Home Blog Page 181

మొదటిసారి EV కొనేవారికి సూపర్ కారు ఇదే.. ఎందుకంటే..

Tata Tiago EV 2026
Tata Tiago EV 2026

Tata Tiago EV 2026: భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం Tata Motors తన అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు Tata Tiago EV కొత్త ‘స్మార్ట్’ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) పథకం కింద ఈ కారు ప్రారంభ ధర రూ.4.69 లక్షల (ఎక్స్‌షోరూమ్) నుంచి అందుబాటులోకి వచ్చింది. దీంతో దేశంలో అత్యంత అందుబాటు ధరలో లభించే ఎలక్ట్రిక్ కార్లలో ఇది ఒకటిగా నిలిచింది. ఈ కారు గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ కార్లు కొనేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో కొన్ని కంపెనీలు తక్కువ ధరకే విద్యుత్ కార్లను అందించాలని అనుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో టాటా మోటార్స్ నుంచి టియాగో ఫేస్ లిప్ట్ ఈవీని తీసుకొచ్చారు. ఈ కొత్త టియాగో EV స్మార్ట్ వేరియంట్‌లో భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఎంట్రీ-లెవల్ వేరియంట్ అయినప్పటికీ ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లను ఉంచడంతో స్టాండర్డ్‌గా అందిస్తోంది. సాధారణంగా ఈ ఫీచర్ అధిక ధర కలిగిన కార్లలో మాత్రమే కనిపిస్తుంది. దీంతో తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి ఇది ఆకర్షణీయమైన ఎంపికగా మారింది.

టియాగో EV స్మార్ట్ వేరియంట్‌లో 19.2 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఈ బ్యాటరీతో పనిచేసే ఎలక్ట్రిక్ మోటార్ 60 bhp శక్తి, 110 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 226 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ ప్రకటించింది. రోజువారీ నగర ప్రయాణాలకు ఈ రేంజ్ సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

2026 టియాగో EVకు టాటా కొత్త రూపాన్ని ఇచ్చింది. కొత్త ఫ్రంట్ బంపర్, బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్, LED హెడ్‌ల్యాంప్స్, LED టెయిల్‌ల్యాంప్స్, కొత్త వీల్ డిజైన్‌తో మరింత ఆధునికంగా కనిపిస్తోంది. బయట నుంచి చూస్తే ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లా అనిపించేలా డిజైన్ చేశారు. క్యాబిన్‌లో కూడా గణనీయమైన మార్పులు చేశారు. కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, రీడిజైన్ చేసిన డ్యాష్‌బోర్డ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. హయ్యర్ వేరియంట్లలో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా వంటి అదనపు సదుపాయాలు కూడా లభిస్తాయి.

ఈ కారు తక్కువ ధరలో లభించడానికి ప్రధాన కారణం బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) విధానం. ఇందులో కారు ధర నుంచి బ్యాటరీ ఖర్చును వేరు చేస్తారు. కస్టమర్ కారు కోసం తక్కువ మొత్తాన్ని చెల్లించి, బ్యాటరీ వినియోగానికి ప్రత్యేకంగా చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి బ్యాటరీతో కొనుగోలు చేయాలనుకునేవారికి టియాగో EV స్మార్ట్ ధర రూ.6.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

రోజూ నగరంలో ప్రయాణించే ఉద్యోగులు, మొదటిసారి ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునేవారు, తక్కువ బడ్జెట్‌లో సురక్షితమైన EV కోరుకునే కుటుంబాలకు టాటా టియాగో EV స్మార్ట్ మంచి ఎంపికగా భావిస్తున్నారు. తక్కువ ప్రారంభ ధర, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, సరిపడే రేంజ్, ఆధునిక ఫీచర్ల కలయికతో ఈ కారు భారత EV మార్కెట్లో కొత్త పోటీకి తెరలేపనుంది.

భారతీయుల సంబురాలు.. కెనడియన్ల ఆక్రోశం!

Toronto Indian Celebrations
Toronto Indian Celebrations

Toronto Indian Celebrations: భారతీయులు ఎక్కువ ఆదాయం, ఉన్నతమైన ఉపాధి కోసం అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలకు వెళ్తుంటారు. మన నైపుణ్యాలతో ఆయా దేశాల ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో వైద్యులు, శాస్త్రవేత్తలు, ఐటీ నిపుణులు ఇలా అన్నిరంగాలవారు ఉన్నారు. అయితే ఇటీవల అమెరికా విదేశీయుల రాకపై ఆంక్షలు విధించింది. దీంతో భారతీయులు కెనడాకు ఎక్కువగా వెళ్తున్నాయి. ఇప్పటికే కెనడాలో భారతీయులు ఎక్కువగా స్థిరపడ్డారు. తాజాగా అక్కడి భారతీయులు చేసుకున్న సంబురాలు.. కెనడీయులకు కోపం తెప్పించాయి. టొరంటో వీధుల్లో భారతీయులు మ్యూజిక్, డాన్స్‌తో అదరగొట్టిన ఒక సాంస్కృతిక ఉత్సవ వీడియో వైరల్‌ కావడంతో కెనడా సోషల్‌ మీడియా మండిపోయింది. ‘‘కెనడా ఇప్పుడు ఇండియన్‌ కాలనీ అయిపోయింది’’, ‘‘టొరంటోలో కెనడియన్లు మైనారిటీ అయిపోయారు’’, ‘‘మా దేశాన్ని ఆక్రమిస్తున్నారు’’ అని తీవ్రమైన కామెంట్లు వస్తున్నాయి.

డెమోగ్రాఫిక్‌ మార్పు..
గ్రేటర్‌ టొరంటో ఏరియాలో సౌత్‌ ఆసియన్లు ఎక్కువ. ఇందులో భారతీయులు 19 శాతం ఉంటారు. టొరంటో నగరం చుట్టుపక్కల బ్రాంప్టన్, మిసిసాగా వంటి ప్రాంతాల్లో స్థిరపడ్డారు. 2013 నుంచి 2023 మధ్య కెనడాకు భారతీయ ఇమ్మిగ్రేషన్‌ నాలుగు రెట్లు పెరిగింది. అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులు ఎక్కువ శాతం ఉండటంతో, గత కొన్ని సంవత్సరాల్లో టొరంటోలో భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ వేగవంతమైన మార్పు కెనడా సమాజంలో ఒక విభాగానికి అసౌకర్యం కలిగించింది. హౌసింగ్‌ క్రై సిస్, అద్దెల పెరుగుదల, ట్రాఫిక్, ఉద్యోగాలపై పోటీ ఇవన్నీ ఇమ్మిగ్రేషన్‌తో ముడిపడి చూడడం మొదలైంది. అధికారిక అధ్యయనాల ప్రకారం, ఇటీవలి ఇమ్మిగ్రేషన్‌ హౌసింగ్‌ ధరలు భారీగా పెరిగాయి. స్థానికులకు ఆదాయం పెరిగింది.

సాంస్కృతిక ఉత్సవాలు..
భారతీయులు తమ సంస్కృతి, పండగలు, సంగీతం-నృత్యాలను ఉత్సాహంగా జరుపుకోవడం సహజం. కానీ రోడ్డు జంక్షన్‌లను ఆక్రమించి, ట్రాఫిక్‌ను అడ్డుకుని, శబ్దం చేసి జరిపే సెలబ్రేషన్స్‌ స్థానికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఒకటి రెండు కాదు ఇటీవలి కాలంలో పలుమార్లు ఇలాంటి వీడియోలు వైరల్‌ అయ్యాయి. అయితే కొత్త దేశంలో స్థానిక నియమాలు, చట్టాలు, సామాజిక సౌకర్యాన్ని గౌరవించాలి. కానీ మన ఉత్సవాలతో అక్కడి వారికి అసౌకర్యం కలిగించడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. దీంతో కెనడా ప్రభుత్వం 2025-2027 ఇమ్మిగ్రేషన్‌ లెవెల్స్‌ ప్లాన్‌లో స్పష్టమైన మార్పులు చేసింది. స్థిర నివాసుల లక్ష్యాలను తగ్గించడంతోపాటు, అంతర్జాతీయ విద్యార్థులు, టెంపరరీ ఫారిన్‌ వర్కర్ల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. 2026లో కొత్త స్టడీ పర్మిట్లు గణనీయంగా తగ్గాయి.

కెనడా చరిత్రే వలసదారుల చరిత్ర..
ఇంగ్లిష్, ఫ్రెంచ్‌ నుంచి ఆసియా దేశాల వరకు వచ్చినవారే కెనడా దేశాన్ని నిర్మించారు. భారతీయులు ఐటీ, హెల్త్‌కేర్, ఇంజనీరింగ్‌ రంగాల్లో ముఖ్యమైన సహకారం అందిస్తున్నారు. వైవిధ్యం కెనడా బలం. మరోవైపు, స్థానికుల ఆందోళనను కేవలం ‘‘రేసిజం’’ అని తోసిపుచ్చడం సరికాదు. ఏ దేశంలోనైనా వేగవంతమైన డెమోగ్రాఫిక్‌ మార్పులు సామాజిక ఉద్రిక్తతలను సృష్టిస్తాయి. పబ్లిక్‌ స్పేస్‌లను ఆక్రమించి, ట్రాఫిక్‌ను అడ్డుకుని, లిట్టర్‌ చేసి జరిపే సెలబ్రేషన్స్‌ స్థానికుల్లో ఆగ్రహాన్ని పెంచుతాయి.

ఈ వివాదం భారతీయ వలసదారులకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తోంది. ఉత్సాహం మంచిది, కానీ బాధ్యత కూడా అవసరం. కొత్త దేశంలో స్థానిక నియమాలను గౌరవించడం, పొరుగువారికి అసౌకర్యం కలిగించకుండా జరుపుకోవడం ముఖ్యం.

వైసీపీలో సీనియర్ల నోరు మూయించిన జగన్!

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వాతావరణం కొనసాగుతోంది. ఎవరి వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చిందో.. వారు ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు. పార్టీలో సీనియర్లు సైలెంట్ అవుతున్నారు. ఈ భిన్న వాతావరణంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. 2019 నుంచి 2024 మధ్య కొంతమంది నేతల వ్యవహార శైలితోనే పార్టీకి ఈ రకమైన ఇబ్బందులు వచ్చాయి. ప్రారంభంలో వారి మాటలు గొప్ప ఫ్యాషన్ గా అనిపించాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సైతం ఆకర్షించాయి. కానీ రాను రాను ఆ నేతల తీరుతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనస్థితికి చేరుకుందనేది పార్టీ క్యాడర్ కు తెలిసింది. పార్టీలో సీనియర్లు మౌనం వహించి.. దూకుడు కలిగిన నేతలు మాటలు పార్టీకి చేటు తెచ్చాయి అని ఆలస్యంగా తెలిసింది. అప్పటికే మూల్యం చెల్లించుకుంది పార్టీ. అయితే ఇప్పుడు క్యాడర్ తెలుస్తుంది కానీ.. నాయకత్వం తెలుసుకోకపోవడం పార్టీకి లోటు.

* ఫైర్ బ్రాండ్లుగా ముద్ర..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్లుగా గుర్తింపు సాధించారు కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్, పేర్ని నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, సిదిరి అప్పలరాజు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది జూనియర్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వారు. వారి మాటలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎంతో ఇష్టంగా ఉండేవి. అయితే వారి మాటలు తటస్థులతోపాటు విద్యాధికులపై విపరీతంగా ప్రభావం చూపించాయి. దాని ఫలితమే 2024 ఎన్నికల్లో దారుణ పరాజయం.

* పక్కన పెట్టినట్టే పెట్టి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేటు తెచ్చిన ఆ దూకుడు నేతలను జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టినట్లు కనిపించారు ప్రారంభంలో. గత అనుభవాల దృష్ట్యా సీనియర్ల సేవలను వినియోగించుకుంటానని జగన్ చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే సీనియర్లుగా ఉన్న ధర్మాన, బొత్స లాంటి నేతలు మాట్లాడడం ప్రారంభించారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చాయని అంతా భావించారు. కానీ ఆ సరదా ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. ఎవరైతే బూతులు మాట్లాడారో.. అడ్డగోలుగా వ్యవహరించారో.. అటువంటి నేతలు మళ్లీ తెరపైకి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వారికి ప్రాధాన్యమిస్తున్నట్టు కనిపిస్తున్నారు. దీంతో సీనియర్లుగా ఉన్న ధర్మాన లాంటి వారు మళ్లీ మౌనం పాటిస్తున్నారు. ఇలా అయితే కష్టమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిట్టూరుస్తున్నారు.

ఏపీలో మరో మూడు రోజులు జాగ్రత్తగా ఉండకపోతే కష్టమే!

AP Weather Forecast
AP Weather Forecast

AP Weather Forecast: ఏపీలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు తీవ్ర వేడిగాలులు వీస్తుండగా.. ఇంకోవైపు వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా.. అదే స్థాయిలో చిరుజల్లులు పలకరిస్తున్నాయి. మరో మూడు రోజులపాటు ఇదే విభిన్న పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే అప్పటివరకు తీవ్ర వేడి గాలులు వీచి.. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షాలు ప్రారంభం అయితే.. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. ఉరుములతో కూడిన వాన విషయంలో మాత్రం రైతులు, పశువుల పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

* ఈ జిల్లాల్లో వర్షాలు..
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది. పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్న దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా హెచ్చరికలు జారీచేసింది.

* భారీ ఉష్ణోగ్రతలు..
మరోవైపు ఈరోజు ఎండల తీవ్రత కూడా అధికంగా ఉండనుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 56 మండలాల్లో తీవ్రవడగాలులు, 51 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ప్రధానంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితి ఉంది. గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్రలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అందుకే అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. మరో మూడు రోజుల పాటు ఇలానే ఉంటుంది అని చెబుతోంది.

టిడిపి నేతలను అలా సర్దుబాటు చేయనున్న చంద్రబాబు!

Chandrababu Naidu Rajya Sabha Selectio
Chandrababu Naidu Rajya Sabha Selectio

Chandrababu: తెలుగుదేశం పార్టీలో చాలామంది నేతలు పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారు ఉన్నారు. పార్టీ కోసం ప్రచారం చేసిన వారు ఉన్నారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారు ఉన్నారు. అటువంటి వారికి ఎలా న్యాయం చేస్తారు అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే ఏ పదవులు ఇప్పుడు వస్తున్నా అందులో రెండు మిత్ర పక్షాలకు సర్దుబాటు చేయాల్సి వస్తోంది. తాజాగా ఓ నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీ అయితే.. అందులో మూడు తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఒక పదవిని జనసేన కు కేటాయించింది. గతంలో ఓ నాలుగు రాజ్యసభ పదవులు భర్తీ చేస్తే అందులో రెండు బిజెపికి విడిచిపెట్టింది. దీంతో టీడీపీలో పదవుల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ఇబ్బందికరంగా మారింది. అయితే ఇప్పుడు ఆశావహులు చూస్తే అధికంగా ఉన్నారు. వారిని ఎలా సర్దుబాటు చేస్తారు అనేది ఇప్పుడు ప్రశ్న. కానీ టిడిపి ఆలోచన వేరేలా ఉంది.

* చాలామంది ఆశావహులు..
ప్రస్తుతం శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు తీసుకుంటే సీట్లు త్యాగం చేసిన చాలా మంది నేతలు ఉన్నారు. వారు పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వంగవీటి రాధాకృష్ణ, బుద్దా వెంకన్న, దేవినేని ఉమామహేశ్వరరావు, పిఠాపురం వర్మ.. ఇలా చూసుకుంటూ పోతే చాలామంది నేతలకు పదవులు దక్కలేదు. రాజ్యసభ తో పాటు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవుల భర్తీ జరిగింది. కానీ వీరికి చోటు దక్కలేదు. దీంతో పదవుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. తాజాగా రాజ్యసభ పదవుల భర్తీతో.. ఛాన్స్ దొరకని వారు అసంతృప్తితో ఉన్నారు. అయితే అటువంటి వారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని టిడిపి అధినేత చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. వచ్చే ఏడాది దాదాపు 20కి పైగా ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి.

