https://oktelugu.com/

Winter Solstice 2024: ఆ రోజు రాత్రి ఎక్కువ.. పగలు తక్కువ.. ఎందుకంటే..

సృష్టిలో వాతావరణ పరిస్థితుల కారణంగానే మన జీవనం సాధ్యమవుతోంది. కాలాలే లేకుంటే జీవరాశి మనుగడ సాధ్యం కాదు. అలాంటి వరం మనకు సృష్టి ఇచ్చింది. ఈ సృష్టిలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. పగలు,

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 2, 2024 / 04:17 PM IST

    Winter Solstice 2024

    Follow us on

    Winter Solstice 2024: సృష్టి మనకు ఎన్నో వరాలు ఇచ్చింది. రాత్రి అనేవి సృష్టి ధర్మమే. 12 గంటలు పగలు, 12 రాత్రి ఉంటాయి. అయితే కాల గమనంలో రుతువులు మారతాయి. అదే విధంగా సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాలు మారతాయి. దీంతో రాత్రి, పగలు మధ్య వ్యత్యాసం కలుగుతుంది. శీతాకాలం వచ్చిందంటే పగలు తక్కువగా ఉంటుంది. రాత్రి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఈ ఏడాది డిసెంబర్‌ 21న రాత్రి మనం ఒక వింతను చూడబోతున్నాం. ఆ రోజు సుదీర్ఘమైన రాత్రి ఉంటుంది. ఏకంగా 16 గంటలు రాత్రి ఉండగా, పగలు కేవల 8 గంటలే ఉంటుంది. దీనిని శీతాకాలపు అయనాంతం(వింటర్‌ సోల్‌ స్టైస్‌) అంటారు.

    ఏటా వింటర్‌ సోల్‌ స్టైస్‌..
    శీతాకాలంలో ఏటా ఈ వింటర్‌ సోల్‌ స్టైస్‌ జరుగుతుంది. ఈ రోజు సూర్యుని నుంచి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. చంద్రకాంతి భూమిపై ఎక్కువకాలం ఉంటుంది. వీతాకాలపు అయనాంతం ఏర్పడిన రోజు భూమి దాని ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపుతో ఉంటుంది. సహజ సిద్ధంగా సంభవించే ఈ మార్పు కారణంగా 2024, డిసెంబర్‌ 21న అత్యంత తక్కువ పగలు, సుదీర్ఘ్గమైన రాత్రి ఏర్పడుతుంది. భూమి దాని అక్షం మీద తిరిగే సమయంలో దక్షిణ అర్థగోళంలో భూమి నుంచి సూర్యుడు దూరం గరిష్టంగా ఉన్న రోజున అయనాంతం వస్తుంది. ఇది శీతాకాలంలో ఏర్పడుతున్నందున దీనిని శీతాకాలపు అయనాంతం అంటారు.

    ఏటా మారుతుంది…
    శీతాకాలపు అయనాంతం తేదీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఏటా మారుతుంది. డిసెంబర్‌ 20 నుంచి 23వ తేదీల మధ్య వస్తుంది. డిసెంబర్‌ 21న భూమికి సూర్యడికి దూరం ఎక్కువగా ఉంటుంది. దీంతో సూర్య కిరణాలు ఆలస్యంగా భూమిని చేరతాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతుల కూడా స్వల్పంగా తగ్గుతాయి. విదేశాల్లో ఈ రోజు ఉత్సవాలు జరుపుకుంటారు. చైనా, తూర్పు ఆసియా దేశాల్లో బౌద్ధమతంలోని యిన్, యాంగ్‌ శాఖకు చెందిన ప్రజలు శీతాకాలపు అయనాంతం ఐక్యత, శ్రేయస్సును అందించే రోజుగా భావిస్తారు.

    మన దేశంలో భిన్నంగా..
    మన దేశంలోను నమ్మకాలు వేర్వేరుగా ఉన్నాయి. ఇదే రోజు ఉత్తర భారత దేశంలో శ్రీకృష్ణునికి నైవేద్యం సమర్పించి గీతా పారాయణం చేస్తారు. రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పుష్యమాస పండుగ జరుపుకుంటారు. సూర్యనికి ఉత్తరాయణం ప్రక్రియ శీతాకాలపు అయనాంతం నుంచి మొదలవుతుంది. అందుకే భారత దేశంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.