https://oktelugu.com/

Rajamouli : రాజమౌళి ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ, ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ సాధించాలంటే దాని వెనుక దర్శకుడు చాలావరకు శ్రమించాల్సిన అవసరమైతే ఉంది.

Written By:
  • Gopi
  • , Updated On : December 2, 2024 / 04:15 PM IST

    Rajamouli

    Follow us on

    Rajamouli : సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ సాధించాలంటే దాని వెనుక దర్శకుడు చాలావరకు శ్రమించాల్సిన అవసరమైతే ఉంది. ఎవరు ఎలా చేసినా కూడా ఫైనల్ గా దర్శకుడు మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండి ఆ సినిమాకు సంబంధించిన ఎలిమెంట్స్ అన్నిటిని ప్రజంట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లినప్పుడు మాత్రమే సినిమా అనేది సక్సెస్ అవుతుంది. లేకపోతే మాత్రం ఆ సినిమా డిజాస్టర్ బాట పడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కాబట్టి దర్శకుడు కొంచెం జాగ్రత్త తీసుకొని సినిమాలు తీస్తే ప్రతి సినిమా సూపర్ సక్సెస్ అవుతుందనే చెప్పాలి.

    సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి… దర్శక ధీరుడిగా తనదైన రీతిలో గుర్తింపుని సంపాదించుకున్న ఈ స్టార్ డైరెక్టర్ పాన్ ఇండియాలో కూడా తన సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్లడం అలాగే ఆయన మార్కెట్ ను అంతకంతకు పెంచుకుంటూ పోవడం అనేది ప్రేక్షకులందరిని అలరించడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచుతుందనే చెప్పాలి. మరి ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి అంత సక్సెస్ ఫుల్ దర్శకుడి గా ఎదగడానికి కారణం ఏంటి చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ వచ్చిన సినిమాలే దానికి ఒక పునాదిని వేశాయంటూ ఆయన చాలా సందర్భాల్లో తెలియజేశాడు. ఇంతకీ ఆయనకు నచ్చిన ఆల్ టైం ఫేవరెట్ మూవీ ఏంటి అంటే ‘మాయ బజార్’ అని రాజమౌళి చాలా సందర్భాల్లో తెలియజేశాడు. ఇక తనకు నచ్చిన దర్శకుడు ఎవరు అనే విషయాన్ని కూడా ఆయన పలు సందర్భాల్లో తెలియజేశాడు. ముఖ్యంగా ఆయనకు రాఘవేంద్రరావు అంటే చాలా ఇష్టమట. ఆయన ఫేవరెట్ డైరెక్టర్ కూడా తనే కావడం విశేషం…

    ఇక ఏది ఏమైనా కూడా రాఘవేంద్రరావు దగ్గర రాజమౌళి చాలా సంవత్సరాల పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడు. అందువల్లే ఆయనలోని మెళుకువలను నేర్చుకున్న రాజమౌళి తను సినిమాలను ఎలా తీయాలి, ఎలా చేస్తే ప్రేక్షకుడికి నచ్చుతుందనే ధోరణిలో ఆలోచిస్తూ ప్రతి సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపడంలో ఆయన కీలక పాత్ర వహిస్తూ వస్తున్నాడు.

    ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడు ప్రస్తుతానికైతే నెంబర్ వన్ దర్శకుడిగా కొనసాగుతున్నాడు. తను చేసిన బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలు భారీ సక్సెస్ లను సంపాదించి పెట్టడమే కాకుండా ఆయనకి ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ అనే ఒక ముద్రను కూడా తగిలించాయి.

    దానివల్లే ఆయన ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా చేయడానికి ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి మహేష్ బాబుతో ఈ సినిమా చేస్తున్నందువల్ల మహేష్ బాబు అభిమానులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తుండటం విశేషం…