* వచ్చే ఏడాది భారీగా ఖాళీలు..
ప్రస్తుతం శాసనమండలిలో 30కి పైగా ఎమ్మెల్సీ పదవులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఎక్కువగా ఆ పార్టీకి ఉన్నారు. వచ్చే నెలలో జడ్పిటిసి, ఎంపీటీసీల పదవీకాలం కూడా ముగుస్తుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కూడా తమ పదవీ కాలాన్ని పూర్తిచేయనున్నారు వచ్చే ఏడాదికి. దాదాపు 20 కి పైగా ఎమ్మెల్సీ పదవులతోపాటు మండలి చైర్మన్ పోస్ట్ కూడా ఖాళీ కానుంది. ఇప్పుడు పదవుల కోసం ఎదురుచూస్తున్న నేతలకు వరుస పెట్టి అవకాశాలు కల్పించనున్నారు. ఇప్పటికే ప్రతి నేతకు ఈ విషయంలో సమాచారం ఉంది. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని.. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అవసరాలకు అనుగుణంగా 2029 ఎన్నికల్లో పోటీ చేయిస్తామని కూడా చంద్రబాబు వారికి హామీ ఇచ్చారట. ఎవర్ని ఎప్పుడు భర్తీ చేస్తారో కూడా సమాచారం ఇచ్చారట. అందుకే టిడిపి సీనియర్ నేతలు సైలెంట్ గా ఉన్నారట.

తెలంగాణలో టిడిపి.. చంద్రబాబుకు టచ్ లోకి ఆ నేతలు!

Telangana TDP
Telangana TDP

Telangana TDP: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలకం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి కారణం లేకపోలేదు. గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీని ఉద్దేశించి టిడిపి అక్కడ యాక్టివ్ అయ్యేందుకు అన్ని సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో పని చేసిన నేతలంతా ఇప్పుడు చంద్రబాబుకు టచ్ లోకి వస్తున్నట్లు సమాచారం. పార్టీని యాక్టివ్ చేస్తే చేరేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తమ ప్రతిపాదనను చంద్రబాబు ఎదుట పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలోనే తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టారట చంద్రబాబు. ప్రస్తుతం అక్కడ పార్టీకి నాయకత్వం లేదు కానీ.. క్యాడర్ ఇప్పటికీ కొనసాగుతోంది. టిడిపి అభిమానులు కూడా ఎక్కువే. గ్రేటర్ తో పాటు సెటిలర్స్ ఉన్న జిల్లాలు చాలా ఉన్నాయి. అటువంటి చోట్ల మాత్రం టిడిపి పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంటుంది.

* మోదీ టూర్ తో..
మొన్న తెలంగాణలో పర్యటనకు వచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. దాదాపు పదివేల కోట్ల రూపాయల నిర్మాణాలకు సంబంధించి హైదరాబాదులో శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. చంద్రబాబుతో అయితే గంటల తరబడి చర్చించారు. అయితే దీని వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఏపీలో ఎన్డీఏ కూటమి నడుస్తోంది మూడు పార్టీలతో. తెలంగాణలో సైతం మూడు పార్టీలు ఏకతాటి పైకి వస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ఉంది. అయితే గతంలో మాదిరిగా ప్రత్యేక రాష్ట్ర భావన లేదు. ఇప్పుడు అంతా అభివృద్ధి అజెండాగా సాగుతోంది తెలంగాణ రాజకీయం. తెలుగుదేశం పార్టీని యాక్టివ్ చేసేందుకు ఇదే సరైన సమయం అని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర పెద్దల ఆదేశాలతో గ్రేటర్ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య పొత్తు ఉండబోతుందనేది ఒక అంచనా.

* బలమైన కేడర్..
తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో బలమైన కేడర్ ఉంది. ఎందుకంటే ఆ పార్టీ పుట్టింది తెలంగాణలో. ఎన్టీఆర్ బలమైన పునాదులు ఏర్పాటు చేశారు. అవి తెలంగాణలో ఎక్కువగా నాటుకున్నాయి కూడా. మధ్యలో ప్రత్యేక రాష్ట్రం వాదంతో తెలుగుదేశం కాస్త ఇబ్బంది పడింది. ప్రతి దానికి చంద్రబాబు బూచి ని చూపించి రాజకీయం చేశారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి పుష్కరకాలం దాటుతున్న క్రమంలో క్రమేపి ప్రాంతీయ వాదం బలహీనపడుతోంది. అభివృద్ధి మంత్రం పతాక స్థాయికి చేరుకుంటుంది. అందుకే ఏపీ మాదిరిగా తెలంగాణలో సైతం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కలిసి నడుస్తాయన్న ప్రచారం జరుగుతోంది.

* టిడిపి నాయకులే అధికం..
తెలంగాణలో ప్రస్తుతం అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు ఎక్కువగా టిడిపి నుంచి వెళ్లిన వారి. గులాబీ పార్టీలో అయితే ఆ పార్టీ బాస్ కెసిఆర్ నుంచి దిగువ స్థాయి కేడర్ వరకు అంతా టిడిపి దే. కాంగ్రెస్ పార్టీలో కూడా మెజారిటీ నాయకత్వం టిడిపి నుంచి వెళ్ళింది. అయితే ఇప్పుడు గులాబీ పార్టీ పరిస్థితి బాగా లేకపోవడంతో.. ఆ పార్టీలో ఉన్న పూర్వపు టిడిపి నేతలు అంతా పూర్వాశ్రమం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారట. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని యాక్టివ్ చేస్తే చేరేందుకు సిద్ధమవుతున్నారట. ఇప్పటికే చంద్రబాబుకు చాలామంది టచ్లోకి వచ్చారట. సరైన సమయం చూసి చెబుతానని బాబు చెప్పారట. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో.

పిల్లల విషయంలో ప్రతీ తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి..

parenting tips
parenting tips

Parenting Tips: ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు తెలివిగా, ఆత్మవిశ్వాసంతో ఎదగాలని కోరుకుంటారు. అయితే పిల్లలను కేవలం చదువులోనే కాకుండా ఆలోచనల్లో, నిర్ణయాల్లో, సమస్యల పరిష్కారంలోనూ ముందుండేలా చేయడం చాలా ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చిన్నప్పటి నుంచే కొన్ని మంచి అలవాట్లు నేర్పితే పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచన పెరుగుతాయి. ఆ ఆలవాట్లు ఏంటో చూద్దాం..

వారితోనే సమాధానం చెప్పించాలి:
పిల్లలు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తితో ఎన్నో ప్రశ్నలు అడుగుతుంటారు. అప్పుడు వెంటనే జవాబు చెప్పేయకుండా, ‘నీకు ఏమనిపిస్తోంది?’ అని ఎదురుప్రశ్న వేయడం మంచిది. ఇలా చేయడం వల్ల వారు తమ ఆలోచనలను ఉపయోగించి సమాధానం వెతకడానికి ప్రయత్నిస్తారు. వారు చెప్పిన జవాబు తప్పుగా ఉంటే సరిదిద్దాలి. ఈ పద్ధతి పిల్లల్లో తార్కిక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంచుతుంది.

వస్తువుల ఎంపికలో..
పిల్లల దుస్తులు, పుస్తకాలు, ఆటవస్తువులు లేదా చిన్న చిన్న విషయాల ఎంపికలో వారినే నిర్ణయం తీసుకోమని ప్రోత్సహించాలి. ఇలా చేయడం వల్ల వారికి నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాని ఫలితాలను అర్థం చేసుకోవడం కూడా నేర్చుకుంటారు. భవిష్యత్తులో పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ నైపుణ్యం ఎంతో ఉపయోగపడుతుంది.

