Uttar Pradesh: వర్షాకాలం అనగానే మనకు చేపలు నిండి నుంచి పడడం చూస్తాం.. కొన్ని సందర్భాల్లో రంగురంగుల కప్పలు కూడా కురవడం చూశాం. ఈ విషయాలే మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇక ఇటీవల కొంత మంది సంపన్నులు నోట్లను కూడా గాల్లో నుంచి విసిరేస్తున్నారు. కొందరు యూట్యూబర్లు కూడా నోట్లను వెదజల్లి రీల్స్ చేస్తున్నారు. సోషల్‌మీడియాలో వైరల్ కోసం రీల్స్ చేస్తున్నారు. ఇలా కనక వర్షం కూడా అప్పుడప్పుడూ కనిపిప్తోంది. కానీ ఉత్తర ప్రదేశ్‌లోని ఫిలిబిత్ జిల్లాలో ఓ పాడుబడిన బావి నుంకి కనక వర్షం కురుస్తోంది. బావిలో నుంచి నోట్ల కట్టలు ఎగసి పడుతున్నాయి. ఈ విషయం ఆనోట ఈ నోట అందరికీ తెలియడంతో సమీప గ్రామాల ప్రజలు నోట్ల కోసం బావి వద్దకు చేరుకున్నారు. కొందరికి నోట్లు దక్కాయి. కొందరు నిరాశ చెందారు. అయితే నోట్లు చాలా వరకు చినిగిపోయి ఉండడంతో నోట్లు దక్కిన వారు కూడా నిరాశ చెందారు.
ఏం జరిగింది…
ఫిలిభిత్ జిల్లా బిసల్పూర్ తహసీల్‌కు చెందిన మొహల్లా గ్యాస్పూర్లో ఈ ఘటన చోటు టచేసుకుంది. అక్కడ మహాదేవ్ ఆలయానికి వెళ్లిన కొందరికి సమీపంలోని బావిలో నుంచి రూ.10, 20, 50, 100 నోట్లు రావడం కనిపించింది. దీంతో వారు అక్కడకు వెళ్లి బయటకు వస్తున్న నోట్లను తీసుకున్నారు. ఈవిషయం గంటల వ్యవధిలో సమీప గ్రామాలకు వ్యాపించింది. దీంతో పెద్ద ఎత్తున జనం బావి వద్దకు చేరుకున్నారు. వివిధ పద్ధతుల్లో ఆ నోట్లను బయటకు తీశారు. అయితే నోట్లన్నీ చినిగిపోయే పరిస్థితిలో ఉండడంతో అందరూ నిరుత్సాహానికి గురయ్యారు. అయితే బావిలోకి ఈ నోట్లు ఎలా వచ్చాయి అనేది మాత్రం తెలియడం లేదు. ఈ ఘటనపై బిలాస్పూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బ్యాంకులకు క్యూ..
ఇదిలా ఉంటే.. చినిగిన నోట్లు దొరికిన చాలా మంది ఇప్పుడు బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు. చినిగిన నోట్లను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫిలిభిత్ సమీపంలోని బ్యాంకులకు పెద్ద ఎత్తు జనం చినిగిన నోట్లతో రావడంతో బ్యాంకర్లు ఆశ్చర్య పోతున్నారు. ఈ నోట్లను చాలాకాలం క్రితమే బ్యాంకులో పడిసే ఉంటారని భావిస్తున్నారు. నోట్లను పరిశీలించిన బ్యాంకర్లు సీరియల్ నంబర్ ఆధారంగా వాటిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈమేరకు వివరాలను రిజర్వు బ్యాంకు సిబ్బందికి సమాచారం అందిస్తున్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: The notes were found in an abandoned well in pilibhit up
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com