Home Blog Page 123

కోట్లు కొల్లగొట్టి..అయోధ్య రాముడినే మోసం చేశారు.. వీళ్ళ దారుణం ఇలా వెలుగులోకి..

Ayodhya Ram Mandir
Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir: వందల సంవత్సరాలు కొట్లాడితే.. అయోధ్యలో రాముడికి ఆలయం సాధ్యమైంది. బాల రాముడు ఆలయంలో కొలువై.. భక్తుల కోరికలు తీర్చుతున్నాడు. కోట్లాదిమంది హిందువులకు ఆలంబనగా నిలుస్తున్నాడు. అటువంటి రాముడిని కొంతమంది హిందువులే మోసం చేశారు. రాముడు మీద ఎంతో భక్తితో సమర్పించే విరాళాలను దొబ్బి తిన్నారు.

రామాలయంలో హుండీలో పడే కానుకలను లెక్కించడానికి కొంతమంది సిబ్బందిని రామ జన్మభూమి ట్రస్ట్ నియమించుకుంది. వారికి 20 నుంచి 25 వేల వరకు వేతనాలు ఇస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. భక్తులు సమర్పించే కానుకలలో వారు నొక్కడం మొదలుపెట్టారు. కేవలం 20 నుంచి 25 వేల వేతనం మాత్రమే వచ్చే వారు.. అయోధ్య రామాలయ చుట్టుపక్కల ప్రాంతంలో కోట్లు విలువ చేసే భూములు కొన్నారు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు ఆడిట్ నిర్వహించారు. అందులో వస్తున్న విరాళాలకు.. లెక్కిస్తున్న సొమ్ముకు పొంతన లేకుండా పోయింది. దీంతో ఇంటర్నల్ ఆడిట్ నిర్వహించారు. దీంతో దొంగలు దొరికిపోయారు.

దొంగలు దొరికిపోయిన తర్వాత అక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. హుండీలో సొమ్ములు పక్కదారి పడుతున్నాయని అనుమానం వ్యక్తం చేసిన అధికారిని సస్పెండ్ చేశారు. అయితే దీనిపై రామ జన్మభూమి ట్రస్ట్ బాధ్యులు కొంతమంది రంగంలోకి దిగారు. హుండీలో సొమ్ములు సక్రమంగానే ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాదు ఆడిటింగ్ జరుగుతోందని.. ఇప్పుడే సొమ్ములు మాయమయ్యాయి అనే విషయంపై ఒక అంచనాకు రాలేమని వారు చెబుతున్నారు. అలాంటప్పుడు ఫిర్యాదు చేసిన అధికారిని విధుల నుంచి ఎలా తొలగించారో వారే చెప్పాలి.

కోట్లాదిమందికి ఆదర్శప్రాయుడు.. నచ్చిన దైవం.. మెచ్చిన దేవుడైనటువంటి రాముడి విషయంలో కొంతమంది దుర్మార్గులు ఇలా చేయడం భక్తుల్లో ఆవేదన కలిగిస్తోంది. ఎంతో కష్టపడి రామాలయం నిర్మించుకుంటే.. దేశం మొత్తం విరాళాలు ఇచ్చి రాముడి మీద భక్తి పారవశ్యాన్ని నిరూపించుకుంటే.. ఇలా చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఒకవేళ ఆడిటింగ్ లో వారు అక్రమాలకు పాల్పడ్డట్టు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని భక్తుల కోరుతున్నారు. ఎందుకంటే కోట్లాదిమంది నమ్మకాన్ని వమ్ము చేస్తే.. అంతకుమించిన పాపం మరొకటి ఉండదని వారు గుర్తు చేస్తున్నారు. మరి దీనిపై రామ జన్మభూమి ట్రస్ట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

చిరంజీవి - పవన్ కళ్యాణ్ కోసం అదిరిపోయే కథను రెడీ చేసిన స్టార్ రైటర్... ఇంతకీ ఏం జరిగిందంటే..?

Chiranjeevi And Pawan Kalyan
Chiranjeevi And Pawan Kalyan

Chiranjeevi And Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. చిరంజీవి ‘ప్రజా రాజ్యం ‘ అనే రాజకీయ పార్టీ పెట్టి ఒక పదేళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైన విషయం మనకు తెలిసిందే. కానీ ఎట్టకేలకు మరోసారి సినిమా ఇండస్ట్రీకి వచ్చి తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం చేశాడు. తను అనుకున్నట్టుగానే సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. చిరంజీవి తమ్ముడు ఆయన పవన్ కళ్యాణ్ సైతం కెరియర్ స్టార్టింగ్ లోనే పవర్ స్టార్ అనే ఇమేజ్ ను తెచ్చుకున్నాడు.

అప్పటినుంచి తనకంటూ ఒక ఓన్ స్టైల్ ని ఏర్పాటు చేసుకుని ఆ స్టైల్ లోనే ముందుకు దూసుకెళ్తూ ఉండడం విశేషం.. వీళ్ళిద్దరిని కలిపి ఒక సినిమా చేయాలని చాలామంది స్టార్ డైరెక్టర్లు ఆసక్తి చూపించారు. కానీ ఏదో ఒక అడ్డంకి ఎదురై అది మాత్రం వీలుపడలేదు. ఇక ఇంద్ర లాంటి సూపర్ డూపర్ సక్సెస్ ఫుల్ కథని రాసిన చిన్ని కృష్ణ సైతం చిరంజీవి పవన్ కళ్యాణ్ ని కలుపుతు ఒక మంచి కథనైతే రెడీ చేశాడట.

కానీ అది అనుకోని కారణాలవల్ల సెట్స్ మీదికైతే రాలేదు… ఇక దానికిగల కారణమేంటంటే ఆ కథ ఫైనల అయిన సమయంలోనే దానికి ముత్యాల సుబ్బయ్య ను దర్శకుడిగా నిర్ణయించారు. కానీ అతను ఆ సినిమాను అంత ఎఫెక్టివ్ గా తీయలేడని భావించిన ప్రొడ్యూసర్లు అతన్ని పక్కన పెట్టి మరో దర్శకుడిని తీసుకోవాలనే ప్రయత్నం చేశారు.

ఇక అది అలా రెండు మూడు దర్శకుల చేతులు మారడం వల్ల ఆ సినిమా చేయాలనే ఇంట్రెస్ట్ అందరికి పోయింది. దాంతో చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నిజానికి ఇద్దరు బ్రదర్స్ ని సినిమా మొత్తం ఒకే ఫ్రేమ్ లో చూస్తే వచ్చే కిక్కు వేరే లెవల్లో ఉండేది. కానీ చివరి నిమిషంలో అది మిస్ అయిందంటూ మెగా అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…

మహేష్ బాబు తో అలాంటి సినిమా చేసి ఉండకూడదు అంటున్న స్టార్ డైరెక్టర్...

