Shoaib Malik Divorce: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. మన దేశమే కాదు పాకిస్తాన్ మీడియా కూడా అతని గురించి కథనాలను ప్రసారం చేస్తోంది. సోషల్ మీడియాలో అయితే అతడి గురించి బీభత్సంగా చర్చ జరుగుతోంది. చాలామంది అతడిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు భూమి మీద ఎందుకు పుడతారంటూ మండిపడుతున్నారు.
షోయబ్ మాలిక్ సానియా మీర్జాను పెళ్లి చేసుకోవడానికి అంటే ముందే వివాహం జరిగింది. ఆయేషా అనే అమ్మాయిని అతడు 2002లో వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన తర్వాత ఎనిమిది సంవత్సరాల వరకు ఆమెతో బాగానే ఉన్నాడు. ఆ తర్వాత విడాకులు ఇచ్చాడు. 2010లో సానియా మీర్జాను వివాహం చేసుకున్నాడు. 13 సంవత్సరాలు ఆమెతో కాపురం చేశాడు. వీరిద్దరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 2023లో సానియా మీర్జాకు షోయబ్ మాలిక్ విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత 2024 లో సనా అనే నటిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి కంటే ముందే ఆమెతో రిలేషన్షిప్ కొనసాగించాడు. సనా జావేద్ పాకిస్తాన్లో పేరుపొందిన నటి. ఒక రియాల్టీ షోలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త సన్నిహిత సంబంధానికి దారితీసింది. ఆ తర్వాత వారిద్దరూ రిలేషన్ షిప్ కొనసాగించారు. ఈ విషయం తెలియడంతో సానియా మీర్జా దూరం జరిగింది. ఆమెకు విడాకులు ఇచ్చి సనాను వివాహం చేసుకున్నాడు షోయబ్ మాలిక్.
2024 లో సనా ను వివాహం చేసుకున్న షోయబ్ మాలిక్ ఏడాది పాటు ఆమెతో బాగానే ఉన్నాడు. ఆ తర్వాతే సనాకు అసలు విషయం అర్థమైంది. దీనికి తోడు షోయబ్ మాలిక్ విలాస పురుషుడు కావడంతో.. మరో అమ్మాయికి దగ్గరైనట్టు తెలుస్తోంది. దీంతో సనాకు విడాకులు ఇచ్చినట్టు సమాచారం. అయితే షోయబ్ మాలిక్ రిలేషన్ కొనసాగిస్తున్న ఆ అమ్మాయి ఎవరనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది..
సానియా మీర్జాకు విడాకులు ఇచ్చినప్పుడు షోయబ్ మాలిక్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా భారత్ లోని సానియా మీర్జా అభిమానులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఇలా మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మండిపడ్డారు. చివరికి సానియా మీర్జాను కూడా వదిలిపెట్టలేదు. చక్కగా ఇండియన్ ముస్లిం పెళ్లి చేసుకుని ఉంటే పరిస్థితి బాగుండదని.. అనవసరంగా పాకిస్తాన్ దేశస్థుడిని పెళ్లి చేసుకొని సానియా మీర్జా పరువు తీసుకుందని వాపోయారు. చివరికి సానియాకి విడాకులు ఇచ్చి.. సనాను పెళ్లి చేసుకుంటే..ఆమెకు కూడా విడాకులు ఇచ్చి మాలిక్ తన అసలు స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు.