Homeవింతలు-విశేషాలుAlbino Hog Deer In Kaziranga National Par: దట్టమైన అడవిలో.. శ్వేత వర్ణంలో జంతువు.....

Albino Hog Deer In Kaziranga National Par: దట్టమైన అడవిలో.. శ్వేత వర్ణంలో జంతువు.. ఇది అత్యంత అరుదు..

Albino Hog Deer In Kaziranga National Par: అది దట్టమైన అడవి.. మండు వేసవిలో కూడా పచ్చగా కనిపిస్తోంది. అటువంటి అడవిలో ఒక శ్వేత వర్ణంలో ఉన్న జంతువు కనిపించింది. ఆ జంతువు కాస్త అడవిలో స్వేచ్ఛగా తిరగడం మొదలుపెట్టింది. పచ్చని గడ్డిని ఆరగించడం ప్రారంభించింది. ఆ జంతువు గెంతుతూ సందడి చేస్తున్న దృశ్యాలు అడవిలో ఏర్పాటుచేసిన సీక్రెట్ కెమెరాలలో రికార్డు అయ్యాయి. దీంతో ఒక్కసారిగా చర్చ మొదలైంది.

మనదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో ప్రముఖమైనది అస్సాం. ఇక్కడ కజరంగ నేషనల్ పార్క్ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఈ పార్కులో ఖడ్గమృగాలనుంచి మొదలు పెడితే పులుల వరకు ఉంటాయి.. విస్తారంగా అడిగి ఉండడంతో జీవ వైవిధ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. పైగా ఇక్కడ జంతువులకు ఆహారం సమృద్ధిగా లభిస్తూ ఉంటుంది. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో అరుదైన జంతువులను అనేకం కనుగొన్నారు. కానీ ఇంతవరకు శాస్త్రవేత్తలకు.. పర్యావరణవేత్తలకు కనిపించని ఒక జంతువు.. సీసీ కెమెరాలలో రికార్డు అయింది. ఆ జంతువు పేరే ఆల్ బినో హాగ్ డీర్.

దీనిని శ్వేత వర్ణ జింక అని పిలుస్తుంటారు. మనదేశంలో కనిపించే జింకలు గాడమైన రంగులో ఉంటాయి. పైగా అవి దేహం పై మచ్చలను కలిగి ఉంటాయి. కానీ ఈ జింక మాత్రం పూర్తిగా శ్వేత వర్ణంలో కనిపిస్తోంది. పైగా దాని నేత్రాలు అత్యంత విశాలంగా ఉన్నాయి. కొమ్ములు కూడా నిటారుగా ఉన్నాయి. దాని చూపు అత్యంత పారదర్శకంగా ఉంది. అది వేగంగా పరుగులు పెడుతూ ఉంది. మిగతా జింకలతో పోల్చి చూస్తే అది అత్యంత బలిష్టంగా ఉంది. శ్వేత వర్ణంలో ఉన్న జింకను చూడటం ఇదే తొలిసారి అని కజిరంగా నేషనల్ పార్క్ సిబ్బంది చెబుతున్నారు.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత ఈ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శ్వేత వర్ణంలో జింక కనిపించడం అస్సాం రాష్ట్రం ఘనతకు గర్వకారణమని పేర్కొన్నారు. కజిరంగా నేషనల్ పార్కులో ఇటువంటి అద్భుతాలు ప్రతి రోజు కనిపిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితం అని ఆయన వెల్లడించారు. ఇటువంటి అరుదైన జంతువులను కాపాడేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు. అయితే ఈ శ్వేత వర్ణంలో ఉన్న జింక ఇక్కడికి ఎలా వచ్చింది.. జింకలలో ఏవైనా జన్యుపరమైన మార్పులు చోటు చేసుకుంటే పుట్టిందా.. లేదా ఏదైనా అద్భుతం జరిగిందా.. అనే కోణాలలో శాస్త్రవేత్తలు పరిశీలన జరుపుతున్నారు.

శ్వేత వర్ణంలో కనిపించే జింకలు అత్యంత అరుదైనవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి విదేశాలలో మాత్రమే ఉంటాయని.. మన దేశ భౌగోళిక వాతావరణానికి ఇవి తట్టుకోలేవని చెబుతున్నారు. అయితే ఈ శ్వేత వర్ణంలో ఉన్న జింక మాత్రం అత్యంత ఆరోగ్యంగా ఉంది. అడవిలో స్వేచ్ఛగా విహరిస్తోంది. ఒకవేళ దీనిని గనుక సంరక్షిస్తే.. శ్వేత వర్ణంలో ఉన్న జింకల సంఖ్య పెరుగుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper