Zomato Conde Nast List: మనదేశంలో తెలంగాణ పేరు ప్రస్తావనకు వస్తే.. అందులో హైదరాబాద్ పేరు మదిలో మెదిలితే వెంటనే బిర్యానీ గుర్తుకు వస్తుంది. హైదరాబాద్ బిర్యాని కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. హైదరాబాద్ నగరాన్ని సందర్శించడానికి వచ్చే వారంతా బిర్యానీ కచ్చితంగా ఆరగిస్తారు. అంతటి ప్రాశస్త్యం ఉన్న బిర్యానికి గుర్తింపు దక్కలేదు. చదువుతుంటే షాక్ కు గురయ్యారు కదా.. వాస్తవానికి మన బిర్యాని ప్రపంచంలోనే పేరుపొందిన వంటకం. ప్రపంచంలోనే గొప్ప గొప్ప హోటల్స్ మొత్తం మన హైదరాబాద్ లోనే ఉన్నాయి. అయితే అటువంటి హోటల్స్ ఇండియాలోని టాప్ 50 రెస్టారెంట్ల లో చోటు దక్కించుకోకపోవడం విశేషం.
జొమాటో కాండే నాస్ట్ IND పేరుతో ఒక జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో మనదేశంలోని ప్రఖ్యాత 50 రెస్టారెంట్ల వివరాలు రూపొందించింది. ఈ జాబితాలో ముంబై నుంచి 13, బెంగళూరు, ఢిల్లీ నుంచి తొమ్మిది చొప్పున చోటు దక్కించుకున్నాయి. టాప్ 4 లో ముంబైలోని ది టేబుల్, masque, papas, the Bombay canteen ఉన్నాయి. అయితే ఈ జాబితాలో హైదరాబాదు నుంచి ఒక్క రెస్టారెంట్ కూడా చోటు దక్కించుకోలేదు. హైదరాబాదులో ఎన్నో పేరుపొందిన రెస్టారెంట్లు ఉన్నప్పటికీ.. ఒక దానిని కూడా నిర్వాహకులు ఎంపిక చేయలేదు. దీని పట్ల సగటు హైదరాబాదీయులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాదులో తినకుండానే ఈ జాబితాను రూపొందించారని పేర్కొంటున్నారు.
హైదరాబాదులో పేరుపొందిన రెస్టారెంట్లు చాలా ఉన్నాయి. హోటల్స్ కూడా అధికంగా ఉన్నాయి. వీటిల్లో జొమాటో కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుంది. అయినప్పటికీ జొమాటో వీటికి చోటు కల్పించకపోవడం విశేషం. హైదరాబాద్ నగరంలో బావర్చి, ప్యారడైజ్, మెపిల్, షా అండ్ గౌస్ వంటి హోటల్స్ ఉన్నాయి. ఇన్ని ఫొటోస్ ఉన్నప్పటికీ ఇవి టాప్ 50 లో చోటు దక్కించుకోకపోవడం విశేషం.. వాస్తవానికి ఈ హోటల్స్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. వీటికి ఇతర దేశాలలో కూడా శాఖలు ఉన్నాయి. అయినప్పటికీ మనదేశంలో టాప్ 50 రెస్టారెంట్లలో చోటు దక్కించుకోకపోవడం విశేషం.