Earth: సమయానికి వర్షాలు కురవడం లేదు.. చల్లగాలులు వీచడం లేదు. ఎండ మాత్రం దంచి కొడుతోంది. కాలానికి అనుగుణంగా వర్షాలు కురువకపోగా.. అదును దాటి పోయి వానలు కురుస్తున్నాయి. అంతేకాదు పంటలు కోత దశలో ఉన్నప్పుడు తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తున్నాయి. ఈ క్రమంలో భూమ్మీద ఇంతటి విపత్కర పరిస్థితులు ఎప్పటిదాకా ఉంటాయి?! అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోంది? అనే విషయాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇటీవల కొన్ని ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాల ద్వారా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం ఏర్పడింది. అప్పటినుంచి అనేక అద్భుతాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఎన్నో రహస్యాలు దాగి ఉంటూనే ఉన్నాయి. శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నప్పటికీ ఈ రహస్యాల గుట్టు వీడడం లేదు. అయితే ఇటీవల జపాన్ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాలలో వారికి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ ప్రయోగం ద్వారా తెలిసిన ఫలితం శాస్త్రవేత్తలను సరికొత్త దిశగా అడుగులు వేసేలా చేస్తోంది.
ప్రస్తుతం ఈ విశ్వం టెంపరేచర్ 2.7k (కెల్విన్) ఉన్నది. అయితే ఏడు బిలియన్ సంవత్సరాల క్రితం 5.13 కెల్విన్ (-268 degree Celsius) ఉండేదని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్ గ్రౌండ్ పరిశీలన వల్ల విశ్వం క్రమంగా అప్పట్లో చల్లబడిందని.. ఆ తర్వాత భూ వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల ఉష్ణోగ్రత పెరిగిందని తెలుస్తోంది.. అయితే ఇటీవల కాలంలో భూ ఉపరితలంపై కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. దీనికి తోడు అభివృద్ధి పేరుతో అడ్డగోలుగా వృక్షాలను కొట్టేస్తున్నారు. ప్రకృతి గమనాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు. అందువల్లే ఉపరితంలో విపరీతంగా ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందువల్లే భూమి వేడి పెరిగిపోతోంది. భూమి వేడి పెరిగిపోవడం వల్ల ధ్రువ ప్రాంతాలు కరిగిపోతున్నాయి. సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి.. ఇప్పటికే అనేక జంతువులు కాలగర్భంలో కలిసిపోయాయి. చాలావరకు జంతువులు అంతర్దాన దశలో ఉన్నాయి..
శీతల ప్రాంత దేశాలలో మాత్రం ఉష్ణోగ్రతలు శీతకాలం సమయంలో దారుణంగా పడిపోతున్నాయి. ఇక్కడ హిమపాతం తీవ్రంగా చోటుచేసుకుంటున్నది. ఇక వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఈ ప్రాంతాలలో తీవ్ర స్థాయిలో చోటుచేసుకుంటున్నాయి. గడచిన కొన్ని సంవత్సరాలుగా యూరప్, అమెరికా ప్రాంతాలలో విపరీతంగా మంచు కురుస్తోంది. అదే సమయంలో వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.