Koheda: వినాయకుడు అభిషేక ప్రియుడు. ఎంతలా ఆయనను పూజిస్తే అంతలా వరాలు కురిపిస్తాడు. అందువల్లే వినాయక చవితి సందర్భంగా స్వామివారిని ప్రతిష్ఠించే క్రమంలో.. భక్తులు పూజలు ఘనంగా నిర్వహిస్తారు. చవితి రోజు వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించ క్రమంలో పూజలు చేసే అర్చకుడితోనే చివరి వరకు ఆ క్రతువు జరిపిస్తారు. అందువల్లే ఈ తొమ్మిది రోజులపాటు ఈ పూజారులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.. అందువల్ల నిర్వాహకులు మా గణపతికే ముందు పూజలు చేయాలని నిర్వాహకులు గొడవలకు దిగుతారు. అయితే సిద్దిపేట జిల్లాలోని కోహెడ లో మాత్రం ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు తీవ్ర చర్చకు కారణమవుతోంది.
Also Read: టైమ్స్ నౌ – జేవీసీ సర్వే: బీహార్లో గెలుపు ఎవరిదంటే?
కోహెడ ప్రాంతంలో కొంతమంది గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. విగ్రహాన్ని ప్రతిష్టించిన చోట తొలి రోజు ఘనంగా పూజలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే బ్రాహ్మణుల కొరత ఉండడం.. మండపాలు ఎక్కువగా ఉండటంతో సాధారణంగానే డిమాండ్ పెరిగింది. దీంతో నిర్వాహకుల మధ్య పోటీ ఏర్పడింది. దీంతో పూజలు చేయాలని పూజారుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ముందుగా తమ ప్రతిష్టించిన గణపతికే పూజలు చేయాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో కొంతమంది ద్విచక్ర వాహనం మీద ఓ పూజారిని బలవంతంగా మండపం వద్దకు తీసుకెళ్లారు. ఆ పూజారి పేరు కనకయ్య. ఆ ప్రాంతంలో గణపతి మండపాలు ఎక్కువగా ఉండడం.. పూజారుల సంఖ్య తక్కువ ఉండడంతో డిమాండ్ పెరిగింది. దీంతో ఓ ప్రాంతంలో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు.. బలవంతంగా పూజారిని తమ ద్వి చక్రవాహనం మీద తీసుకెళ్లారు. అయితే ఈ తతంగం మొత్తాన్ని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ఇప్పుడు విస్తృతమైన చర్చకు కారణమవుతోంది.
గతంలో వినాయక చవితి ఈ స్థాయిలో జరిగేది కాదు. పరిమిత సంఖ్యలోనే మండపాలు ఏర్పాటయ్యేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మండపాల సంఖ్య పెరగడం.. పూజారుల సంఖ్య తగ్గడంతో డిమాండ్ పెరిగింది. దీంతో నిర్వాహకుల మధ్య పోటీ పెరిగింది. దీంతో ఇలా వాగ్వాదాలు జరుగుతున్నాయి. కోహెడ లో జరిగిన సంఘటన సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే వెలుగులోకి రాని సంఘటనలు చాలా ఉన్నాయి.
View this post on Instagram