ఆలోచనలకు స్వేచ్ఛ ఇవ్వండి..:
ఇంట్లో పిల్లలు తమ అభిప్రాయాలను భయపడకుండా చెప్పగలిగే వాతావరణం ఉండాలి. వారి ఆలోచనలు విచిత్రంగా అనిపించినా వెంటనే విమర్శించకూడదు. వారిని శ్రద్ధగా వినడం, చర్చించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇదే సృజనాత్మకతకు, కొత్త ఆలోచనలకు పునాది అవుతుంది.

జీవిత అనుభవాలను..:
తల్లిదండ్రులు తమ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, వాటిని ఎలా అధిగమించారో పిల్లలకు చెప్పడం మంచిది. విజయాల కంటే వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠాలను వివరించడం మరింత ప్రయోజనకరం. దీనివల్ల జీవితంలో సమస్యలు సహజమని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవచ్చని పిల్లలు అర్థం చేసుకుంటారు.

తప్పులకు అవకాశం.. :
చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేయకుండా ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటారు. కానీ చిన్న చిన్న తప్పులు చేయడం కూడా ఒక నేర్చుకునే ప్రక్రియ. తప్పు జరిగితే మందలించడం కాకుండా, దాని నుంచి ఏమి నేర్చుకోవచ్చో వివరించాలి. ఇది పిల్లల్లో బాధ్యతాయుతమైన ఆలోచనను పెంచుతుంది.

పుస్తకాల జ్ఞానం మాత్రమే సరిపోదు. చుట్టూ జరిగే విషయాలను గమనించడం, ప్రశ్నించడం, కొత్త విషయాలు తెలుసుకోవడం వంటి అలవాట్లను ప్రోత్సహించాలి. వార్తలు, విజ్ఞాన కార్యక్రమాలు, ప్రకృతి పరిశీలన వంటి కార్యకలాపాలు పిల్లల మేధో వికాసానికి దోహదపడతాయి. పిల్లలను మాస్టర్ మైండ్స్‌గా మార్చడం ఒక్కరోజులో జరిగే పని కాదు. వారికి సరైన మార్గనిర్దేశం, ఆలోచించే స్వేచ్ఛ, నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, తప్పుల నుంచి నేర్చుకునే వాతావరణం కల్పిస్తే వారు భవిష్యత్తులో ఆత్మవిశ్వాసంతో కూడిన, తెలివైన వ్యక్తులుగా ఎదుగుతారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహనం, నమ్మకమే పిల్లల విజయానికి నిజమైన పునాది.

పవన్ ఓ జి సినిమాతో మహిళకు ఆపరేషన్!

Woman Surgery While Watching OG
Woman Surgery While Watching OG

Woman Surgery While Watching OG: ఇటీవల వైద్యులు ఆపరేషన్లను వినూత్న పద్ధతుల్లో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మెదడుకు సంబంధించిన వ్యాధులకు ఆపరేషన్లు చేసే సమయంలో రోగులు మెలకువగా ఉండాలి. అందుకే తమకు ఇష్టమైన సినిమాలను ప్రదర్శించడం.. వాటిని చూపించి ఆపరేషన్ చేయడం వంటివి చేస్తున్నారు. తాజాగా గుంటూరులో కూడా ఇలానే ఓ మహిళకు ఆపరేషన్ చేశారు. తన అభిమాన నటుడు నటించిన సినిమాను ఆపరేషన్ థియేటర్లో ప్రదర్శించి చికిత్స చేశారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

* నిరుపేద మహిళ..
ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి చెందిన గనిపిశెట్టి రాఘవులు, కోటేశ్వరమ్మ దంపతులు గుంటూరు జిల్లా పొన్నూరులో నివాసం ఉంటున్నారు. వారికి కిచిడీ షాపు ఉంది. అయితే ఇటీవల కోటేశ్వరమ్మ అనారోగ్యానికి గురయ్యారు. మూర్ఛ వ్యాధితో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు వడ్లమూడి లోని డివిసి ఆసుపత్రిలో చేర్చారు. వెంటనే అక్కడ వైద్యులు స్కాన్ చేసి ఆమె తలలో రక్తం గడ్డకట్టి ఉండడాన్ని గుర్తించారు. ఆపరేషన్ చేయాలని కూడా నిర్ణయించారు. కానీ ఎటువంటి మత్తుమందు ఇవ్వకుండా మెలకువగా ఉన్న సమయంలోనే ఆ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అందుకే అక్కడి డాక్టర్లు వినూత్న ఆలోచన చేశారు. కోటేశ్వరమ్మకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన నటించిన ఓజి సినిమాను ప్రదర్శించి.. ఆమె చూస్తుండగానే ఈ ఆపరేషన్ పూర్తి చేయగలిగారు.

* ఇటీవల సర్వసాధారణం..
ఇటీవల నాడీ వ్యవస్థకు ముప్పు వాటిల్లకుండా.. రోగికి ఎటువంటి మత్తు మందు ఇవ్వకుండా.. ఆపరేషన్లు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే కోటేశ్వరమ్మకు ఈ ఆపరేషన్ చేశారు. అయితే కొంతమంది పాత సినిమాలకు ఇష్టపడతారు. మరికొందరు కొత్త సినిమాలను ఇష్టంగా చూస్తారు. అటువంటివారికి క్లిష్టమైన ఆపరేషన్లు చేసే సమయంలో తాము అభిమానించే నటుడు చిత్రాన్ని ప్రదర్శించి ఆపరేషన్లు చేస్తుంటారు. ఇప్పుడు కోటీశ్వరమ్మ సైతం ఓ జి సినిమా చూసి తన ఆపరేషన్ కు ఎంతగానో సహకరించింది.

డీఎస్సీ 2025.. వైసీపీ ప్రచారం ఎవరికి నష్టం?!

YSRCP DSC Campaign
YSRCP DSC Campaign

YSRCP DSC Campaign: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తక్షణం ప్రజామోదం అవసరం. ప్రజల పార్టీని గుర్తించాలి. కూటమిని తిరస్కరించాలి. అది జరగాలంటే కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మాలి. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పని కూడా అదే. అదేపనిగా డీఎస్సీ 2025 పై విషం చిమ్ముతోంది. వస్తే ఆరు లక్షల ఓట్లు.. పోతే 16 వేల ఓట్లు అన్నట్టు ఆ పార్టీ రాజకీయం నడుస్తోంది. అదేపనిగా డీఎస్సీ 2025 పై వ్యతిరేక ప్రచారం చేస్తోంది. కానీ ఎక్కడా ప్రభుత్వం ప్రతి విమర్శలు చేయకుండా చాలా జాగ్రత్తలు పడుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రతి అభ్యంతరంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఫేక్ ప్రచారం అని ప్రజల్లోకి బలంగా వెళ్తోంది.

* జగన్ ను కలిసిన అభ్యర్థులు
ఇటీవల కొంతమంది డీఎస్సీ అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డిని కలిశారు.. తమకు మంచి ర్యాంకులు వచ్చిన ఉద్యోగాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి దీనిని అవకతవకలతో పోల్చేసి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రారంభించారు. డీఎస్సీలో గోల్మాల్ జరిగిందని.. భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ లేనిపోని ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఇక్కడే పాఠశాల విద్యాశాఖ చతురత చూపింది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని కలిసి తమకు ఉత్తమ ర్యాంకులు వచ్చిన ఉద్యోగాలు రాలేదని చెప్పారో.. వారి విషయంలో జరిగిన పరిణామాలు గురించి వివరణ ఇచ్చారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్, హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం వారికి ఉద్యోగాలు దక్కలేదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసే క్రమంలో.. కటాఫ్ ను పరిగణలోకి తీసుకొని.. మధ్యలో వికలాంగుల కోటాలాంటివి.. స్పోర్ట్స్ కోటా లాంటివి అమలు చేసిన క్రమంలో వారికి ఉద్యోగాలు రాలేదు అని సావధానంగా చెప్పింది పాఠశాల విద్యాశాఖ. ఆధారాలతో సహా అధికారులు వివరించే ప్రయత్నం చేయడం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రచారం చేస్తోందని స్పష్టం అవుతుంది.