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న హీరోలు మన తెలుగువాళ్లే కావడం విశేషం… ఇక ఇలాంటి సందర్భంలోనే మహేష్ బాబు లాంటి నటుడు సైతం ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితమయ్యాడు. కానీ ఇప్పుడు ఆయన రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో ఏకంగా పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు పాన్ ఇండియాలో ఒక్క సినిమా సైతం చేయని ఆయన ఒక్కసారిగా పాన్ వరల్డ్ లోకి వెళ్లడం చూస్తున్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రాజమౌళి ఉన్నాడనే ధైర్యంతోనే మహేష్ బాబు మీద ఏ మాత్రం మార్కెట్ లేకపోయిన కూడా ప్రపంచ స్థాయి సినిమా చేయడానికి ప్రొడ్యూసర్లు ముందుకు అడుగులు వేస్తున్నారు.

ఆ రాజమౌళి తన విజన్ తో ఈ సినిమాని మరో మెట్టు పైకెక్కించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అలాంటి రాజమౌళి ఈ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించి పెట్టడానికి ఆయన ఏ స్ట్రాటజీ వాడతారు అనేది కూడా తెలియాల్సి ఉంది… సూపర్ స్టార్ మహేష్ బాబు కృష్ణ కుమారుడిగా వచ్చినప్పటికి చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతను ఏర్పాటు చేసుకున్నాడు.

మహేష్ బాబు మొదట్లో తమిళ దర్శకులతో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ ఖుషి సినిమా సక్సెస్ తరువాత ఎస్ జే సూర్యతో నాని సినిమా చేశాడు. ఆ సినిమా ప్లాప్ అయిన తర్వాత అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన తమిళ దర్శకులను పక్కన పెడుతూనే వచ్చాడు. కానీ మురుగదాస్ అంటే తనకి ఎక్కడో ఇష్టం ఏర్పడింది.

దాంతో స్పైడర్ అనే సినిమా చేశాడు. మొత్తానికైతే మురుగుదాస్ స్పైడర్ సినిమాతో మహేష్ ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఒక కమర్షియల్ హీరోతో అలాంటి కథను తీసుకొని సినిమా చేయడం అనేది చాలా దారుణం అంటూ చాలామంది కామెంట్స్ చేశారు. ఒక సోషల్ మెసేజ్ ని ఇచ్చే ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాని చేస్తే బాగుండేదని అలా కాకుండా ఇలా డిఫరెంట్ వే లో ప్రయత్నం చేయడం వల్ల సినిమా తేడా కొట్టింది అంటూ మురుగదాస్ కొన్ని సందర్భాల్లో ఈ సినిమా ఫ్లాప్ గురించి చాలా ఎమోషనల్ అయ్యాడు…

నాగార్జున కి డిఫరెంట్ జానర్ లో కథ చెప్పిన అనిల్ రావిపూడి... ఇంతకీ కింగ్ ఏం చెప్పాడంటే..?

Anil Ravipudi And Nagarjuna
Anil Ravipudi And Nagarjuna

Nagarjuna And Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతల తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. స్టార్ హీరోలందరు పాన్ ఇండియాలో తమ సత్తా చాటుకుంటున్న క్రమంలో సీనియర్ హీరోలు కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమవుతున్నారు. ఇక్కడే సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో తెలుగు సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే మన సీనియర్ హీరోలు సైతం వరుసగా విజయాలను సాధిస్తుంటడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఆయన సినిమాలతో పెద్దగా సందడి చేయలేకపోయిన కూడా అతనికంటూ ఒక బ్రాండ్ నేమ్ క్రియేట్ అయి ఉంది. గతంలో ఆయన విభిన్న తరహా సినిమాలను ఎంచుకొని మరి సక్సెస్ లను సాధించాడు. ఇక గత సంవత్సరం కూలీ, కుబేర లాంటి సినిమాలతో కొంతవరకు డీలా పడిన ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో మాత్రం చాలా క్లారిటిని మైంటైన్ చేస్తున్నాడు.

తన వందో సినిమాతో మరోసారి మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక దాంతో పాటుగా మరికొన్ని సినిమాలను సైతం పైన్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ గా పేరు సంపాదించుకున్న అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు సైతం రీసెంట్ టైమ్ లో ఆయనకి హార్రర్ జానర్ లో ఒక కథనైతే వినిపించాద
డట.

ఈ స్టోరీ నాగార్జునకి బీభత్సం గా నచ్చడంతో ఆ సినిమాని ఎలాగైనా సరే మనం చేద్దామని చెప్పినట్టుగా తెలుస్తుంది. నాగార్జున ప్రస్తుతం కొన్ని కమిట్మెంట్స్ తో ఉన్నాడు. ఇప్పుడు ఆయన తన వందో సినిమా చేస్తున్నాడు. దాంతోపాటుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలతో ఆయన చాలా బిజీగా ఉన్నాడు. కాబట్టి ఈ సినిమాలు అయిపోయిన తర్వాత అనిల్ రావిపూడి సినిమా చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం అనిల్ రావిపూడి, వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి చేస్తున్న మల్టీ స్టారర్ సినిమా సైతం తొందర్లోనే రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోబోతుంది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నారు…

బాలయ్య విషయంలో వెనక్కి తగ్గుతున్న కుర్ర దర్శకులు...

Balakrishna
Balakrishna

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ మధ్యకాలంలో వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ముఖ్యంగా కమర్షియల్ జానర్ లో సక్సెస్ లను సాధించడంలో బాలయ్యను మించిన వారెవరు లేరనే చెప్పాలి. మాస్ ఎలివేషన్స్ సన్నివేశాలలో బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపిస్తుంటాడు. అందువల్లే ప్రతి ఒక్క దర్శకుడు కూడా బాలయ్య ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని కథలను రాసుకుంటున్నారు. వాటికి మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే విధంగా కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించి సక్సెస్ లను సాధిస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో వరుసగా నాలుగు విజయాలను సాధించాడు. మధ్యలో ‘అఖండ 2’ కొంతవరకు డీలా పడినప్పటికి ఇప్పుడు మరోసారి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది.

కానీ వివేక్ ఆత్రేయ లాంటి దర్శకుడు సైతం బాలయ్య బాబుతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించినప్పటికి అది వర్కౌట్ అయ్యే విధంగా కనిపించలేదు. కారణం ఏంటంటే వివేక్ ఆత్రేయ మాస్ సినిమాలను అంత బాగా హ్యాండిల్ చేయలేడనే వార్తలు కూడా వస్తున్నాయి. నానితో ‘సరిపోదా శనివారం’ అనే సినిమా చేశాడు. కానీ అందులో మాస్ ఎలిమెంట్స్ కంటే కూడా యాక్షన్ ఎలివేషన్ సీన్స్ కి మాత్రమే ఆయన పెద్ద పీట వేశాడు. మాస్ అంటే అది బాడీ లాంగ్వేజ్ లో నుంచి రావాలి.

