే ఉంది. ఇక కథల విషయంలో కూడా ఆయన ఇంకా డిఫరెంట్ గా ప్రయత్నం చేయాల్సిన అవసరమైతే ఉంది…

చిరంజీవి మార్కెట్ ఎంత ఆయన మీద ఎంత బడ్జెట్ పెడితే సేఫ్ జోన్ లో ఉండచ్చు..?

Chiranjeevi
Chiranjeevi

Chiranjeevi Market Range: మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో పెను సంచలనాలను క్రియేట్ చేయడంలో కొంతవరకు వెనుకబడిపోతున్నాడు. కారణం ఏంటి అంటే ఆయనకు ఈజీ పెరిగే కొద్ది డిఫరెంట్ సినిమాలను చేయలేకపోతున్నాడని కొంతమంది అంటుంటే చిరంజీవి మాత్రం ఏజ్ తో సంబంధం లేదు. తను ఎలాంటి పాత్రనైనా సరే పోషిస్తాను కానీ తన వద్దకు వచ్చిన స్క్రిప్ట్ లను మాత్రమే సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేస్తున్నానని డిఫరెంట్ సినిమాలను చేసే దర్శకుడు తన దగ్గరికి వస్తే తప్పకుండా అలాంటి సినిమాలు చేస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. ఇక నిజానికి చిరంజీవి సినిమాలకు ఓవర్ బడ్జెట్ పెట్టడం కంటే చాలా తక్కువ బడ్జెట్ పెడితేనే బెటర్… ఎందుకంటే ఇప్పుడు ఆయన మార్కెట్ 400 కోట్ల వరకు మాత్రమే ఉంది. కాబట్టి ఆయన సినిమా మీద 150 నుంచి 200 కోట్ల వరకు పెడితే దర్శక నిర్మాతలు సేఫ్ జోన్ లో ఉండొచ్చనే ఉద్దేశ్యంతో ఉన్నారు.

ఇక రీసెంట్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా 400 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టింది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చిరంజీవి మార్కెట్ ఎంతుంది అనే అంచనాకైతే వస్తున్నారు. చిరంజీవి గత 50 సంవత్సరాల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎనలేని ఖ్యాతిని సంపాదించుకున్నాడు.

కాబట్టి ఆయన నుంచి వచ్చే సినిమాల విషయంలో ప్రేక్షకులు కూడా చాలా చాలావరకు కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక మార్కెట్ తో సంబంధం లేకుండా ఇప్పటికైనా చిరంజీవి రియాలెస్టిక్ గా ఉండే సినిమాలు చేస్తే బాగుంటుందని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఆయన అడపదడప అలాంటి సినిమాలు చేసిన కూడా ప్రేక్షకులు వాటిని ఆదరించడం లేదు.

కమర్షియల్ సినిమాల వైపు ప్రేక్షకులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని ఆయన అలాంటి సినిమాలను మాత్రమే చేస్తున్నాడు… ఇక ప్రస్తుతం ఆయన బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా కూడా కమర్షియల్ సినిమానే కావడం విశేషం…ఈ మూవీ కోసం దాదాపు 200 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక చిరంజీవి ఒక ఇప్పటికైనా తన పంథా ను మార్చుకొని డిఫరెంట్ సినిమాలు చేస్తే చూడాలని ఒక వర్గం ప్రేక్షకులైతే భావిస్తున్నారు. ఇక ఫ్యూచర్ లో అది వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి…

ధనుష్ కి అలాంటి క్యారెక్టర్ చేయాలనుందా..?

Dhanush New Movie Updates
Dhanush New Movie Updates

Dhanush New Movie Updates: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి ధనుష్ కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. పాన్ ఇండియాలో అతనికి చాలా మంచి మార్కెట్ ఉంది. ఇప్పటివరకు అతనితో చాలా మంది దర్శకులు డిఫరెంట్ సినిమాలను చేశారు. ఇక ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటున్నారు. కాబట్టి ధనుష్ కూడా వారందరితో సినిమాలు చేస్తూ ప్రయోగాత్మకమైన క్యారెక్టర్స్ ని చేసి మెప్పిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చాలా సినిమాల్లో డిఫరెంట్ పాత్రల్లో నటించాడు. కానీ తనకి ఒక కాటి కాపరి గెటప్ లో నటించాలని ఉందని తెలియజేశాడు. నిజానికి శివపుత్రుడు సినిమాలో విక్రమ్ అలాంటి ఒక డిఫరెంట్ పాత్రను పోషించి చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ధనుష్ నటన పరంగా చాలా వైవిధ్యాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి అలాంటి పాత్ర ఏదైనా దొరికితే చేస్తానని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట. ఇక ఇప్పుడు అలాంటి రియాలెస్టిక్ సినిమాలను ఆదరించే ప్రేక్షకులు తగ్గిపోయారు. కాబట్టి తమిళ్ డైరెక్టర్లు సైతం అలాంటి సినిమాల వైపు అడుగులు వేయడం లేదు.

దాంతో ధనుష్ అనుకున్న కోరిక అప్పటినుంచి ఇప్పటివరకు నెరవేరలేదట. ఇక ఇప్పుడు ఎవరైనా ముందుకొచ్చి అలాంటి కథతో ధనుష్ తో సినిమా చేస్తే తను తప్పకుండా సినిమా చేస్తానని చెబుతున్నట్టుగా తెలుస్తుంది…

ధనుష్ హీరోగా కాకుండా దర్శకుడిగా కూడా తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు. గత సంవత్సరం రాయన్ సినిమాతో డైరెక్టర్ గా తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఇక ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన కొంతవరకు డీలాపడ్డాడు. ఇడ్లీ కొట్టు సినిమాతో మరోసారి దర్శకుడిగా తన సత్తా చాటుకునే ప్రయత్నం చేసిన కూడా ఆ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది.

దాంతో ఆయన దర్శకత్వాన్ని పక్కనపెట్టి ఇప్పుడు సినిమా హీరోగానే ఎక్కువగా ఫోకస్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎప్పటికప్పుడు వైవిధ్యాన్ని కోరుకునే ఆయన ఇప్పటికి డిఫరెంట్ సినిమాల వైపే అడుగులు వేస్తుండటం విశేషం…

దుల్కర్ సల్మాన్ తో సినిమా చేయబోతున్న తెలుగు స్టార్ డైరెక్టర్...

