Baahubali The Epic Collection Day 5: లాంగ్ రన్ లో కొత్త సినిమాలకు కూడా థియేట్రికల్ రన్ దక్కని రోజులివి. భారీ బడ్జెట్ తో సినిమాలు తీసినా కూడా నాలుగైదు రోజులకు మించి పెద్ద గ్రాస్ వసూళ్లు కనిపించడం లేదు. అలాంటిది ఒక రీ రిలీజ్ చిత్రం, విడుదలైన రోజు నుండి నేటి వరకు స్టడీ కలెక్షన్స్ తో దూసుకుపోవడం ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. కేవలం ‘బాహుబలి : ది ఎపిక్'(Bahubali: The Epic) విషయం లోనే ఇది జరిగింది. బాహుబలి రెండు భాగాలను కలిపి, కొన్ని కొత్త సన్నివేశాలతో ‘బాహుబలి : ది ఎపిక్’ గా రీసెంట్ గానే రీ రిలీజ్ చేశారు. దీనికి ఆడియన్స్ మొదటి రోజున దాదాపుగా 20 కోట్ల రూపాయిల గ్రాస్ ఓపెనింగ్ ని అందించారు. కొన్ని మీడియం రేంజ్ హీరోల కొత్త సినిమాలకు కూడా దక్కని ఓపెనింగ్ ఇది. కేవలం ఒక్క ఓపెనింగ్స్ తో సరిపెట్టుకోవాల్సిందే, లాంగ్ రన్ కష్టమని అంతా అనుకున్నారు.
కానీ ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 5వ రోజు వచ్చిన వసూళ్లు, నాల్గవ రోజు కంటే తక్కువ అనే వాస్తవాన్ని మీరు నమ్ముతారా?. కానీ నిజంగానే అది జరిగింది. నాల్గవ రోజున ఈ చిత్రానికి 2 కోట్ల 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తే, 5వ రోజున ఏకంగా 3 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 5 రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 46 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే, తెలుగు రాష్ట్రాల నుండి ఇప్పటి వరకు ఈ చిత్రానికి 19 కోట్ల 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, కర్ణాటక నుండి 4 కోట్ల 15 లక్షలు, తమిళనాడు + కేరళ నుండి 3 కోట్ల 20 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 6 కోట్ల 95 లక్షలు, ఓవర్సీస్ నుండి 11 కోట్ల 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఈమధ్య కాలం లో ఒక సినిమాకు ఈ రీ రిలీజ్ సినిమాకు ఈ రేంజ్ గ్రాస్ రావడం ఎప్పుడూ జరగలేదు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే, ఇప్పట్లో థియేట్రికల్ రన్ ఆగేలా కనిపించడం లేదు. మరో వారం రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారిగా వచ్చిన వసూళ్లను పరిశీలిస్తే, నైజాం నుండి 10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ నుండి 2 కోట్ల 10 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్ నుండి 7 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 19 కోట్ల 85 లక్షలు వచ్చాయి. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి రికార్డు ని కొట్టొచ్చేమో కానీ, ఓవర్సీస్ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో మాత్రం ముట్టుకోవడం కూడా కష్టమే.