Mahesh Babu – Rajamouli: అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా దాదాపుగా 12 ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్న క్రేజీ కాంబినేషన్స్ లో ఒకటి మహేష్ బాబు, రాజమౌళి సినిమా. టాక్ తో సంబంధం లేకుండా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టే మహేష్ బాబు, తన ప్రతీ సినిమాతో ఇండస్ట్రీ ని పది అడుగులు ముందుకేసేలా చేస్తున్న రాజమౌళి, వీళ్ళ కాంబినేషన్ సినిమా అంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక అద్భుతం జరగాలి. మరో రెండు మూడు రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకోబోతున్న ఈ చిత్రం ఇండియాన్ లాంగ్వేజ్స్ తో పాటు, ఫారిన్ లాంగ్వేజ్స్ లో కూడా ఇక కాలం లో విడుదల కాబోతుంది. అందుకు తగ్గట్టుగానే ఒక పర్ఫెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్లాన్ ని సిద్ధం చేసుకున్నాడు రాజమౌళి. గత ఆరు నెలల నుండి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో వర్క్ షాప్ ని కూడా నిర్వహిస్తున్నారు.
ఈ వర్క్ షాప్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతీ రోజు పాల్గొంటూనే ఉన్నాడు. ఆయన గత 28 సినిమాలకు పడిన కష్టం వేరు, ఈ సినిమాకి పడుతున్న కష్టం వేరు. ఒక సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభానికి ముందు, మహేష్ బాబు ఇంత ప్రాక్టీస్ చేసిన చరిత్ర లేదు. అలాంటిది ఆయన కెమెరా ముందుకు వెళ్లేందుకు ఇంత రిహార్సల్స్ చేసి వెళ్ళబోతున్నాడంటే ఈ చిత్రాన్ని రాజమౌళి ఏ రేంజ్ లో తెరకెక్కించబోతున్నాడో ఊహించుకోవచ్చు. కనీసం పూజ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను కూడా బయటకి రానివ్వకుండా జాగ్రత్త పడ్డ రాజమౌళి కి మహేష్ బాబు ఊహించని షాక్ ఇచ్చాడు. అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద మహేష్ బాబు వర్క్ షాప్ లో పాల్గొన్నప్పుడు ఒక అభిమాని వచ్చి ఆయనతో ఫోటో దిగాడు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో హీరోయిన్ గా బాలీవుడ్ కం హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె కూడా ఇప్పుడు వర్క్ షాప్ లో పాల్గొంటుంది. ఆమె లుక్ కి సంబంధించిన టెస్టులు కూడా పూర్తి చేసారు. రెండేళ్ల పాటు ఈ సినిమాకి తన డేట్స్ ని కేటాయించింది. హాలీవుడ్ లో ఒక్కో సినిమాకి మిల్లియన్ల సంపాదిస్తూ, బిలీనియర్ గా మారిపోయిన ప్రియాంక చోప్రా, ఒక సినిమా కోసం రెండేళ్ల కాల్ షీట్స్ ఇచ్చేసింది అంటే, ఈ కథలో ఎంత దమ్ముందో అర్థం అవుతుంది. మహేష్ కెరీర్ లోనే కానీ, టాలీవుడ్ కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ గా నిల్చిపోబోతున్న ఈ సినిమా 2027 వ సంవత్సరం లో మన ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు మహేష్ బాబు అభిమానులు ఎదురు చూడాల్సిందే. అదృష్టం బాగుంటే ఏడాదిన్నర లోపు కూడా పూర్తి అవ్వొచ్చు.