Sanda Island : అమ్మకానికి సముద్రంలో ఈ దీవి.. ఇందులోని లగ్జరీ.. వింతలు, విశేషాలు ఇవీ

ఇక ఈ దీవిని సొంతం చేసుకోవాలంటే 31 మిలియన్ పౌండ్లు అంటే 26 కోట్ల రూపాయలు చాలు. ఇప్పటికే దీని కోసం క్యూ కట్టారట ప్రజలు.

Written By: NARESH, Updated On : April 30, 2024 9:36 pm

Sanda Island

Follow us on

Sanda Island : సాధారణంగా ఒక చిన్న ఇల్లు, అందులో కొంత లగ్జరీ వస్తువులు ఉంటే చాలు అనుకుంటారు సామాన్యులు. కానీ ఇప్పుడు ఒక ఆఫర్ గురించి వింటే షాక్ అవుతారు. యూకేలోని ఓ స్కాట్లాండ్ లోని బంపర్ ఆఫర్ సామాన్యుడిని సైతం ఊరించేలా ఉంది. పశ్చిమ తీరంలో ఏకంగా 453 ఎకరాల ప్రైవేట్ లగ్జరీ ఐలాండ్ ఒకటి చాలా తక్కువ ధరకే అమ్మకానికి పెట్టారు. ఇందులో ఏడు బెడ్ రూంలు, బీచ్ లు, హెలిప్యాడ్, పబ్ అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సౌకర్యాలు ఉన్నాయి. ప్రముఖ నైట్ ఫ్రాంక్ ప్రాపర్టీస్ దీన్ని అమ్మకానికి పెట్టింది. కానీ దీన్ని మీరు సొంతం చేసుకోవాలంటే మీ దగ్గర రూ. 26 కోట్లు ఉండాలి.

స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్ మధ్య 453 ఎకరాల మేర విస్తరించింది. సాండా ద్వీపం. సాలక మాక్ కార్ట్ నీ, వింగ్చ్ చే 1977 పాట ముల్ ఆఫ్ కింటైర్ ద్వారా పాపులర్ అయింది. ఇది కొన్ని సంవత్సరాల క్రితం నుంచి సన్యాసులు, రాజులు, సాధువులతో చారిత్రక సంబంధం కలిగి ఉంది ఈ దీవి. దీన్ని స్కాటిష్ రాజు రాబర్ట్ ది బ్రూస్, నార్వే రాజు హకోన్ సందర్శించారని సమాచారం. 1946 లో ద్వీపం నుంచి ధ్వంసమైన ఓడ సాండా పేరునే ఈ దీవికి పేరు పెట్టారట. ఇది ఎంతో మంది యజమానులు చేతిలో ఉండేది. ఇందులో స్కాటిష్ గాయకుడు, రాక్ బ్యాండ్ క్రీమ్ కు చెందిన జాక్ బ్రూస్ కూడా ఉన్నారు.

ప్రాపర్టీస్ ఏజెన్సీ నైట్ ఫ్రాంక్ ఇచ్చే సమాచారం ప్రకారం ఇందులో ఏడు ఇల్లు, పబ్ తో పాటు హెలికాప్టర్, బీచ్ లు ఉన్నాయి. పక్కనే రెండు చిన్న దీవులు కూడా ఉన్నాయట. సాండా కొనుగోలు చేసిన వారు ఈ రెండు దీవులను కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ చిన్న దీవుల్లో ఒక దాని మీద లైట్ హౌజ్ కూడా ఉందట.

మరో విశేషం ఏంటంటే.. ఇక్కడ ఒక చిన్న గొర్రెల ఫామ్ కూడా ఉందని సమాచారం. అందులో బ్లాక్ ఫేస్ 55 గొర్రెలు ఉన్నాయి. వన్యప్రాణులతో పాటు పశువులకు కూడా ఇది ఆవాసంగా నిలుస్తుంది. కిట్టివాక్ లు, పఫిన్ లు, షాగ్ లు, రేజర్ బిల్స్, కార్మోరెంట్ వంటి పక్షులు కూడా ఉంటాయి ఇక్కడ. ఉత్తర ఐర్లాండ్ నుంచి బోటులో ఈ దీవికి చేరవచ్చు. ఉత్తర ఐర్లాండ్ లోని క్యాంపెల్ టౌన్ నుంచి 20 కి. మీ దూరంలో ఉంటుందని నైట్ ఫ్రాంక్ సంస్థ తెలిపింది. ఇక ఈ దీవిని సొంతం చేసుకోవాలంటే 31 మిలియన్ పౌండ్లు అంటే 26 కోట్ల రూపాయలు చాలు. ఇప్పటికే దీని కోసం క్యూ కట్టారట ప్రజలు.