Home Blog Page 180

గేమింగ్ యూజర్లు, బ్యాటరీ లైఫ్ కోరుకునేవారికి బెస్ట్ ఫోన్ ఇదే..

Tecno Pova 8 gaming smartphone
Tecno Pova 8 gaming smartphone

Tecno Pova 8 gaming smartphone: శక్తివంతమైన బ్యాటరీ, ఆకర్షణీయమైన డిజైన్, గేమింగ్ ఫీచర్లు కావాలని కోరుకునే మొబైల్ యూజర్లకు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ మార్కట్లోకి త్వరలో రాబోతుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్, భారీ బ్యాటరీతో పాటు గ్లిఫ్-స్టైల్ లైటింగ్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. అయితే దీని వివరాల్లోకి వెళితె..

ఇండియాలో 11 జూన్ 2026 తేదీన Tecno Pova 8 స్మార్ట్ఫోన్ విడుదల కాబోతుందని అధికారికంగా ప్రకటించింది. ఈ మొబైల్ లో అత్యంత విశేషమైన ఫీచర్ బలమైన బ్యాటరీ. ఇందులో 8,000mAh బ్యాటరీ ఉండనుంది. ఇది Tecno బ్రాండ్ లోనే అత్యంత పెద్ద బ్యాటరీగా పేర్కొంటున్నారు. ఈ బ్యాటరీకి 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

ఈ కొత్త మొబైల్ లో లో 6.76 అంగుళాల HD+ AMOLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో ఉండడంతో గేమింగ్ యూజర్లకు అద్భుతమైన అనుభవం ఇస్తుంది. ప్రాసెసర్ విషయంలో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్ ఉండనుంది. Android 16 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే ఇందులో 8GB RAM, 128GB స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది.

Tecno Pova 8 మొబైల్ లో 50MP మెయిన్ కెమెరా ఉండనుంది. 13MP సెల్ఫీ కెమెరాను అమర్చారని తెలుస్తోంది. డిజైన్ విషయంలో, Tecno Pova 7నే పోలి ఉంటుందని తెలుస్తోంది. బ్యాక్ పానెల్ డిజైన్ కంపెనీ ఆఫీషియల్గా రివీల్ చేసింది. ఫోన్ యొక్క ఫ్రంట్ పానెల్ గ్లాస్తో తయారీ అయ్యింది. ఈ మొబైల్ ఇండియాలో రూ.25,000 నుండి రూ.30,000 మధ్యలో విక్రయిస్తారని అంచనా. ఈ మొబైల్ ప్రధానంగా గేమింగ్ యూజర్లు, బ్యాటరీ లైఫ్ కోసం ప్రయోజనం పొందే వ్యక్తులను టార్గెట్ చేసి తయారీ చేయబడిందని తెలుస్తోంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి అలర్ట్.. ముందు ఈ 5 విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి

Electric scooter buying guide
Electric scooter buying guide

Electric scooter buying guide: పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో చాలా మంది ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ నిర్వహణ ఖర్చులు, పర్యావరణానికి మేలు చేయడం వంటి కారణాలతో EVలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే కేవలం ఆకర్షణీయమైన డిజైన్ లేదా ప్రకటనలు చూసి స్కూటర్ కొనేస్తే తర్వాత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే కొనుగోలు చేసే ముందు కొన్ని కీలక అంశాలను పరిశీలించడం చాలా అవసరం. ముఖ్యంగా ఈ 5 విషయాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి..

రోజువారీ ప్రయాణం ఎంత? మీ అవసరానికి సరిపోయే రేంజ్ ఉందా?
ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంపికలో మొదట పరిశీలించాల్సిన విషయం రోజూ మీరు ఎంత దూరం ప్రయాణిస్తారనేది. ఉదాహరణకు రోజుకు 20-30 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తే సాధారణ రేంజ్ ఉన్న స్కూటర్ సరిపోతుంది. అయితే ఉద్యోగం, వ్యాపారం లేదా డెలివరీ పనుల కోసం రోజుకు 60-100 కిలోమీటర్లు తిరిగేవారైతే అధిక రేంజ్ కలిగిన మోడల్‌ను ఎంచుకోవాలి. కంపెనీలు ప్రకటించే రేంజ్ సాధారణంగా ఆదర్శ పరిస్థితుల్లో పరీక్షించినదే. వాస్తవ పరిస్థితుల్లో ట్రాఫిక్, బరువు, రోడ్ల పరిస్థితి, డ్రైవింగ్ శైలి కారణంగా రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అవసరానికి కనీసం 20-30 శాతం అదనపు రేంజ్ ఉన్న మోడల్‌ను ఎంపిక చేసుకోవడం మంచిది.

బ్యాటరీ వారంటీపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అత్యంత ఖరీదైన భాగం బ్యాటరీ. అందువల్ల బ్యాటరీ వారంటీ ఎంతకాలం ఉంటుందో, ఎన్ని కిలోమీటర్ల వరకు వర్తిస్తుందో తెలుసుకోవాలి. ప్రస్తుతం చాలా కంపెనీలు 3 నుంచి 8 సంవత్సరాల వరకు లేదా నిర్దిష్ట కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తున్నాయి. బ్యాటరీ సామర్థ్యం తగ్గితే లేదా లోపం తలెత్తితే వారంటీ కింద మార్పిడి చేస్తారా? లేదా? అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే బ్యాటరీ మార్చాల్సి వస్తే భారీ ఖర్చు భరించాల్సి రావచ్చు.

ఛార్జింగ్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి?
స్కూటర్ కొనేముందు ఛార్జింగ్ వ్యవస్థ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఇంట్లో సులభంగా ఛార్జ్ చేసుకునే అవకాశం ఉందా? బ్యాటరీ తొలగించి ఇంట్లోకి తీసుకెళ్లి ఛార్జ్ చేయవచ్చా? ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందా? వంటి అంశాలను పరిశీలించాలి. సాధారణంగా పూర్తి ఛార్జ్ కావడానికి 4 నుంచి 8 గంటల సమయం పట్టవచ్చు. మీరు తరచూ ఎక్కువ దూరం ప్రయాణిస్తే మీ ప్రాంతంలో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయా? లేదా? కూడా చెక్ చేయడం అవసరం.

బ్రాండ్‌తో పాటు సర్వీస్ నెట్‌వర్క్ కూడా ముఖ్యమే
చాలామంది స్కూటర్ ఫీచర్లు, ధర మాత్రమే చూసి కొనుగోలు చేస్తారు. కానీ విక్రయానంతర సేవలు కూడా అంతే ముఖ్యమైనవి. మీ నగరంలో లేదా సమీప ప్రాంతంలో ఆ బ్రాండ్‌కు సంబంధించిన సర్వీస్ సెంటర్లు ఉన్నాయా? విడి భాగాలు సులభంగా లభిస్తున్నాయా? సాంకేతిక సమస్యలు వస్తే త్వరగా పరిష్కారం లభిస్తుందా? వంటి విషయాలను ముందుగానే తెలుసుకోవాలి. మంచి సర్వీస్ నెట్‌వర్క్ ఉన్న బ్రాండ్‌ను ఎంచుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తగ్గుతాయి.

ఎక్స్-షోరూమ్ ధరే తుది ధర కాదు
చాలా మంది ప్రకటనల్లో కనిపించే ఎక్స్-షోరూమ్ ధరను చూసి బడ్జెట్ నిర్ణయించుకుంటారు. కానీ వాస్తవానికి రిజిస్ట్రేషన్, బీమా, హ్యాండ్లింగ్ ఛార్జీలు, యాక్సెసరీలు, పొడిగించిన వారంటీ వంటి ఖర్చులు అదనంగా చేరుతాయి. దీంతో చివరకు చెల్లించాల్సిన మొత్తం ధర గణనీయంగా పెరగవచ్చు. అందువల్ల కొనుగోలు చేసే ముందు “ఆన్-రోడ్ ధర” ఎంత అవుతుందో డీలర్ వద్ద పూర్తిగా తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు అనేది కేవలం వాహనం కొనడం మాత్రమే కాదు, దీర్ఘకాలిక పెట్టుబడి కూడా. మీ ప్రయాణ అవసరాలు, బ్యాటరీ నాణ్యత, ఛార్జింగ్ సౌకర్యం, సర్వీస్ మద్దతు, వాస్తవ ఖర్చు వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తే సరైన స్కూటర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. కొంత సమయం కేటాయించి పరిశోధన చేయడం వల్ల భవిష్యత్తులో డబ్బు, సమయం రెండూ ఆదా అవుతాయి.

ఆ దర్శకులకు స్టార్ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ ఎందుకు రాలేదంటే..?

Telugu Directors
Telugu Directors

Telugu directors and star heroes: కొంతమంది దర్శకులు చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగినా కూడా వాళ్లకు స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలైతే రావు. ముఖ్యంగా కొంతమంది హీరోలు కావాలనే వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా పక్కన పెడుతున్నారనే కామెంట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి హీరోలు అలాంటి వైఖరిని పాటించడానికి గల కారణం ఏంటంటే…ఆయా దర్శకులు స్టార్ హీరోలు ఇమేజ్ ను హ్యాండిల్ చేయలేరని భావిస్తున్నారట. దానికి ఈ దర్శకులు మాత్రం అవకాశం ఇస్తే కదా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకునేది అంటూ దర్శకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక టాలెంట్ ఉంది కూడా స్టార్ డైరెక్టర్ల తో సినిమాలు చేయలేని దర్శకులలో శేఖర్ కమ్ముల మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన మొదటి నుంచి కూడా స్టార్ హీరోలతోనే సినిమాలు చేయడానికి ప్రయత్నం చేసిన కూడా ఆయన తీసే సినిమాలు చాలా క్లాస్ గా ఉంటాయి.

కాబట్టి వాటికి స్టార్ హీరోల ఇమేజ్ అడ్డం వస్తుంది. ఆ సినిమాలను తమ అభిమానులు చూడలేరనే ఉద్దేశ్యంతో స్టార్ హీరోలు ఎప్పటికప్పుడు ఆయనకి హ్యాండ్ ఇస్తు పక్కకు తప్పుకుంటున్నారు. శేఖర్ కమ్ముల మాత్రం టైర్ వన్ హీరోలు అవకాశం ఇస్తేవాళ్ల ఇమేజ్ ను మార్చే విధంగా తను కథ చేసి ప్రేక్షకులను మెప్పిస్తాననే ఒక కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు.

కానీ ఏ స్టార్ హీరో కూడా తనని పెద్దగా నమ్మడం లేదు… దేవకట్ట లాంటి దర్శకుడు సైతం స్టార్ హీరోలతో సినిమా చేయడానికి ఆద్యంతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. కానీ అతనికి అవకాశం ఇచ్చే హీరోలైతే కరువయ్యారు. ముఖ్యంగా దేవకట్ట చాలా మంచి రైటర్ ఆయన కథ బాగా రాసుకుంటాడు. దాని నుంచి సినిమాని ఎలా ప్రజెంట్ చేయాలి. ప్రేక్షకుడికి నచ్చే విధంగా సినిమాని ఎలా తీర్చిదిద్దాలి అనేది తనకు చాలా బాగా తెలుసు…

కానీ స్టార్ హీరో ఇమేజ్ చట్రం లో ఇరుక్కుపోయి ఉండడం వల్ల ఆయన సినిమాలో నటిస్తే ప్రేక్షకులకు హై ఎలివేషన్స్ ఉండవేమో కమర్షియల్ గా సినిమా ప్రేక్షకుడిని మెప్పించదేమో అనే ఉద్దేశ్యంతో అతనికి సినిమాలు ఇవ్వడానికి చాలామంది భయపడుతున్నారు. ఈ స్టార్ డైరెక్టర్లు ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాల పైనే అవుతున్నప్పటికి ఒక స్టార్ హీరోతో కూడా సినిమా చేయలేదు…

రాజమౌళి, ప్రశాంత్ నీల్ ఇద్దరు ఎలివేషన్ సీన్స్ రాసేటప్పుడు ఏం చేస్తారో తెలుసా..?

Rajamouli and Prashanth Neel
Rajamouli and Prashanth Neel

Rajamouli and Prashanth Neel: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కని విని ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధించిన దర్శకులు చాలామంది ఉన్నారు. నిజానికి పాన్ ఇండియాలో ఎంత మంది దర్శకులు ఉన్నప్పటికి రాజమౌళి, ప్రశాంత్ నీల్ లకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్ అనే చెప్పాలి… ఈ దర్శకులు భారీ సినిమాలను చేస్తు ప్రేక్షకుల మెప్పు పొందుతూ వాళ్లకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా వాళ్ళ సినిమాలో ఎలివేషన్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఇక వాటిని రాయడానికి వాళ్ళు చాలా వరకు శ్రమిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా వాళ్లకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడానికి డిఫరెంట్ ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు వీళ్ళిద్దరు తెరకెక్కించిన సినిమాలు కమర్షియల్ గా సూపర్ సక్సెస్ లను సాధించాయి.

రాజమౌళి ఇప్పటివరకు 12 సినిమాలు చేస్తే అందులో 12 కూడా సూపర్ సక్సెస్ ని సాధించాయి. ఇక ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకు 4 సినిమాలు చేయగా ఆ నాలుగు సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలవడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… వీళ్లిద్దరి సినిమాలో ఎలివేషన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎలివేషన్స్ రాసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీని ఫాలో అవుతూ రాస్తుంటారట.

ప్రశాంత్ నీల్ తను నైట్ టైం లో మందు తాగుతూ ఎలివేషన్ రాసుకుంటాడట. ఇక రాజమౌళి అయితే కథ రచయిత రాసిన సీన్స్ ను ఎమోషనల్ గా కనెక్ట్ చేసి అందులో ఎలివేషన్ సన్నివేశాలను సినిమా కథ కి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే లో అమర్చుతాడట.

అక్కడ ఎలాంటి ఎమోషన్ ని వాడితే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది అనే విషయాలను ఆలోచించి రాస్తాడట. రాజమౌళి ఎర్లీ మార్నింగ్ టైమ్ లో మొక్కలకు నీళ్లు పడుతూ ప్రశాంతంగా ఉన్న టైమ్ లో రాసుకుంటారట. ఇక మొత్తానికైతే వీళ్ళిద్దరి సినిమాలు సూపర్ సక్సెస్ ని సాధిస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

శరీరంలో ప్రొటీన్ తక్కువగా ఉందని ఎలా తెలుస్తుంది..

Signs of Protein deficiency in Body
Signs of Protein deficiency in Body

Signs of Protein deficiency in Body: శరీరానికి అవసరమైన పోషకాల్లో ప్రోటీన్ కీలకమైనది. మన శరీర కణజాల నిర్మాణం, కండరాల బలం, రోగనిరోధక వ్యవస్థ పనితీరు అంతా ప్రోటీన్లపైనే ఆధారపడి ఉంటుంది. అయితే, ఆధునిక జీవనశైలిలో సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల అనేక మంది ప్రోటీన్ లోపం సమస్యను ఎదుర్కొంటున్నారు. కొంత మంది వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరంలో ప్రోటీన్ స్థాయిలు పడిపోయినప్పుడు మన శరీరం కొన్ని హెచ్చరికలను జారీ చేస్తుంది. వీటిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం. మరి ప్రొటీన్ తక్కువైనప్పుడు ఎలాంటి హెచ్చరికలు వస్తాయి?

సాధారణంగా జుట్టు రాలడం , చర్మం పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తే అది ప్రోటీన్ లోపానికి సంకేతం కావచ్చు. మన శరీరానికి అవసరమైనంత మోతాదులో ప్రోటీన్ అందనప్పుడు, అందుబాటులో ఉన్న కొద్దిపాటి ప్రోటీన్‌ను గుండె, మెదడు వంటి అత్యవసర అవయవాలు తమ పనితీరు కోసం వాడుకుంటాయి. దీనివల్ల చర్మం, జుట్టు, గోళ్ల వంటి తక్కువ ప్రాధాన్యత కలిగిన కణజాలాలకు పోషకాలు అందక అవి బలహీనపడతాయి. ఫలితంగా జుట్టు రాలడం, చర్మం జీవం కోల్పోయి పొడిబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ప్రోటీన్ లోపం ఉన్నవారిలో కడుపు నిండినట్లు అనిపించకపోవడం మరొక ప్రధాన సమస్య. సాధారణంగా ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. కానీ, డైట్‌లో ప్రోటీన్ లోపించినప్పుడు ఆ సంతృప్తి కలగదు. దీనివల్ల శరీరం తక్షణ శక్తి కోసం షుగర్స్ మరియు కార్బోహైడ్రేట్లపై ఆధారపడుతుంది. ఫలితంగా తరచుగా తీపి పదార్థాలు లేదా జంక్ ఫుడ్ తినాలనే కోరిక పెరిగి, బరువు పెరగడానికి లేదా జీవక్రియలో అసమతుల్యతకు దారితీస్తుంది.

శరీరం తరచూ ఇన్ఫెక్షన్లకు గురికావడం, జ్వరం రావడం కూడా ప్రోటీన్ లోపానికి నిదర్శనం. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు ప్రోటీన్లతోనే తయారవుతాయి. తగినంత ప్రోటీన్ లేకపోతే, శరీరం వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని కోల్పోతుంది. దీనివల్ల చిన్నపాటి వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా త్వరగా సోకడం, కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టడం జరుగుతుంది. కాబట్టి, పప్పు ధాన్యాలు, గుడ్లు, పాలు, మాంసం వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.

మన గ్యాస్‌ కష్టాలు తీరినట్లే.. అండమాన్‌లో అద్భుతం!

Andaman gas discovery
Andaman gas discovery

Andaman gas discovery: పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తగా చమురు సంక్షోభం నెలకొంది. హర్మూజ్‌ను మూసివేయంతో గల్ఫ్‌ దేశాల నుంచి రమురు, సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, చైనా వంటి దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. చమురు, గ్యాస్‌ ధరలు భారీగా పెంచాయి. ఈ పరిస్థితిలో తాజాగా భారతీయుల గ్యాస్‌ కష్టాలు తీరే ఒక వార్త ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌(ఓఐఎల్‌) మరోసారి సంచలనం సృష్టించింది. అండమాన్‌ దీవుల తూర్పు తీరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో, 355 మీటర్ల లోతట్టు సముద్ర జలాల్లో విజయపురం–3 అన్వేషణ బావిలో సహజ వాయువు ఉనికిని గుర్తించింది.

ఓఐఎల్‌ రెండో విజయం..
ఇది ఓఐఎల్‌ సంస్థ ఆండమాన్‌ బ్లాక్‌లో సాధించిన రెండో విజయం. గత సెప్టెంబర్‌ 2025లో విజయపురం–2 బావిలో కనుగొన్న మొదటి ఆవిష్కరణతోపాటు, ఇప్పుడు రెండో బావిలో కూడా గ్యాస్‌ ఉనికి తెలియడంతో అండమాన్‌–నికోబార్‌ బేసిన్‌ హైడ్రోకార్బన్‌ సంభావ్యత గురించి ఆశలు భారీగా పెరిగాయి.కేంద్ర పెట్రోలియం మంత్రి హరదీప్‌ సింగ్‌ పురి దీనిని ఇంధన అవకాశాల సముద్రం అని అభివర్ణించారు. ఇది దేశం ఇంధన భద్రత, ఆర్థిక స్వావలంబన, ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాలకు ఒక ముఖ్యమైన మైలురాయి.

అండమాన్‌ బేసిన్‌లో అన్వేషణ..
ఈ బ్లాక్‌ 2019లో ఆయిల్‌ ఇండియాకు కేటాయించబడింది. సంస్థ మూడు బావుల అన్వేషణ క్యాంపెయిన్‌ను చేపట్టింది. విజయపురం–2లో 87 శాతం మీథేన్‌ కంటెంట్‌తో గ్యాస్‌ లభించగా, ఇప్పుడు విజయపురం–3లో కూడా గ్యాస్‌ ఫ్లో నిర్ధారణ అయింది. గ్యాస్‌ నమూనాల విశ్లేషణ, అప్‌ప్రైజల్‌ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. అండమాన్‌ బేసిన్‌ ఇప్పటి వరకు తక్కువ అన్వేషణ జరిగిన ఫ్రంటియర్‌ బేసిన్‌గా పరిగణించబడేది. మయన్మార్, ఇండోనేషియా వంటి పొరుగు దేశాల్లోని ఉత్పాదక బేసిన్లతో భూగర్భ నిర్మాణ సారూప్యతలు ఉన్నాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది భారత్‌కు కొత్త ఆశలు కల్పిస్తోంది.

ఇంధన భద్రతకు కీలకం..
భారత్‌ ప్రస్తుతం తన సహజ వాయువు అవసరాలలో గణనీయమైన భాగాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఆర్థిక వృద్ధి, పారిశ్రామిక అవసరాలు, నగరీకరణతో గ్యాస్‌ డిమాండ్‌ సంవత్సరానికి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక నిక్షేపాలు పెరగడం వల్ల విదేశీ మారక నిల్వలు ఆదా అవుతాయి, ఇంధన ఖర్చులు తగ్గుతాయి, జాతీయ భద్రత బలపడుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ 2025లో ప్రారంభించిన ‘సముద్ర మంథన్‌’ మిషన్‌కు ఈ ఆవిష్కరణలు ప్రత్యక్ష మద్దతు అందిస్తాయి. లోతట్టు సముద్ర అన్వేషణను ప్రోత్సహించడం ద్వారా దేశం ఇంధన దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవాలన్నది ప్రభుత్వ వ్యూహం.

ఇంకా ఆవిష్కణ దశలోనే..
అయితే ఉత్సాహంతో పాటు వాస్తవికతను కూడా గుర్తించాలి. ఇవి ఇంకా ఆవిష్కరణ దశలోనే ఉన్నాయి. వాణిజ్య సాధ్యత, నిక్షేపాల పరిమాణం, ఉత్పత్తి వ్యయాలు ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారణ కాలేదు. లోతట్టు సముద్ర ప్రాంతంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి చాలా ఖరీదైనది, సవాల్‌తో కూడుకున్నది. పర్యావరణ సున్నిత ప్రాంతం కావడంతో పర్యావరణ రక్షణ, స్థానికుల హక్కులు, సముద్ర జీవ వైవిధ్యం కాపాడటం వంటి అంశాలు కూడా కీలకమవుతాయి.

అండమాన్‌ సముద్రంలో ఆయిల్‌ ఇండియా సాధించిన వరుస విజయాలు భారత్‌ ఇంధన రంగ చరిత్రలో ముఖ్యమైన మలుపు. ఇంధన దిగుమతి నుంచి విముక్తి పొందడానికి, ఆర్థిక బలం పెంచుకోవడానికి, వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాకారం చేయడానికి ఒక బలమైన ఆధారం. సరైన దిశలో అడుగులు వేస్తే, అండమాన్‌ భారత్‌ యొక్క కొత్త ఇంధన హబ్‌గా ఎదగడం ఖాయం.

