Sarpanch Navya: సోషల్ మీడియా అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఎవరికివారు సొంతంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా అనేది బలమైన వేదిక కావడంతో తమలో ఉన్న ప్రతిభను బయట పెట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు పాటలు పాడుతుంటే.. కొందరు డ్యాన్సులు వేస్తున్నారు.. మిగతావారు తమలో ఉన్న నైపుణ్యాన్ని రకరకాలుగా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో జనాలకు కనెక్ట్ అయిన వారు అవకాశాలు దక్కించుకుంటున్నారు. ప్రస్తుత బిగ్ బాస్ లో దువ్వాడ మాధురి, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష, సోషల్ మీడియా ద్వారానే వెలుగులోకి వచ్చారు. ఏకంగా బిగ్ బాస్ లో కి వెళ్లే అవకాశాన్ని దక్కించుకున్నారు..
దువ్వాడ మాధురి బిగ్ బాస్ లోకి వెళ్లడంతో.. ఆమె లేని లోటును తీర్చడానికి సర్పంచ్ నవ్య ముందుకు వచ్చినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. తన భర్తతో కలిసి పాపులర్ తెలుగు పాటలతో డ్యాన్సులు వేస్తూ అదరగొడుతోంది. అప్పట్లో గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే రాజయ్య ఎపిసోడ్తో నవ్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత అది సంచలనంగా మారింది. రాజయ్య ఎపిసోడ్తో నవ్య ఒకసారిగా పాపులర్ అయిపోయింది. ఆ ఎన్నికల్లో రాజయ్యకు టికెట్ దక్కకపోవడానికి ప్రధాన కారణం నవ్య అని ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుసగుసలు వినిపించాయి. రాజయ్యకు టికెట్ రాకపోవడంతో అప్పట్లో నవ్య సంబరాలు కూడా జరుపుకున్నట్టు వార్తలు వచ్చాయి.
ఎన్నికలు ముగిసిన తర్వాత నవ్య కూడా పెద్దగా వెలుగులోకి రాలేదు. ఇప్పుడు ఒకసారి గా సోషల్ మీడియాలో తన వీడియోలు విడుదల చేస్తూ సంచలనం రేపుతోంది. నవ్య. వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఫిమేల్ పొలిటికల్ లీడర్లు పెద్దగా లేరు. అయితే నవ్య ఇప్పుడు ఆ స్థానాన్ని ఆదుకోవడానికి ఆత్రుతగా ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్లే సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ అదరగొడుతోంది. పాపులర్ సినిమా పాటలకు తన భర్తతో స్టెప్పులు వేస్తూ సందడి చేస్తోంది.
ఇటీవల ఒక ఫంక్షన్ కి వెళ్ళిన నవ్య.. తన భర్తతో కలిసి గిటార్ పట్టుకొని 360 డిగ్రీల కోణంలో ఫోటోలు దిగింది. వీడియోలలో కూడా కనిపించింది. ఆ వీడియో సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో కొద్దిరోజులపాటు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆ వీడియోను తెగ ప్రమోట్ చేశాయి. ఇక ఇప్పుడు తనకు వచ్చిన పాపులారిటీని ఉపయోగించుకోవాలని నవ్య భావిస్తుంది. ఇదే దూకుడు కనక నవ్య కొనసాగిస్తే వచ్చే బిగ్ బాస్ సీజన్లో హౌస్ లోకి వెళ్లే అవకాశం లేక పోలేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.