రూట్ లెవెల్ నుంచే ఆ రైటింగ్ అనేది డెవలప్ చేసుకుంటూ రావాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే స్క్రీన్ మీద మాస్ ఎలిమెంట్స్ ఎలివేట్ అవుతుంటాయి. అందుకే బాలయ్య తన నెక్స్ట్ సినిమా కోసం వివేక్ ఆత్రేయ ను పక్కనపెట్టి కొరటాల శివను ఆ ప్లేస్ లో భర్తీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇతనితో పాటుగా మరికొంత మంది కుర్ర దర్శకులను సైతం బాలయ్య పక్కన పెట్టేసాడు…

మొత్తానికైతే బాలయ్య విషయంలో ఈ కుర్ర దర్శకులందరు కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాతో కూడా సినిమాలు చేస్తే మేము సక్సెస్ లను కట్టబెడతాం కదా ఆయన యాక్టింగ్ లో వేరియేషన్స్ ను చూపిస్తాం కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫ్యూచర్లో బాలయ్య వీళ్ళతో సినిమాలు చేసే అవకాశం ఉందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ట్రంప్ కు భరించలేని కడుపు మంట.. మోడీ సార్ కొంచెం గ్యాప్ ఇవ్వండి..

Trump And Narendra Modi
Trump And Narendra Modi

Trump And Narendra Modi: మొన్నటికి మొన్న మన దేశానికి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి వచ్చాడు.. కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు మన వాళ్ళు. స్వాగతం కాదు కదా రెడ్ కార్పెట్ కూడా వేయలేదు. సీఐ స్థాయి అధికారులను పంపించి పరువు తీశారు. అమెరికా అంటే మాకు వెంట్రుకతో సమానం అన్నట్టుగా వ్యవహరించారు. ఇక మీడియా సమావేశంలో మన విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఏమాత్రం భయం అనేది లేకుండానే మాట్లాడారు. ఒకప్పుడు అమెరికాను చూస్తే చుచ్చు పోసుకొనే భారత ప్రజాప్రతినిధులను చూసిన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రూబియో.. జై శంకర్ వ్యవహరించిన తీరు పట్ల ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అంతేకాదు క్రూడ్ ఆయిల్ విషయంలో భారత్ తన వైఖరి చెప్పడంతో తల పట్టుకున్నాడు. చివరికి అతనికి వీడ్కోలు కూడా మనవాళ్లు సరిగా ఇవ్వలేదు. మళ్లీ అదే సీఐ స్థాయి అధికారులతో సెండాఫ్ ఇచ్చారు.

కేవలం రూబియో మాత్రమే కాదు.. ట్రంప్ కు కూడా భారత్ చుక్కలు చూపిస్తోంది. ప్రపంచ దేశాల దగ్గర క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తుంది. రష్యా నుంచి మొదలుపెడితే వెనుజులా వరకు అన్ని ప్రాంతాలలో క్రూడ్ ఆయిల్ కొంటూనే ఉంది. ఎన్ని రకాలుగా ఆంక్షలు విధించినప్పటికీ పక్కనపెడుతోంది. చివరికి మోడీని వంచాలని అమెరికా అధ్యక్షుడు చేయని పని అంటూ లేదు. డీప్ స్టేట్ కూడా రంగంలోకి దిగింది. అయినప్పటికీ దేశ ప్రయోజనాల విషయంలో మోడీ తలవంచలేదు. ట్రంప్ ముందు మోకారిల్ల లేదు.

మనదేశ నౌకల మీద అమెరికా దాడి చేసి.. ముగ్గురు భారతీయ పౌరుల మరణానికి కారణమైన నేపథ్యంలో.. మన దేశ విదేశాంగ శాఖ వెంటనే రెస్పాండ్ అయింది. భారత్ లో ఉంటున్న అమెరికా రాయబారులను పిలిపించింది. సమన్లు జారీ చేసింది. అమెరికా చరిత్రలో అమెరికా రాయబారులకు భారతదేశం సమన్లు ఇవ్వడం ఇదే తొలిసారి. శ్వేత సౌధాధిపతి నుంచి ఒత్తిడి ఉంటుందని తెలిసినప్పటికీ కూడా ఇండియా ఏ మాత్రం తలవంచలేదు.

పైగా ఇటీవల ఒక సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ దేశ ప్రయోజనాల విషయంలో కాంప్రమైజ్ కాడని.. తాను ఎన్ని చెప్పినప్పటికీ తాను తల పంచడం లేదని పేర్కొన్నాడు. ఎప్పటికైనా నరేంద్ర మోడీ నుంచి సానుకూల స్పందన వస్తుందో చూస్తున్నానని ట్రంప్ వ్యాఖ్యానించాడు. దీనిని బట్టి నరేంద్ర మోడీ దేశం విషయంలో ఎలా ఉంటున్నాడో అర్థం చేసుకోవచ్చు. అగ్రరాజ్య రాయబారులకు సమన్లు జారీ చేసి ఇండియా అంటే ఏమిటో మోడీ నిరూపించాడు. అంతేకాదు తమ జోలికి వస్తే వేరే విధంగా ఉంటుందని హెచ్చరికలు పంపించాడు.

మన దేశ పౌరులను అమెరికా అనవసరమైన దాడులు చేసి చంపిన నేపథ్యంలో నరేంద్ర మోడీ ఇంతవరకు పరోక్షంగా మాత్రమే స్పందించారు. ప్రస్తుతం ఫ్రాన్స్ దేశంలో పర్యటిస్తున్న నరేంద్ర మోడీ.. అనేక రకాల ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. తద్వారా అమెరికా ప్రమేయం లేకుండానే భారత్ ఎగుమతులు.. ఇతర వ్యవహారాలు సాగించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ముగ్గురు భారత పౌరుల మరణం పై ఇప్పటికే మన దేశ విదేశాంగ శాఖ నిరసన వ్యక్తం చేసింది. అమెరికా తీరు పట్ల మండిపడింది. అదే కాదు అమెరికన్ రాయబారులకు సమన్లు కూడా జారీ చేసింది. ఈ వ్యవహారాన్ని ఇక్కడితోనే భారత్ ఆపి వేసే విధంగా కనిపించడం లేదు.. మరింత తీవ్రతరం చేసే పనిలోనే ఉంది. వచ్చే రోజుల్లో ఈ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.

నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం.. నెల రోజుల పాటు శుభ ముహూర్తాల సందడి..

Nija Jyeshtha Masam 2026
Nija Jyeshtha Masam 2026

Nija Jyeshtha Masam 2026: తెలుగు పంచాంగం ప్రకారం.. 2026 జూన్ 16 నుంచి నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతోంది. ఈ మాసం జూలై 15 వరకు కొనసాగనుంది. అనంతరం ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది అధిక మాసం ప్రభావంతో రెండు జ్యేష్ఠ మాసాలు వచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు ప్రారంభమవుతున్న నిజ జ్యేష్ఠ మాసానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నెలలో వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, నిశ్చితార్థాలు వంటి అనేక శుభకార్యాలకు అనుకూలమైన ముహూర్తాలు లభిస్తున్నాయని పండితులు పేర్కొంటున్నారు. అయితే ఈ నెలలో వివాహాలు జరిగే తేదీ లేవు చూద్దాం..

పంచాంగాల ప్రకారం నిజ జ్యేష్ఠ మాసంలో వివాహాలకు అనుకూలంగా పరిగణిస్తున్న ప్రధాన తేదీలు జూన్ 17, 18, 21, 22, 24, 25, 29, 30 అలాగే జూలై 1, 2, 6, 8, 9, 10, 13, 14 తేదీలు. అయితే ప్రాంతీయ పంచాంగ భేదాలు, వధూవరుల జన్మనక్షత్రాలు, రాశులు, గోత్రాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలని పండితులు సూచిస్తున్నారు.నిజ జ్యేష్ఠ మాసంలో కొత్త ఇంటి నిర్మాణ ప్రారంభం, భూమి పూజ, గృహప్రవేశం వంటి కార్యక్రమాలకు కూడా అనేక శుభ ముహూర్తాలు ఉన్నాయి. ముఖ్యంగా జూన్ రెండో పక్షం నుంచి జూలై తొలి వారాల వరకు గృహ సంబంధిత శుభకార్యాలకు అనుకూల సమయంగా పరిగణిస్తున్నారు. కొత్త ఇల్లు కొనుగోలు, రిజిస్ట్రేషన్ వంటి కార్యక్రమాలు కూడా ఈ సమయంలో నిర్వహించుకోవచ్చు.

ఈ మాసంలో నిశ్చితార్థాలు, ఉపనయనాలు, అక్షరాభ్యాసం, అన్నప్రాశన, నామకరణం, వ్యాపార ప్రారంభోత్సవాలు, వాహన కొనుగోళ్లు, కొత్త ఉద్యోగంలో చేరిక, కార్యాలయ ప్రారంభం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవచ్చు. ముఖ్యంగా వ్యాపార విస్తరణ లేదా కొత్త పెట్టుబడులు ప్రారంభించాలనుకునేవారికి ఇది అనుకూల కాలంగా భావిస్తున్నారు.

జూలై 15తో నిజ జ్యేష్ఠ మాసం ముగియనుండగా, అనంతరం ప్రారంభమయ్యే ఆషాఢ మాసంలో సాధారణంగా వివాహాలు వంటి ప్రధాన శుభకార్యాలు నిర్వహించరు. అందువల్ల పెళ్లిళ్లు, గృహప్రవేశాలు లేదా ఇతర ముఖ్యమైన కుటుంబ వేడుకలను ప్లాన్ చేస్తున్నవారు ఈ నెలలో లభించే ముహూర్తాలను వినియోగించుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

అయితే పంచాంగాల్లో సూచించిన సాధారణ ముహూర్తాలు అందరికీ ఒకే విధంగా వర్తించవు. వ్యక్తిగత జాతకాలు, దోషాలు, కుటుంబ సంప్రదాయాలు, ప్రాంతీయ పంచాంగ విధానాలను పరిగణనలోకి తీసుకుని స్థానిక పురోహితులను సంప్రదించిన తర్వాతే తుది ముహూర్తాన్ని ఖరారు చేసుకోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఊహించనంత లాభాలు..

Today 16 June 2026 Horoscope
Today 16 June 2026 Horoscope

Today 16 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశరాసులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు కొత్తగా పెట్టుబడును పెడతారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారి ఆదాయం ఈరోజు గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగులకు బదిలీలు ఉండే అవకాశం ఉంది. ప్రమోషన్ గురించి శుభవార్తను వింటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. పెద్దల ఆరోగ్యం ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. తల్లిదండ్రుల ఆశీస్సులతో వ్యాపారులు కొత్తగా పెట్టుబడును పెడతారు. ఉద్యోగులు మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నింటిలో విజయం సాధిస్తారు. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. జీవితం భాగస్వామి అండదండలతో ఆర్థికంగా స్థిరపడతారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు కొందరు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇంట్లోని రహస్యాలను ఎవరికి చెప్పుకోకుండా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. అనుకోకుండా జరిగే ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు గ్రహాల అనుకూలత ఉండడంతో చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : సింహరాశి వారికి ఈరోజు అపాలమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. అనుకున్న ప్రతి పనిని పూర్తి చేస్తారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఉద్యోగులు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు సంతోషకరమైన వాతావరణ ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండడమే మంచిది. కుటుంబ సభ్యుల అండదండలతో వ్యాపారులు కొత్తగా పెట్టుబడి పెడతారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా అదృష్టం వరిస్తుంది. ఉద్యోగులు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడతారు. గ్రహాల అనుకూలతతో సమస్యలు తొలగిపోతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వ్యాపారులు పెద్దలను సంప్రదించడం మంచిది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో ముఖ్యమైన పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది. కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారాలు అధిక లాభాలు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఊహించిన దానికంటే ఎక్కువగా డబ్బు వస్తువులు అవుతుంది. కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. పాత అప్లోడ్ నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల మద్దతుతో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. పడుకోకుండా వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు ఉంటాయి. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగులు కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను పూర్తి చేస్తారు.

యుద్ధం ముగిసింది.. ఇరాన్ ముందు అమెరికా మోకరిల్లింది.. ట్రంపూ నువ్వు జబ్బలు చరచుకో ఇక

Hormuz Strait
Hormuz Strait

Trump Iran Deal: యుద్ధం వల్ల ఏం జరిగింది.. ఇజ్రాయిల్ దేశానికి సంఘీభావంగా వచ్చిన అమెరికా.. ఏం సాధించింది.. ఇప్పుడు డీల్ కుదుర్చుకొని అమెరికా ఏం లాభం పొందింది.. ఇప్పుడు ఈ ప్రశ్నలు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తం అవుతున్నాయి. తన జన్మదినం సందర్భంగా ట్రంప్ గొప్పగా చెప్పుకోవచ్చు.. తాను ఇతర అమెరికా అధ్యక్షుల వలె కాకుండా
.. ఇరాన్ దేశంతో యుద్ధాన్ని ముగించానని… మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పానని జబ్బలు చర్చుకోవచ్చు. కానీ అమెరికా కోరుకున్నట్టుగా.. అమెరికా ఆశించినట్టుగా అక్కడ జరగలేదు.

