Rajinikanth upcoming film latest update: కొన్ని అనుకోని కారణాల వల్ల ఒక హీరో చెయ్యాల్సిన సినిమా మరో హీరో చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అవి సూపర్ హిట్ అయ్యినవి కొన్ని ఉన్నాయి, డిజాస్టర్ ఫ్లాప్ అయినవి కూడా కొన్ని ఉన్నాయి. అలా సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) రిజెక్ట్ చేసిన స్టోరీలతో సూపర్ హిట్స్ ని అందుకున్న స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితా లోకి సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా చేరిపోయాడట. ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయం లో ఆయన వద్దకు ఒక యంగ్ తమిళ డైరెక్టర్ వచ్చి స్టోరీ వినిపించాడు. అది మహేష్ బాబు కి తెగ నచ్చేసింది. కానీ భవిష్యత్తులో ఆయన కమిట్ అయినా సినిమాల కారణంగా ఇప్పట్లో ఈ చిత్రం చేయలేము, ప్రస్తుత కమిట్మెంట్స్ ని పూర్తి చేసుకున్న తర్వాత కచ్చితంగా ఈ చిత్రం చేద్దామని చెప్పాడట.
ఇప్పుడు ఆ స్టోరీ సూపర్ స్టార్ రజినీకాంత్ చేతుల్లోకి వెళ్ళింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తమిళంలో శివ కార్తికేయన్ హీరో గా నటించిన ‘డాన్’ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. తెలుగు లో ఈ సినిమా డీసెంట్ రన్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత ఆ చిత్ర డైరెక్టర్ సిబి చక్రవర్తి ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్ సమయం లో మహేష్ బాబు కి ఒక స్టోరీ ని వినిపించాడట. ఇది ఒక గ్యాంగ్ స్టర్ స్టోరీ అని తెలుస్తోంది. మహేష్ కి కథ బాగా నచ్చింది కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘గుంటూరు కారం’ చిత్తానికి కమిట్ అవ్వడం, ఆ తర్వాత వెంటనే రాజమౌళి తో ‘వారణాసి’ మూవీ కి కూడా కమిట్ అవ్వడం వల్ల ఇప్పట్లో ఈ సినిమాని చెయ్యలేం అని చెప్పాడట మహేష్ బాబు.
ఇప్పుడు అదే సినిమాని సిబి చక్రవర్తి సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేయబోతున్నాడు. ఈ సినిమా కు కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ చిత్రం కోసం రజినీకాంత్ ఏకంగా 250 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకోబోతున్నాడు అట. అంటే ఈ చిత్రం స్కేల్ ఎంత పెద్దదో మీరే ఊహించుకోండి. మరి ఈ సినిమాని మిస్ చేసుకొని మహేష్ బాబు పొరపాటు చేశాడా ?, లేదంటే మంచి పని చేశాడా అనేది తెలియాలంటే , ఆ సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ‘జైలర్ 2’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్న రజినీకాంత్ , ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వగానే ఈ క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు.