Homeవింతలు-విశేషాలుWoman Cried at Italy Airport: ఈ అక్కకు ఏమైంది.. ఎయిర్ పోర్ట్ లో చిన్నపిల్లలా...

Woman Cried at Italy Airport: ఈ అక్కకు ఏమైంది.. ఎయిర్ పోర్ట్ లో చిన్నపిల్లలా ఎందుకు ఏడ్చింది? కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు (వీడియో వైరల్)

Woman Cried at Italy Airport: అది విమానాశ్రయం.. వచ్చే ప్రయాణికులు, పోయే ప్రయాణికులతో విపరీతమైన రద్దీగా ఉంది. అలాంటి చోట ఓ మహిళ కింద పడింది. అటు ఇటు పోర్లు దండాలు పెట్టింది. అదే స్థాయిలో అరిచింది. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది. ఆ వీడియో తెగ వైరల్ గా మారింది. అక్కడ ఆ మహిళ ఏడుస్తూ ఉన్న దృశ్యాలను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇటలీలోని మిలాన్ మాల్ఫెన్సా విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ఆ మహిళ లగేజ్ బరువు పరిమితికి మించి ఉంది. పరిమితికి మించి లగేజీ బరువు ఉంటే ఫ్లైట్ లో ప్రయాణం చేయడానికి అధికారులు అనుమతించారు. ఆ ప్రయాణికురాలికి కూడా అదే అనుభవం ఎదురయింది.

అదనపు చార్జీలు చెల్లించాలని అనడంతో..
ఎక్కువ బరువు ఉన్న లగేజీ కోసం అదనపు చార్జీలు చెల్లించాలని అక్కడి అధికారులు ఆమెకు స్పష్టం చేశారు. ఒకవేళ డబ్బులు చెల్లించడం వీలు కాకపోతే ఆ లగేజీ చెక్ ఇన్ సూట్ లో పెట్టుకోవాలని ఆ ప్రయాణికురాలికి అధికారులు స్పష్టం చేశారు. ఆ బరువు మొత్తాన్ని తనతో పాటు తీసుకెళ్తానని ఆ ప్రయాణికురాలు చిన్న పిల్ల మాదిరిగానే గొడవ చేసింది. కింద పడి దొర్లింది. చేతులు, కాళ్లను నేలకేసి కొట్టింది. అంతేకాదు విపరీతమైన రభస సృష్టించింది. అయితే ఆమె సృష్టించిన బీభత్సాన్ని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత ఆ ప్రయాణికురాలు విమానాశ్రయంలో ఉన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారు ఎంత చెప్పినా కూడా ఆమె వినిపించుకోలేదు. ఫలితంగా ఆమెను విమానం ఎక్కడానికి అధికారులు ఒప్పుకోలేదు. అనంతరం ఆ మహిళ సర్దుకున్న తర్వాత.. అధికారులు ఇంకో విమానానికి టికెట్ బుక్ చేశారు. ఆ తర్వాత అందులో ఆమెను పంపించారు..

నెటిజన్లు ఏమంటున్నారంటే..
ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీయడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ” ఇలా రచ్చ చేసి.. అధికారులలో ఒప్పించాలి అనుకుంటే కష్టమే.. ఇలాంటి నాటకాలకు ఈ రోజుల్లో కాలం చెల్లిపోయింది. ఇటీవల కాలంలో ప్యాసింజర్లు విమానాశ్రయాలలో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం పెరిగిపోయింది. గత నెలలో కూడా చికాగో విమానాశ్రయంలో ఓ ప్యాసింజర్ కంప్యూటర్ మానిటర్ ను చేతితో పట్టుకొని సిబ్బందిపై విసిరివేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా విమానాశ్రయ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. విమానాశ్రయంలో భద్రతను పెంచాలి. ప్రయాణికులకు నిబంధనల గురించి వివరించాలని” నెటిజన్లు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version