అమెరికా చేసిన యుద్ధం వల్ల ఇరాన్ భారీగా నష్టపోయింది. నగరాలకు నగరాలు తుడిచిపెట్టుకొని పోయాయి. సైన్యం మొత్తం నాశనమైంది. వేలాదిగా ప్రజలు చనిపోయారు. ఒకరకంగా చెప్పాలంటే ఇరాన్ ఇప్పుడు స్మశానంతో సమానం. ఇంత నష్టం జరుగుతున్నప్పటికీ ఇరాన్ వెన్ను వంచలేదు. మడమ తిప్పలేదు. పోరాటం చేస్తూనే ఉంది. తనకు నచ్చిన తీరుగా వ్యాపారం చేస్తూనే సాగిపోయింది. కొన్ని సందర్భాలలో బ్లాక్ మార్కెట్ ద్వారా కూడా చమురు తరలించింది. అమెరికా కన్నుగప్పి వ్యాపారాన్ని సాగించింది. ఇరాన్ ఏ దేశానికి చమురు అమ్మింది.. ఎక్కడి నుంచి మనీ ల్యాండరింగ్ ద్వారా డబ్బు స్వీకరించింది అనే విషయాలు ఇప్పటికీ బయటకి తెలియ రాలేదు. అంతటి అమెరికా సిఐఏ ఏజెన్సీ ఉన్నప్పటికీ ఈ విషయాన్ని కనిపెట్టలేకపోయింది.

14 సూత్రాల ఒప్పందానికి ఒకవేళ అమెరికా గనుక కట్టుబడి ఉంటే ఇరాన్ నైతికంగా గెలిచినట్టే. ఎందుకంటే ఆ 14 సూత్రాలు అమెరికా పాటిస్తే ఇరాన్ ఫ్రీ అయిపోతుంది. ప్రపంచ దేశాలు అన్నింటికీ చమురు అమ్ముకోవచ్చు. అంతేకాదు, దర్జాగా వ్యాపారం సాగించుకోవచ్చు. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల మీద పట్టు సాధించవచ్చు. అమెరికా సేనలు ఇరాన్ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే అక్కడి ప్రజలు స్వేచ్ఛగా బతకవచ్చు. ఇంతే కాదు .. చమురు విషయంలో ధరను కూడా నిర్ణయించుకోవచ్చు. 14 సూత్రాలకు అమెరికా ఒప్పుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ మీద దాడి చేసే స్థాయి అమెరికా సైన్యానికి లేదు. ఎందుకంటే అమెరికా సైన్యం మీద ఇప్పటికే భారీగా ఖర్చుపెట్టింది. ఒకరకంగా చెప్పాలంటే ఇజ్రాయిల్ కోసం అమెరికా తన డబ్బులు మొత్తం యుద్ధానికి తగలేసింది. ఇలాగే చేసుకుంటూ పోతే అమెరికా తీవ్రంగా నష్టపోతుంది. అందువల్లే పదేపదే ట్రంప్ డీల్ అంటూ మాట్లాడాడు..

ఇరాన్ ఎప్పటిలాగే తన ధైర్యాన్ని ఇప్పటికీ ప్రదర్శిస్తూనే ఉంది. 14 సూత్రాల ఒప్పందానికి అమెరికానే కట్టుబడి ఉండాలంటూ ఉల్టా ప్రశ్నిస్తోంది. ఇప్పుడు అమెరికాకు మరో మార్గం లేదు. నిన్నటిదాకా ఇరాన్ మీద మీసాలు దువ్వింది. ఇప్పుడేమో డీల్ కుదిరింది.. యుద్ధం ముగిసింది అంటూ మాట్లాడుతోంది.. పాపం ట్రంప్.. గాలికి పోయే కంపను తగిలించుకున్నాడు. ఇప్పుడు ముండ్లు ఏరుకునే పనిలో పడ్డాడు.

పూరి జగన్నాధ్ కి హిట్టు రాకపోతే ఛార్మి తో పెద్ద గొడవ అయ్యే అవకాశాలు ఉన్నాయా..?

Puri Jagannadh And Charmme Kaur
Puri Jagannadh And Charmme Kaur

Puri Jagannadh And Charmme Kaur: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరీ జగన్నాధ్… గతంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు ఆయన్ని టాప్ లెవల్లో నిల్చో బెట్టాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతన్ని నెక్స్ట్ లెవెల్ దర్శకుడిగా పేరు సంపాదించి పెట్టినవే కావడం విశేషం… గత రోజుల నుంచి తన పూర్తి ఫామ్ ను అందుకోలేకపోతున్నాడు. అందుకే స్పెషల్ కేర్ తీసుకొని మరి సినిమాలు చేస్తున్నాడు. వరుసగా లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి రెండు డిజాస్టర్ సినిమాలతో పూర్తిగా డీలా పడిపోయిన పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ సేతుపతి డైరెక్షన్ లో ‘స్లమ్ డాగ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన మరోసారి తనని తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.

తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పూరి జగన్నాధ్, ఛార్మి మధ్య బిజినెస్ పరంగా చాలా మంచి డీల్స్ ఉన్నాయి. దానికి అనుగుణంగానే వీళ్లిద్దరు తమ సినిమాలను నిర్మించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఈ క్రమంలో వరుసగా తీసిన సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో కొంతవరకు నష్టపోయారు.

ఇప్పుడు స్లమ్ డాగ్ మూవీతో మరోసారి సక్సెస్ ని సాధించి భారీ లాభాలను ఆర్జిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ సినిమా కనక డిజాస్టర్ అయితే మాత్రం పూరి జగన్నాధ్, చార్మి మధ్య విపరీతమైన గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు డబ్బులు నష్టపోయారు. ఇకమీదట కూడా నష్టపోతే వీళ్ళ బిజినెస్ దెబ్బతినే అవకాశం ఉందని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఇంకా కొంతమంది పూరి జగన్నాధ్ అభిమానులైతే ఛార్మి ని వదిలేసి పూరి జగన్నాధ్ సినిమాలు చేసినప్పుడు మాత్రం అతనికి సక్సెస్ లు వస్తాయని, అప్పటి వరకు ఆయన ఏం చేసినా కూడా అంత ఎఫెక్టివ్ గా సినిమాలు చేయలేకపోతున్నాడనే వార్తలను కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

వైభవ్ సూర్య వంశీ 15 ఏళ్ల బుడ్డోడు కాదు రా బాబూ.. డైనమైట్.. గెలికితే దబిడి దిబిడే

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: బుడ్డోడు కదా అని ట్రోల్ చేశారు. 15 సంవత్సరాల బాలుడే కదా అంటూ పరిహాసమాడారు. వాళ్లకు తెలియదు కదా వాడొక డైనమైటని.. తిక్క రేగితే తిత్తి తీస్తాడని.. చివరికి అర్థమైంది.. కాకపోతే ఆలస్యంగా.. ఆ బుడ్డోడికి తిక్క రేగింది.. లెజెండ్ సినిమాలో బాలయ్య గనుక జగపతిబాబు మీదికి వెళ్ళినట్టు దూసుకుపోయాడు. కొంతలో తప్పిపోయింది.. లేకుంటే నా శాల్తీలు గల్లంతయ్యేవి.

