Driver Maniyamma: సోషల్ మీడియా ఓపెన్ చేయగానే రకరకాల వీడియోలు వస్తుంటాయి. ఇటీవల ఆడవాళ్లను కించపరుస్తూ కొన్ని వీడియోలు ప్రసారమవుతున్నాయి. కొందరు ఆడవాళ్లు స్కూటీ నడుపుతూ ఇండ్ల పైకి పోనిచ్చారు.. మరికొందరు చిన్న యాక్సిడెంట్లు చేశారు. అయితే అతిపెద్ద స్పేస్ జెట్ విమానం ప్రమాదం కన్నా ఆడవాళ్లు నడిపే స్కూటీ ప్రమాదం అంటూ కొందరు వ్యంగంగా పోస్టులు కూడా పెట్టారు. కానీ ఆడవారు తరుచుకుంటే ఏ రంగంలోనైనా రాణిస్తారు అని కొందరు నిరూపిస్తున్నారు. వారికి స్కూటీ నడపడమే కాకుండా యుద్ధ విమానం కూడా నడపొచ్చు అని ఇప్పటికే నిరూపించారు. అయితే 70 ఏళ్ల ఒక మహిళ ఏం చేస్తుందో తెలుసా?
మహిళల చేతికి వాహనాలు ఇస్తే రోడ్డుపై ప్రమాదకరం అంటూ చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టులకు కొందరు కామెంట్లు కూడా చేశారు. ఆడవారికి డ్రైవింగ్ చేయడం రాదు అంటూ ఏదైనా చేయడం పై కొందరు మహిళ మణులు వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా వారు ఇప్పటికే పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అందులో కేరళలోని మణియమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. త్రిశూర్ జిల్లాకు చెందిన ఈమె భర్తను కోల్పోయింది. అయితే జీవనోపాధి కోసం ముందుగా ఆటో నడపడం ప్రారంభించింది. మొదట్లో చాలామంది పిల్లలు చూసి అందరిలాగే వ్యంగ్యంగా మాట్లాడారు. కానీ ఆ తర్వాత పట్టుదలతో ఆటో మాత్రమే కాకుండా బస్సు, లారీ డ్రైవింగ్ నేర్చుకున్నారు. 12 టైర్లు ఉండే ట్రక్కును కూడా నడుపుతారు. ఈమె చేసే డ్రైవింగ్ చూసి పురుషులే ఆశ్చర్యపోతారు.
మణియమ్మ కేవలం డ్రైవింగ్ చేయడమే కాకుండా చాలామందికి కోచింగ్ కూడా ఇస్తుంది. డ్రైవింగ్ లోనే మెలకువలు తీర్పుతుంది. ఈమె డ్రైవింగ్ విధానాన్ని చూసి చాలా మంది ప్రశంసించారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేకంగా సన్మానించారు. ఆమెతో డ్రైవింగ్ కోర్సు తీసుకున్న వారు వివిధ రంగాల్లో డ్రైవర్గా రాణిస్తున్నారు. ఇలా ఆమె డ్రైవర్ గా రాణిస్తూ తన జీవితంలో అనేక విజయాలను సాధించింది. మహిళలంటే కేవలం కొన్ని పనులకు మాత్రమే పరిమితం అని కొందరు అంటుంటారు. అలాంటి వారికి దీటుగా ఈమె చేసిన సాహసాన్ని దేశం మొత్తం మెచ్చుకుంటుంది. అంతేకాకుండా డ్రైవర్ గా కూడా మహిళలు రాణిస్తారు అని నిరూపిస్తుంది.
ఇప్పటికే యుద్ధ విమానాల్లో.. ఆర్మీలో సంచలనాలు సృష్టించే మహిళలు ఉన్నారు. అలాగే ఇలా పురుషులతో దీటుగా అన్ని రకాల పనులు చేసే వారు కూడా ఉన్నారు. అందువల్ల కొందరు మహిళా సంఘాలు చెప్పేది ఏంటంటే.. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారు. అయితే వారు కాస్త ఓపికగా ఉంటారు. అలాంటి వారిని ఎప్పటికీ హేళన చేయొద్దని కొందరు సూచిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వారి గురించి తప్పుడు పోస్టులు పెట్టొద్దని అంటున్నారు.