Strange Things : చారిత్రక వస్తువులను వెలికి తీయడం మనదేశంలో ఎప్పటినుంచో ఉంది. వెనుకటి కాలం నాటి సంస్కృతి, సంప్రదాయాలు ప్రస్తుత తరానికి తెలియాలంటే కచ్చితంగా తవ్వకాలు జరపాల్సిందే. అందులో లభ్యమైన వస్తువులకు కార్బన్ కోటింగ్ నిర్వహిస్తే.. అవి ఏ కాలం నాటివో తెలిసిపోతాయి. వాటి గురించి మరింత లోతుగా పరిశోధన చేస్తే సరికొత్త విషయాలు వెలుగు చూస్తాయి. ఇప్పటివరకు చారిత్రాత్మక అంశాల గురించి పరిశోధకులు ఇదే విధంగా ప్రయోగాలు చేశారు. పరిశీలన జరిపారు. తవ్వకాలు చేపట్టారు. ఇప్పటికి ఏదో ఒకచోట తవ్వకాలు జరుపుతూనే ఉంటారు..
సోషల్ మీడియా వాడకం ఎక్కువైన తర్వాత తవ్వకాలకు సంబంధించిన వీడియోలు పెరిగిపోయాయి. ఏదో ఒకచోట జరుగుతున్న తవ్వకాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఎవరో ఒకరు పోస్ట్ చేయడం.. అది వైరల్ గా మారడం పరిపాటి అయిపోయింది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఓ వ్యక్తి చారిత్రాత్మక ఆధారాల కోసం భూమిని తవ్వాడు. ఆ తవ్వకాలలో ఒక పురాతనమైన మట్టికుండ లాంటి కూజా బయటపడింది. దాని చుట్టూ ఎక్కువగా మట్టి ఉండడంతో.. బయటకు తీయడం దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో గత్యంతరం లేక ఆ వ్యక్తి ఆ కూజాను రెండుగా పగలగొట్టాడు.
అలా కూజాను పగలగొట్టగా అందులో నుంచి ధగధగ మెరుస్తూ కొన్ని వస్తువులు కనిపించాయి. వాటిని చూడగా గాజులు, ఆభరణాల మాదిరి దర్శనమిచ్చాయి. ఇంతకీ అవి బంగారానివా, లేక మరొక లోహానికి సంబంధించినవా? అనేవి తెలియాల్సి ఉంది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానిని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో బంగారు నిధి దొరికిందని చెబుతుంటే.. మరికొందరేమో ఫేమస్ కావాలని ఇలాంటివి చేస్తున్నారని కామెంట్ చేశారు. కామెంట్స్ సంగతి ఎలా ఉన్నప్పటికీ ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.