అసలే శ్రీలంక సిరీస్ లో వైభవ్ సూర్య వంశీ అంచనాలకు తగ్గట్టుగా ఆడటం లేదు. రెండు మ్యాచ్లలో తన ప్రతాపాన్ని అతడు చూపించలేకపోయాడు. పైగా టీమిండియా ఓడిపోయింది. సూపర్ ఓవర్లో శ్రీలంక ముందు తలవంచింది.. సరిగా ఆడలేక పోయాను అనే బాధ.. సూపర్ ఓవర్ లో టీమిండియా ఓడిపోయిందనే కోపం.. ఇవన్నీ సూర్య వంశీలో తీవ్రస్థాయిలో అసహనం పెంచాయి. మిగతా ప్లేయర్లు ఓటమిని సహజంగా తీసుకుంటారు. కానీ సూర్య వంశీ అలా కాదు. అతడికి ప్రతి మ్యాచ్లో గెలవాలని మాత్రమే ఉంటుంది.. ఓటమిని అసలు ఒప్పుకోడు. బహుశా 15 సంవత్సరాల వయసు కాబట్టి.. అలానే ఉంటుందేమో.

అతడి గురించి తెలియక.. శ్రీలంక ప్లేయర్లు గేలి చేశారు. బుడ్డోడు అంటూ ఆటపట్టించారు. అతడికి తిక్క రేగింది. బుల్డోజర్ లాగా దూసుకుపోయాడు. శ్రీలంక ప్లేయర్లను ఒక తొక్కుడు తొక్కాలని అనుకున్నాడు. ఈ సమయంలోనే శ్రీలంక కీపర్ అడ్డంగా వచ్చి.. సూర్యవంశీని సముదాయించాడు. దీంతో గొడవ ఆగిపోయింది. తుఫాను తేలిపోయింది. సునామి ప్రశాంతతను పొందింది. లేకుంటే నా సినిమా వేరే తీరుగా ఉండేది. ఆ తర్వాత సూర్య వంశీ ఏదో తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో తిరుగుతున్నాయి. ఇది కదా మాకు కావాల్సింది అంటూ టీమిండియా అభిమానులు వైభవ్ సూర్య వంశీ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.

తవ్వుకోవడమే కాదు.. పుడమికి పచ్చల హారం తొడిగింది సింగరేణి.. ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా

Singareni
Singareni

Singareni: విస్తారంగా బొగ్గు.. తవ్వుకుంటే కోట్లే కోట్లు. అదే పని కొన్ని సంవత్సరాలుగా సింగరేణి చేస్తోంది.. విస్తారంగా ఉన్న బొగ్గును తవ్వుకున్నది. అక్కడ బొగ్గు అయిపోయింది. గుట్టలుగా పోసిన మట్టి.. ఆకాశాన్ని తాకుతోంది. సింగరేణి విధి బొగ్గు తవ్వుకోవడం మాత్రమే కాదు.. అంతకుమించి.. దానినే ఇప్పుడు చేసి చూపించింది. అది కాస్త ప్రశంసలకు అర్హమైనదిగా మారిపోయింది.

సాధారణంగా భూమిలో ఒక విత్తును నాటితే అది మొలకెత్తుతుంది. ఆ తర్వాత చిన్న చిన్న ఆకులను కూడ తీసుకొని చెట్టుగా ఎదుగుతుంది. ఇలా ఎదిగిన చెట్లు భూమికి రక్షణగా ఉంటాయి. భూమిలో పెరుగుతూ సమస్త మానవాళికి గాలి.. నీడ.. ఆవాసం.. ఆహారం అందిస్తాయి. పారిశ్రామికీకరణ వల్ల అడవులను పెంచడం కాదు కదా.. నరకడం పెరిగిపోయింది. దీనికి సింగరేణి మినహాయింపు కాదు. సింగరేణి బొగ్గు కోసం ఎన్నో అడవులను నరికింది. ఎన్నో అడుగుల లోతు తవ్వకాలు జరిపింది. భూమి గర్భంలో ఉన్న బొగ్గును తవ్వింది. సొమ్ము చేసుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఓపెన్ కాస్ట్ గనుల్లో తవ్వి తీసిన ఓవర్ బర్డన్ గుట్టలుగా పేరుకుపోయింది. సింగరేణికి వచ్చిన ఒక ఆలోచన సమస్తం ఓవర్ బర్డన్ రూపు రేఖలను మార్చేసింది.

బెల్లంపల్లి ఏరియాలో డోర్లీ ప్రాంతంలో గతంలో సింగరేణి బొగ్గును తవ్వితీసింది. అక్కడ బొగ్గు అయిపోవడంతో ఆ గని మొత్తాన్ని మూసేసింది. దాదాపు 162 హెక్టార్ల ప్రాంతంలో ఒక అడవిని సృష్టించింది. అంతేకాదు దీనికోసం సింగరేణి డిపాజిట్ చేసిన 40 కోట్లను వడ్డీతో సహా తిరిగి చెల్లించింది. డోర్లీ 2 మాత్రమే కాదు, డోర్లీ 1 ప్రాంతంలో కూడా సింగరేణి ఇదేవిధంగా మొక్కలు పెంచింది. అది కూడా అడవిలాగా మారిపోయింది. దీని ద్వారా కూడా 60 కోట్ల వరకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక నిబంధన తీసుకొచ్చింది. మైనింగ్ ప్రారంభం.. బొగ్గు వెలికితీత.. ఆ తర్వాత మూసివేత విషయంలో అనేక ప్రమాణాలను తెరపైకి తీసుకొచ్చింది. దీనికోసం కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ఎదుట కొంత డబ్బు డిపాజిట్ చేయాలని నిబంధన విధించింది. ప్రమాద ప్రకారం గని మూసివేత పూర్తయిన తర్వాత.. ఆ డబ్బులు తిరిగి ఇస్తోంది. బెల్లంపల్లి ఏరియాలో కూడా ఇదే జరిగింది. డోర్లీ 2 ఓపెన్ కాస్ట్ కు 2013, 14 కాలంలో అనుమతులు వచ్చాయి. 2023, 24 కాలంలో మూతపడింది. దీనికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆడిట్ జరిపింది. ఈ వ్యవహారం మొత్తంలో సంతృప్తి వ్యక్తం చేసింది. ఫలితంగా సింగరేణి కి ప్రశంస లభించింది.