Dulquer Salmaan
Dulquer Salmaan

Dulquer Salmaan New Movie: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మనవాళ్లు భారీ సినిమాలను చేస్తూ బిజీగా ఉండటం వల్ల మన దర్శకులకు కావలసిన డేట్లు ఇవ్వలేకపోతున్నారు. హీరోలు తక్కువ మంది ఉన్నారు. దర్శకులు ఎక్కువ మంది ఉండటం వల్ల ఆ హీరోలు స్టార్ డైరెక్టర్లతోనే సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. దానివల్ల మన దర్శకులు ఇతర భాషల హీరోల మీద ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పటికే వెంకీ అట్లూరి లాంటి దర్శకుడు సార్, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలతో ఇతర భాషల హీరోలకు సక్సెస్ లను అందించాడు. ఇక ఇప్పుడు మరోసారి సూర్య ని హీరోగా పెట్టి ఆయన విశ్వనాథన్ ఆన్ సన్స్ అనే సినిమా చేస్తున్నాడు…ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల సైతం స్టార్ హీరోతో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసిన కూడా ఆ హీరో చాలా బిజీగా ఉండటం వల్ల ఆయన అతనితో సినిమా చేయలేకపోతున్నాడు. దాంతో మలయాళం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న దుల్కర్ సల్మాన్ ను హీరోగా పెట్టి సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. దుల్కర్ సల్మాన్ కి తెలుగులో కూడా చాలా మంచి మార్కెట్ ఉంది.

ఆ మార్కెట్ ను పెంచుకోవడానికి ఆయన తెలుగు దర్శకులతో కూడా సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు… ఇక ఇది చూసిన కొంతమంది మాత్రం స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం లేకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేయొచ్చు కదా…

మన దర్శకులు ఎందుకని ఇతర భాషల హీరోలను ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్లెవరూ మన మన సినిమాలను చూడరు అంటూ దర్శకుల మీద ఫైర్ అవుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా స్టార్ హీరోలు డేట్స్ ఇస్తే వాళ్లతో సినిమాలు చేయడానికి దర్శకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

మీడియం రేంజ్ హీరోలతో సినిమా చేస్తే వాళ్లు అనుకున్న కంటెంట్ ప్రేక్షకులకు అంత పెద్దగా రీచ్ అవ్వదనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు మీడియం రేంజ్ హీరోలను పక్కన పెడుతున్నారు…ఇక ఇప్పుడు విరాట పర్వం దర్శకుడు వేణు ఉడుగుల సైతం దుల్కర్ సల్మాన్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు…ఇంతకు ముందు వేణు ఉడుగుల ధనుష్ తో సినిమా చేయడానికి కోసం ట్రై చేశాడు. అది వర్కౌట్ కాకపోయేసరికి దుల్కర్ సల్మాన్ తో ట్రై చేస్తున్నాడు…

పదేళ్ల బాలిక.. విజయ్ కన్నీళ్లు.. రాజీనామాకు డిమాండ్.. తమిళనాడులో ఏం జరిగింది..

Vijay Emotional Reaction
Vijay Emotional Reaction

Vijay Emotional Reaction: కొద్దిరోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశ మీడియాలో అంతగా స్థానాన్ని ఆక్రమించడం లేదు. విజయ్ ముఖ్యమంత్రి కాకముందు చోటు చేసుకున్న పరిణామాలు.. అయిన తర్వాత జరిగిన సంఘటనలపై జాతీయ మీడియా విస్తృతంగా ఫోకస్ చేసింది. ఆ తర్వాత విజయ్ తన పరిపాలనలో పడిపోయారు.. జాతీయ మీడియా కూడా పెద్దగా పట్టించుకోవడం మానేసింది. అయితే ఇది కొద్దిరోజులు మాత్రమే.. ఎందుకంటే ఇప్పుడు జాతీయ మీడియా దృష్టి మొత్తం తమిళనాడు మీద పెట్టింది. తమిళనాడు లో జరిగిన ఓ సంఘటన దీనికి కారణం.

తమిళనాడులో పారిశ్రామిక రాజధానిగా పేరుపొందింది. కోయంబత్తూరు. ఈ నగరంలో 30 సంవత్సరాల బాలిక దుకాణానికి వెళ్ళింది.. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు విచారణలో ఆ బాలిక హత్యకు గురైనట్టు తెలిసింది. అయితే ఆమె హత్య వెనక కార్తీక్.. మోహన్ రాజ్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు కోయంబత్తూర్ పోలీసులు గుర్తించారు. వారిని అరెస్ట్ కూడా చేశారు. ఈ సంఘటన తమిళనాడు రాజకీయాలను తీవ్రంగా కుదిపి వేస్తోంది. అంతేకాదు ముఖ్యమంత్రి ఈ ఘటనపై తీవ్ర విచారణ వ్యక్తం చేశారు.. భావోద్వేగానికి కూడా గురయ్యారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కచ్చితంగా చర్య తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబం ఉంటే.. వారిని టీవీ కే ఎమ్మెల్యే ఎన్ఎం కుమార్ పరామర్శించారు. ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

అయితే ఈ బాలిక హత్య సంఘటన తమిళనాడు రాజకీయాలలో తీవ్ర కలకలం రేపుతోంది. విజయ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 రోజుల్లోనే ఈ ఘటన జరిగిందని.. రాష్ట్ర వ్యాప్తంగా నేరాలు చేసే వారి సంఖ్య పెరిగిపోతుందని డీఎంకే ఆరోపణలు మొదలుపెట్టింది. శాంతిభద్రతల పరిరక్షణ సరిగా లేదని.. అందువల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్.. ప్రతిపక్ష నాయకుడు ఉదయనిది స్టాలిన్ ఆరోపించారు. ఈ ఘటన వెనుక ఉన్న వారిని కచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళా భద్రతను కాగితాలలో కాకుండా.. చేతల్లో చేసి చూపించాలని ఉదయనిది డిమాండ్ చేశారు. శాంతి భద్రతలను పరిరక్షించడం చేతకాకపోతే రాజీనామా చేయాలని సూచించారు.

