Abhishek Sharma Viral Video: మొన్న ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. టీమ్ ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పట్టిష్టమైన పాకిస్తాన్ బౌలింగ్ లైన్ అప్ మొత్తాన్ని ఉతికి ఆరేశాడు. బౌలర్ ఎవరనేది లేక పెట్టలేదు. బంతి ఎలా వేస్తున్నారో చూడలేదు. కేవలం బాదుడినే లక్ష్యంగా పెట్టుకున్నాడు. వేగంగా పరుగులు తీస్తూ పాకిస్తాన్ జట్టుకు చుక్కలు చూపించాడు. అతడు ఆడుతున్నంత సేపు మైదానంలో ఈలలు , గోలలు.. ఇక భారత అభిమానులైతే పాకిస్తాన్ ప్లేయర్లను ఒక రేంజ్ లో ర్యాగింగ్ చేశారు.
భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టే బంతులు వేయలేక పాకిస్తాన్ బౌలర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా బ్యాట్ మీదకి బంతులు వేసి తమ నిర్లక్ష్యాన్ని చాటుకున్నారు. అయితే వచ్చిన అవకాశాలను భారత బ్యాటర్లు అద్భుతంగా ఉపయోగించుకున్నారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. గిల్ బౌండరీల వర్షం కురిపిస్తే.. అభిషేక్ శర్మ సిక్సర్ల సునామీ సృష్టించాడు. ఫలితంగా పాకిస్తాన్ విధించిన లక్ష్యం కాస్త కరిగిపోయింది. టీమ్ ఇండియాకు మరో విజయం సాధ్యమైంది. వాస్తవానికి టీమిండియా గెలుపులో అభిషేక్ శర్మ ముఖ్యపాత్ర పోషించాడు. సుడిగాలి ఇన్నింగ్స్ ఆడటం ద్వారా తను ఎంత ప్రమాదకరమైన ఆటగాడినో పాకిస్తాన్ జట్టుకు మరోసారి నిరూపించాడు. వాస్తవానికి అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పాకిస్తాన్ ప్లేయర్లు ముఖ్యంగా రౌఫ్ తన నోటికి పని చెప్పాడు. దురుసుగా ప్రవర్తించాడు. మీది మీదికి వెళ్ళాడు. అయితే అభిషేక్ కూడా అదే స్థాయిలో సమాధానం చెప్పడంతో అన్ని మూసుకొని కూర్చున్నాడు.
అయితే ఇప్పుడు రౌఫ్ ను ఉద్దేశించి భారత అభిమానులు ఒక వీడియోను సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. అందులో యువరాజ్ సింగ్ శిక్షణ ఇస్తుండగా అభిషేక్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. యువరాజ్ చెప్పిన విధంగా అభిషేక్ బంతులను ఎదుర్కొంటున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ టీమ్ ఇండియా అభిమానులు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.” ఒరేయ్ రౌఫ్.. మొన్న మీది మీదికి వచ్చావు కదా.. ఏదో అడ్డి మారి గుడ్డి దెబ్బలో అభిషేక్ పరుగులు సాధించలేదు. అతడు ఈ స్థాయిలో శిక్షణ పొందాడు కాబట్టే ఆ స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. ఇప్పటికైనా ఈ వీడియోని ఒకసారి చూసి నీ బౌలింగ్ శైలిని మార్చుకో అంటూ టీమ్ ఇండియా అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
This is how Abhishek Sharma got trained by Yuvaraj Singhpic.twitter.com/veJMw3uyFy
— Farrago Abdullah Parody (@abdullah_0mar) September 21, 2025