ఓవర్ బర్డెన్ మీద సింగరేణి ఏకంగా గ్రీన్ బెల్టులు ఏర్పాటు చేసింది. జల కాలుష్యం ఉండేందుకు అతి పొడవైన డ్రైనేజీలు ఏర్పాటు చేసింది.. చెక్ డ్యాములు కూడా నిర్మించింది. బురద నీరు వల్ల కాలుష్యం జరగకుండా ఏర్పాటు చేసింది. సెటిలింగ్ ట్యాంకులు నిర్మించింది.. మైన్ లో నుంచి వచ్చే నీటిని శుభ్రం చేసి సమీపంలో ఉన్న కాలువలకు వదిలింది. గని చుట్టు ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. అక్కడ ఏర్పాటుచేసిన భవనాలను అత్యంత జాగ్రత్తగా తొలగించింది.

ప్రభాస్ 'ఫౌజీ' టీజర్ అప్డేట్ వచ్చేసింది.. వచ్చే నెల ఫ్యాన్స్ కి పండగే..

Prabhas Fauji Teaser Update
Prabhas Fauji Teaser Update

Prabhas Fauji Teaser Update: రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ ల తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 3 న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు సోషల్ మీడియా లో లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త. అయితే దీనిపై ఇప్పటి వరకు మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అసలు ప్రభాస్ వెర్షన్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యిందా లేదా అనే విషయం పైన కూడా ఎలాంటి అప్డేట్ లేదు. దీనిపై ఫ్యాన్స్ లో కొంతకాలం నుండి తీవ్రమైన అసంతృప్తి ఉంది. మరోపక్క ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ తో ఫుల్ బిజీ అయిపోయాడు. మరి ‘ఫౌజీ’ సంగతేంటి , అసలు ఈ సినిమా ఉందా లేదా అనే అనుమానం అభిమానుల్లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యం లో ఈ చిత్రం గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న లేటెస్ట్ వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి.

మేకర్స్ రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబదించిన టీజర్ కట్ వర్క్ ని మొదలు పెట్టారట. జులై చివరి వారం లో , లేదా ఆగస్టు మొదటి వారం లో ఈ టీజర్ ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కొంతమంది జులై మొదటి వారం లో కూడా ఈ టీజర్ విడుదల అవ్వొచ్చని అంటున్నారు. దీనిని బట్టీ చూస్తుంటే వచ్చే నెలలో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కచ్చితంగా రాబోతుంది అనేది స్పష్టంగా అర్థం అవుతోంది. అయితే ఈ చిత్రం ఆర్మీ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఒక లవ్ స్టోరీ కావడంతో , ఆగస్టు 15 న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తే , రీచ్ వేరే లెవెల్ లో ఉంటుంది కదా?, మేకర్స్ ఎందుకు ఆ దిశగా ఆలోచన చేయడం లేదు అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

ఈ ఏడాది ఆరంభం లో ‘రాజా సాబ్’ చిత్రం తో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్రమైన నిరాశకు గురయ్యారు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది అనే బాధ ఒకవైపు , సోషల్ మీడియా లో వచ్చిన ట్రోల్స్ మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ ని మానసిక వేదనకు గురయ్యేలా చేసింది. ఇలాంటి సమయం లో వాళ్లకు ఒక సూపర్ హిట్ సినిమా రావడం తప్పనిసరి. అందుకే ‘ఫౌజీ’ చిత్రం ఎట్టి పరిస్థితిలోనూ సూపర్ హిట్ అవ్వాలని అభిమానులు చాలా బలంగా కోరుకుంటున్నారు. మరి ఆ రేంజ్ కి ఈ చిత్రం వెళ్తుందా లేదా అనేది , వచ్చే నెలలో విడుదల అవ్వబోయే టీజర్ తో ఒక క్లారిటీ అయితే రాబోతుంది .

లెనిన్ మీద అంచనాలైతే లేవు... అఖిల్ ను కాపాడేది ఎవరు..?

Lenin Censor Review
Lenin Censor Review

Lenin Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జునకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. కెరియర్ స్టార్టింగ్ లో రొమాంటిక్ సినిమాలతో పేరు సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత మాస్ కమర్షియల్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబట్టుకున్నాడు. వైవిధ్యభరితమైన సినిమాలను చేయడంలో నాగార్జునను మించిన వారు ఎవరు లేరనెంతలా గుర్తింపును కూడా తెచ్చుకున్నాడు. ఇక అలాంటి నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో మరిన్ని సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు…అక్కినేని నట వారసులు అయిన నాగ చైతన్య, అఖిల్ లకు ఎన్ని సినిమాలు చేసిన కూడా వారికి ఏమాత్రం సక్సెస్ రావడం లేదు.

ఇక ఇలాంటి క్రమంలోనే వారి నుంచి రాబోతున్న సినిమాల విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ప్రస్తుతం నాగ చైతన్య ‘వృషకర్మ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక అఖిల్ సైతం డిఫరెంట్ సినిమాలైతే చేయడానికి సిద్ధమవుతున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఇప్పుడు చేస్తున్న లెనిన్ సినిమాతో సక్సెస్ ను సాధించి తన స్టామినా ఏంటో చూపిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

సినిమా ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు దాటినా కూడా ఒక్క సక్సెస్ కూడా లేని నట వారసుడు అఖిల్ అనే చెప్పాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక సక్సెస్ తో అయిన ముందుకు సాగుతున్నారు. కానీ అఖిల్ కి మాత్రం ఇప్పటివరకు ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. కారణం ఏంటంటే ఆయన ఎంచుకున్న కథలో క్వాలిటి ఉండటం లేదు.

అలాగే డైరెక్టర్ డైరెక్షన్ చేసేటప్పుడు అఖిల్ తన ఇన్పుట్స్ ఇస్తుంటాడట. ప్రస్తుతం అఖిల్ కి ఈ సినిమాతో సక్సెస్ పడితేనే ఆయన నిలదొక్కుకుంటాడు. లేకపోతే మాత్రం అతన్ని కాపాడే వారు ఎవరు ఉండరనేది వాస్తవం… ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు. కానీ అఖిల్ మాత్రం తన వైఖరి మార్చుకోకపోతే మాత్రం ఫ్యూచర్ లో స్టార్ హీరోగా మారే అవకాశాలైతే లేకుండా పోతాయి…

పెద్ది' ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది.. మేకర్స్ కి ఇంత తొందర ఎందుకు?