మరోవైపు బిజెపి నాయకులు కూడా ఈ ఘటనపై స్పందించారు. స్టాలిన్ ప్రభుత్వం తమిళనాడు రాష్ట్రంలో శాంతి భద్రతలను మొత్తం నాశనం చేసిందని.. ఇప్పుడు విజయ్ దానిని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కోయంబత్తూర్ లోని కన్నపాలెం గ్రామానికి చెందిన బాలిక గురువారం సాయంత్రం దుకాణానికి వెళ్లిందని.. ఆ తర్వాత ఇంటికి రాలేదని.. బాలిక తల్లిదండ్రులు చాలా చోట్ల వెతికినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని.. శుక్రవారం స్థానికంగా ఉన్న ఒక చెరువులో ఆమె మృతదేహం కనిపించిందని నారాయణన్ పేర్కొన్నారు. అయితే పోలీసులు విచారణలో ఓ వ్యక్తి ఆ బాలికను ద్విచక్ర వాహనం మీద తీసుకొని వెళ్ళినట్టు తేలింది. అతనితోపాటు మరొక వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

అమెరికా వద్దు.. ఇండియాకు వచ్చేయండి.. జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ ఎందుకీ మాట అన్నారంటే..

Zoho Founder Sridhar Vembu
Zoho Founder Sridhar Vembu

Zoho Founder Sridhar Vembu: అమెరికాలో గ్రీన్ కార్డు కోసం తాత్కాలిక వలసదారులు దరఖాస్తులు చేసుకుంటారు. కొంతకాలంగా అమెరికా లో స్థిరనివాసం ఉండేందుకు వలసదారులు విపరీతమైన పోటీపడుతున్నారు. అమెరికాలో శాశ్వత నివాస హక్కు కోసం పోటీ కూడా అదే స్థాయిలో ఉంటోంది. గతంలో దరఖాస్తులు సమర్పించడానికి వలసదారులు సొంత దేశానికి వెళ్లే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. అక్కడ చట్టాలు మొత్తం పూర్తిగా మార్చేశారు.

అమెరికాలో శాశ్వత నివాస హక్కును కోరే తాత్కాలిక వలసదారుల విషయంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాశ్వత నివాస హక్కును కోరుకునేవారు ఇకపై తమ దరఖాస్తులను సమర్పించేందుకు సొంత దేశానికి వెళ్లాలి.. దీనిపై అనేక రకాలుగా విమర్శలు వినిపిస్తున్నాయి.. లింక్డ్ ఇన్ సహా వ్యవస్థాపకుడు రెడ్ హామన్ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఉద్యోగులు.. పరిశోధకులు.. వైద్యులు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతే అమెరికా పరిస్థితి ఏంటని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అమెరికా ప్రగతిని పూర్తిగా దెబ్బతిస్తుందని ఆయన పేర్కొన్నారు. గతంలో గూగుల్ ఏఐ నాయకత్వంలో కీలక వ్యక్తిగా పనిచేసిన అండ్రు ఎంగ్ ట్రంపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో పోటీ తత్వం తగ్గిపోతుందని.. శాస్త్రవేత్తలు.. వైద్యులు.. ఉపాధ్యాయులు వారి సొంత దేశాలకు వెళ్తే.. అమెరికా పరిస్థితి దారుణంగా మారుతుందని పేర్కొన్నారు.

అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డ్ వ్యవహారంలో తీసుకున్న నిర్ణయం పట్ల జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు స్పందించారు. “గ్రీన్ కార్డు ప్రక్రియలో అమెరికా అనేక రకాల షరతులు విధించింది. ఏకంగా సొంత దేశాలకు వెళ్ళిపోయి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అమెరికాలో ఉంటున్న భారతీయులు ఇప్పటికైనా ఆలోచించాలి. సొంత దేశానికి రావాలి. ఈ నిర్ణయం కాస్త కఠినంగా ఉన్నప్పటికీ తప్పదు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొన్ని నిర్ణయాలు కష్టంగా ఉన్నప్పటికీ తప్పదు. ఈ సమయంలో మనం భారతదేశానికి తిరిగి వచ్చి.. ఇక్కడి ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలి. ఈ దేశానికి మన ప్రతిభ చాలా అవసరమని” శ్రీధర్ పిలుపునిచ్చారు. ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా ఆయన ఇదే స్థాయిలో ప్రకటన చేశారు. భారతదేశానికి సేవ చేస్తేనే నిజమైన భారతీయులం అనిపించుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు.

బెంగళూరు మ్యాచ్లో అది మిస్సయినా.. హైదరాబాద్ కు భలే ఛాన్స్.. అదే జరిగితే ట్రోఫీ మనదే

Sunrisers Hyderabad Trophy Chances
Sunrisers Hyderabad Trophy Chances

Sunrisers Hyderabad Trophy Chances: బెంగళూరు తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ గెలిచింది. కాకపోతే గ్రూప్ 2 కి వెళ్లే సమీకరణం స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. దీంతో తొలి క్వాలిఫైయర్స్ ఆడే అవకాశాన్ని కోల్పోయింది. బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో గెలిచినప్పటికీ మూడో స్థానానికి హైదరాబాద్ పరిమితమైంది. దీంతో అభిమానులు ఒక రకమైన నిర్వేదంలో ఉన్నారు.

అయితే ఇక్కడ కొంత సానుకూలతను ప్రదర్శిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు. 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్ జట్టు ఐపిఎల్ విజేతగా నిలిచింది. నాడు మూడో స్థానంలోనే ఉండిపోయింది. నాకౌట్ లో పోటీ పడింది. ట్రోఫీని అద్భుతంగా సొంతం చేసుకుంది. ఇప్పుడు కూడా 2016 సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.. 2016లో డేవిడ్ వానర్ నాయకత్వంలో హైదరాబాద్ జట్టు మొత్తం 14 మ్యాచ్లు ఆడింది. ఇందులో 8 విజయాలు సొంతం చేసుకుంది. నాడు గుజరాత్ లయన్స్ 18 పాయింట్ల తో అగ్రస్థానంలో ఉంది. 16 పాయింట్లతో బెంగళూరు రెండవ స్థానాన్ని దక్కించుకుంది. అయితే 16 పాయింట్లు కలిగి ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ సరిగ్గా లేకపోవడంతో హైదరాబాద్ టు మూడో స్థానానికి పరిమితం కావలసి వచ్చింది. అప్పుడు కూడా బెంగళూరు హైదరాబాద్ జట్టుకు అద్దంకిగా మారింది. అయితే ఫైనల్ మ్యాచ్లో బెంగళూరును హైదరాబాద్ ఓడించింది.