* పేకాట అంశం నవ్వుల పాలు..
మరోవైపు డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద పేకాట ఆడే వారికి అవకాశం కల్పించారని మాజీమంత్రి పేర్ని నాని అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. బ్రిడ్జి అనే స్పోర్ట్స్ కోటా కింద అంటే పేకాటక వర్ణిస్తున్నారు. ఇది కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చే పరిణామమే. ఎందుకంటే అది భారత ప్రభుత్వం గుర్తించిన క్రీడ. క్రీడా కోటాలో ఉద్యోగాల ఎంపిక సమయంలో బ్రిడ్జి అనేది తప్పనిసరి చేసింది. అందుకే స్పోర్ట్స్ కోటాలో 40వ క్రీడగా దానిని పెట్టారు. కానీ ఆ కోటాలో ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఇలా లేనిపోని ప్రచారం చేసి డీఎస్సీ 2025 పై గందరగోళం సృష్టించడమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం. దీనిని గమనించిన ప్రభుత్వం గొడవలకు వెళ్లకుండా.. ప్రత్యరోపణలకు వెళ్లకుండా.. ప్రతి అభ్యర్థి అనుమానాలను నివృత్తి చేస్తోంది.

కులాన్ని నమ్ముకుంటున్న వైసిపి!

YSRCP Caste Politics
YSRCP Caste Politics

YSRCP Caste Politics: జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును ఖరారు చేశారు. అయితే ఇప్పుడు కాపు సామాజిక వర్గం వారు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నవారు దీనిని తప్పు పట్టవచ్చు. కానీ దీనిని ముందుగానే పసిగట్టారు పవన్ కళ్యాణ్. తన కష్టకాలంలో తన వెంట ఉన్న వారిని మాత్రమే గుర్తించుకుంటానని.. పార్టీపై ఒక కులం ముద్ర వేస్తే ఊరుకునేది లేదని.. 2019లో ఈ కుల నేతలంతా ఎక్కడికి వెళ్లిపోయారని ప్రశ్నించారు. మరోవైపు కులం కులం అంటూ కాపు కులాన్ని జనసేనకు ఆపాదిస్తూ వచ్చారు. అందుకే ఇప్పుడు లింగమనేని రమేష్ అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేయడం ద్వారా వారికి షాక్ ఇచ్చారు పవన్.

* టిడిపి,వైసిపిలపై వ్యతిరేక ప్రచారం..
తెలుగుదేశం పార్టీ కాపులకు ప్రాధాన్యం ఇస్తోందని ప్రచారం చేసేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అదిగో పవన్ కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యమిస్తున్నారని చెబుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇలా ఎలా చూసుకున్నా ఆ రెండు పార్టీలకు సొంత సామాజిక వర్గాల వారు దూరం కావాలి. అప్పుడే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడేది. ఆ పార్టీ ఆలోచన కూడా అదే. అయితే ఎన్నడు పవన్ కళ్యాణ్ కాపుల విషయంలో బాహటంగా ప్రకటనలు చేయలేదు. కాపులు మాత్రం పవన్ విషయంలో సానుకూలంగా ఉన్నారు. కానీ అదే కాపుల్లో చీలిక తేవాలన్న ఉద్దేశంతో.. నాదెండ్ల మనోహర్ పార్టీలో నెంబర్ 2 గా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా రాజ్యసభ పదవి కమ్మ సామాజిక వర్గానికి చెందిన లింగమనేని రమేష్ కు అప్పగించారు. చూశారా ఈ వివక్ష అంటూ కాపుల్లో ఆగ్రహాన్ని రగిలించే ప్రయత్నంలో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.

* పార్టీని నమ్ముకున్న వారికి..
మరోవైపు తెలుగుదేశం కాపులకు ప్రాధాన్యమిస్తోంది. పార్టీని నమ్ముకున్న కమ్మ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తోంది అంటూ ప్రచారం చేస్తున్నవారు ఉన్నారు. చాలామంది కమ్మ నేతలు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారందరినీ రెచ్చగొట్టే పనిలో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీకైనా కులంతో పని ఉండదు. ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచే వారికి అధినాయకత్వం ప్రాధాన్యం ఇస్తుంది. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా గట్టిగానే చెప్పారు. 2019లో ఎందుకు కాపు నేతలు తనను గెలిపించలేదని ప్రశ్నించారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన కాపు నేత జెడి లక్ష్మీనారాయణ ఎందుకు పార్టీలో కొనసాగలేకపోయారని ప్రశ్నించిన సందర్భం కూడా ఉంది. అయితే జేడీ లాంటి వ్యక్తులు పార్టీలో కొనసాగి ఉంటే ఇప్పుడు రాజ్యసభ ద్వారా ఎంపీలు అయి ఉండేవారు. మొన్నటి ఎన్నికల్లో లోక్సభ సభ్యులై ఉండేవారు. వారంతా పవన్ కళ్యాణ్ ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరి పార్టీని, అధినేత పవన్ ను నమ్ముకొని పార్టీకి అండదండగా నిలిచిన లింగమనేని రమేష్ లాంటి వ్యక్తులకు పదవులు ఇవ్వడం అంటే తప్పు కాదు కదా? కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ అనవసరం. ఆ పార్టీకి కుల ప్రచారమే రాజకీయ అస్త్రం.

వైఎస్ఆర్ కాంగ్రెస్ సంచలన సర్వే!

YSR Congress Survey
YSR Congress Survey

YSR Congress Survey: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఒక సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఆయన వద్ద ఉంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీం ఒకవైపు సర్వే చేస్తే.. తాను సొంతంగా ఒక సర్వే చేయించుకున్నారట. కానీ అందులో సానుకూల అంశాలు ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు కానీ.. ప్రతికూలతలు అధికంగా ఉన్నట్లు తేలిందట. ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఇంకా ప్రజల్లో భయం ఉందని ఆ సర్వేలో తేలడం సంచలనంగా మారింది. కానీ జగన్ మాత్రం సానుకూలంగానే దానిని తీసుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. వైసిపి దూకుడు కూడా ఆ పార్టీకి నష్టం చేకూరుస్తోందని ఆ సర్వేలో తేలడం విశేషం.

* అవే మైనస్ లు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆందోళనలకు పిలుపునిస్తున్నారు. నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. కానీ వాటిలో జగన్మోహన్ రెడ్డి మాత్రం పాల్గొనడం లేదు. పైగా ఆందోళన కార్యక్రమాలు ఏ అజెండాతో నిర్వహిస్తున్నారో.. కొంతకాలానికి వాటిని అలానే వదిలేస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ అంశాన్ని కూడా అలానే విడిచి పెట్టేసారు. ఇవన్నీ పార్టీకి మైనస్ అవుతున్నట్లు ఆ సర్వేలో తేలిందట. జగన్మోహన్ రెడ్డి స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం.. పక్క రాష్ట్రం నుంచి రాకపోకలు సాగించడం కూడా ఆ పార్టీకి మైనస్. ఇవన్నీ ఆ సర్వేలో తేలినా.. పట్టించుకునే స్థితిలో లేరట జగన్మోహన్ రెడ్డి. అటువంటప్పుడు సర్వేలు చేయడం ఎందుకనేది ఒక ప్రశ్న. అయితే ఆయన చెబుతున్న సర్వరోగ నివారిణి పాదయాత్ర. తను వచ్చే ఏడాదిలో చేసే పాదయాత్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వరూపాన్ని మార్చేస్తుందని ఆయన నమ్మకంతో ఉన్నారట.

