Blood group and Aging: మానవ శరీరంలో అవయవాల అన్ని సక్రమంగా పనిచేయాలంటే రక్తం అవసరం. శరీరంలోని పోషకాలు, ఆక్సిజన్, హార్మోన్లు, వ్యర్థాలు అన్నింటినీ శరీరంలోని ప్రతి కణానికి తీసుకెళ్తూ ఆరోగ్యంగా ఉంచగలుగుతుంది. రక్తం అనేది ద్రవరూప కణజాలం. ఇది గుండె నుంచి శరీరం అంతా రక్తనాళాల ద్వారా వ్యాపిస్తుంది. ఒక మనిషి శరీరంలో 4.5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. శరీరంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్, ప్లాస్మా ఉంటాయి. రక్తంలోని యాంటిజెన్లు, యాంటీ బాడీల ఆధారంగా రక్తం యొక్క గ్రూప్ ను నిర్ణయిస్తారు. ఒక వ్యక్తి బ్లడ్ గ్రూప్ ఆధారంగా అతని మానసిక, శారీరక ప్రవర్తన ఉంటుందని కొందరు చెబుతున్నారు. అయితే దీనిపై కొందరు వ్యతిరేకిస్తున్నా.. కొన్ని లక్షణాలను బట్టి వారి యొక్క రక్తం గ్రూపును నిర్ణయించవచ్చని అంటున్నారు. అయితే వీటిలో బి ప్లస్ గ్రూప్ నాకు చెందినవారు ఎలా ఉంటారంటే?
ఒక శరీరంలోని రక్తంలో B యాటిజన్ Rh ఫాక్టర్ పాజిటివ్గా ఉంటుంది. దీనినే బి ప్లస్ బ్లడ్ గ్రూప్ అంటారు. ఈ గ్రూపు రక్తం కలిగిన వారు బి ప్లస్, బీ మైనస్, ఓ పాజిటివ్, ఓ మైనస్ రక్తం స్వీకరించగలరు. వీరి రక్తాన్ని బి ప్లస్, ఏబి ప్లస్ వారికి ఇస్తారు. బి ప్లస్ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు శక్తివంతులుగా ఉంటారు. సాధారణంగానే వీరికి ఇమ్యూనిటీ బలం ఎక్కువగా ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది. వీరికి మాంసాహారం, పాలు, పండ్లతో కూడిన మిక్స్డ్ డైట్ తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే అధిక కార్బోహైడ్రేట్ ఫుడ్ లేదా ఓవర్ ప్రాసెస్ ఆహారం తీసుకుంటే అధిక కొవ్వు పెరిగే అవకాశం ఉంటుంది. మీరు శారీరకంగా ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు. వీరికి అలసట వచ్చిందంటే అందుకు కారణం ఆహారం లేకపోవడం లేదా నిద్ర లేకపోవడం వంటివి జరుగుతుంది.
కొన్ని అధ్యయనాల ప్రకారం.. బి ప్లస్ గ్రూప్ కలిగిన వారు సృజనాత్మకతను ఎక్కువగా కలిగి ఉంటారు. ఎప్పుడూ ఇతరులపై ఆధారకుండా సొంతంగా పనిచేయడానికి ఇష్టపడతారు. కష్టపడితేనే జీవితం అన్న తోరనితో ఉంటారు. కొన్నిసార్లు ఒంటరితనాన్ని కోరుకుంటారు. ఇండిపెండెంట్గా ఉండాలని కోరుకునే వారు కూడా ఉన్నారు. అయితే బి ప్లస్ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు తొందరగా వృద్ధాప్యం అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వంశపారపర్యంగా వారి ఆహారపు అలవాట్లు, నిద్ర, వ్యాయామం అన్ని సక్రమంగా ఉంటే ఎక్కువ కాలం మీరు ఉత్సాహంగా ఉండగలుగుతారు. అయితే వీటిలో ఏ ఒక్కటి తగ్గినా కూడా తొందరగా అలసిపోయి వృద్ధాప్యంలోకి వెళ్తారు. ఈ గ్రూపు ఉన్నవారు ఒత్తిడిని ఎక్కువగా ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలో వీరికి యోగా చాలా ఉపయోగపడుతుంది. పాలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. ప్రోటీన్ ఫుడ్ తోపాటు వ్యాయామం చేయడం వల్ల శక్తి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అధిక బరువు రాకుండా కాపాడుకుంటే అనారోగ్యాలకు గుర అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి.