Viral Video: సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలను చాలామంది వీక్షిస్తుంటారు. పెళ్లిలో జరిగే కొన్ని సంఘటనలు కొందరు వీడియోలను తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. స్నేహితులు, బంధువులు, ప్రముఖులు ఎంతో మంది మధ్య జరిగే ఈ వేడుక లో ఎక్కడో ఒకచోట పొరపాటు జరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా స్నేహితులు పెళ్ళికొడుకు, పెళ్లికూతురును ఆటపట్టించే సంఘటనలు అందరిని నవ్విస్తాయి. తాజాగా జరిగిన ఓ సంఘటనతో అందరూ నవ్వుకున్నారు. ఇంతకీ ఏం జరిగింది?
వధూవరులు పెళ్లి జరిగిన తర్వాత వేదిక పైకి వచ్చారు. ఈ సందర్భంగా ఒకరినొకరు దండలు మార్చుకుంటున్నారు. అయితే ఈ సమయంలో వధువు మెడలో వరుడు దండ వేసే క్రమంలో ఒకేసారి టపాసు పేలింది. దీంతో ఒక్కసారిగా వరుడు భయపడిపోయాడు. అయితే వధువు మాత్రం కొంచెం కూడా భయపడకుండా ఉండిపోయింది. దీంతో పెళ్లి కొడుకు భయపడిపోయి.. పెళ్లికూతురు ధైర్యంగా ఉండడంపై అందరూ నవ్వుకున్నారు. కానీ పెళ్ళికొడుకుకు మాత్రం టపాసు పిలిచిన వారిపై కోపం వచ్చింది.
అయితే ఇది ఎవరో ఆట పట్టించడానికి చేశారు. కానీ అక్కడ ఉన్న వారందరినీ నవ్వులు తెప్పించింది. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా వరకు జరిగాయి. అయితే కొందరు దీనిని సరదాగా తీసుకున్నా.. మరికొందరు మాత్రం సీరియస్గా తీసుకున్న సంఘటనలు ఉన్నాయి. అయినా కూడా స్నేహితులు పెళ్లిలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వింత చేష్టలు చేస్తూనే ఉంటారు. ఇంతకాలం తమతో కలిసి ఉన్న స్నేహితుడు లేదా స్నేహితురాలు ఇకపై తమతో కలిసి ఉండరు అంటూ చేసిన వీడియోలు కూడా ఆసక్తిని రేపుతాయి. అలాగే కొన్ని సందర్భాల్లో వధూవరులు డాన్సులు చేసిన సీన్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ కొత్త వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీనిని చాలామంది వీక్షిస్తున్నారు. నేటి కాలంలో మగవారి కంటే ఆడవారే ధైర్యంగా ఉంటున్నారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం అని కొందరు కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా మరికొందరు భవిష్యత్తులో కూడా ఇలాగే భయపడుతూ ఉంటావు అని మెసేజ్ చేశారు. ఏది ఏమైనా ఈ వీడియో ఫన్నీగా మారింది.