* ప్రజల్లోకి వచ్చేది ఎప్పుడు?
ప్రజల మధ్యకు వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేయకపోవడం అనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన మైనస్ అని ఆ సర్వేలో తేలింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్ముకుంటున్నట్టు ఉంది ఆ పార్టీ. అందుకే నిత్యం వ్యతిరేక ప్రచారం చేస్తోంది. అది కూడా పెద్దగా వర్కౌట్ కావడం లేదని తెలుస్తోంది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీం సర్వే చేసిందా? లేకుంటే జాతీయ సంస్థ చేసిందా? అన్నది తెలియడం లేదు. కానీ ఈ సర్వే పూర్తిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా వచ్చినట్లు తెలుస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదట. అటువంటప్పుడు సర్వే చేయించడం ఎందుకు.. దానిని నిర్లక్ష్యం చేయడం ఎందుకు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయట!

మంచి నిద్ర కోసం బెడ్రూంలో ఈ రంగు లైట్ బెటర్.. వీటితో పాటు..

Sleep Light Color
Sleep Light Color

Sleep Light Color: నేటి జీవనశైలిలో రకరకాల కారణాల వల్ల చాలా మంది నిద్ర సమస్యలతో బాధపడుతున్నారు. అయితే మంచి నిద్ర కోసం కేవలం మెత్తని పరుపు లేదా నిశ్శబ్ద వాతావరణం మాత్రమే కాకుండా బెడ్రూమ్‌లో ఉండే లైట్ రంగు కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఉపయోగించే కాంతి శరీరంలోని జీవ గడియారం (బయోలాజికల్ క్లాక్)పై ప్రభావం చూపి నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఇలాంటి సమయంలో ఏ రంగుతో ఉన్న లైట్ ఉంచుకోవడం మంచిది?

నిపుణుల ప్రకారం.. ఎరుపు రంగు (Red Light) నిద్రకు అత్యంత అనుకూలమైన కాంతిగా భావిస్తారు. ఈ కాంతి మెదడును ప్రశాంతంగా ఉంచడంతో పాటు నిద్రకు సహాయపడే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని ఎక్కువగా అడ్డుకోదు. ఫలితంగా శరీరం సహజంగా నిద్ర మోడ్‌లోకి వెళ్లేందుకు సహకరిస్తుంది. అందుకే రాత్రి పడుకునే ముందు బెడ్రూమ్‌లో మసక ఎరుపు కాంతిని ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు.

నారింజ రంగు (Orange Light) కూడా నిద్రకు అనుకూలమైన కాంతిగా గుర్తించబడింది. ఇది సూర్యాస్తమయ సమయంలో కనిపించే సహజ కాంతిని పోలి ఉండటంతో శరీరానికి విశ్రాంతి సంకేతాలను పంపుతుంది. దీని వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, క్రమంగా నిద్ర ముంచుకొస్తుంది. ముఖ్యంగా రాత్రి చదవడం లేదా ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఈ రంగు కాంతి ఉపయోగకరంగా ఉంటుంది.

పసుపు రంగు (Yellow Light) కంటికి తక్కువ ఒత్తిడిని కలిగించే కాంతిగా పరిగణిస్తారు. ఇది కళ్లపై తీవ్ర ప్రభావం చూపకుండా సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అయితే చాలా ప్రకాశవంతంగా కాకుండా డిమ్ లైట్ రూపంలో ఉండటం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. మసక పసుపు కాంతి గదిలో హాయిగా ఉండే వాతావరణాన్ని కల్పించి నిద్రకు సహాయపడుతుంది.

మరోవైపు బ్లూ లైట్ (Blue Light) నిద్రకు ప్రధాన శత్రువుగా భావిస్తారు. మొబైల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, LED స్క్రీన్ల నుంచి ఎక్కువగా వెలువడే ఈ కాంతి మెలటోనిన్ ఉత్పత్తిని అణిచివేస్తుంది. దీంతో మెదడు ఇంకా పగలే ఉన్నట్లుగా భావించి నిద్ర ఆలస్యమవుతుంది. అందువల్ల పడుకునే కనీసం ఒక గంట ముందు ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.

గ్రీన్ లైట్, అత్యంత ప్రకాశవంతమైన తెల్లటి కాంతులు (Bright White Lights) కూడా కొందరిలో నిద్ర చక్రాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇవి మెదడును అప్రమత్త స్థితిలో ఉంచి విశ్రాంతిని దూరం చేయవచ్చు. అందుకే రాత్రి సమయంలో బెడ్రూమ్‌లో అధిక ప్రకాశం ఉన్న లైట్లకు బదులుగా మసక కాంతిని ఎంచుకోవడం మంచిది.

మంచి నిద్ర కోసం లైట్ రంగుతో పాటు కొన్ని అలవాట్లు కూడా అవసరం. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, పడుకునే ముందు కాఫీ లేదా టీ తాగకపోవడం, మొబైల్ వినియోగాన్ని తగ్గించడం, గదిలో ఉష్ణోగ్రతను సౌకర్యవంతంగా ఉంచడం వంటి చర్యలు గాఢమైన నిద్రకు సహాయపడతాయి. సరైన రంగు కాంతిని ఎంచుకోవడం ద్వారా నిద్ర నాణ్యత మెరుగుపడి, మరుసటి రోజు శరీరం, మనసు మరింత ఉత్సాహంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచాన్ని ఏలిన బ్రిటన్ ఇప్పుడు బిచ్చమెత్తుకుంటుందా.. ఎందుకు

Britain Economy Crisis
Britain Economy Crisis

Britain Economy Crisis: ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యంగా పేరొందిన బ్రిటన్ ప్రస్తుతం ఆర్థిక, సామాజిక సవాళ్లను ఎదుర్కొంటోంది.2024 లెక్కల ప్రకారం బ్రిటన్ అప్పులు దేశ ఆదాయానికి 99.5 శాతానికి చేరుకున్నాయి. 14.1 మిలియన్ల మంది (ఇందులో 3.8 మిలియన్ల మంది పిల్లలు కూడా ఉన్నారు) ఆహార అస్థిరతతో బాధపడుతున్నారు. 2 మిలియన్ల మంది కనీసం ఒక రోజైనా ఆహారం లేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితికి బ్రిటన్ యూరోపియన్ యూనియన్(EU) నుంచి బయటకు రావడమే అని కొందరు అంటున్నారు. అసలు ఈయూ నుంచి బ్రిటన్ ఎందుకు బయటకు వచ్చింది? తరువాత ఏం జరిగింది?

European Union అనేది యూరప్‌లోని అనేక దేశాల ఆర్థిక, రాజకీయ కూటమి. సభ్య దేశాల మధ్య వస్తువులు, సేవలు, పెట్టుబడులు, ప్రజల రాకపోకలు సులభంగా జరిగేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. బ్రిటన్ 1973లో ఈ కూటమిలో చేరింది. దశాబ్దాల పాటు సభ్యదేశంగా కొనసాగింది. అయితే ఈయూలో ఉండడం వల్త తమకు తీవ్రంగా ఆర్థిక నష్టం చేకూరుతుందని.. యూరోపియన్ లో ఉన్న దేశాలు ఎక్కువగా బ్రిటన్ సేవలను పొందుతున్నారని భావించారు. అంతేకాకుండా ఈ యూనియన్ లో ఉండడం వల్ల కొన్ని దేశాల ప్రజలు ముఖ్యంగా యూనియన్ లో ఉన్న తూర్పు దేశాలు ఎక్కువగా బ్రిటన్ కు వలసలు రావడం ఎక్కువైంది. దీంతో స్థానికులకు ఉద్యోగాలు రావడం లేదని ఆందోళన చేయడం ప్రారంభించారు.

