Dave Carroll airlines song: సంగీతం అంటే చాలామందికి ఇష్టం. సంగీతం నేర్చుకున్న వారు తమ జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగారు. సంగీతంతో ప్రాణాలను కూడా నిలబెట్టవచ్చని కొందరు వైద్యులు నిరూపించారు. అందమైన సంగీతంతో మనసు ఉల్లాసంగా మారుతుంది. కానీ ఇదే సంగీతం ఒక సంస్థకు కోట్ల రూపాయల నష్టం తీసుకొచ్చింది. ఒక వ్యక్తి తనను అవమానించినందుకు ఒక్క పాట పాడి ఎయిర్ లైన్ సంస్థకు భారీగా నష్టం తీసుకొచ్చారు. ఇంతకు ఆయన ఎవరు? ఎందుకు పాడారు? అసలు ఏం జరిగింది?
కెనడాకు చెందిన Dave Carroll అనే వ్యక్తి గిటారిస్టు. ఇతను అమెరికాలో ఒక ప్రోగ్రాం నిర్వహించేందుకు 2008 లో అమెరికాకు చెందిన ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే ఫ్లైట్ ఇబ్బంది తన 2.5 లక్షల గిటార్ ను నిర్లక్ష్యంగా కింద పడేశారు. అలా కింద పడేయడంతో అవి పూర్తిగా ధ్వంసం అయింది. అంతేకాకుండా తాను ఉపాధి కూడా కోల్పోయారు. ఈ విషయాన్ని ఎయిర్లైన్స్ సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. అయితే ఒక నెల తర్వాత తనకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ ఒక పాట పాడారు. తన స్నేహితుల సహాయంతో వీడియో తీసి దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు. అయితే ఆ వీడియో వైరల్ అయి పది లక్షల వ్యూస్ తెచ్చుకుంది. ఆ తర్వాత దీనిని మీడియా కూడా హైలెట్ చేసింది. దీంతో చాలామంది యునైటెడ్ ఎయిర్ లైన్స్ టికెట్ కొనడం మానేశారు. అలా ఆ ఎయిర్ లైన్స్ కు 10% వరకు టికెట్స్ కొనుగోలు పడిపోయాయి. అలా మొత్తంగా రూ. 1500 కోట్ల నష్టం జరిగింది.
అయితే యునైటెడ్ ఎయిర్లైన్స్ సిబ్బంది డేవ్ క్యారెల్ కు నష్టపరిహారం అందించింది. కానీ ఆ నష్ట పరిహారాన్ని తాను తీసుకోలేదు. దానిని ఒక ట్రస్ట్ కు మార్చాడు. ఆ తర్వాత చాలామంది యునైటెడ్ ఎయిర్లైన్స్ పై రకరకాల పోస్టులు పెట్టారు. అయితే ఎయిర్లైన్స్ సిబ్బంది ప్రస్తుతం ప్రయాణికులకు అనువైన సేవలు చేస్తున్నారు. వారితో మర్యాదగా ప్రవర్తిస్తున్నారు. కొన్నిచోట్ల వారికి సరైన సౌకర్యాలు లేకపోవడంతో కంప్లైంట్ చేస్తున్నారు. దీనికి ప్రతిస్పందనగా వారు నష్టపరిహారం చెల్లిస్తున్నారు. ఎక్కడైనా కొన్ని సంస్థల్లో ప్రయాణికులకు అసౌకర్యాలు కలిగితే ముందుకు కదిలి ఫిర్యాదులు చేస్తే సంస్థలు స్పందించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రయాణికులకు సరైన సౌకర్యాలు అందించాలని కొందరు కోరుతున్నారు.