ఈ ఫోన్ ధర తక్కువ.. కానీ ప్రీమియం ఫీచర్లు.. తెలిస్తే వెంటనే కొంటారు..

Xiaomi 17T Price In India
Xiaomi 17T Price In India

Xiaomi 17T Price In India: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రీమియం ఫీచర్లు కలిగిన మొబైల్స్ కు ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. లగ్జరీ లైఫ్ ను మెయింటేన్ చేసేవారు ఇలాంటి ఫీచర్లు కలిగిన ఫోన్ ను ఇష్టపడుతుంటారు. అయితే ఇప్పుడు ఈ ఫీచర్లు తక్కువ ధర కలిగిన మొబైల్స్ లో కూడా ఉంటున్నాయి. Xiaomi కంపెనీ నుంచి Xiaomi 17T అనే మొబైల్ గురించి ఇప్పుడు టెక్ ప్రపంచంలో ప్రత్యేక చర్చకు దారి తీసింది. ఇందులో ఖరీదైన ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో కనిపించే అనేక ఫీచర్లను ఈ మధ్యస్థ ధరలో అందిస్తోంది. ముఖ్యంగా Leica కెమెరా భాగస్వామ్యంతో వచ్చిన ఇమేజింగ్ సామర్థ్యాలు ఈ ఫోన్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

డిస్ ప్లే:
Xiaomi 17T డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. సన్నని బెజెల్స్, ఫ్లాట్ ఫ్రేమ్, స్లిమ్ బాడీతో ఇది ప్రీమియం ఫోన్‌లా కనిపిస్తుంది. చేతిలో పట్టుకున్నప్పుడు తేలికగా, సౌకర్యంగా అనిపించేలా కంపెనీ రూపొందించింది. గ్లాస్ ఫినిష్, నాణ్యమైన నిర్మాణంతో ఈ ఫోన్ ధర కంటే ఎక్కువ విలువ కలిగిన డివైస్‌గా అనిపిస్తుంది. ఈ ఫోన్‌లో హై-రిఫ్రెష్ రేట్ AMOLED డిస్‌ప్లేను అందించారు. వీడియోలు చూడటం, గేమింగ్ ఆడటం, సోషల్ మీడియా బ్రౌజింగ్ చేయడం వంటి పనుల్లో స్మూత్ అనుభవాన్ని అందిస్తుంది. ప్రకాశవంతమైన రంగులు, లోతైన బ్లాక్ లెవెల్స్, మెరుగైన కాంట్రాస్ట్‌తో కంటెంట్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సూర్యరశ్మిలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా అధిక బ్రైట్‌నెస్‌ను అందించారు.

Leica కెమెరా మ్యాజిక్
Xiaomi 17Tలో ప్రధాన ఆకర్షణ Leica ట్యూన్ చేసిన కెమెరా వ్యవస్థ. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కెమెరా సహజమైన రంగులు, అద్భుతమైన డైనమిక్ రేంజ్, మెరుగైన డీటెయిల్స్‌ను అందిస్తుంది. పగలు మాత్రమే కాకుండా తక్కువ వెలుతురులో కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. Leica Vibrant, Leica Authentic వంటి ప్రత్యేక మోడ్‌లు ఫోటోలకు ప్రొఫెషనల్ టచ్‌ను జోడిస్తాయి. పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీలో కూడా ఈ ఫోన్ ఆకట్టుకునే పనితీరును కనబరుస్తుంది.

ఆధునిక ప్రాసెసర్:
Xiaomi 17Tలో ఆధునిక ప్రాసెసర్‌ను అమర్చారు. మల్టీటాస్కింగ్, హై-ఎండ్ గేమింగ్, వీడియో ఎడిటింగ్ వంటి పనులను సులభంగా నిర్వహించగలదు. అధిక RAM, వేగవంతమైన స్టోరేజ్ టెక్నాలజీ కారణంగా యాప్‌లు వేగంగా ఓపెన్ అవుతాయి. రోజువారీ వినియోగంలో ఎలాంటి ల్యాగ్ లేకుండా స్మూత్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఫోన్‌లో భారీ బ్యాటరీని అందించారు. సాధారణ వినియోగంలో ఒక రోజు కంటే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే సామర్థ్యం ఉంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వల్ల కేవలం కొద్ది నిమిషాల ఛార్జింగ్‌తో గంటల తరబడి ఉపయోగించవచ్చు. తరచూ ప్రయాణాలు చేసే వారికి ఇది పెద్ద ప్లస్ పాయింట్‌గా మారుతుంది.

సాఫ్ట్‌వేర్, AI ఫీచర్లు
Xiaomi 17T తాజా HyperOS ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో AI ఆధారిత ఫీచర్లు, మెరుగైన యూజర్ ఇంటర్‌ఫేస్, స్మార్ట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్, మెరుగైన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. యూజర్ అనుభవాన్ని మరింత సులభతరం చేసే అనేక స్మార్ట్ టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్ ధర 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ను రూ. 59,999 నుంచి విక్రయిస్తున్నారు.

వరుసగా 3 రోజులు నిద్ర లేకపోతే జరిగేది ఇదే..

Sleep Deprivation
Sleep Deprivation

Sleep Deprivation Effects: మనిషి ఆరోగ్యానికి ఆహారం, నీరు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. శరీరానికి విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా మెదడు పనితీరును సక్రమంగా ఉంచడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఆధునిక జీవనశైలి, ఉద్యోగ ఒత్తిళ్లు, మొబైల్ ఫోన్ల అధిక వినియోగం వంటి కారణాలతో చాలామంది సరిపడా నిద్రపోవడం లేదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం ఒక రాత్రి నిద్ర లేకపోవడమే శరీరంపై ప్రభావం చూపుతుంది. అదే వరుసగా మూడు రోజుల పాటు నిద్ర లేకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఆ సమస్యలు ఏంటంటే?

24 గంటలు నిద్ర లేకపోతే…
ఒక్కరోజు నిద్ర లేకుండా గడిపితే ముందుగా మెదడు పనితీరు మందగించడం ప్రారంభమవుతుంది. కళ్లలో మంట, ఎర్రబడటం, తలనొప్పి, అలసట, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఏకాగ్రత తగ్గిపోవడంతో పనుల్లో పొరపాట్లు జరిగే అవకాశం పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయులు పెరుగుతాయి. దీనివల్ల మానసిక ఆందోళన కూడా అధికమవుతుంది.

48 గంటలు నిద్ర లేకపోతే…
రెండు రోజుల పాటు నిద్ర లేకపోతే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, చేతులు వణకడం, శరీరంలో బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెదడు స్పందించే వేగం తగ్గిపోవడంతో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం దెబ్బతింటుంది. కొందరిలో జ్ఞాపకశక్తి తాత్కాలికంగా తగ్గడం, మాట్లాడేటప్పుడు తడబడటం వంటి సమస్యలు కూడా కనిపించవచ్చు. ఈ దశలో శరీరం తీవ్ర అలసటకు గురై శక్తిని కోల్పోతుంది.

72 గంటలు నిద్ర లేకపోతే…
మూడు రోజుల పాటు నిద్ర లేకుండా ఉంటే శరీరం అత్యంత ప్రమాదకర స్థితిలోకి చేరుతుంది. తీవ్రమైన నీరసం, మానసిక గందరగోళం, దృష్టి లోపాలు ఏర్పడవచ్చు. కొందరిలో లేనివి కనిపించడం లేదా వినిపించడం వంటి భ్రాంతులు కూడా కలగొచ్చు. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటంతో ఇన్‌ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. ఈ సమయంలో గుండెపై అధిక ఒత్తిడి పడటంతో గుండె సంబంధిత సమస్యల ముప్పు కూడా పెరుగుతుంది.

