Today 4 October 2025 Horoscope: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ద్వాదశ రాశులపై శనివారం శతభిష నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఉద్యోగులకు ఈరోజు అనుకూల వాతావరణం ఉండనుంది. వ్యాపారులు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈ రోజు జీవిత భాగస్వామితో బాగానే ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండటమే మంచిది. వ్యాపారులకు విశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. శత్రువులు వ్యాపారుల పనులకు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. వీరు గతంలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు బిజీగా ఉంటారు. వ్యాపారులకు గతంలో ఏర్పడిన నష్టాలనుంచి బయటపడేందుకు ప్రణాళికలు వేస్తారు. విద్యార్థుల భవిష్యత్తుపై నిలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల అండతో కొన్ని వర్గాల వారు అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు పోటీ పరీక్షలో పాల్గొంటే ఈరోజు విజయం సాధించే అవకాశం ఉంది. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. విద్యార్థుల కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. కొత్తవారికి డబ్బు ఇచ్చే ప్రయత్నాలు చేయొద్దు. ఎందుకంటే ఇవి తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : వ్యాపారులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇదే సమయంలో శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉంటుంది. దీంతో అనుకున్న పనులు పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం ఉంది. అయితే అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి సమయంలో కాస్త సంయమనం మనం పాటించడమే మంచిది. ఇతరులతో విభేదాలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. ఇవి కొనసాగితే నష్టాలు ఉండే అవకాశం ఉంటుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఇవి భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో ఇప్పటికే వ్యాపారం ప్రారంభించిన వారు లాభాలు పొందుతారు. ఏమైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహా తీసుకోవాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. పోటీ పరీక్షలో పాల్గొనే విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉండనుంది. మీరు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధించడం జరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది . కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే పెద్దలను సంప్రదించాలి. తోటి వారితో కలిసి పెండింగ్ పనులను పూర్తి చేస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : . ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. గతంలో ఉన్న సమస్యలు ఈరోజు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే గురువుల మద్దతు ఉంటుంది. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల కెరియర్ పై నిర్ణయం తీసుకుంటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు సహ ఉద్యోగులతో సంతోషంగా ఉంటారు. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు ఉంటుంది. దీంతో అనుకున్న స్థాయిలో లాభాలు పొందుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఏమైనా విభేదాలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. జీవిత భాగస్వామితో వాదనలో ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మాటలను అదుపులో ఉంచుకోవాలి. ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఉపాధ్యాయులను కలుస్తారు. ఉద్యోగులు అనుకున్న పనులను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఆనందంగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఇతరులకు డబ్బులు ఇచ్చే పనులు మానుకోవాలి. లేకుంటే తీవ్ర నష్టాలు ఎదుర్కునే అవకాశం ఉంది. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయితే ఇలాంటి సమయంలో తోటి వారి మద్దతుతో అనుకున్న పనులను పూర్తి చేయాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు పెండింగ్ పనులను ఈరోజు పూర్తి చేస్తారు. విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉద్యోగులు కార్యాలయాల్లో కొత్తగా ప్రాజెక్టులను చేపడతారు. వీటిని పూర్తి చేయడానికి తోటి వారి మద్దతు తీసుకుంటారు. అధికారులు సైతం ఉద్యోగులకు మద్దతు ఉంటుంది. వ్యాపారులు గతంలో కంటే మెరుగైన లాభాలు సాధిస్తారు.