Rajendra Singh: 18 ఏళ్లు సైనికుడు.. పదేళ్లు సెక్యూరిటీ గార్డు.. ఇప్పడు క్లర్క్‌.. 51 ఏళ్ల వయసులో ప్రభుత్వ కొలువు!

రాజస్థాన్‌లోని సికార్‌ జిల్లా లక్ష్మణగఢ్‌ పట్టణంలో కుటుంబంతో ఉంటున్నాడు రాజేంద్రసింగ్‌. ఇండియన్‌ ఆర్మీలో 1991లో చేరాడు. 18 ఏళ్లపాటు పనిచేశాడు.

Written By: Raj Shekar, Updated On : May 12, 2024 2:42 pm

Rajendra Singh

Follow us on

Rajendra Singh: వయసు అనేది శరీరానికే కానీ, మనసుకు కాదంటారు పెద్దలు. అయితే మనసుతోపాటు విద్యకు, ఉద్యోగానికి కూడా వయసు ఆటంకం కాదని నిరూపించాడు ఓ మాజీ సైనికుడు 18 ఏళ్లు దేశ రక్షణ కోసం సైన్యంలో విధులు నిర్వహించిన అతను తర్వాత వాలంట్రీ రిటైర్మెట్‌ తీసుకున్నాడు. తర్వాత పదేళ్లు సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. ప్రస్తుతం 51 ఏళ్ల వయసులో ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఆదర్శంగా నిలిచాడు.

రాజస్థాన్‌కు చెందిన రాజేంద్రసింగ్‌..
రాజస్థాన్‌లోని సికార్‌ జిల్లా లక్ష్మణగఢ్‌ పట్టణంలో కుటుంబంతో ఉంటున్నాడు రాజేంద్రసింగ్‌. ఇండియన్‌ ఆర్మీలో 1991లో చేరాడు. 18 ఏళ్లపాటు పనిచేశాడు. 2009లో హవల్దార్‌ హోదాలో వాలంట్రీ రిటైర్మెట్‌ తీసుకున్నాడు. సైన్యం నుంచి రిటైర్‌ అయ్యాక చాలా మంది విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు. కానీ రాజేంద్రసింగ్‌ మాత్రం తన భార్య అమృతాదేవి ప్రోత్సాహంతో 2014లో ఎస్‌బీఐ బ్యాంకులో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం సంపాదించాడు. పదేళ్లుగా గార్డుగా పనిచేస్తూనే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అయ్యాడు.

స్టేట్‌ 4వ ర్యాంకు..
బ్యాంకులో గార్డుగా పనిచేస్తూనే బ్యాంకు పోటీ పరీక్ష కోసం చదివిన రాజేంద్రసింగ్‌ 2024, మార్చి 28న నిర్వహించిన ఎస్‌బీఐ క్లర్క్‌ పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించి యువకులకు సవాల్‌ విసిరాడు. క్లర్క్‌గా ఉద్యోగం సాధించాడు. ఈ సందర్భంగా రాజేంద్రసింగ్‌ మాట్లాడుతూ తాను ఉద్యోగం సాధించడానికి తన భార్య అమృతా దేవికే దక్కుతుందని తెలిపాడు. రాజేంద్రసింగ్‌కు ఇద్దరుకుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు నితేష్‌ బీఎస్‌ఎఫ్‌లో సైనికుడు. చిన్నకుమారుడు బీఎస్సీ నర్సింగ్‌ చేస్తున్నాడు.