దీర్ఘకాలిక ప్రభావాలు కూడా తీవ్రంగానే…
నిద్రలేమి తరచూ కొనసాగితే అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిద్ర సరిగా లేకపోవడం వల్ల ఆకలిని నియంత్రించే హార్మోన్లలో మార్పులు వచ్చి అధికంగా తినే అలవాటు ఏర్పడుతుంది. దీంతో బరువు పెరగడం సులభమవుతుంది. అలాగే మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది.

రోజుకు ఎంత నిద్ర అవసరం?
ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం పెద్దలు రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర తీసుకోవాలి. పిల్లలు, యువతకు ఇంకా ఎక్కువ నిద్ర అవసరం ఉంటుంది. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, మొబైల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించడం, కాఫీన్ పానీయాలను పరిమితం చేయడం ద్వారా నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చు.

లింక్ 3.. భారత్ ఎక్కుపెట్టిన అస్త్రం.. పాకిస్తాన్ అడుక్కు తినడమే

India Pakistan Water Dispute
India Pakistan Water Dispute

India Pakistan Water Dispute: పోనీలే పాపం అని మనం వదిలిన నీళ్లను పాకిస్తాన్ ఇన్ని సంవత్సరాల పాటు వాడుకుంది. వ్యవసాయం చేసింది. పంటలు పండించుకుంది. కానీ, తిన్నింటి వాసాలు లెక్కపెట్టే పాకిస్తాన్ పాలకులు.. మన మీద ద్రోహానికి పాల్పడ్డారు. ఉగ్రదాడులకు పాల్పడ్డారు. ఫలితంగా మన దేశం తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ విషయంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా నీళ్ల విషయంలో కఠిన చర్యలు తీసుకుంది.

పాకిస్తాన్ దేశానికి సింధు నది.. దాని ఉపనదుల ద్వారా నీరు వెళ్తూ ఉంటుంది. అయితే భారత భూభాగంలో ప్రవహించే ఈ నీటికి మన దేశ పాలకులు అడ్డుకట్ట వేస్తున్నారు. ఇప్పటివరకు ఈ నీళ్లను పాకిస్తాన్ దర్జాగా వాడుకుంది. వ్యవసాయం కూడా చేసింది. అయితే ఈ నీళ్లను ఇప్పుడు భారత్ వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్నట్టుగా ప్రాజెక్టులు నిర్మిస్తోంది.. ఈ క్రమంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ లోని కొక్సర్ ప్రాంతంలో 19 అడుగుల పొడవుతో ఒక డ్యామ్ నిర్మించింది. ఈ నీటిని 8.7 km పొడవు ఉన్న టన్నెల్ ద్వారా బియాస్ నదిలోకి పంపిస్తోంది.. దీని ద్వారా మనదేశంలో ఉన్న పంట పొలాలకు సాగునీరు అందుతూ ఉంటుంది.

ఈ ప్రాజెక్టు చాలా చిన్నది. భవిష్యత్తులో మన భూభాగం నుంచి పాకిస్తాన్ దేశానికి వెళ్లే నీటిని మొత్తం భారత్ అడ్డుకుంటుంది. ఇప్పటికే పాకిస్తాన్ దేశంలో సాగునీరు సరిగ్గా అందక పంటలు పడడం లేదు.. దీంతో అక్కడి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.. దీని అంతటికి ప్రధాన కారణం భారత్ సాగునీటికి అడ్డుకట్ట వేయడమే. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దేశానికి నీరు ఎలా ఇస్తామంటూ భారత్ ప్రశ్నిస్తోంది.

సింధు నది ప్రవాహాన్ని లెక్కల ఆధారంగానే వాడుకుంటామని పాకిస్తాన్ దేశానికి స్పష్టం చేసింది. చినాబు నది ప్రవాహం విషయంలో కూడా భారత్ కూడా ఇలానే వ్యవహరించింది. ఈ రెండు నదులు పాకిస్తాన్ దేశంలో వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైనవి.. ఈ ప్రవాహాలను అడ్డుకోవడం వల్ల పాకిస్తాన్ ఇప్పటికే దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఇది ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి.

మొదటిసారి EV కొనేవారికి సూపర్ కారు ఇదే.. ఎందుకంటే..

Tata Tiago EV 2026
Tata Tiago EV 2026

Tata Tiago EV 2026: భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం Tata Motors తన అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు Tata Tiago EV కొత్త ‘స్మార్ట్’ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) పథకం కింద ఈ కారు ప్రారంభ ధర రూ.4.69 లక్షల (ఎక్స్‌షోరూమ్) నుంచి అందుబాటులోకి వచ్చింది. దీంతో దేశంలో అత్యంత అందుబాటు ధరలో లభించే ఎలక్ట్రిక్ కార్లలో ఇది ఒకటిగా నిలిచింది. ఈ కారు గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ కార్లు కొనేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో కొన్ని కంపెనీలు తక్కువ ధరకే విద్యుత్ కార్లను అందించాలని అనుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో టాటా మోటార్స్ నుంచి టియాగో ఫేస్ లిప్ట్ ఈవీని తీసుకొచ్చారు. ఈ కొత్త టియాగో EV స్మార్ట్ వేరియంట్‌లో భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఎంట్రీ-లెవల్ వేరియంట్ అయినప్పటికీ ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లను ఉంచడంతో స్టాండర్డ్‌గా అందిస్తోంది. సాధారణంగా ఈ ఫీచర్ అధిక ధర కలిగిన కార్లలో మాత్రమే కనిపిస్తుంది. దీంతో తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి ఇది ఆకర్షణీయమైన ఎంపికగా మారింది.

టియాగో EV స్మార్ట్ వేరియంట్‌లో 19.2 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఈ బ్యాటరీతో పనిచేసే ఎలక్ట్రిక్ మోటార్ 60 bhp శక్తి, 110 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 226 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ ప్రకటించింది. రోజువారీ నగర ప్రయాణాలకు ఈ రేంజ్ సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

2026 టియాగో EVకు టాటా కొత్త రూపాన్ని ఇచ్చింది. కొత్త ఫ్రంట్ బంపర్, బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్, LED హెడ్‌ల్యాంప్స్, LED టెయిల్‌ల్యాంప్స్, కొత్త వీల్ డిజైన్‌తో మరింత ఆధునికంగా కనిపిస్తోంది. బయట నుంచి చూస్తే ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లా అనిపించేలా డిజైన్ చేశారు. క్యాబిన్‌లో కూడా గణనీయమైన మార్పులు చేశారు. కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, రీడిజైన్ చేసిన డ్యాష్‌బోర్డ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. హయ్యర్ వేరియంట్లలో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా వంటి అదనపు సదుపాయాలు కూడా లభిస్తాయి.

ఈ కారు తక్కువ ధరలో లభించడానికి ప్రధాన కారణం బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) విధానం. ఇందులో కారు ధర నుంచి బ్యాటరీ ఖర్చును వేరు చేస్తారు. కస్టమర్ కారు కోసం తక్కువ మొత్తాన్ని చెల్లించి, బ్యాటరీ వినియోగానికి ప్రత్యేకంగా చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి బ్యాటరీతో కొనుగోలు చేయాలనుకునేవారికి టియాగో EV స్మార్ట్ ధర రూ.6.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

రోజూ నగరంలో ప్రయాణించే ఉద్యోగులు, మొదటిసారి ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునేవారు, తక్కువ బడ్జెట్‌లో సురక్షితమైన EV కోరుకునే కుటుంబాలకు టాటా టియాగో EV స్మార్ట్ మంచి ఎంపికగా భావిస్తున్నారు. తక్కువ ప్రారంభ ధర, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, సరిపడే రేంజ్, ఆధునిక ఫీచర్ల కలయికతో ఈ కారు భారత EV మార్కెట్లో కొత్త పోటీకి తెరలేపనుంది.

