Homeవింతలు-విశేషాలుRajasthan Groom: రూ.31 లక్షల కట్నం వదులుకున్న వరుడు.. అమ్మాయిని ఇవ్వడమే గొప్ప అంటూ ఆదర్శ...

Rajasthan Groom: రూ.31 లక్షల కట్నం వదులుకున్న వరుడు.. అమ్మాయిని ఇవ్వడమే గొప్ప అంటూ ఆదర్శ వివాహం!

Rajasthan Groom: ఇటీవల తెలంగాణలో ఓ ఐఏస్, ఐపీఎస్‌ ఆదర్శ వివాహం చేసుకున్నారు. హంగు, ఆర్భాటాలతో పెళ్లితో డబ్బులు వృథా అవుతాయని గుర్తించి సింపుల్‌గా రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఇలాంటి అవేర్నెస్‌ ఇటీవలికాలంలో పెరుగుతోంది. అదే సమయంలో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లు, కొత్త కొత్త సెట్టింగ్‌లతో జరిగే పెళ్లిళ్లు కూడా అంతకన్నా ఎక్కువగా ఉన్నాయి. ఇక మనదేశంలో వరకట్నం నిషేధం. అయినా అమ్మాయి తరఫువాళ్లు ఇవ్వడం, అబ్బాయి తరఫువాళుల తీసుకోవడం ఆనవాయితీగా మారింది. తీసుకోకపోతే అనుమానించడం కూడా జరుగుతుంది. కానీ, ఇక్కడ ఓ యువకుడు రూ.31 లక్షల కట్నాన్ని సున్నితంగా తిరస్కరించాడు.

అసాధారణ నిర్ణయం..
రాజస్థాన్‌ అల్వార్‌లోని బిలాలీ గ్రామానికి చెందిన ధీరేంద్ర సింగ్‌ షెఖావత్‌ కుటుంబం కట్నా వ్యవస్థకు వ్యతిరేకంగా అసాధారణ నిర్ణయం తీసుకుంది. కోట్‌పుట్లీ యువతితో అతనికి వివాహం నిశ్చయమైంది. యువతి తండ్రి రూ.31 లక్షలు కట్నంగా ఇవ్వాలని నిర్ణయించాడు. ఈమేరకు వరుడికి విషయం తెలిపాడు. దానిని ధీరేంద్రసింగ్‌తోపాటు అతని తండ్రి సున్నితంగా తిరస్కరించారు. కేవలం రూ.1, కొబ్బరి స్వీకరించారు.

వివాహ సంఘటన వివరాలు
ఫిబ్రవరి 10న జరిగిన వివాహంలో వధువు తండ్రి నగదు అందించినా, ధీరేంద్ర తండ్రి జాలిమ్‌ సింగ్‌ తిరస్కరించారు. మీ కూతురును ఇవ్వడమే మాకు గొప్ప బహుమతని చెప్పి, లక్ష్మీస్వరూపిణిని ఆదరించారు. ఈ చర్య స్థానికుల్లో భావోద్వేగాలు రేకెత్తించింది. వివాహానికి హాజరైనవారు, సమాజం ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు. దహేజ్‌ వ్యవస్థను వ్యతిరేకిస్తూ యువతకు స్ఫూర్తిగా మారింది.

ఈ సంఘటన ఆర్థిక ఒత్తిడి లేకుండా వివాహాలు జరగాలనే సందేశాన్ని ఇస్తుంది. సామాజిక మార్పు కోసం వ్యక్తిగత నిర్ణయాలు కీలకం. దీర్ఘకాలంలో ఇలాంటి ఆదర్శాలు కట్నా ఆచారాన్ని క్రమంగా నిర్మూలించే అవకాశం రావొచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Rajahmundry vibes (@rajahmundry_vibe)

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular