PR23: వ్యవసాయం అనేది రోజురోజుకు ఆధునికతను సంతరించుకుంటున్నది. అవసరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో అధిక దిగుబడిన వంగడాలను శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు. మనదేశంలో దాన్యం, గోధుమలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే దక్షిణ భారత రాష్ట్రాలలో బియ్యాన్ని ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తుంటారు. ఉత్తరాది రాష్ట్రాలలో గోధుమలను ప్రధాన ఆహారంగా వాడుతుంటారు. గోధుమలు ఉత్తర భారత రాష్ట్రాలలో విస్తారంగా పండుతుంటాయి. ఇప్పటికే గోధుమలలో అధికంగా దిగుబడి ఇచ్చే వంగడాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. వరిలో కూడా ఆ దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి.
వరి మనదేశమే కాకుండా చైనా వంటి దేశాలలో కూడా పండుతుంది. మనదేశంలో ధాన్యం దిగుబడి పంజాబ్, హర్యాన రాష్ట్రాలలో అధికంగా వస్తూ ఉంటుంది. అయితే చైనాలో మాత్రం దిగుబడి ఎక్కువగా ఉంటుంది. చైనా శాస్త్రవేత్తలు ఎక్కువ దిగుబడి అందించే వరి వంగడాలను సృష్టించారు. మరింత దిగుబడి ఇచ్చే వంగడాలని కూడా సృష్టిస్తున్నారు. చైనా శాస్త్రవేత్తల సృష్టించిన ఓ వంగడం ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఆ వంగడం పేరు చైనా పీఆర్ 23.
PR 23 వంగడాన్ని ఒక్కసారి నాటితే మూడు సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది. మూడు సంవత్సరాలలో ఆరుసార్లు పంటను కోసే అవకాశం ఉంటుంది. దీనివల్ల సాగు ఖర్చు 29 శాతం వరకు తగ్గిందని అధ్యయనాలలో తేలింది. పైగా ఈ పంట 119 రోజుల్లోనే కోతకు వస్తుంది. తొలి కోతలు హెక్టార్ కు 6.8 నుంచి 7.5 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. తర్వాత కోతలలో 5.4 నుంచి 6.3 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. మనదేశంలో ధాన్యం దిగబడి హెక్టార్ కు 4.2 టన్నులే . ఆసియా, ఆఫ్రికాలోని 17 దేశాలలో పర్యావరణ పరిస్థితులు విభిన్నంగా ఉండడం వల్లే PR 23 వంగడం మెరుగైన దిగుబడి ఇస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
వరిని మనదేశంలో అర్ధవార్షిక పంటగా సాగు చేస్తుంటారు. వానా కాలం, వేసవికాలం లో వరిని సాగు చేస్తుంటారు. వరికి అధికంగా నీరు అవసరం ఉంటుంది. పైగా ఇటీవల కాలంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ మెరుగు పడడం వల్ల వరి సాగు విస్తారంగా జరుగుతోంది. వరిలో కూడా విభిన్న రకాలైన వంగడాలు అందుబాటులోకి రావడంతో రైతులు సాగు చేస్తున్నారు. అయితే ఎన్ని రకాల వంగడాలు వచ్చినప్పటికీ మనదేశంలో సరాసరి దిగుబడి తక్కువగా ఉండడం విశేషం. అయితే దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఎక్కువ దిగుబడి వచ్చే వంగడాలను సృష్టించడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. చైనా పిఆర్ 23 మాదిరిగానే వరిలో అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను సృష్టించడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.