భారతీయుల సంబురాలు.. కెనడియన్ల ఆక్రోశం!

Toronto Indian Celebrations
Toronto Indian Celebrations

Toronto Indian Celebrations: భారతీయులు ఎక్కువ ఆదాయం, ఉన్నతమైన ఉపాధి కోసం అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలకు వెళ్తుంటారు. మన నైపుణ్యాలతో ఆయా దేశాల ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో వైద్యులు, శాస్త్రవేత్తలు, ఐటీ నిపుణులు ఇలా అన్నిరంగాలవారు ఉన్నారు. అయితే ఇటీవల అమెరికా విదేశీయుల రాకపై ఆంక్షలు విధించింది. దీంతో భారతీయులు కెనడాకు ఎక్కువగా వెళ్తున్నాయి. ఇప్పటికే కెనడాలో భారతీయులు ఎక్కువగా స్థిరపడ్డారు. తాజాగా అక్కడి భారతీయులు చేసుకున్న సంబురాలు.. కెనడీయులకు కోపం తెప్పించాయి. టొరంటో వీధుల్లో భారతీయులు మ్యూజిక్, డాన్స్‌తో అదరగొట్టిన ఒక సాంస్కృతిక ఉత్సవ వీడియో వైరల్‌ కావడంతో కెనడా సోషల్‌ మీడియా మండిపోయింది. ‘‘కెనడా ఇప్పుడు ఇండియన్‌ కాలనీ అయిపోయింది’’, ‘‘టొరంటోలో కెనడియన్లు మైనారిటీ అయిపోయారు’’, ‘‘మా దేశాన్ని ఆక్రమిస్తున్నారు’’ అని తీవ్రమైన కామెంట్లు వస్తున్నాయి.

డెమోగ్రాఫిక్‌ మార్పు..
గ్రేటర్‌ టొరంటో ఏరియాలో సౌత్‌ ఆసియన్లు ఎక్కువ. ఇందులో భారతీయులు 19 శాతం ఉంటారు. టొరంటో నగరం చుట్టుపక్కల బ్రాంప్టన్, మిసిసాగా వంటి ప్రాంతాల్లో స్థిరపడ్డారు. 2013 నుంచి 2023 మధ్య కెనడాకు భారతీయ ఇమ్మిగ్రేషన్‌ నాలుగు రెట్లు పెరిగింది. అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులు ఎక్కువ శాతం ఉండటంతో, గత కొన్ని సంవత్సరాల్లో టొరంటోలో భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ వేగవంతమైన మార్పు కెనడా సమాజంలో ఒక విభాగానికి అసౌకర్యం కలిగించింది. హౌసింగ్‌ క్రై సిస్, అద్దెల పెరుగుదల, ట్రాఫిక్, ఉద్యోగాలపై పోటీ ఇవన్నీ ఇమ్మిగ్రేషన్‌తో ముడిపడి చూడడం మొదలైంది. అధికారిక అధ్యయనాల ప్రకారం, ఇటీవలి ఇమ్మిగ్రేషన్‌ హౌసింగ్‌ ధరలు భారీగా పెరిగాయి. స్థానికులకు ఆదాయం పెరిగింది.

సాంస్కృతిక ఉత్సవాలు..
భారతీయులు తమ సంస్కృతి, పండగలు, సంగీతం-నృత్యాలను ఉత్సాహంగా జరుపుకోవడం సహజం. కానీ రోడ్డు జంక్షన్‌లను ఆక్రమించి, ట్రాఫిక్‌ను అడ్డుకుని, శబ్దం చేసి జరిపే సెలబ్రేషన్స్‌ స్థానికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఒకటి రెండు కాదు ఇటీవలి కాలంలో పలుమార్లు ఇలాంటి వీడియోలు వైరల్‌ అయ్యాయి. అయితే కొత్త దేశంలో స్థానిక నియమాలు, చట్టాలు, సామాజిక సౌకర్యాన్ని గౌరవించాలి. కానీ మన ఉత్సవాలతో అక్కడి వారికి అసౌకర్యం కలిగించడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. దీంతో కెనడా ప్రభుత్వం 2025-2027 ఇమ్మిగ్రేషన్‌ లెవెల్స్‌ ప్లాన్‌లో స్పష్టమైన మార్పులు చేసింది. స్థిర నివాసుల లక్ష్యాలను తగ్గించడంతోపాటు, అంతర్జాతీయ విద్యార్థులు, టెంపరరీ ఫారిన్‌ వర్కర్ల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. 2026లో కొత్త స్టడీ పర్మిట్లు గణనీయంగా తగ్గాయి.

కెనడా చరిత్రే వలసదారుల చరిత్ర..
ఇంగ్లిష్, ఫ్రెంచ్‌ నుంచి ఆసియా దేశాల వరకు వచ్చినవారే కెనడా దేశాన్ని నిర్మించారు. భారతీయులు ఐటీ, హెల్త్‌కేర్, ఇంజనీరింగ్‌ రంగాల్లో ముఖ్యమైన సహకారం అందిస్తున్నారు. వైవిధ్యం కెనడా బలం. మరోవైపు, స్థానికుల ఆందోళనను కేవలం ‘‘రేసిజం’’ అని తోసిపుచ్చడం సరికాదు. ఏ దేశంలోనైనా వేగవంతమైన డెమోగ్రాఫిక్‌ మార్పులు సామాజిక ఉద్రిక్తతలను సృష్టిస్తాయి. పబ్లిక్‌ స్పేస్‌లను ఆక్రమించి, ట్రాఫిక్‌ను అడ్డుకుని, లిట్టర్‌ చేసి జరిపే సెలబ్రేషన్స్‌ స్థానికుల్లో ఆగ్రహాన్ని పెంచుతాయి.

ఈ వివాదం భారతీయ వలసదారులకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తోంది. ఉత్సాహం మంచిది, కానీ బాధ్యత కూడా అవసరం. కొత్త దేశంలో స్థానిక నియమాలను గౌరవించడం, పొరుగువారికి అసౌకర్యం కలిగించకుండా జరుపుకోవడం ముఖ్యం.

వైసీపీలో సీనియర్ల నోరు మూయించిన జగన్!

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వాతావరణం కొనసాగుతోంది. ఎవరి వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చిందో.. వారు ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు. పార్టీలో సీనియర్లు సైలెంట్ అవుతున్నారు. ఈ భిన్న వాతావరణంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. 2019 నుంచి 2024 మధ్య కొంతమంది నేతల వ్యవహార శైలితోనే పార్టీకి ఈ రకమైన ఇబ్బందులు వచ్చాయి. ప్రారంభంలో వారి మాటలు గొప్ప ఫ్యాషన్ గా అనిపించాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సైతం ఆకర్షించాయి. కానీ రాను రాను ఆ నేతల తీరుతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనస్థితికి చేరుకుందనేది పార్టీ క్యాడర్ కు తెలిసింది. పార్టీలో సీనియర్లు మౌనం వహించి.. దూకుడు కలిగిన నేతలు మాటలు పార్టీకి చేటు తెచ్చాయి అని ఆలస్యంగా తెలిసింది. అప్పటికే మూల్యం చెల్లించుకుంది పార్టీ. అయితే ఇప్పుడు క్యాడర్ తెలుస్తుంది కానీ.. నాయకత్వం తెలుసుకోకపోవడం పార్టీకి లోటు.

