Kajal Aggarwal Turns Director: యూత్ ఆడియన్స్ లో కలల రాకుమారి గా ముద్ర వేసుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal). ఈ పేరు వింటేనే అభిమానుల్లో ఒక వైబ్రేషన్ మొదలు అవుతుంది. ‘లక్ష్మీ కళ్యాణం’ అనే సినిమాతో మొదలైన కాజల్ అగర్వాల్ కెరీర్ ‘చందమామ’ చిత్రం తో సరికొత్త మలుపు తిరిగింది. ఇక ‘మగధీర’ చిత్రం అయితే ఆమెని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మార్చేసింది. ఈ చిత్రం తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగు,తమిళ భాషల్లో దాదాపుగా సూపర్ స్టార్స్ అందరితో సినిమాలు చేసి లేడీ సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగింది. కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే గౌతమ్ కిచులు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. రీసెంట్ గానే రీ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ సినిమాలు చేస్తుంది కానీ, ఒకప్పటి రేంజ్ లో అవకాశాలు రావడం లేదు.
హీరోయిన్ ఛాన్స్ కేవలం సీనియర్ హీరోల సినిమాల్లోనే వస్తున్నాయి. ప్రస్తుత పాన్ ఇండియన్ హీరోల చిత్రాల సినిమాల్లో ఈమెకు హీరోయిన్ రోల్స్ దొరకడం కష్టమే. అందుకే నెమ్మదిగా క్యారక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తుంది. రీసెంట్ గానే సల్మాన్ ఖాన్ ‘సికిందర్’ చిత్రం లో ఒక మంచి క్యారక్టర్ చేసింది. త్వరలో విడుదలయ్యే ‘కన్నప్ప’ లో కూడా ఈమె పార్వతి క్యారక్టర్ చేసింది. ఇవి రెండు కాకుండా హిందీ నితీష్ తివారి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ లో ఈమె మండోదరి క్యారక్టర్ చేస్తుంది. ఇలా వరుసగా క్యారక్టర్ రోల్స్ చేస్తూ విలక్షణ నటిగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. భవిష్యత్తులో పూర్తి స్థాయి విలన్ పాత్ర దొరికిన చేసేందుకు సిద్దమే అంటుంది కాజల్ అగర్వాల్. ఇదంతా పక్కన పెడితే నేటి తరం హీరోయిన్స్ ఎవ్వరూ కూడా చెయ్యని విన్నూతన ప్రయత్నం చేసేందుకు కాజల్ అగర్వాల్ సిద్ధం అవుతుంది.
Also Read: Kajal Agarwal : టాలీవుడ్ లో తనకు ఇష్టమైన హీరో ఎవరో ఓపెన్ గా చెప్పేసిన కాజల్ అగర్వాల్!
త్వరలోనే ఆమె ఒక సినిమాకు దర్శకత్వం వహించబోతుందట, అందులో ఆమె కీలక పాత్ర కూడా చేయబోతుందట. ఈ చిత్రం లో హీరో ఎవరు?, నిర్మాత ఎవరు?, కథ కూడా కాజల్ అగర్వాల్ రాకుండా?, లేకపోతే వేరే రైటర్ రాసిన కథతో చేయబోతుందా? వంటి ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. కానీ ఆమె మాత్రం దర్శకత్వ వహించేందుకు రెడీ అయ్యిందని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న వార్త. హీరోయిన్స్ లో ఆ రోజుల్లో మహానటి సావిత్రి ఒక్కటే ఇలాంటి ప్రయోగం చేసి సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ వచ్చారు,ఒక్కరు కూడా దర్శకత్వం వైపు ఆలోచించలేదు, కానీ కాజల్ అగర్వాల్ మాత్రం ఆ దిశగా అడుగులు వేస్తుంది. హీరోయిన్ గా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన కాజల్ అగర్వాల్ , ఈ సరికొత్త ప్రయాణం లో సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది చూడాలి