Uttar Pradesh : అది 2023 సంవత్సరం … ఫిబ్రవరి 10వ తారీఖు, ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఒక పెళ్లి వైభవంగా జరిగింది. వరుడు తన వధువును పెళ్లి చేసుకుని ఇంటికి తెచ్చుకున్నాడు. ఆరో రాత్రి పెద్దలంతా కలిసి శోభనానికి ముహూర్తం పెట్టారు. ఇంతలో ఫోన్ కాల్ మోగింది. ఫోన్ చేసింది తన ప్రాణ స్నేహితుడు. ఈ టైంలో వీడు ఫోన్ చేశాడేంటా అని ఆందోళనతోనే ఫోన్ ఎత్తాడు. అవతల నుంచి హాయ్ రా.. ఏం చేస్తున్నావ్.. ఇప్పుడు ఫోన్ చేసినందుకు క్షమించు.. అన్నాడు. సరే రా ఏమైంది ఈ సమయంలో ఎందుకు ఫోన్ చేశావు చెప్పు అన్నాడు. హా సరే.. ఏం లేదురా.. ఇప్పుడు నీకు పెళ్లయింది కదా. ఈ రోజు నీకు శోభనం కదా.. ఆ మొత్తాన్ని వీడియో చేసి నాకు పంపు. వెంటనే వరుడికి కాస్త అర్థం కాలేదు. తర్వాత బెస్ట్ ఫ్రెండ్ కదా అని స్నేహితుడిని నమ్మి బెడ్ రూంలో నవ దంపతులు సన్నిహితంగా ఉన్న సందర్భాన్ని రహస్యంగా చిత్రీకరించి స్నేహితుడికి పంపించాడు. తన ఫ్రెండే కాదా ఏం కాదని అనుకున్నాడు కానీ అప్పటి నుంచే తనకు కష్టాలు మొదలయ్యాయి.
తన శోభనం వీడియోను పంపిన స్నేహితుడు తన బుద్ధిని బయట పెట్టుకున్నాడు. బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చూడకుండా అతనిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఏడాది ఎనిమిది నెలల్లో ఈ వీడియోను అడ్డుపెట్టుకుని భారీగా డబ్బులు వసూలు చేశాడు. దీంతో స్నేహితుడి బెదిరింపులకు విసిగిపోయిన అతడు పోలీసులను ఆశ్రయించాడు. నిందితుడి పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి. విషయం షాజహాన్‌పూర్ జిల్లా చౌక్ కొత్వాలిది. ఒక యువకుడు 10 ఫిబ్రవరి 2023న ఇక్కడ వివాహం చేసుకున్నాడు. అతనికి శివమ్ అనే స్నేహితుడు ఉన్నాడు. ఇద్దరి మధ్య స్నేహం ఎంత గాఢంగా ఉందంటే 24 గంటలూ ఒకరితో ఒకరు ఉండేవారు. తన స్నేహితుడి పెళ్లికి శివమ్ కూడా వచ్చాడు. శోభనం సమయం రాగానే పెళ్లి రాత్రి వీడియో తీసి పంపమని శివమ్ తన స్నేహితుడిని కోరాడు.
పోలీసులతో వరుడు..‘‘సార్, నేను శివమ్ మాటలకు ప్రభావితమయ్యాను. అతను నా బెస్ట్ ఫ్రెండ్ అని అనుకున్నాను. నేను అతనితో ఏమీ దాచలేకపోయాను. నా పెళ్లి రాత్రి వీడియో కూడా శివమ్‌కి పంపాను. నేను ఆ వీడియో తీశానని నా భార్యకు కూడా తెలియదు. అయితే కొన్ని రోజుల తర్వాత శివమ్ నన్ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. డబ్బులు ఇవ్వకపోతే నీ పెళ్లి రాత్రి వీడియో వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడు. ఇది విని చాలా షాక్ అయ్యాను. కానీ అవమానం భయంతో నేను అతనికి డబ్బు ఇచ్చాను. అయినా మళ్లీ మళ్లీ డబ్బులు ఇవ్వమని శివమ్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నేను అతనికి ఏడాది కాలంగా చాలా డబ్బు ఇచ్చాను. అతని బ్లాక్‌మెయిలింగ్‌తో నేను చాలా విసిగిపోయాను. చివరికి నేను అతనికి డబ్బు ఇవ్వడానికి నిరాకరించాను. దీంతో నన్ను చంపేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. విషయం తీవ్రరూపం దాల్చడంతో మా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాను. అప్పుడు వారి సలహా మేరకు నేను ఇప్పుడు మీ సహాయం కోరడానికి వచ్చాను..’’ అంటూ చెప్పుకొచ్చాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడు శివంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయంలో తదుపరి విచారణ కొనసాగుతోంది. త్వరలో శివమ్‌ని అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. ఆరోపణలు నిజమని తేలితే అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Shobnam video took and sent to friend who blackmailed and charged huge sums of money
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com