Highways Viral Video: ఒకప్పుడు మనదేశంలో హైవేలు కొన్ని నగరాల మధ్య మాత్రమే ఉండేవి. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వాలు పెద్ద పీట వేయడంతో రోడ్ల నిర్మాణం ఊపందుకుంది. ఫలితంగా ప్రాంతాల రూపు రేఖలు మారిపోయాయి. భూముల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. రహదారుల పక్కన కొత్త కొత్త భవనాలు ఏర్పాటయ్యాయి.. హోటళ్లు, షాపింగ్ మాల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
2014 నుంచి ఇప్పటివరకు మనదేశంలో జాతీయ రహదారులు రికార్డు స్థాయిలో నిర్మాణమయ్యాయి. ఇప్పటికీ అనేక రహదారులు నిర్మాణ దశలో ఉన్నాయి. గతంలో హైవేనిర్మాణం అనేది కొన్ని ప్రాంతాల మధ్య మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు దేశంలో అన్ని ప్రాంతాలను కలుపుతూ అద్భుతమైన హైవేలు నిర్మితమవుతున్నాయి. కొత్తగా గ్రీన్ ఫీల్డ్ హైవేలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. రోడ్ల కోసం కేంద్ర ప్రభుత్వం దండిగా నిధులు మంజూరు చేస్తూ ఉండడంతో దేశంలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ రోడ్లు నిర్మితమవుతున్నాయి. వాస్తవానికి రోడ్ల ద్వారానే దేశం బాగుపడుతుంది. ముఖ్యంగా మౌలిక వసతులు బాగుంటాయి. భూముల ధరలు పెరగడంతో అన్ని వ్యాపారాలు జోరందుకుంటాయి. రోడ్ల నిర్మాణం వల్ల ఇప్పటివరకు మనకు ఈ విషయాలు మాత్రమే తెలుసు.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఒక వీడియో మాత్రం మన దేశంలో హైవే లకు కొత్త అర్థం చెబుతోంది. హైవేల నిర్మాణం వెనుక అసలు అంతరార్ధాన్ని బయటపెడుతోంది. ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం దంపతులు ద్విచక్ర వాహనం మీద బయటకు వెళ్తున్నారు. వెనుక వైపు కూర్చున్న ఓ మహిళ లగేజీ బ్యాగ్ ను పట్టుకుంది. కాకపోతే ఆ బ్యాగ్ కింద ఉన్న చక్రాల సహాయంతో లాక్కొని వెళ్తోంది. ఎవరో దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. “థాంక్యూ మోడీజీ.. హైవేలు నిర్మిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు” అంటూ ఆ వీడియోకు ట్యాగ్ లైన్ జత చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
Highways so good u can move ur luggage bags on them
Thank Modi pic.twitter.com/nyes4R8ahU
— Frontalforce (@FrontalForce) September 25, 2025