World’s Oldest Hotel : ప్రస్తుతం సమాజం అత్యంత ఆధునికత వైపు పరుగులు తీస్తోంది.. రోజురోజుకు కొత్తదానాన్ని కోరుకుంటున్నది. అయితే అప్పుడప్పుడు నెమరు వేసుకోవడానికి పాత విషయాలు కూడా ఉండాలి. ఎందుకంటే పాత విషయాల ద్వారానే మన చరిత్ర తెలుస్తుంది. మన గతకాలం కళ్ళముందు కనిపిస్తుంది.
World’s Oldest Hotel : గతకాలం కళ్ళముందు కనిపించినప్పుడు.. వర్తమానానికి, దానికి తేడా ఏమిటో మనకు అవగతం అవుతుంది. అయితే ఇప్పటి కాలంలో ఆధునికతను ఎంతగా ఆస్వాదిస్తున్నారో.. పాత విషయాలను తెలుసుకోవడానికి కూడా అంతే ఆసక్తిని చూపిస్తున్నారు. పైగా నేటి కాలంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. తద్వారా పాత విషయాలపై పరిశీలన కూడా మొదలైంది. ముఖ్యంగా నేటి కాలంలో పరిశోధకులు పాత విషయాలపై సునిశిత పరిశీలన చేస్తున్నారు . అంతేకాదు వాటిని ఆధునిక కాలానికి అనుసంధానించి.. చేయాల్సిన మార్పులను.. నేర్చుకోవలసిన విషయాలను వెల్లడిస్తున్నారు. ఇలా చరిత్రకారుల పరిశోధనలో.. ఒక పురాతన హోటల్ కనిపించింది. కాకపోతే ఇదేమీ కాలగర్భంలో కలిసిపోలేదు. ఇప్పటికి కస్టమర్లకు సేవలు అందిస్తూనే ఉంది. వారికి నచ్చిన ఫుడ్ సర్వ్ చేస్తూనే ఉంది.
జపాన్ దేశంలోని ఈ యమా నాసి ప్రాంతంలో నిషియామా అన్సెస్ కేయుంకాన్ అనే ప్రాంతంలో ఒక హోటల్ ఉంది. 705 సంవత్సరంలో దీని ప్రారంభించారు. దాదాపు 1300 సంవత్సరాల నుంచి ఈ హోటల్ నిరంతరాయంగా కస్టమర్లకు సేవలు అందిస్తూనే ఉంది. వారికి నచ్చిన ఫుడ్ సర్వ్ చేస్తూనే ఉంది. జపాన్ లో భూకంపాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ప్రకృతి విపత్తులు ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆయనప్పటికీ కూడా ఈ హోటల్ చెక్కుచెదరకుండా ఉంది. కస్టమర్లకు సేవలు అందిస్తూనే ఉంది. గతంలో చుట్టుపక్కల ప్రాంతంలో భూకంపాలు చోటు చేసుకున్నా.. ఈ హోటల్ దృఢంగానే ఉంది. ఏనాడు కూడా కస్టమర్లకు సేవలు అందించే విషయంలో నిర్వాహకులు రాజీ పడలేదు. ఇక ఈ హోటల్ ప్రారంభించిన నాటి నుంచి ఒకే కుటుంబం సేవలు అందిస్తోంది. ఇప్పటికీ 52 తరాలు గడిచిపోయాయి. అయినప్పటికీ ఈ హోటల్ నిర్వహణ ఆగడం లేదు.
జపాన్ దేశానికి చెందిన సాంప్రదాయ వంటకాలు ఇక్కడ ఎక్కువగా లభిస్తుంటాయి. ముఖ్యంగా నూడిల్స్, సూప్ లు ఇక్కడ ఎక్కువగా లభ్యమవుతుంటాయి. ఇక్కడ లభించే జింజర్ సూపర్, చికెన్ నూడుల్స్ అద్భుతంగా ఉంటాయి. వీటిని తినడానికి పర్యాటకులు ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంటారు.. ఈ హోటల్ నిర్మాణంలో ఇనుము, చెక్క, ఎర్రమట్టి ఉపయోగించారు. గోడల మధ్య దృఢత్వం ఉండడానికి బంక మట్టి వినియోగించారు. తద్వారా ఈ హోటల్ దృఢంగా ఉంది. వందల సంవత్సరాలు గడిచినప్పటికీ సేవలు అందిస్తూనే ఉంది. ప్రపంచంలో ఈ స్థాయిలో ఏ హోటల్ కూడా సేవలు అందించలేదని జపాన్ దేశానికి చెందిన చరిత్రకారులు చెబుతున్నారు. హోటల్ ద్వారా జపాన్ దేశానికి చెందిన సంప్రదాయ వంటలు టూరిస్టులకు తెలిసే అవకాశం ఉంటుందని.. తద్వారా టూరిజం పెరగడానికి అవకాశం ఏర్పడుతుందని జపాన్ చరిత్రకారులు వివరిస్తున్నారు.