2016లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం)లో స్వల్ప మెజారిటీ ప్రజలు EU నుంచి బయటకు రావాలని ఓటు వేశారు. దీనినే ‘బ్రెగ్జిట్’ (Brexit) అంటారు. Britain , Exit అనే పదాల కలయికతో ఈ పేరు వచ్చింది. వలసలను నియంత్రించుకోవడం, తమ చట్టాలపై పూర్తి నియంత్రణ పొందడం, EU నియమాల నుంచి విముక్తి పొందడం వంటి కారణాలతో చాలా మంది బ్రిటిష్ ఓటర్లు బ్రెగ్జిట్‌కు మద్దతిచ్చారు.దీంతో 2020లో బ్రిటన్ అధికారికంగా EU నుంచి వైదొలిగింది.

కానీ ఇక్కడే సమస్యలు మొదలయ్యాయి. అప్పటి వరకు యూరప్‌తో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థలో మార్పులు వచ్చాయి. కొత్త కస్టమ్స్ నిబంధనలు, సరిహద్దు తనిఖీలు, అదనపు పత్రాలు వ్యాపార వ్యయాలను పెంచాయి. అలాగే వ్యవసాయం, ఆహార ఉత్పత్తి, రవాణా రంగాల్లో కార్మికుల కొరత ఏర్పడింది. దీనివల్ల కొన్ని వస్తువుల ధరలు పెరిగాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. వీటికి తోడు కరోనా సంక్షోభం కూడా రావడంతో ఈ దేశంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ప్రస్తుతం బ్రిటన్ ఇంకా ప్రపంచంలో ప్రముఖ ఆర్థిక శక్తిగానే ఉంది. United Kingdom కు బలమైన ఆర్థిక సేవల రంగం, ప్రముఖ విశ్వవిద్యాలయాలు, సాంకేతిక పరిశ్రమలు ఉన్నాయి. అయితే అప్పుల నియంత్రణ, గృహ నిర్మాణం, ఉత్పాదకత పెంపు, ఉపాధి అవకాశాల విస్తరణ వంటి అంశాలపై ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ సవాళ్లను అధిగమించగలిగితే బ్రిటన్ మళ్లీ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

స్విమ్మింగ్ లో కూడా ఈ వాచ్ పనిచేస్తుంది.. ధర ఎంతో తెలుసా..

Realme Smartwatch
Realme Smartwatch

Realme Smartwatch: మగవారు అందంగా కనిపించడానికి కొందరు చేతికి ప్రత్యేకంగా వాచ్ ధరిస్తూ ఉంటారు. అయితే స్టైలిష్ గా.. ప్రీమీయింతో కూడిన వాచ్ కావాలని అనుకునేవారికి Realme Watch S5 ఇప్పుడు భారత్‌లో అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. ఈ వాచ్ ఎలా ఉందంటే?

Realme Watch S5 లో 1.43- అంగుళాల AMOLED గుండ్రని డిస్‌ప్లే ఉంది. 466×466 పిక్సెల్ రిజల్యూషన్ తో పనిచేస్తుంది. ఈ వాచ్‌లో Built-in GPS, 5 GNSS systems support ఉన్నాయి. అంటే రన్నింగ్, సైక్లింగ్ వంటి అవుట్‌డోర్ యాక్టివిటీలను ఫోన్ లేకుండా కూడా ట్రాక్ చేయవచ్చు. ఇందులో 20-days అల్ట్రా లాంగ్ లైఫ్ బ్యాటరీ సెట్ చేశారు. అయితే కొన్ని నివేదికల ప్రకారం.. 460 mAh battery అని అంటున్నారు. 5ATM వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉందని కంపెనీ చెబుతోంది. దీంతో స్విమ్మింగ్ వాటిలో కూడా దీనిని వాడుకోవచ్చు.

గుండ్రని డయల్ డిజైన్, అల్యూమినియం బాడీ, పండా గ్లాస్ ప్రొటెక్షన్, సిలికాన్ స్ట్రాప్ వంటి వాటితో ఇది కనిపిస్తుంది. ని ధర రూ.7,999గా నిర్ణయించారు. కంపెనీ ఈ మోడల్‌ను 22 May 2026న ప్రకటించగా, ఇప్పుడు Flipkart, realme.comతో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల ద్వారా విక్రయాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభ ఆఫర్లలో కొందరు కొనుగోలుదారులకు ₹7,499 తో కొనుగోలు చేశారు. ౌ

ఈ వాచ్ లో Bluetooth calling సపోర్ట్ ఉంది. Android, iOS రెండింటికీ అనుకూలంగా పనిచేస్తుంది. ఇది Wear OS కాదు; realme Link యాప్‌తో జతచేసే RTOS-based smartwatch అని అంటున్నారు. రూ.8,000 లోపు round-dial smartwatch కోసం ఎదురుచూసేవారికి ఇది బెస్ట్ ఎంపిక అని అంటున్నారు.

ఇయర్ బడ్స్ ఇలా వాడుతున్నారా..

Danger
Danger

Danger: స్మార్ట్‌ఫోన్లు, మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ప్రయాణంలో, వ్యాయామం చేస్తున్నప్పుడు, చదువుకునేటప్పుడు, పని చేసేటప్పుడు చాలా మంది గంటల తరబడి ఇయర్‌బడ్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ అలవాటు వినికిడి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అధిక శబ్దంతో, ఎక్కువసేపు వినడం వల్ల చెవిలోని సున్నితమైన కణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అయితే ఈ నియమం పాటిస్తే ఇయర్ బడ్స్ తో ఎలాంటి సమస్యలు ఉండవని అంటున్నారు.. అవేంటంటే?

ఇయర్‌బడ్స్ నేరుగా చెవి కాలువలో అమరిపోతాయి. దీంతో శబ్ద తరంగాలు కర్ణభేరి (Eardrum)కి చాలా దగ్గర నుంచి చేరుతాయి. సాధారణ స్పీకర్లతో పోలిస్తే ఈ శబ్ద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అధిక వాల్యూమ్‌లో సంగీతం లేదా వీడియోలు వినడం వల్ల చెవిలోని సున్నితమైన హెయిర్ సెల్స్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఇవే శబ్దాలను మెదడుకు చేరవేసే కీలక కణాలు. మన శరీరంలోని కొన్ని కణాలు దెబ్బతింటే తిరిగి ఏర్పడతాయి. కానీ చెవి లోపలి భాగంలో ఉండే హెయిర్ సెల్స్ మాత్రం ఒకసారి దెబ్బతింటే తిరిగి పెరగవు. అందుకే శబ్ద కాలుష్యం వల్ల కలిగే వినికిడి నష్టం చాలా సందర్భాల్లో శాశ్వతంగా మారుతుంది. మొదట్లో స్వల్పంగా వినికిడి తగ్గినట్లు అనిపించినా, కాలక్రమేణా అది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.

ఎక్కువసేపు ఇయర్‌బడ్స్ ఉపయోగించిన తర్వాత కొందరికి చెవిలో ‘గుయ్..గుయ్..’ లేదా ‘టింగ్..టింగ్..’ అనే మోగుతున్న శబ్దం వినిపిస్తుంది. దీనిని వైద్య భాషలో టిన్నిటస్ (Tinnitus) అంటారు. ఇది చెవి అధిక శబ్దానికి గురైందనే సంకేతంగా పరిగణిస్తారు. ఇలాంటి లక్షణాలు తరచుగా కనిపిస్తే వెంటనే వాల్యూమ్ తగ్గించి వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

60-60 నియమాన్ని పాటించండి
వినికిడి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వైద్యులు ‘60-60 రూల్’ను సూచిస్తున్నారు. అంటే ఇయర్‌బడ్స్ వాడేటప్పుడు గరిష్ఠ వాల్యూమ్‌లో 60 శాతం కంటే ఎక్కువ పెట్టకూడదు. అలాగే నిరంతరంగా 60 నిమిషాలకు మించి వినకూడదు. గంట పూర్తయిన తర్వాత కనీసం కొంత సమయం చెవులకు విశ్రాంతి ఇవ్వడం మంచిది. ఈ నియమం పాటిస్తే వినికిడి నష్టం ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

ప్రస్తుతం చిన్న వయసు నుంచే పిల్లలు మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ల ద్వారా ఇయర్‌బడ్స్ ఉపయోగిస్తున్నారు. యువతలో అయితే సంగీతం, గేమింగ్, వీడియోల కోసం గంటల తరబడి వినడం సాధారణంగా మారింది. దీని వల్ల చిన్న వయసులోనే వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శబ్దభరిత ప్రాంతాల్లో వాల్యూమ్‌ను మరింత పెంచడం సమస్యను తీవ్రతరం చేస్తుంది.

