AP Viral News: డబ్బు ముందు మనుషులు బలాదూర్. సంబంధాలు బలాదూర్. ఆత్మీయత బలాదూర్. అన్నీ బలాదూర్. డబ్బుల కోసం కట్టుకున్న వాళ్లను చంపుకుంటున్న పాపపు కాలమిది. పచ్చ నోట్ల కోసం అయిన వాళ్లను అత్యంత దారుణంగా దూరం చేసుకుంటున్న దుర్మార్గపు కాలమిది. ఇటువంటి దినాలలో ఈమె ఒక తులసి మొక్క. ఆమె భర్త చందనపు చుక్క. ఇంతకీ వాళ్ళ కథ ఏంటంటే..
ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. వారు ఏ ప్రాంతానికి చెందినవారో తెలియదు. కాకపోతే వారికి సంబంధించిన కథ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారంలో ఉంటున్నది. సోషల్ మీడియాలో కనిపిస్తున్న దృశ్యం ప్రకారం వారిద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారిగా కనిపిస్తున్నారు. ఆ మహిళ వస్త్రధారణ ఆదివాసీల శైలిని ప్రతిబింబిస్తోంది. అతను కూడా ఆదివాసీలు ధరించినట్టుగానే దుస్తులు ధరించాడు. ఇటీవల అతడికి ఆరోగ్యం బాగోలేదు. దీంతో భర్తను కాపాడుకునేందుకు ఆమె ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. భర్త కన్నుమూయడంతో గుండెలు పగిలే విధంగా రోధించింది. రాజా వెళ్లిపోయావా అంటూ అక్కడే కుప్పకూలిపోయింది. ఈలో గానే ఆసుపత్రి సిబ్బంది వచ్చారు. మీ ఆయన పేరు మీద భూమి ఉంది కాబట్టి.. పోస్టుమార్టం చేస్తే ఐదు లక్షలు వస్తాయని చెప్పారు. దానికి ఆమె చెప్పిన సమాధానం విని ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆమెను అలా చూస్తూ ఉండిపోయారు.
వాస్తవానికి తన భర్త శరీరానికి పోస్టుమార్టం చేస్తే.. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఐదు లక్షలు ఇస్తుంది. కానీ చనిపోయినప్పటికీ తన భర్త ఇంకా సజీవంగానే ఉన్నాడని ఆమె అనుకుంటున్నది. అంతేకాదు పోస్టుమార్టం చేయడానికి ఒప్పుకోలేదు. అలా చేస్తే తాను తట్టుకోలేడని.. ఆమె ఆసుపత్రి సిబ్బందితో చెప్పింది..” నా రాజు ఎప్పటికీ నా గుండెల్లో రాజే. అతడు చిన్న నొప్పిని కూడా తట్టుకునేవాడు కాదు. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా అతని శరీరాన్ని కోయాలి అంటున్నారు. అంతటి బాధను అతడు తట్టుకోలేడు. అతడిని కోసి ఇచ్చిన ఐదు లక్షలు నాకు వద్దు. నాకు అలా ఇచ్చే ఐదు లక్షలు గడ్డిపరకతో సమానమని” ఆ ఇల్లాలు చెప్పింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తన భర్త మీద ఆమెకున్న ప్రేమను చూసి కదిలిపోయారు. కరిగిపోయారు.
ఈ సంఘటనలో చనిపోయిన ఆ వ్యక్తి నిజంగానే రాజు. ఇంకా లోతుగా మాట్లాడితే హృదయ సామ్రాట్ కూడా. తన భార్య మనసు అనే రాజ్యాన్ని ఎంతో గొప్పగా పరిపాలించాడు. ఎంతో ప్రేమతో ఆమెను చూసుకున్నాడు. జీవితానికి సరిపడా అనుభూతులను ఆమెకు ఇచ్చాడు. తన శరీరాన్ని కోసి.. ఓట్లు వేసి ఇచ్చే ఐదు లక్షలను ఆమె గడ్డి పరకలా తీసి పడేసిందంటే అతడు ఏ స్థాయిలో ప్రేమను పంచి ఉండాలి.. ఇంతటి సామ్రాజ్యలక్ష్మిని సొంతం చేసుకున్న అతడు నిజంగానే రాజాధిరాజు.
మరణించిన తన భర్త మృత దేహానికి
పోస్ట్ మార్డం చేస్తే ఆ భార్యకి 5 లక్షలు వస్తాయివారి జీవనధారం : మేకలు కాసుకొని జీవించడం
ఆవిడ హాస్పిటల్ సిబ్బందితో చెప్పిన మాటలు
నా భర్తను కోసి ఇచ్చే 5 లక్షలు నాకు ఎందుకు
నా రాజు ఆ నొప్పి భరించలేడుఅవును నిజంగా అతను రాజే
ఇంకా గట్టిగ మాట్లాడితే… pic.twitter.com/CSC14evER5— South Digital Media (@SDM_official1) September 22, 2025