నాటి సెమి ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు గుజరాత్ అటును ఓడించింది. ఫైనల్ చేరుకుంది. హైదరాబాద్ జట్టు ఎలిమినేటర్ విభాగంలో కోల్కతాను ఓడించింది. రెండవ క్వాలిఫైయర్ కు అర్హత పొందింది.. అక్కడ గుజరాత్ ను గురించి ఫైనల్ వెళ్ళింది. నాటు జరిగిన ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేసి 209 పరుగులు చేసింది.. చేజింగ్ దిగిన బెంగళూరు జట్టులో గేల్ 76, విరాట్ కోహ్లీ 54 పరుగులు చేసి అదరగొట్టారు. అయితే మిగతా బ్యాటర్లు అంతగా ఆకట్టుకోలేదు. బెన్ కట్టింగ్ రెండు వికెట్లు తీసి బెంగళూరు జట్టును చావు దెబ్బతీశాడు. చివర్లో సచిన్ బాబి, కేఎల్ రాహుల్ వంటి వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ విజయానికి బెంగళూరు 8 పరుగుల దూరంలో ఉండిపోయింది. దక్కన్ చార్జర్స్ నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ గా మారిపోయిన తర్వాత కావ్య జట్టుకు తొలి ట్రోఫీ దక్కింది.

ఇప్పుడు కూడా 2016 సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఎలిమినేటర్లో గెలిచిన తర్వాత.. బెంగళూరు/ గుజరాత్ మ్యాచ్లో ఓడిన జట్టుతో రెండవ క్వాలిఫైయర్ ఆడాలి. కమిన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జట్టు ఫైనల్ చేరుకుని.. రెండోసారి ట్రోఫీ దక్కించుకోవాలని హైదరాబాద్ అభిమానులు భావిస్తున్నారు.

టీపీసీసీ చీఫ్‌కు 'పొగ' పెడుతున్నారా? సీఎం రేవంత్ మౌనం వెనుక రాజకీయ వ్యూహమా..

TPCC Chief Controversy
TPCC Chief Controversy

TPCC Chief Controversy: ఏం జరిగిందో తెలియదు. ఏం జరుగుతుందో కూడా తెలియదు. కాకపోతే మాడు వాసన వస్తోంది. దీనికి బాధ్యులు ఎవరు అనే ప్రశ్న ఎదురైనప్పుడు.. ఎవరు కూడా తమకేం తెలియదు అన్నట్టుగా మొహాలు పెడుతున్నారు.. కానీ ఇలా పార్టీ ప్రజల్లో పరువు పోగొట్టుకుంటుంటే.. ఆ తదుపరి ఏం జరుగుతుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది ఇదే.

ఆ మీడియా ఛానల్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన అనుకూలమైన వార్తలు.. ప్రభుత్వానికి సంబంధించిన అడుకూలమైన కథనాలను అది ప్రసారం చేస్తూ ఉంటుంది. అటువంటి చానల్లో ఉన్నట్టుండి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు వ్యతిరేకంగా కథనాలు ప్రసారమవుతున్నాయి. ఇది ఒక రకంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు మహేష్ కుమార్ గౌడ్ కు పొమ్మనలేక పగబెడుతున్నారా అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.. ప్రతిష్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ క్యాడర్ కు దగ్గరగా ఉండటం లేదు.. ప్రభుత్వ పథకాలను ఆయన ప్రచారం చేయడం లేదు. విదేశాలలో ఎక్కువ సమయం ఉంటున్నారు. పార్టీకి సంబంధించిన సామాజిక మాధ్యమాల విభాగాలను కూడా అంతగా శక్తివంతం చేయలేదు. దీంతో భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా రెచ్చిపోతుంది. కొన్ని సందర్భాలలో ప్రభుత్వాన్ని తీవ్రమైన ఇరకాటంలో పెడుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే.. మహేష్ కుమార్ గౌడ్ పెద్దగా పట్టించుకోవడంలేదని ఆ చానల్లో వరుసగా కథనాలు ప్రసారం అయ్యాయి.

ఆ చానల్ యాజమాన్యంలో కొంతమంది వ్యక్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర మిత్రులని తెలుస్తోంది. ఇటీవల మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆ ఛానల్ యాజమాన్యానికి సంబంధించిన దగ్గర వ్యక్తికి ఇవ్వలేదని.. అందువల్లే మహేష్ కుమార్ గౌడ్ మీద ఈ స్థాయిలో నెగిటివ్ వార్తలు ప్రసారం చేస్తున్నారనే వాదనలు లేకపోలేదు. అయితే మహేష్ కుమార్ గౌడ్ ఆ చానల్ తనపై ప్రసారం చేసిన వ్యతిరేక కథనాల పట్ల స్పందించారు. మీడియా మీద గౌరవం ఉంది కాబట్టి తాను ఏమీ అనలేకపోతున్నారని.. కాలమే అన్నిటికి సమాధానం చెబుతుందని ఆయన ప్రకటించారు.

ఆ చానల్ ప్రసారం చేసిన కథనాన్ని కాస్త పక్కన పెడితే మహేష్ కుమార్ గౌడ్ టీపిసిసి ప్రెసిడెంట్ అవ్వడానికి ముఖ్య కారకుల్లో రేవంత్ రెడ్డి కూడా. పైగా ఇటీవల ఆయన 2034 వరకు కూడా తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీసీ ముఖ్యమంత్రి అవతారని అన్నారు. రేవంత్ రెడ్డి ఆ ప్రకటన చేసిన తర్వాత.. మహేష్ కుమార్ గౌడ్ బీసీ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించడం సీఎం రేవంత్ రెడ్డికి నచ్చలేదని తెలుస్తోంది. పైగా కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ ఒక వర్గంగా.. రేవంత్ రెడ్డి మరొక వర్గం గా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అయితే మహేష్ కుమార్ గౌడ్ మీద ఇలాంటి కథనం ప్రసారం కావడం పట్ల కాంగ్రెస్లో ఉన్న అంతర్గత పోరు మరొకసారి బయటపడింది.

