Dr Pradeep Reddy vs TV5 Sambasiva Rao: ఈ లొల్లి నిత్యం జరుగుతూనే ఉంటుంది. నల్ల కాడ బిందెలతో కొట్లాడుకున్నట్టు.. పొలాల దగ్గర గెట్ల దగ్గర కొట్టుకున్నట్టు.. చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ కోసం తన్నులాడుకున్నట్టు.. ఒడవదు. తీరదు. ఎంతసేపటికి అదే లొల్లి.. అవే సవాళ్లు.. అవే ప్రతి సవాళ్లు. కొందరేమో టీవీ స్టూడియోలలో.. ఇంకొందరేమో ఎక్కడో విదేశాలలో.. శపదాలు చేసుకుంటారు.. కమాన్ అంటూ గట్టిగా వార్నింగులు ఇచ్చుకుంటారు. తెల్లారి లేస్తే ఏమీ ఉండదు. కాకపోతే వీళ్ళని నమ్ముకుని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుంటారు. వారు కూడా వర్గాలుగా విడిపోయి ఛాలెంజ్ లు విసురుకుంటారు. ఇదంతా చూస్తే ఏదో ఉప్పులేని వంటకంలాగా.. చప్పిడి చలివిడి లాగా ఉంటుంది. కాకపోతే చూసే వాళ్లకి మాత్రం సూపర్ ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది.
ఇప్పటి కాలంలో జర్నలిజం అనేది పార్టీలకు తగ్గట్టుగా విడిపోయింది. అనుకూల.. వ్యతిరేక ఛానల్స్.. పేపర్లు తెలుగులో జోరుగా నడుస్తున్నాయి. వీటికి పొలిటికల్ పార్టీలు స్పాన్సర్ కాబట్టి.. ఆ పార్టీలకు అనుగుణంగా వాయిస్ వినిపిస్తుంటాయి. ఒకవేళ అధికారంలో ఉంటే అభివృద్ధి కనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలు కనిపిస్తుంటాయి. అంతిమంగా బఫున్లు అయ్యేది మాత్రం ప్రజలు. ఇందులో అనుమానం లేదు. ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇక తెలుగులో కూటమికి అనుకూలంగా ఉండే ఛానల్ లో టీవీ5 ముందు వరుసలో ఉంటుంది. ఈ ఛానల్ లో సాంబశివరావు అనే సుప్రసిద్ధ జర్నలిస్ట్ పనిచేస్తుంటారు. ఈయన మిగతా వారి మాదిరిగా కాకుండా విభిన్నంగా మాట్లాడుతుంటారు. విషయాన్ని విషయంలాగే చెప్పేస్తుంటారు. డొంక తిరుగుడు ఉండదు. మసి పూసి మారేడు కాయ చేసే తత్వం ఉండదు. ఉన్నది ఉన్నట్టే చెబుతుంటారు. అందువల్లే ఈయన అంటే చాలామంది ఇష్టపడుతుంటారు. అదే సమయంలో వైసీపీ నాయకులు తిడుతుంటారు. ఇటీవల కాలంలో సాంబశివరావును ఉద్దేశించి వైసిపి కి అనుకూలంగా ఉండే డాక్టర్ ప్రదీప్ రెడ్డి ఏవో విమర్శలు చేశారు. ఆ విమర్శలు నేరుగా సాంబశివరావు దాకా వచ్చాయి. ఆయన తన లైవ్ డిబేట్ కార్యక్రమంలో పేరు ప్రస్తావించకుండా విమర్శించారు..
“కొందరు ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు.. ఎక్కడెక్కడో ఉండుకుంటూ విమర్శలు చేస్తుంటారు. అటువంటి వారికి సవాల్ విసురుతున్నా. మీరు అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడేం చేస్తారు.. మీరు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అంటూ” సాంబశివరావు మాస్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు జగన్ కంపెనీలు భారతి సిమెంట్స్, ప్రైవేట్ జెట్స్, ప్రవేట్ బస్సులు, గెస్ట్ హౌస్ లు, ప్రైవేట్ హోటల్స్ గురించి సరికొత్త విషయాలను వెల్లడించారు సాంబశివరావు. ఈ మాటలను వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ పండగ చేసుకుంటున్నారు వైసీపీ నేతలు. ఇక ప్రదీప్ రెడ్డి అయితే ఏకంగా సాంబశివరావును ఉద్దేశించి వీడికి మైండ్ పూర్తిగా మింగింది.. అన్నట్టు కామెంట్లు చేశారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ వీడియోను వైసీపీ శ్రేణులు తెగ ట్రోల్ చేస్తుండగా.. టిడిపి నాయకులు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. మొత్తంగా సాంబశివరావును సోషల్ మీడియాలో విపరీతంగా చర్చలో ఉండేలా చేస్తున్నారు.
NO DOUBT …. వీడికి మైండ్ పూర్తిగా మింగింది pic.twitter.com/Rajj43rWqf
— Dr.Pradeep Reddy Chinta (@DrPradeepChinta) September 14, 2025
ఏంటి సాంబా బాబాయి…. ఏమయ్యింది??
ఆదివారం కూడా ఎందుకు ఈ వార్నింగ్లు??
ఒక్క రోజు, రిలాక్స్ అవొచ్చు కదా!! pic.twitter.com/NlQl6ByOxK— The Samosa Times (@Samotimes2026) September 21, 2025