Happiest Cities In The World: ప్రతి ఒక్కరూ తమ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అయితే చుట్టూ ఉన్న వాతావరణం సక్రమంగా ఉంటేనే వారి జీవితం బాగుంటుంది. చాలామంది నేటి కాలంలో పుట్టిన చోటే ఉండకుండా ఇతర నగరాలకు, ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. తమకు ఎక్కడ కన్వీనెంట్ ఉంటే అక్కడే ఉండాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా టైం అవుట్ ఆసియా ఖండంలో అత్యంత సంతోషంగా జీవించే నగరాలపై సర్వే నిర్వహించింది. చాలామంది ఈ నగరాల్లో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇంతకీ సంతోషంగా అనిపించే ఆ టాప్ టెన్ నగరాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
టాప్ టెన్ నగరాలు:
ముంబై ( ఇండియా )
బీజింగ్ (చైనా )
షాంఘై ( చైనా )
చియాంగుమాయి (థాయిలాండ్)
హనోయి (వియత్నాం)
జకార్తా (ఇండోనేషియా)
హాంకాంగ్
బ్యాంకాక్ (థాయిలాండ్)
సింగపూర్
సియోల్ (దక్ష కొరియా)
భారతదేశంలో టాప్ వన్ లో ఇండియాలోనే ముంబై నిలిచింది.ఈ నగరంలో ఉండడానికి ప్రజలు 94 శాతం మంది ఇష్టపడుతున్నట్లు టైం అవుట్ సర్వే తెలిపింది. ఆయన నగరాల్లో ఉండే ఫుడ్ కల్చర్, స్ట్రీట్ కల్చర్, ఇండస్ట్రీస్, ఎంటర్టైన్మెంట్, మనుషుల మధ్య సంబంధాలు, సమీకృత రిలేషన్ వంటి కారణాలతో ఎక్కువగా ఈ నగరాల్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు.
ఆ తర్వాత చైనాలోని బీజింగ్లో ఎక్కువ శాతం అంటే 90% ప్రజలు ఇక్కడ సౌకర్యవంతమైన వాతావరణ ముందని భావిస్తున్నారు. ఆధునిక సౌకర్యాలతో పాటు టెక్నాలజీ, సాంస్కృతిక అంశాలు, స్వేచ్ఛ వాతావరణం ఉండడంతో చాలామంది ఇక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారు.
ఆ తర్వాత హనోయి దేశంలోని చియాంగ్ మాయి అనే నగరంలో కూడా ఎక్కువగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఇక్కడ మానవుల మధ్య సంబంధాలు, హరిత ప్రదేశం, పచ్చని స్వచ్ఛమైన వాతావరణం, నెమ్మదిగా నడిచే జీవనశైలి, సాంస్కృతిక అంశాలు ఇక్కడ ఉండేందుకు ఇష్టపడుతున్నారు. టైం అవుట్ చేసిన సర్వేలో ఎక్కువగా సంస్కృతి, ఆహారం,, జీవన నాణ్యత, సమాజ సంబంధాలపై సర్వేలు నిర్వహించారు. వాటి ఆధారంగానే ఆయా నగరాలకు రేటింగ్ ఇస్తూ వచ్చారు. ఇందులో భాగంగా ప్రపంచంలోనే ముంబై అత్యంత సౌకర్యవంతమైన సంతోషంగా ఉండే నగరం అని తేలింది. చాలామంది విదేశీయులు ఇక్కడ ఉండేందుకు ఇష్టపడుతున్నారు. టూరిస్ట్ గా వచ్చిన వారు సైతం ఇక్కడే వ్యాపారం చేస్తూ సెటిల్ అయిన వారు చాలామంది ఉన్నారు. అలాగే భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారు సైతం బొంబాయికి రావడానికి ఎక్కువగా ఇష్టపడతారు.
ముంబైని ఆర్థిక రాజధానిగా పేర్కొంటారు. ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్ టాప్ లెవల్ లో ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారం చేయాలని అనుకునే వారికి ఈ నగరం ది బెస్ట్ అని కొందరు పేర్కొంటారు. చాలామంది ఉన్నత వర్గానికి చెందిన వారు ఇక్కడ వ్యాపారాన్ని ప్రారంభించిన వారే అని చరిత్ర తెలుపుతుంది.