కాంగ్రెస్ పార్టీ దక్షిణ భారత దేశంలో మూడు రాష్ట్రాలలో అధికారంలో ఉంది.. తమిళనాడులో అధికార భాగస్వామి పార్టీగా ఉంది.. అయితే కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణనే కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ నాయకులు అధిష్టానానికి ఇప్పుడు బలమైన మద్దతు ఇస్తున్నారు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అంతర్గత పోరుతో అసలుకే మోసం తెచ్చుకునే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కాక్రోచ్ ఫౌండర్ కు దిమ్మతిరిగింది.. ఇది అసలు ఊహించలేదుగా..

Cockroach founder
Cockroach founder

Cockroach founder: దేశ రాజకీయాలను మారుస్తాం.. అవినీతి లేని పరిపాలన అందిస్తాం.. యువత నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు మెరుగైన పరిపాలన అందిస్తాం.. ఇలా సంచలన హామీలతో ఆన్లైన్లో ఏర్పాటు అయింది కాక్రోచ్ జనతా పార్టీ. ఈ పార్టీ ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ లో చాలామంది ఫాలోవర్స్ ను పొందింది.. సంచలన ప్రకటనలతో ఇంకా ఇంకా సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడిగా అభిజిత్ కొనసాగుతున్నారు. ఈయన అమెరికాలో చదువుతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిగా ఈయన సంచలన విషయాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నారు. దేశ రాజకీయాలను మారుస్తామని, ప్రజలు తమకు సహకరించాలని కోరుతున్నారు. ఎక్కడో అమెరికాలో ఉంటూ.. ఇటువంటి ప్రకటనలు చేస్తున్న అభిజిత్ మీద కొంతమంది విమర్శలు చేస్తుండగా.. మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అభిజిత్ ఇప్పుడు దేశ రాజకీయాలలో ఒక సంచలన వ్యక్తిగా మారిపోయారు. జనరేషన్ జెడ్ ఉద్యమాన్ని తీసుకురావాలని కోరుతున్న ఈయన.. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి పని చేశారు. ఇప్పుడు ఈయన బోస్టన్ లో చదువుకుంటున్నారు. అక్కడి నుంచే కాక్రోజ్ జనతా పార్టీ వ్యవహారాలను నడుపుతున్నారు.

సోషల్ మీడియాలో సంచలన సృష్టిస్తున్న అభిజిత్ కు ఇప్పుడు ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది. ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయినట్టు తెలుస్తోంది. దాన్ని రికవరీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే ఇప్పుడు పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ మీద ఆయనకు యాక్సిస్ లేకుండా పోయింది. ఒకవేళ ఎవరైనా పోస్టులు చేస్తే.. వాటిని అధికారిక ప్రకటనలుగా భావించవద్దని అభిజిత్ వెల్లడించారు.

మనదేశంలో సోషల్ మీడియాలో రకరకాల వ్యక్తులు పుట్టుకొస్తుంటారు. కొంతమంది సెలబ్రెటీలు అవుతుంటారు. వారిని చాలామంది ఫాలో అవుతుంటారు. అలా అయినంత మాత్రాన వారేమీ దేశ పరిపాలకులు కాలేరు. మహా అయితే సెలబ్రిటీల హోదా అనుభవిస్తారు. డబ్బు కూడా సంపాదిస్తారు. అంతవరకే వారి స్థాయి ఆగిపోతుంది. అంతకుమించి ఊహించుకుంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు అభిజిత్ విషయంలో కూడా అదే జరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. సోషల్ మీడియాలో ఒక పార్టీ ఏర్పడినంత మాత్రాన అది దేశాన్ని పరిపాలిస్తుందని ఎలా అనుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అనవసరంగా హడావిడి తప్ప ఉపయోగం లేదని వారు స్పష్టం చేస్తున్నారు.

రాజమౌళి తో పోటీ పడి గల్లంతయిన దర్శకులు వీళ్లే..

Rajamouli
Rajamouli

Directors competed with Rajamouli: సినిమా ఇండస్ట్రీ అంటే హీరోల మధ్య పోటీనే కాదు దర్శకుల మధ్య కూడా తీవ్రమైన పోటీ ఉంటుంది. ఒక సినిమాని చేసిన దర్శకుడు ఆ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే ఆయన అలాంటి సినిమా చేసి సక్సెస్ ని సాధించాడు. కాబట్టి మనం అంతకంటే విభిన్నమైన సినిమాలు చేయాలని మిగతా దర్శకులందరు ఆరాటపడుతుంటారు. ఇక రాజమౌళి లాంటి దర్శకుడు కెరియర్ స్టార్టింగ్ లో మాస్ కమర్షియల్ సినిమాలను చేసినప్పటికి ఆ తర్వాత విజువల్ వండర్స్ ని క్రియేట్ చేయడానికి ఆయన సన్నాహాలు చేశాడు. మొత్తానికైతే ఆయన అందులో సక్సెస్ ని సాధించాడు. ఇక రాజమౌళితో పోటీ పడాలనే ప్రయత్నం చేసిన వి వి వినాయక్, మెహర్ రమేష్ లాంటి దర్శకులు భారీగా డీలా పడిపోయారు. మగధీర సినిమాతో మేము కూడా అలాంటి సినిమాలు చేయగలమని వివి వినాయక్ బద్రీనాథ్ సినిమా చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ అయింది.

ఇక మెహర్ రమేష్ సైతం ఎన్టీఆర్ తో శక్తి సినిమా చేసి భారీగా డీలాపడిపోయాడు అంటే ఇదే అంటూ కొంతమంది సినిమా విమర్శకులు సైతం వాళ్ళిద్దరిని విమర్శించారు… గత 25 సంవత్సరాల నుంచి రాజమౌళికి ఎవరు పోటీ రావడం లేదు. ఆయన సినిమాలు ఆయనే చేసుకుంటూ తనకు తానే పోటీగా మారుతున్నాడు.

ఎప్పటికప్పుడు కొత్త బెంచ్ మార్కులను సెట్ చేస్తూ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయడం అతను టార్గెట్ గా పెట్టుకొని ముందుకు సాగుతుండటం విశేషం…ప్రస్తుతం ఉన్న దర్శకులలో కూడా రాజమౌళితో పోటీపడే స్థాయిలో ఎవరూ లేరు. ఎందుకంటే రాజమౌళి లాంటి దర్శకుడు ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తారు.

