Smallest Prison: ప్రపంచంలో అతి చిన్న జైలు ఇదే.. ఎక్కడుంది.. ఎంత మంది ఖైదీలు ఉంటారో తెలుసా?

సార్క్‌ దీవిలో 1856లో ఈ చిన్న జైలు నిర్మించారు. చెక్క పీపాను దీనికి పైకప్పుగా ఏర్పాటు చేశారు. తొలి రోజుల్లో ఈ జైలుకు కరెంటు ఉండేది కాదు.

Written By: Raj Shekar, Updated On : June 11, 2024 1:20 pm

Smallest Prison

Follow us on

Smallest Prison: మనం నిశితంగా, ఓపికగా పరిశీలిస్తే, సెర్చ్‌ చేస్తే.. ప్రపంచంలో అనేక వింతలు, విశేషాలు కనిపిస్తాయి. వాటిలో చాలా వరకు ప్రకృతి సిద్ధమైనవి కాగా, కొన్ని మానవ నిర్మాణాలు. అమెరికా, మెక్సికో మధ్య అతి చిన్న వంతెన ఉండగా, బ్రిటన్‌లో ప్రపంచంలోనే అతి చిన్న జైలు ఉంది. ఇందులో కేవలం ఇద్దరు ఖైదీలు మాత్రమే ఉంటారు. ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ దేశాల మధ్య ఇంగ్లిష్‌ ఛానల్‌లోని ఛానల్‌ దీవుల ద్వీప సమూహంలో ఒకటైన సార్క్‌ దీవిలో ఉంది. దీని విస్తీర్ణం 5.4 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ జనభా కేవలం 562 మాత్రమే.

1856లో జైలు నిర్మాణం..
సార్క్‌ దీవిలో 1856లో ఈ చిన్న జైలు నిర్మించారు. చెక్క పీపాను దీనికి పైకప్పుగా ఏర్పాటు చేశారు. తొలి రోజుల్లో ఈ జైలుకు కరెంటు ఉండేది కాదు. జైలు నిర్మించిన శతాబ్దం(వందేళ్ల) తర్వాత కరెంటు ఇచ్చారు. ఇందులో ఇద్దరు ఖైదీలు మాత్రమే ఉంటారు. వారి కోసం ఇందులో రెండు గదులు ఉంటాయి. ఈ జైలు ఇప్పటికీ వినియోగంలో ఉంది.

తక్కువ రోజులే శిక్ష పడేవారికే..
ఈ జైలులో ఖైదీలను ఎక్కువ రోజులు ఉంచు. నిందితులుగా ఉన్న వారు రెండు మూడు రోజులు రిమాండ్‌లో ఉంచడానికి దీనిని వినియోగిస్తున్నారు. కోర్టులో హాజరు పర్చిన తర్వాత ఇక్కడి నుంచి గ్రంజీ దీవిలోని పెద్ద జైలుకు తరలిస్తారు. ఈ జైలుకు ఖైదీలు కూడా తక్కువగా వస్తారు. ఎందుకంటే ఈ దీవిలో జనాభా కూడా తక్కువే. అందుకే అరుదుగా వచ్చే ఖైదీలను రెండు రోజులు ఇక్కడ నిర్బింధిస్తారు.