Winter Season Trip: పచ్చని ప్రదేశంలో ప్రశాంతంగా జీవించడం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి వరకు నగరాల్లో జీవించిన వారు ప్రశాంతత కోసం ఇలాంటి ప్రదేశాలకు వీకెండ్ డేస్ లో వెళ్తూ ఉంటారు. అయితే రెండు లేదా అంతకంటే ఎక్కువ రోజులపాటు విహారయాత్రలకు వెళ్లాలనుకుంటే గ్రీనరీ కలిగిన ప్రదేశం ఎక్కడ ఉంది? అన్న ప్రశ్న చాలా మందిలో తలెత్తుతూ ఉంటుంది. ఇలాంటి వారి కోసం దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తుంది కేరళ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఉన్న పచ్చదనం ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశానికి మూడు వైపులా సముద్ర తీరం ఉంటే.. పశ్చిమాన అరేబియా సముద్రం ఉంటుంది. ఈ సముద్రానికి ఒడ్డున ఉన్న కేరళ రాష్ట్రం ఎప్పుడూ పచ్చదనాన్ని సంతరించుకొని ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలం పూర్తయిన తర్వాత ఇక్కడే ప్రదేశాలన్నీ ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అందుకే వింటర్ సీజన్ ప్రారంభం కాగానే ఇక్కడికి విహారయాత్రలకు వెళ్లడం చాలా ప్రశాంతమైన వాతావరణంలో గడపవచ్చు అని కొందరు అంటుంటారు. ముఖ్యంగా కేరళలోని తిరువనంతపురం ఈ సమయంలో మంచి ప్రదేశం అని అంటూ ఉంటారు. తిరువనంతపురంలోని కోవలం బీచ్ ఈ సమయంలో ప్రశాంతతను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న పచ్చిక బయలు గ్రీనరీతో మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. కోవలం బీచ్ తో పాటు తిరువనంతపురం పట్టణంలో ఉన్న పద్మనాభ స్వామి ఆలయం మానసికంగా ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అతి పురాతనమైన ఆలయం మాత్రమే కాకుండా ఇక్కడ ఎన్నో విశేషాలు కలిగి ఉన్నాయి. అందువల్ల ఈ సీజన్లో ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉండొచ్చు.
తిరువనంతపురం సమీపంలో కొన్ని గ్రామాల మధ్య ఉన్న నదులు మనసును హాయిని కలిగిస్తాయి. ఈ గ్రామాలకు పడవల ద్వారా ప్రయాణం చేయడం మరింత ఉత్సాహం ఇస్తుంది. అంతేకాకుండా ఈ ప్రదేశం సముద్రానికి దగ్గరగా ఉండడంతో సముద్రం వైపు కూడా బోటు షికారు చేయొచ్చు. వీటితోపాటు కొండలు పూర్తిగా పచ్చదనాన్ని కలిగి ఉంటాయి. పచ్చికా భయాలతో ఉండడంవల్ల ఇక్కడ చాలామంది విశ్రాంతి తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు.
ఇవే కాకుండా కేరళలో సంస్కృతి సంప్రదాయాలు వెల్లువిరుస్తాయి. ఇక్కడ జరిగే కార్యక్రమాలు, సాంప్రదాయాలు కొత్త వాతావరణాన్ని కలిగిస్తాయి. అలాగే పద్మనాభస్వామి గుడికి సమీపంలో మరికొన్ని ప్రత్యేకమైన ఆలయాలు కూడా ఉన్నాయి. వీటిని సందర్శించడం వల్ల ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక కేరళలో షాపింగ్ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎక్కువగా నార చీరలు దొరుకుతూ ఉంటాయి. ఈ చీరలను పండుగలు, ధరిస్తుంటారు. వీటిని కొనుగోలు చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి తరలివస్తారు. అంతేకాకుండా అరుదైన ఆయుర్వేదిక మూలికలు కూడా తిరువనంతపురంలో లభిస్తాయి. ఇక్కడ లభించే ఆయుర్వేదిక మూలికల ద్వారా కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుందని చెబుతారు. మొత్తంగా వింటర్ సీజన్ లో కేరళ లోని తిరువనంతపురం సందర్శిస్తే మనసుకు హాయిని ఇస్తుందని చాలామంది చెబుతూ ఉంటారు.