Peddi 2 Weeks Worldwide Collections
Peddi 2 Weeks Worldwide Collections

Peddi OTT release date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదలై 11 రోజులు పూర్తి అయినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద జోరు ఏ మాత్రం తగ్గలేదు. నేడు రెండవ సోమవారం అయినప్పటికీ అనేక ప్రాంతాల్లో హౌస్ ఫుల్స్ నమోదు అవ్వడం అందరినీ షాక్ కి గురి చేసింది. టిక్కెట్ రేట్స్ తగ్గడం తో ఫ్యామిలీ ఆడియన్స్ మరోసారి ఈ సినిమాకు క్యూలు కట్టడం మొదలు పెట్టారు. ఆ కారణం చేతనే ఈ సినిమాకు నేడు కూడా హౌస్ ఫుల్స్ నమోదు అయ్యాయని , మరో వారం రోజులు సాలిడ్ లాంగ్ రన్ ఉంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి నేడు కూడా తెలుగు రాష్ట్రాల నుండి 1.6 కోట్ల రూపాయిల షేర్ నుండి 1.8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాబడుతుందని అంటున్నారు.

మొదటి సోమవారం ఉండాల్సిన ఈ నంబర్లు , రెండవ సోమవారం ఉందంటే , లాంగ్ రన్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి బ్లాక్ బస్టర్ థియేట్రికల్ రన్ ఉన్న సినిమా , త్వరలోనే ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్. విడుదలకు ముందు ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ దాదాపుగా 140 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందట. థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాల తర్వాత , హిందీ మినహా, మిగిలిన అన్ని భాషల్లోనూ ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసుకోవచ్చని నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు. హిందీ వెర్షన్ 7 వారాల తర్వాత అందుబాటులోకి వస్తుంది. అయితే నిర్మాతలు కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం చూస్తే , ఈ సినిమా కచ్చితంగా జులై 1 లేదా 2 తేదీలలో విడుదల అవ్వాలి. ఈ తేదీలలోనే విడుదల చెయ్యాలని నెట్ ఫ్లిక్స్ సంస్థ కూడా ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది.

వచ్చే వారం లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారు అట. మరోవైపు ఈ చిత్రం లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన చికిరి చికిరి వీడియో సాంగ్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. అప్పుడే ఇంత మంచి పాటని యూట్యూబ్ లో విడుదల చేసినందుకు అభిమానులు మండిపడుతున్నారు. కేవలం ఈ పాటని థియేటర్స్ లో చూసేందుకు టిక్కెట్స్ కొనుగోలు చేసే ఆడియన్స్ చాలా మంది ఉంటారని , అలాంటిది ఇంత తొందరగా విడుదల చేయడం వల్ల, ఆ టిక్కెట్స్ మొత్తం పోయినట్టే కదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇకపోతే ఈ చిత్రం లో కొన్ని సన్నివేశాలను కట్ చేసి , మూడు కొత్త సన్నివేశాలను యాడ్ చేశారట. ఈ బుధవారం నుండి ఆ కొత్త సన్నివేశాలు థియేటర్స్ లో అందుబాటులోకి వస్తాయి.

చిరంజీవి - శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆగిపోయిందా..? అసలు ఏమి జరుగుతోంది..

Chiranjeevi And Srikanth Odela
Chiranjeevi And Srikanth Odela

Chiranjeevi And Srikanth Odela: గత రెండు మూడు రోజులుగా సినీ ఇండస్ట్రీ లో చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనల గురించి సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారాలు చూస్తుంటే , అసలు ఇండస్ట్రీ లో ఏమి అవుతుంది? అనే సందేహం రాక తప్పదు. ముఖ్యంగా నేచురల్ స్టార్ నాని ప్రాజెక్ట్స్ లో గందరగోళం నెలకొంది. ప్రస్తుతం ఆయన శ్రీకాంత్ ఓదెల తో ‘ది ప్యారడైజ్’ అనే చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం , ఆగస్టు 21 న ప్రేక్షకుల ముందుకు రావాలి. కానీ షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో , ఈ సినిమా మరోసారి వాయిదా పడినట్టు తెలుస్తోంది. దీంతో అసలు ఈ చిత్రం సెప్టెంబర్ లో వస్తుందా?, డిసెంబర్ లో వస్తుందా?, అసలు ఈ ఏడాది లో విడుదల అవుతుందా? అనే సందేహం అందరిలోనూ వ్యక్తం అయ్యింది.

ఇలాంటి క్రమం లో డైరెక్టర్ సుజిత్ ‘బ్లడీ రోమియో’ నుండి పక్కకు జరిగి ‘ఓజీ 2’ కి తన ఫోకస్ ని షిఫ్ట్ చేయడం , అసలు ‘బ్లడీ రోమియో’ ఉంటుందా లేదా అనే సందేహాలకు దారి తీసింది. ‘ది ప్యారడైజ్’ ఆలస్యం అవుతూ ఉండడం, అదే సమయంలో పవన్ కళ్యాణ్ నుండి కాల్ రావడంతో సుజిత్ ‘ఓజీ 2’ కి షిఫ్ట్ అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కాసేపు పక్కన పెడితే భవిష్యత్తులో నాని నిర్మాతగా , మెగాస్టార్ చిరంజీవి , శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో తెరకెక్కబోయే యాక్షన్ సినిమా కూడా అట్టకెక్కిందని నిన్నటి నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ‘ది ప్యారడైజ్’ ని శ్రీకాంత్ ఓదెల డీల్ చేస్తున్న విధానం నాని కి నచ్చలేదని , అందుకే ఈ మూవీ ని రద్దు చేసాడని , రకరకాల వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నాయి.

వీటి అన్నిటికి సమాధానం నాని మాత్రమే చెప్పాలి. ‘బ్లడీ రోమియో’ చిత్రం అయితే ఇప్పట్లో లేనట్టే అని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న సుజిత్, ఈ నెలాఖరున ఇండియా కి తిరిగి వస్తున్నదని , ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో ‘ఓజీ 2’ చర్చల్లో పాల్గొంటాడని అంటున్నారు. ఈ ఏడాది నవంబర్ నుండే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట. మరి నాని ‘బ్లడీ రోమియో’ సంగతి , చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ గురించి భవిష్యత్తులో ఇంకా ఎలాంటి వార్తలు రాబోతున్నాయో చూడాలి.

బి*కి*నీలో అందాల ‘సికిందర్’

Shama Sikander poolside photos
Shama Sikander poolside photos