Rajamouli : సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు. ఇక ఎంతమంది ఉన్నప్పటికీ ఇండియాలో మాత్రం రాజమౌళి ని మించిన దర్శకుడు మరొకరు ఉండరని చెప్పడంలో ఎంత అతిశయోక్తి లేదు. ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించి ఆయనకి పాన్ ఇండియాలో మంచి గుర్తింపును తీసుకొచ్చి పెడుతున్నాయి… ఇలాంటి సందర్భంలోనే ఇప్పటివరకు ఆయన చేసిన ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వకపోవడం 100% సక్సెస్ రేట్ ఉండడాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు…
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా రాణించడం అనేది చాలా కష్టమైన పని.. ఎందుకంటే ఇక్కడ చిన్న తప్పు చేసిన కూడా ప్రతి ఒక్కరికి ఫెయిల్యూర్ అనేది వస్తుంది. కానీ దర్శకుడు చాలా జాగ్రత్త వహిస్తూ సినిమాను ముందుకు తీసుకెళ్తే మాత్రం సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో 100% సక్సెస్ రేట్ ని కలిగి ఉన్న ఏకైక దర్శకుడిగా రాజమౌళి ఒక బ్రాండ్ ను క్రియేట్ చేశాడు. ఇక దాంతో పాటుగా ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి ఫ్యామిలీ నుంచి అతను ఒక్కడే కాకుండా వాళ్ళ ఎంటైర్ వాళ్ల ఫ్యామిలీ కూడా సినిమా ఇండస్ట్రీలో పలు రంగాల్లో ఉంది మంచి గుర్తింపును సంపాదించుకున్నారనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఇక కీరవాణి తన అన్నయ్య కావడం వల్ల రాజమౌళి ప్రతి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తనే వ్యవహరిస్తూ ఉంటాడు.
అయితే కీరవాణి తమ్ముడు, చెల్లి ఆయన కొడుకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ అనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఇక మొత్తానికైతే కీరవాణి తమ్ముడు అయిన కళ్యాణ్ మాలిక్ అలాగే ఎంఎం శ్రీలేఖ కీరవాణి కొడుకు అయిన కాలభైరవ ముగ్గురు కూడా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు.
అయినప్పటికీ వీళ్లు రాజమౌళి సినిమాకి పెద్దగా వర్క్ చేసినట్టుగా మనకైతే కనిపించదు. ఇక కీరవాణి ఉన్నాడనే భరోసాతోనే రాజమౌళి సాంగ్స్ విషయంలో కూడా అంత పెద్దగా ఇన్వాల్వ్ అవ్వని చాలా సందర్భాల్లో తెలియజేశాడు. మరి కీరవాణి కాకుండా తన కొడుకు, తమ్ముడు, చెల్లె కూడా మ్యూజిక్ డైరెక్టర్లు అవ్వడం అనేది నిజంగా యాదృచ్ఛికం అనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా కీరవాణి లాంటి స్టాండర్డ్ మ్యూజిక్ ని మిగతావారు ఎవరు ఇవ్వరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక రాజమౌళి సినిమాలన్నీ సూపర్ సక్సెస్ అవ్వడంలో కీరవాణి కీలకపాత్ర వహిస్తూ వచ్చాడు. మ్యూజిక్ విషయంలో కానీ, బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కానీ ఆయన పాటించిన ప్రతి విషయం కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండడంతోనే ఆయన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. అలాగే రాజమౌళి కూడా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎదిగాడనే చెప్పాలి…