* ఫైర్ బ్రాండ్లుగా ముద్ర..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్లుగా గుర్తింపు సాధించారు కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్, పేర్ని నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, సిదిరి అప్పలరాజు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది జూనియర్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వారు. వారి మాటలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎంతో ఇష్టంగా ఉండేవి. అయితే వారి మాటలు తటస్థులతోపాటు విద్యాధికులపై విపరీతంగా ప్రభావం చూపించాయి. దాని ఫలితమే 2024 ఎన్నికల్లో దారుణ పరాజయం.

* పక్కన పెట్టినట్టే పెట్టి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేటు తెచ్చిన ఆ దూకుడు నేతలను జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టినట్లు కనిపించారు ప్రారంభంలో. గత అనుభవాల దృష్ట్యా సీనియర్ల సేవలను వినియోగించుకుంటానని జగన్ చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే సీనియర్లుగా ఉన్న ధర్మాన, బొత్స లాంటి నేతలు మాట్లాడడం ప్రారంభించారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చాయని అంతా భావించారు. కానీ ఆ సరదా ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. ఎవరైతే బూతులు మాట్లాడారో.. అడ్డగోలుగా వ్యవహరించారో.. అటువంటి నేతలు మళ్లీ తెరపైకి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వారికి ప్రాధాన్యమిస్తున్నట్టు కనిపిస్తున్నారు. దీంతో సీనియర్లుగా ఉన్న ధర్మాన లాంటి వారు మళ్లీ మౌనం పాటిస్తున్నారు. ఇలా అయితే కష్టమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిట్టూరుస్తున్నారు.

ఏపీలో మరో మూడు రోజులు జాగ్రత్తగా ఉండకపోతే కష్టమే!

AP Weather Forecast
AP Weather Forecast

AP Weather Forecast: ఏపీలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు తీవ్ర వేడిగాలులు వీస్తుండగా.. ఇంకోవైపు వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా.. అదే స్థాయిలో చిరుజల్లులు పలకరిస్తున్నాయి. మరో మూడు రోజులపాటు ఇదే విభిన్న పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే అప్పటివరకు తీవ్ర వేడి గాలులు వీచి.. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షాలు ప్రారంభం అయితే.. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. ఉరుములతో కూడిన వాన విషయంలో మాత్రం రైతులు, పశువుల పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

* ఈ జిల్లాల్లో వర్షాలు..
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది. పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్న దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా హెచ్చరికలు జారీచేసింది.

* భారీ ఉష్ణోగ్రతలు..
మరోవైపు ఈరోజు ఎండల తీవ్రత కూడా అధికంగా ఉండనుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 56 మండలాల్లో తీవ్రవడగాలులు, 51 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ప్రధానంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితి ఉంది. గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్రలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అందుకే అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. మరో మూడు రోజుల పాటు ఇలానే ఉంటుంది అని చెబుతోంది.

టిడిపి నేతలను అలా సర్దుబాటు చేయనున్న చంద్రబాబు!

Chandrababu Naidu Rajya Sabha Selectio
Chandrababu Naidu Rajya Sabha Selectio

Chandrababu: తెలుగుదేశం పార్టీలో చాలామంది నేతలు పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారు ఉన్నారు. పార్టీ కోసం ప్రచారం చేసిన వారు ఉన్నారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారు ఉన్నారు. అటువంటి వారికి ఎలా న్యాయం చేస్తారు అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే ఏ పదవులు ఇప్పుడు వస్తున్నా అందులో రెండు మిత్ర పక్షాలకు సర్దుబాటు చేయాల్సి వస్తోంది. తాజాగా ఓ నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీ అయితే.. అందులో మూడు తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఒక పదవిని జనసేన కు కేటాయించింది. గతంలో ఓ నాలుగు రాజ్యసభ పదవులు భర్తీ చేస్తే అందులో రెండు బిజెపికి విడిచిపెట్టింది. దీంతో టీడీపీలో పదవుల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ఇబ్బందికరంగా మారింది. అయితే ఇప్పుడు ఆశావహులు చూస్తే అధికంగా ఉన్నారు. వారిని ఎలా సర్దుబాటు చేస్తారు అనేది ఇప్పుడు ప్రశ్న. కానీ టిడిపి ఆలోచన వేరేలా ఉంది.

* చాలామంది ఆశావహులు..
ప్రస్తుతం శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు తీసుకుంటే సీట్లు త్యాగం చేసిన చాలా మంది నేతలు ఉన్నారు. వారు పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వంగవీటి రాధాకృష్ణ, బుద్దా వెంకన్న, దేవినేని ఉమామహేశ్వరరావు, పిఠాపురం వర్మ.. ఇలా చూసుకుంటూ పోతే చాలామంది నేతలకు పదవులు దక్కలేదు. రాజ్యసభ తో పాటు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవుల భర్తీ జరిగింది. కానీ వీరికి చోటు దక్కలేదు. దీంతో పదవుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. తాజాగా రాజ్యసభ పదవుల భర్తీతో.. ఛాన్స్ దొరకని వారు అసంతృప్తితో ఉన్నారు. అయితే అటువంటి వారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని టిడిపి అధినేత చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. వచ్చే ఏడాది దాదాపు 20కి పైగా ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి.

* వచ్చే ఏడాది భారీగా ఖాళీలు..
ప్రస్తుతం శాసనమండలిలో 30కి పైగా ఎమ్మెల్సీ పదవులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఎక్కువగా ఆ పార్టీకి ఉన్నారు. వచ్చే నెలలో జడ్పిటిసి, ఎంపీటీసీల పదవీకాలం కూడా ముగుస్తుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కూడా తమ పదవీ కాలాన్ని పూర్తిచేయనున్నారు వచ్చే ఏడాదికి. దాదాపు 20 కి పైగా ఎమ్మెల్సీ పదవులతోపాటు మండలి చైర్మన్ పోస్ట్ కూడా ఖాళీ కానుంది. ఇప్పుడు పదవుల కోసం ఎదురుచూస్తున్న నేతలకు వరుస పెట్టి అవకాశాలు కల్పించనున్నారు. ఇప్పటికే ప్రతి నేతకు ఈ విషయంలో సమాచారం ఉంది. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని.. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అవసరాలకు అనుగుణంగా 2029 ఎన్నికల్లో పోటీ చేయిస్తామని కూడా చంద్రబాబు వారికి హామీ ఇచ్చారట. ఎవర్ని ఎప్పుడు భర్తీ చేస్తారో కూడా సమాచారం ఇచ్చారట. అందుకే టిడిపి సీనియర్ నేతలు సైలెంట్ గా ఉన్నారట.

తెలంగాణలో టిడిపి.. చంద్రబాబుకు టచ్ లోకి ఆ నేతలు!

Telangana TDP
Telangana TDP

Telangana TDP: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలకం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి కారణం లేకపోలేదు. గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీని ఉద్దేశించి టిడిపి అక్కడ యాక్టివ్ అయ్యేందుకు అన్ని సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో పని చేసిన నేతలంతా ఇప్పుడు చంద్రబాబుకు టచ్ లోకి వస్తున్నట్లు సమాచారం. పార్టీని యాక్టివ్ చేస్తే చేరేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తమ ప్రతిపాదనను చంద్రబాబు ఎదుట పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలోనే తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టారట చంద్రబాబు. ప్రస్తుతం అక్కడ పార్టీకి నాయకత్వం లేదు కానీ.. క్యాడర్ ఇప్పటికీ కొనసాగుతోంది. టిడిపి అభిమానులు కూడా ఎక్కువే. గ్రేటర్ తో పాటు సెటిలర్స్ ఉన్న జిల్లాలు చాలా ఉన్నాయి. అటువంటి చోట్ల మాత్రం టిడిపి పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంటుంది.