కాబట్టి ఆయన ఎంచుకున్న పంథా వేరు వీళ్ళు చేస్తున్న సినిమాలు వేరు…రాజమౌళి తో పోటీకి రావడానికి కానీ అతన్ని ఢీకొట్టే దర్శకులు కానీ ఇండియాలోనే ఎవరూ లేరు అనేది వాస్తవం…ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబు తో చేస్తున్న వారణాసి సినిమాతో భారీ విజయాన్ని సాధించి పాన్ వరల్డ్ లో తన సత్తా చాటాలనే ప్రయత్నం చేస్తున్నాడు…

'కల్కి 2' బడ్జెట్ తో అలాంటి హిట్ మూవీస్ 100 తీయచ్చా..? అంతలా పెంచేసారేంటి..?

Kalki 2
Kalki 2

Kalki 2 movie budget: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన ‘కల్కి’ సినిమా పెను సంచలనాలను క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా ‘కల్కి 2’ సినిమా కూడా రాబోతుంది అంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. మొత్తానికైతే ‘కల్కి 2’ సినిమా షూటింగ్ కి సంబంధించిన సెట్స్ మొత్తాన్ని రెడీ చేసి పెట్టారట. ప్రభాస్ ఎప్పుడు వస్తే అప్పుడు సినిమా షూటింగ్ చేయడానికి వాళ్ళు సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్ మూవీ షూటింగ్లో పాల్గొంటున్నారు. కల్కి మూవీ తో 1100 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు. కాబట్టి ‘కల్కి 2’ సినిమా మీద బడ్జెట్ కూడా భారీగానే కేటాయించే అవకాశాలైతే ఉన్నాయి. ఈ సినిమా మీద దాదాపు 800 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద భారీ హైప్ ఉండడం వల్ల ఈ సినిమాని చూడడానికి ప్రతి ప్రేక్షకుడి ఇంట్రెస్ట్ చూపిస్తాడు.

కాబట్టి వాళ్ల హైప్ ని క్యాష్ చేసుకోవడానికి ఈ సినిమాని విజువల్ వండర్ గా తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో నాగ్ అశ్విన్ ఉన్నాడు… తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే ‘నాగ్ అశ్విన్’ పాన్ వరల్డ్ లోనే ఒక మంచి దర్శకుడుగా మారిపోతాడు. ఇక ఈ సినిమా బడ్జెట్ చూసిన కొంతమంది ‘కల్కి 2’ సినిమా బడ్జెట్ తో దాదాపు 100 సినిమాలు చేయొచ్చు అంటూ కొన్ని కామెంట్లు చేస్తున్నారు.

నిజానికి 5,6 కోట్ల బడ్జెట్లో తెరకెక్కే సినిమాలు ఈ మధ్యకాలంలో మంచి విజయాలను సాధిస్తున్నాయి. ముఖ్యంగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ లాంటి సినిమాలు చాలా తక్కువ బడ్జెట్ తో చేశారు. ఇక ‘కల్కి 2’ సినిమా మీద పెట్టే బడ్జెట్ తో అలాంటివి ఒక 100 సినిమాలు చేయొచ్చు అంటూ కొంతమంది సినిమా విమర్శకులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. సినిమా బడ్జెట్ ను ఉద్దేశించి ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు…

ఇక మరి కొంతమంది మాత్రం ఏ సినిమా రేంజ్ ఆ సినిమాదే విజువల్ వండర్స్ ను క్రియేట్ చేస్తేనే మన ఇండస్ట్రీ హాలీవుడ్ ఇండస్ట్రీకి సరి సమానంగా మారుతుంది. లేకపోతే మనం ఎన్ని సినిమాలు చేసిన కూడా సక్సెస్ ఫెయిల్యూర్స్ మాత్రమే ఉంటాయి తప్ప ఇండియన్ సినిమా ముఖ్యంగా తెలుగు సినిమా స్థాయి పెరగదు అనే కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ ను విపరీతంగా వైరల్ చేస్తున్నారు…

రామ్ చరణ్ vs ఎన్టీఆర్...పోటీలో నెగ్గేది ఎవరు..?

Ram Charan vs NTR
Ram Charan vs NTR

Ram Charan vs NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టైర్ వన్ హీరోలు నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య కూడా ఇలాంటి ఒక పోటీ వాతావరణం నెలకొంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇంతకుముందు ‘త్రిబుల్ ఆర్’ సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ చేసిన ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలు భారీ డిజాస్టర్లుగా మిగిలాయి. ఇక ఎన్టీఆర్ చేసిన దేవర సినిమా సక్సెస్ ని సాధించింది. కానీ ఆ తర్వాత హృతిక్ రోషన్ తో కలిసి చేసిన ‘వార్ 2’ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. ఇక ఈ క్రమంలోనే అటు ఎన్టీఆర్,ఇటు రామ్ చరణ్ ఇద్దరు కూడా మన సినిమాలతో డిఫరెంట్ ప్రయత్నాలైతే చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు.

మూడు వేరియేషన్స్ చూపించే పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నాడు… ఇక ఎన్టీఆర్ సైతం ప్రశాంత్ నీల్ చేస్తున్న ‘డ్రాగన్’ సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను సంపాదించుకుంది.

కాబట్టి ఈ సినిమా తప్పకుండా విజయాన్ని సాధిస్తుంది అంటూ అటు ఎన్టీఆర్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ పెద్ది సినిమా ఈ సంవత్సరం వస్తుంది. డ్రాగన్ సినిమా వచ్చే సంవత్సరం రానున్న నేపథ్యంలో రామ్ చరణ్ కి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య పోటీ అయితే ఉంది.

వీళ్లిద్దరు చేస్తున్న రెండు సినిమాలు ఏ రేంజ్ కలెక్షన్స్ ని రాబడతాయి. ఒకదానితో ఒకటి ఎంత వరకు పోటీ పడతాయి అనేది తెలియాల్సి ఉంది. ఇక అల్టిమేట్ గా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు అయినప్పటికి సినిమాల పరంగా మాత్రం వాళ్ల మధ్య ఎప్పుడు పోటీ ఉంటుందని వాళ్లే పలు సందర్భాల్లో చెప్పడం విశేషం…

ఆ ఒక్క సలహాతో.. గుర్రాలతో లక్షల ఆదాయం..

Success story meet Raju Lahoria
Success story meet Raju Lahoria

Success story meet Raju Lahoria: మనం చేసే పని మీద ఇష్టం ఉంటే సాధారణ వ్యక్తి కూడా అసాధారణ విజయాన్ని సాధించగలడని మధ్యప్రదేశ్‌కు చెందిన రాజు లహోరియా నిరూపించాడు. Madhya Pradesh రాష్ట్రంలోని Khandwa district పరిధిలోని అహ్మద్‌పూర్ ఖేగావ్ గ్రామానికి చెందిన రాజు.. చదువులో వెనుకబడినా.. డబ్బు సంపాదించడంలో మాత్రం వెనక్కి తగ్గలేదు. తన ఆసక్తిని వ్యాపారంగా మార్చుకొని ఇప్పుడు మంచి ఆదాయం సంపాదిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. నేటి యూత్ కు ఏంతో ఆదర్శంగా నిలుస్తున్న ఈ రాజు గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

రాజు లహోరియా దాదాపు 10 ఏళ్ల క్రితం రాజు గుజరాత్ నుంచి రూ.3.5 లక్షల భారీ వ్యయంతో ఒక మార్వారీ జాతి ఆడ గుర్రాన్ని కొనుగోలు చేశాడు. మొదట్లో అది కేవలం తన ఇష్టానికి మాత్రమే పెంచుకున్నాడు. అయితే ఒక రోజు ఓ పూజారి ఇచ్చిన సలహా అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ‘ఈ గుర్రాన్ని పెళ్లి వేడుకలకు పంపించు.. మంచి ఆదాయం వస్తుంది’ అని చెప్పడంతో రాజు తొలిసారి తన గుర్రాన్ని ఓ వివాహానికి పంపించాడు.

ఆ ఒక్క ప్రయత్నమే రాజుకు ఊహించని విజయాన్ని తెచ్చిపెట్టింది. పెళ్లిలో గుర్రం ఆకర్షణగా నిలవడంతో వరుసగా బుకింగ్‌లు రావడం ప్రారంభమైంది. దీంతో రాజుకు ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా మరిన్ని గుర్రాలను కొనుగోలు చేశాడు. ప్రస్తుతం అతని వద్ద ‘లక్ష్మి’ అనే ప్రత్యేకమైన మార్వారీ జాతి ఆడ గుర్రం ఉంది. ఈ గుర్రం అందంగా ఉండటమే కాకుండా పెళ్లిళ్లలో సంగీతానికి అనుగుణంగా నాట్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పెళ్లికొడుకు ఇచ్చే ఆదేశాలను కూడా సులభంగా పాటిస్తుండటంతో దీని డిమాండ్ మరింత పెరిగింది.

Marwari horse జాతి గుర్రాలు వాటి ప్రత్యేకమైన రూపం, తెలివితేటలు, శిక్షణకు త్వరగా అలవాటు పడే స్వభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. రాజు వద్ద ఉన్న గుర్రాలకూ ఇదే ప్రత్యేకత కలిసి రావడంతో పెళ్లిళ్ల సీజన్ మొదలయ్యే 3 నుంచి 4 నెలల ముందే బుకింగ్‌లు పూర్తవుతున్నాయి. అప్పట్లో రూ.3.5 లక్షలకు కొనుగోలు చేసిన గుర్రం విలువ ఇప్పుడు మార్కెట్లో సుమారు రూ.5 లక్షల వరకు పెరిగిందని చెబుతున్నారు.

ఈ వ్యాపారంలో ఖర్చులు ఉన్నప్పటికీ మంచి లాభాలు వస్తున్నాయని రాజు చెబుతున్నాడు. గ్రామాల్లో జరిగే పెళ్లిళ్లకు ఒక్కో ఆర్డర్‌కు రూ.4,500 నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తారు. అదే నగరాల్లో జరిగే పెద్ద పెళ్లిళ్లకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఏడాదికి సుమారు 70 నుంచి 80 పెళ్లి బుకింగ్‌లు వస్తుండటంతో అన్ని ఖర్చులు పోను రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు నికర ఆదాయం వస్తోందని రాజు తెలిపాడు.

ఈ ఏడాదిలో రోహిణి కార్తె ఎప్పటి నుంచి..

Rohini Karthe 2026 dates
Rohini Karthe 2026 dates

Rohini Karthe 2026 dates: భారతీయ జ్యోతిష్యశాస్త్రంలో సూర్యుడికి అత్యంత ప్రాధాన్యం ఉంది. నవగ్రహాలలో రాజుగా పరిగణించే సూర్య భగవానుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచరిస్తూ ఉంటాడు. అలాగే నక్షత్రాల మార్పు కూడా భూమిపై వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో వేసవి కాలంలో సూర్యుడు Rohini Nakshatraలోకి ప్రవేశించనున్నాడు. ఈ రోహిణి కార్తెలోకి సూర్యుడు ఎప్పుడు ప్రవేశిస్తాడంటే?

రోహిణి నక్షత్రంలో సూర్యుడు మే 25న ప్రవేశిస్తాడు. జూన్ 8 వరకు సంచరించే ఈ కాలాన్ని సంప్రదాయంగా ‘రోహిణి కార్తె ’గా పిలుస్తారు. ఈ సమయంలో ఎండలు అత్యంత తీవ్రంగా ఉంటాయని ప్రజల నమ్మకం. సాధారణ వేసవి వేడి ఒక ఎత్తయితే, రోహిణి కార్తె సమయంలో మాత్రం భూమి నిప్పుల కుండలా మారుతుందని పెద్దలు చెబుతుంటారు. మధ్యాహ్న సమయంలో బయట అడుగు పెట్టలేనంతగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.

గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ‘రోహిణి ఎండలు’ గురించి ఎన్నో సామెతలు, అనుభవాలు తరతరాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. ‘రోహిణి కార్తెలో రోళ్లు కూడా పగులుతాయి’ అనే మాట ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ‘రోళ్లు’ అంటే రాళ్లు లేదా గట్టి వస్తువులు కూడా వేడి తట్టుకోలేక పగిలిపోతాయన్న అర్థంలో ఈ సామెత వాడతారు. అంటే ఈ సమయంలో ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుందో చెప్పేందుకు పెద్దలు ఇలా పోల్చి చెబుతుంటారు.

జ్యోతిష్య నమ్మకాల ప్రకారం రోహిణి నక్షత్రానికి అగ్ని తత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. అందుకే ఈ సమయంలో సూర్య కిరణాలు మరింత ఉష్ణాన్ని విడుదల చేస్తాయని అంటారు. ఉదయం నుంచే మండే ఎండలు, మధ్యాహ్నం వేడి గాలులు, రాత్రివేళ కూడా తగ్గని ఉక్కపోత ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా రైతులు, కూలీలు, బయట పనులు చేసే వారు ఈ కాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

వాతావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం కూడా మే చివరి వారాలు, జూన్ ప్రారంభ రోజుల్లో భూమిపై ఉష్ణోగ్రతలు సహజంగానే అత్యధిక స్థాయికి చేరుతాయి. ఈ కాలంలో పొడి గాలులు, తేమ తగ్గడం, భూమి వేడి ఎక్కువగా నిల్వ ఉండటం వల్ల వేడి తీవ్రత పెరుగుతుంది. అందుకే సంప్రదాయ జ్యోతిష్య భావనలు, ప్రజల అనుభవాలు రెండూ కలిసి రోహిణి కార్తెను అత్యంత వేడి కాలంగా పేర్కొంటాయి.

ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు తాగడం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవ పదార్థాలు తీసుకోవడం, మధ్యాహ్న వేళ బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని చెబుతున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎండ ప్రభావానికి త్వరగా గురయ్యే అవకాశం ఉండటంతో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

సామాన్యుల కోసం BSNL కొత్త ఆఫర్..

BSNL new offer
BSNL new offer

BSNL new offer: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL వినియోగదారులను ఆకర్షించేందుకు మరో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. Freedom Offer పేరుతో తీసుకొచ్చిన ఈ ప్లాన్‌లో కేవలం రూ.51కే కొత్త మొబైల్ కనెక్షన్‌తో పాటు ఫ్రీ సిమ్‌ను అందిస్తోంది. తక్కువ ధరలోనే ఎక్కువ ప్రయోజనాలు ఇవ్వడం ఈ ఆఫర్ ప్రత్యేకతగా నిలుస్తోంది. ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ ప్లాన్‌లో వినియోగదారులకు 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ప్రతి రోజు 2GB హైస్పీడ్ డేటా ఇస్తారు. రోజుకు 100 SMSలు పంపించుకోవచ్చు. అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని BSNL వెల్లడించింది. ప్రస్తుతం ఇతర టెలికం సంస్థల రీచార్జ్ ధరలు పెరుగుతున్న సమయంలో ఈ ప్లాన్ సామాన్యులకు ఉపశమనం కలిగించే అవకాశముంది.

కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకునే వారు దేశవ్యాప్తంగా ఉన్న BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్లు లేదా అధికారిక రిటైల్ స్టోర్లలో ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ముఖ్యంగా కొత్త వినియోగదారులను ఆకర్షించడం, అలాగే ఇతర నెట్‌వర్క్‌ల నుంచి BSNL వైపు మార్చే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్లాన్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. జూన్ 30 వరకు మాత్రమే ఈ ప్రత్యేక అవకాశం ఉంటుందని BSNL స్పష్టం చేసింది. తక్కువ ఖర్చుతో డేటా, కాలింగ్ సౌకర్యాలు కోరుకునే వినియోగదారులకు ఇది మంచి ఆప్షన్‌గా మారే అవకాశముందని టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ తాబేళ్ల సంతానం ఆసక్తికరం.. ఎలా ఉంటుందంటే..

Rare Turtle Species Facts
Rare Turtle Species Facts

Rare Turtle Species Facts: ప్రపంచంలోని చాలా జీవుల్లో పుట్టబోయే పిల్లల లింగాన్ని సెక్స్ క్రోమోజోమ్స్ నిర్ణయిస్తాయి. కానీ సముద్ర తాబేళ్లలో మాత్రం ప్రకృతి ఒక అద్భుతమైన విధానాన్ని అమలు చేస్తుంది. వీటిలో అనేక జాతుల పిల్లలు మగవారా? ఆడవారా? అన్నది గుడ్లు పొదిగే సమయంలో ఉండే ఉష్ణోగ్రత ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఈ ప్రత్యేకత కారణంగా సముద్ర తాబేళ్లు శాస్త్రవేత్తలను ఎప్పటికప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉన్నాయి.ప్రపంచ తాబేలు దినోత్సవం (World Turtle Day)ను ప్రతి సంవత్సరం మే 23 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా సముద్ర తాబేళ్ల జీవనం గురించి..

తాబేళ్ల సంతానోత్పత్తి చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ తాబేళ్ల గుడ్లు ఉన్న గూటి ఉష్ణోగ్రత 27.7 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటే ఎక్కువగా మగ తాబేళ్లు పుడతాయి. అదే ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌కి పైగా ఉంటే ఆడ తాబేళ్లు జన్మిస్తాయి. మధ్యస్థ ఉష్ణోగ్రతల్లో మగ, ఆడ తాబేళ్లు కలగలిపి పుడతాయి. ఈ ప్రక్రియను శాస్త్రవేత్తలు ‘టెంపరేచర్ డిపెండెంట్ సెక్స్ డిటర్మినేషన్’ అని పిలుస్తారు.

ఈ ప్రత్యేక లక్షణం Green sea turtle, Red-eared slider వంటి తాబేళ్ల జాతుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వాతావరణ మార్పులు పెరుగుతున్న నేపథ్యంలో గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇసుక ఉష్ణోగ్రతలు పెరిగితే ఆడ తాబేళ్ల సంఖ్య అధికమయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల భవిష్యత్తులో ఈ జాతుల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందని చెబుతున్నారు.

సముద్ర తాబేళ్లలో అత్యంత విశేషమైన జాతిగా Leatherback sea turtle గుర్తింపు పొందింది. ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర తాబేళ్లు మాత్రమే కాకుండా అద్భుతమైన డైవర్స్ కూడా. ఆహారం కోసం సముద్రంలో సుమారు 3 వేల అడుగుల లోతు వరకు వెళ్లగల సామర్థ్యం వీటికి ఉంది. తీవ్రమైన ఒత్తిడిని తట్టుకుని లోతైన సముద్రాల్లో సంచరించే ఈ తాబేళ్లు ప్రకృతిలోని అద్భుత జీవులలో ఒకటిగా నిలిచాయి.