వినికిడి నష్టం మాత్రమే కాదు, ఎక్కువసేపు ఇయర్‌బడ్స్ ధరించడం వల్ల చెవిలో వేడి పెరగడం, చెమట పేరుకుపోవడం, ఇన్ఫెక్షన్లు రావడం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఇతరులు ఉపయోగించిన ఇయర్‌బడ్స్ వాడితే బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఇయర్‌బడ్స్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

టిడిపి రాజ్యసభ మూడో పదవికి అనూహ్య ఎంపిక!

TDP Rajya Sabha Seat
TDP Rajya Sabha Seat

TDP Rajya Sabha Seat: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. ఈనెల 8 తో నామినేషన్ల గడువు ముగియనుంది. మరో రెండు రోజులపాటు మాత్రమే గడువు ఉంది. దీంతో కూటమి తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో పడింది. అయితే ఈసారి బిజెపికి అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరికి రాజ్యసభ పదవి దక్కుతుంది. అయితే ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక అనేది కత్తి మీద సాములా మారింది. ఇద్దరు అభ్యర్థుల ఎంపికలో స్పష్టత వచ్చింది. మరోసారి టిడిపి నుంచి సానా సతీష్ కు ఛాన్స్ ఖాయం. జనసేన నుంచి లింగమనేని రమేష్ పేరు ప్రకటించేశారు.

* రెండు పదవులు కొలిక్కి..
తెలుగుదేశం పార్టీ రెండు పదవులకు సంబంధించి కసరత్తు ప్రారంభించింది. అందులో విద్యావేత్త భాష్యం రామకృష్ణ పేరు దాదాపు ఖరారు చేసినట్లు పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పార్టీ గెలుపోటములతో సంబంధం లేకుండా భాష్యం రామకృష్ణ సేవలందిస్తూ వచ్చారు. అందుకే ఆయనకు ఛాన్స్ ఇవ్వాలని హై కమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. చివరి నిమిషంలో చేర్పులు మార్పులు తప్పిస్తే ఆయనకు రాజ్యసభ పదవి ఖరారు చేస్తారని తెలుస్తోంది. లోకేష్ కు అత్యంత విధేయుడుగా ఉంటూ వచ్చారు భాష్యం రామకృష్ణ. అందుకే ఈసారి ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

* సామాజిక సమీకరణలు..
మరోవైపు టిడిపి కి లభించే మూడో రాజ్యసభ పదవిపై బలమైన చర్చ నడుస్తోంది. అనూహ్య అభ్యర్థిని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. బీసీ మహిళకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకోవైపు బీసీ పురుషుల కోటాలో చింతకాయల విజయ్ పేరు వినిపిస్తోంది. ఇక ఎస్సీలకు ఇవ్వదలచుకుంటే వర్ల రామయ్యకు ఖరారు చేయనున్నారు. ప్రతిసారి వర్ల రామయ్యకు మొండి చేయి చూస్తూ వచ్చారు. సీనియారిటీతోపాటు సిన్సియారిటీని దృష్టిలో పెట్టుకొని రామయ్యను ఫైనల్ చేస్తారని టిడిపి వర్గాల్లో ప్రచారం సాగుతోంది. విజయ్ కు భవిష్యత్తులో మంచి పదవి కల్పిస్తామని హామీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే అనూహ్యంగా బీసీ మహిళను తెరపై తెచ్చే ఛాన్స్ కూడా ఉందంటున్నాయి టిడిపి వర్గాలు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఆ సీనియర్ రాజకీయ జీవితంలో అదో లోటు!

Yanamala Ramakrishnudu
Yanamala Ramakrishnudu

Yanamala Ramakrishnudu: తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరు యనమల రామకృష్ణుడు. టిడిపి ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఆయన చేయని పదవి అంటూ లేదు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, పీఏసీ చైర్మన్ గా ఇలా చాలా పదవులు చేపట్టారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఎక్కువసార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఆయన జీవితంలో ఒక లోటు ఉంది. అదే కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లడం. ఎంపీగా పెద్దల సభకు వెళ్లాలన్నది ఆయన ఆలోచన. కానీ అది కార్యరూపం దాల్చడం లేదు. తాజా రాజ్యసభ పదవుల్లో సైతం ఆయనకు ఛాన్స్ లేదని ప్రచారం నడుస్తోంది. దీంతో ఈ సీనియర్ నేత కాస్త ఆవేదనతో ఉన్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉంది.

* పార్టీ ఆవిర్భావం నుంచి..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు యనమల రామకృష్ణుడు. 1983 నుంచి 1999 వరకు తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. మధ్యలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినా.. ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా టిడిపిలో కొనసాగారే తప్ప.. మరో పార్టీ వైపు చూడలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆయనకు మంత్రి పదవి దక్కుతూ వచ్చింది. 1983లో తొలిసారిగా గెలిచేసరికి ఎన్టీఆర్ తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. 1989లో టిడిపి అధికారంలోకి రాలేదు. 1994లో టిడిపి అధికారంలోకి రాగా యనమల రామకృష్ణుడు కు స్పీకర్ పదవి ఇచ్చారు నందమూరి తారక రామారావు. కానీ 1995 టీడీపీ సంక్షోభ సమయంలో యనమల రామకృష్ణుడు స్థితప్రజ్ఞత ప్రదర్శించారు. చంద్రబాబుకు అవకాశం ఇచ్చారు సభలో. తన బలాన్ని నిరూపించుకున్నారు చంద్రబాబు. తన పొలిటికల్ లైఫ్ లో అదో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. నాడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అవకాశం ఇవ్వకుంటే.. చంద్రబాబుకు ఈ తరహా గౌరవం ఉండేది కాదు. అందుకే యనమల రామకృష్ణుడు విషయంలో చాలా గౌరవభావంతో ఉంటారు చంద్రబాబు. 1999లో గెలిచేసరికి ఆర్థిక శాఖ కట్టబెట్టారు. 2004లో పార్టీ ఓడిపోయింది కానీ యనమలకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తూ వచ్చారు. 2014లో ఎమ్మెల్సీగా ఉన్న యనమలను మంత్రివర్గంలోకి తీసుకొని తన ప్రత్యేకత చాటుకున్నారు. కానీ 2024 లో మాత్రం ఎమ్మెల్సీగా ఉన్న యనమల ను రెన్యువల్ చేయలేదు. మంత్రివర్గంలోకి తీసుకోలేదు.

* పెద్దల సభ ఆశ..
యనమల రామకృష్ణుడు పెద్దల సభకు వెళ్లాలన్న ఆశతో ఉన్నారు. ఒకసారి రాజ్యసభకు ఎంపికై గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. తన మనసులో ఉన్న మాటను చంద్రబాబు చెవిలో వేశారు. కానీ ఇప్పుడు నాలుగు రాజ్యసభ పదవుల ఎంపికలో యనమల రామకృష్ణుడు పేరును ప్రతిపాదనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. అయితే మరో మూడేళ్లలో రాజ్యసభ పదవులు ఖాళీ కానున్నాయి. అప్పుడు ఛాన్స్ ఇస్తామని యనమలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే యనమల కుమార్తె ఎమ్మెల్యే గా ఉండగా.. అల్లుడు లోక్సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. బహుశా ఈ కారణాల వల్లే ఈసారి యనమలకు అవకాశం లేనట్లు తెలుస్తోంది. అయితే పెద్దల సభకు వెళ్లాలన్న యనమల కోరిక తీరకపోవడం ఆయనకు పెద్ద లోటు.