* మోదీ టూర్ తో..
మొన్న తెలంగాణలో పర్యటనకు వచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. దాదాపు పదివేల కోట్ల రూపాయల నిర్మాణాలకు సంబంధించి హైదరాబాదులో శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. చంద్రబాబుతో అయితే గంటల తరబడి చర్చించారు. అయితే దీని వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఏపీలో ఎన్డీఏ కూటమి నడుస్తోంది మూడు పార్టీలతో. తెలంగాణలో సైతం మూడు పార్టీలు ఏకతాటి పైకి వస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ఉంది. అయితే గతంలో మాదిరిగా ప్రత్యేక రాష్ట్ర భావన లేదు. ఇప్పుడు అంతా అభివృద్ధి అజెండాగా సాగుతోంది తెలంగాణ రాజకీయం. తెలుగుదేశం పార్టీని యాక్టివ్ చేసేందుకు ఇదే సరైన సమయం అని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర పెద్దల ఆదేశాలతో గ్రేటర్ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య పొత్తు ఉండబోతుందనేది ఒక అంచనా.

* బలమైన కేడర్..
తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో బలమైన కేడర్ ఉంది. ఎందుకంటే ఆ పార్టీ పుట్టింది తెలంగాణలో. ఎన్టీఆర్ బలమైన పునాదులు ఏర్పాటు చేశారు. అవి తెలంగాణలో ఎక్కువగా నాటుకున్నాయి కూడా. మధ్యలో ప్రత్యేక రాష్ట్రం వాదంతో తెలుగుదేశం కాస్త ఇబ్బంది పడింది. ప్రతి దానికి చంద్రబాబు బూచి ని చూపించి రాజకీయం చేశారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి పుష్కరకాలం దాటుతున్న క్రమంలో క్రమేపి ప్రాంతీయ వాదం బలహీనపడుతోంది. అభివృద్ధి మంత్రం పతాక స్థాయికి చేరుకుంటుంది. అందుకే ఏపీ మాదిరిగా తెలంగాణలో సైతం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కలిసి నడుస్తాయన్న ప్రచారం జరుగుతోంది.

* టిడిపి నాయకులే అధికం..
తెలంగాణలో ప్రస్తుతం అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు ఎక్కువగా టిడిపి నుంచి వెళ్లిన వారి. గులాబీ పార్టీలో అయితే ఆ పార్టీ బాస్ కెసిఆర్ నుంచి దిగువ స్థాయి కేడర్ వరకు అంతా టిడిపి దే. కాంగ్రెస్ పార్టీలో కూడా మెజారిటీ నాయకత్వం టిడిపి నుంచి వెళ్ళింది. అయితే ఇప్పుడు గులాబీ పార్టీ పరిస్థితి బాగా లేకపోవడంతో.. ఆ పార్టీలో ఉన్న పూర్వపు టిడిపి నేతలు అంతా పూర్వాశ్రమం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారట. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని యాక్టివ్ చేస్తే చేరేందుకు సిద్ధమవుతున్నారట. ఇప్పటికే చంద్రబాబుకు చాలామంది టచ్లోకి వచ్చారట. సరైన సమయం చూసి చెబుతానని బాబు చెప్పారట. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో.

పిల్లల విషయంలో ప్రతీ తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి..

parenting tips
parenting tips

Parenting Tips: ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు తెలివిగా, ఆత్మవిశ్వాసంతో ఎదగాలని కోరుకుంటారు. అయితే పిల్లలను కేవలం చదువులోనే కాకుండా ఆలోచనల్లో, నిర్ణయాల్లో, సమస్యల పరిష్కారంలోనూ ముందుండేలా చేయడం చాలా ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చిన్నప్పటి నుంచే కొన్ని మంచి అలవాట్లు నేర్పితే పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచన పెరుగుతాయి. ఆ ఆలవాట్లు ఏంటో చూద్దాం..

వారితోనే సమాధానం చెప్పించాలి:
పిల్లలు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తితో ఎన్నో ప్రశ్నలు అడుగుతుంటారు. అప్పుడు వెంటనే జవాబు చెప్పేయకుండా, ‘నీకు ఏమనిపిస్తోంది?’ అని ఎదురుప్రశ్న వేయడం మంచిది. ఇలా చేయడం వల్ల వారు తమ ఆలోచనలను ఉపయోగించి సమాధానం వెతకడానికి ప్రయత్నిస్తారు. వారు చెప్పిన జవాబు తప్పుగా ఉంటే సరిదిద్దాలి. ఈ పద్ధతి పిల్లల్లో తార్కిక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంచుతుంది.

వస్తువుల ఎంపికలో..
పిల్లల దుస్తులు, పుస్తకాలు, ఆటవస్తువులు లేదా చిన్న చిన్న విషయాల ఎంపికలో వారినే నిర్ణయం తీసుకోమని ప్రోత్సహించాలి. ఇలా చేయడం వల్ల వారికి నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాని ఫలితాలను అర్థం చేసుకోవడం కూడా నేర్చుకుంటారు. భవిష్యత్తులో పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ నైపుణ్యం ఎంతో ఉపయోగపడుతుంది.

ఆలోచనలకు స్వేచ్ఛ ఇవ్వండి..:
ఇంట్లో పిల్లలు తమ అభిప్రాయాలను భయపడకుండా చెప్పగలిగే వాతావరణం ఉండాలి. వారి ఆలోచనలు విచిత్రంగా అనిపించినా వెంటనే విమర్శించకూడదు. వారిని శ్రద్ధగా వినడం, చర్చించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇదే సృజనాత్మకతకు, కొత్త ఆలోచనలకు పునాది అవుతుంది.

జీవిత అనుభవాలను..:
తల్లిదండ్రులు తమ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, వాటిని ఎలా అధిగమించారో పిల్లలకు చెప్పడం మంచిది. విజయాల కంటే వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠాలను వివరించడం మరింత ప్రయోజనకరం. దీనివల్ల జీవితంలో సమస్యలు సహజమని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవచ్చని పిల్లలు అర్థం చేసుకుంటారు.

తప్పులకు అవకాశం.. :
చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేయకుండా ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటారు. కానీ చిన్న చిన్న తప్పులు చేయడం కూడా ఒక నేర్చుకునే ప్రక్రియ. తప్పు జరిగితే మందలించడం కాకుండా, దాని నుంచి ఏమి నేర్చుకోవచ్చో వివరించాలి. ఇది పిల్లల్లో బాధ్యతాయుతమైన ఆలోచనను పెంచుతుంది.

పుస్తకాల జ్ఞానం మాత్రమే సరిపోదు. చుట్టూ జరిగే విషయాలను గమనించడం, ప్రశ్నించడం, కొత్త విషయాలు తెలుసుకోవడం వంటి అలవాట్లను ప్రోత్సహించాలి. వార్తలు, విజ్ఞాన కార్యక్రమాలు, ప్రకృతి పరిశీలన వంటి కార్యకలాపాలు పిల్లల మేధో వికాసానికి దోహదపడతాయి. పిల్లలను మాస్టర్ మైండ్స్‌గా మార్చడం ఒక్కరోజులో జరిగే పని కాదు. వారికి సరైన మార్గనిర్దేశం, ఆలోచించే స్వేచ్ఛ, నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, తప్పుల నుంచి నేర్చుకునే వాతావరణం కల్పిస్తే వారు భవిష్యత్తులో ఆత్మవిశ్వాసంతో కూడిన, తెలివైన వ్యక్తులుగా ఎదుగుతారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహనం, నమ్మకమే పిల్లల విజయానికి నిజమైన పునాది.