Telecom Tariffs : అరచేతిలో ఇమిడిపోతున్న స్మార్ట్ఫోన్ ప్రపంచంలో ఏం జరుగుతుందో ఇట్టే తెలిసేలా చేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం అంతకంతకు అభివృద్ధి చెందడం వల్ల మనిషి జీవితం కూడా సమూలంగా మార్పులకు గురవుతోంది. ఇది సమయంలో స్మార్ట్ ఫోన్ మనిషి జీవితంలో విడదీయలేని భాగం అయిపోయింది. దీనికి తోడు డాటా ధరలు కూడా అందుబాటులోకి రావడంతో ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఒక నివేదిక ప్రకారం మనదేశంలో స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య 60 కోట్ల దాకా ఉంటుందని.. ఇందులో యాక్టివ్ యూజర్లు 50 కోట్ల దాకా ఉంటారని సమాచారం. అయితే ఇటీవల కంపెనీలు డాటా ధరలు పెంచినప్పటికీ.. ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య ఏమాత్రం తగ్గలేదని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇదే క్రమంలో DoT India X ఒక సర్వే నిర్వహించింది. ఈ క్రమంలో డేటా కు సంబంధించిన పలు కీలక విషయాలను వెల్లడించింది. ఈ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూసాయి. ఇదే సమయంలో 1gb డేటా కోసం మనదేశంలో ప్రజలు ఎంత ఖర్చు చేస్తున్నారు? ఇతర దేశాల ప్రజలు ఎంత వెచ్చిస్తున్నారు అనే విషయాలు పూర్తిగా అవగతమయ్యాయి.
2014 తర్వాత..
మనదేశంలో ఒక కప్పు చాయ్ ధర పది నుంచి 20 రూపాయల వరకు ఉంది. పేరుపొందిన హోటల్లో ఈ ధర ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఒక కప్పు చాయ్ ధర కంటే తక్కువకు 1 జీబీ డాటా లభిస్తోంది. మనదేశంలో 1 జీబీ డాటా కోసం 6.5 రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇదే సమయంలో ఇజ్రాయిల్ దేశంలో 1 జీబీ డాటా కోసం అక్కడి ప్రజలు 8 రూపాయలు, కిర్గిస్తాన్ లో 15.3 రూపాయలు, ఇటలీ దేశంలో 31.38 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఇక ఆతిథికంగా తూర్పు ఆఫ్రికాలోని మలావి లో 1 జీబీ డాటా కోసం అక్కడి ప్రజలు ఏకంగా ₹ 2000 చెల్లిస్తున్నారు. అమెరికాలో 1 జీబీ డాటా కోసం అక్కడి ప్రజలు ఏకంగా ₹500 దాకా వెచ్చిస్తున్నారు. వాస్తవానికి 2014 కంటే ముందు మనదేశంలో స్మార్ట్ ఫోన్ విప్లవం అంతంతమాత్రంగానే ఉండేది. అప్పట్లో నెట్వర్క్ కంపెనీలు డాటా చార్జీలు విపరీతంగా విధించేవి. 2014 తర్వాత సమూల మార్పులు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా డాటా అనేది చవకగా మారింది. కంపెనీల మధ్య పోటీ కూడా పెరగడంతో వినియోగదారులకు డాటా అనేది చవకగా రావడం మొదలుపెట్టింది. దీనికి తోడు కంపెనీలు అధునాతన ఫోన్ లను రూపొందించాయి. ధరలు కూడా ఆమోదయోగ్యమైన తీరుగా ఉండడంతో స్మార్ట్ ఫోన్ వినియోదారులు పెరిగిపోయారు. ఇది సమయంలో సోషల్ మీడియా వినియోగం కూడా తారస్థాయికి చేరడంతో.. స్మార్ట్ ఫోన్ వాడకం అనేది అనివార్యం అయిపోయింది. ఇదే సమయంలో డాటా వినియోగం కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.. భారతదేశంలో సగటున ఒక వ్యక్తి రోజుకు 6 నుంచి 9 గంటల దాకా ఫోన్ లోనే మునిగి తేలుతున్నట్టు తెలుస్తోంది. ఇక మిగతా దేశాలలో కూడా దాదాపుగా ఇలానే ఉండగా.. మనదేశంలో మాత్రమే డాటా చవకగా లభిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మనదేశంలోనే డాటా అనేది తక్కువ ఖర్చుతో వస్తోందని వివిధ కంపెనీలు చెబుతున్నాయి..
యాప్స్ వాడకంతో..
సోషల్ మీడియా తర్వాత రకరకాల యాప్స్ మనిషి జీవితాన్ని మరింత సుఖవంతం చేస్తున్నాయి. అవన్నీ కూడా డాటా ఆధారంగానే కార్యకలాపాలు సాగిస్తుంటాయి. అందువల్లే డాటా వినియోగం పెరుగుతోంది. గూగుల్ లొకేషన్ మ్యాప్ నుంచి మొదలు పెడితే ఆన్లైన్ పేమెంట్స్ వరకు ప్రతిదీ డేటా ద్వారానే సాగుతోంది. అందువల్లే డాటా వినియోగం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఒకప్పుడు నెల మొత్తం వన్ జీబీ డాటా సరిపోతే.. ప్రస్తుత కాలంలో 2జీబి డాటా ఒక రోజులోనే ఖతమయ్యే పరిస్థితి నెలకొంది. ఇదే స్థాయిలో వినియోగం పెరిగితే భారత్ డాటా వాడకంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More