Attari Railway Station: సాధారణంగా మనమందరం ప్రయాణాలు చేస్తుంటాం. దూర అయితే ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా రైలు లేదా విమాన ప్రయాణానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అయితే మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా వీసా ఉండాలి. అదే మన దేశంలో విమాన ప్రయాణం చేయాలంటే వీసా లేకుండా కూడా చేయవచ్చు. అదే రైల్వే స్టేషన్ అయితే ఫ్లాట్ ఫాం టికెట్ లేదా ప్రయాణ టికెట్ ఉంటే చాలు. కానీ మన దేశంలో ఉండే ఓ రైల్వే స్టేషన్‌కి వెళ్లాలంటే తప్పనిసరిగా వీసా ఉండాలి. అది కూడా పాకిస్థాన్ వీసా. వినడానికి కొత్తగా ఉన్న మీరు విన్నది కరెక్టే. మన దేశంలో ఉన్న రైల్వే స్టేషన్‌కి వెళ్లాలంటే పాకిస్థాన్ వీసా ఎందుకు? ఇంతకీ ఆ రైల్వే స్టేషన్ పేరు ఏంటి? ఎక్కడ ఉంది? పూర్తి వివరాలు తెలియాలంటే మొత్తం చదివేయండి.
భారత్, పాకిస్థాన్ సరిహద్దులో అట్టారీ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ స్టేషన్ లోపలికి వెళ్లాలంటే పాస్‌పోర్ట్‌తో పాటు పాకిస్థాన్ వీసా కూడా ఉండాలి. ఈ రైల్వే స్టేషన్‌ను అట్టారీ శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్ అని కూడా అంటారు. ఇది పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ జిల్లాలో ఉంది. భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో అత్యంత సున్నితమైన ప్రదేశం ఇదే. అయితే ఈ రైల్వే స్టేషన్ అట్టారి, వాఘా బోర్డర్‌లో ఉంది. అట్టారి ప్రాంతం ఇండియాకు చెందినది. వాఘా అనేది పాకిస్థాన్‌కు చెందినది. అందుకే ఆ రైల్వే స్టేషన్‌కు వెళ్లడానికి పాకిస్థాన్ వీసా తప్పకుండా ఉండాలని నియమం పెట్టారు. అయితే కొన్ని ఏళ్ల నుంచి రెండు దేశాల మధ్య శాంతియుత సంబంధాలు తగ్గిపోయాయి. దీంతో రెండు దేశాల మధ్య రాకపోకలు తగ్గిపోయాయి. గతంలో భారత్, పాకిస్థాన్ మధ్య నడిచే సంజౌతా ఎక్స్‌ప్రెస్ రైలు కూడా రద్దు చేశారు.
అట్టారి రైల్వే స్టేషన్ ఇండియాలో ఉన్నా కూడా మన వాళ్లు ఆ స్టేషన్‌కు వెళ్లాలంటే తప్పనిసరిగా వీసా, పాస్‌పోర్టు ఉండాలి. ఈ స్టేషన్ పాకిస్థాన్‌కి ఎంట్రీ పాయింట్ అయితే మనకి ఇది ఎగ్జిట్ పాయింట్. దీనివల్ల సరిహద్దులో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్ నుంచి వెళ్లే ప్రయాణికులకు తనిఖీలు చేసిన తర్వాతే వాళ్లను లోపలికి వదులుతారు. ఈ స్టేషన్ నుంచి ఎవరైనా పాకిస్థాన్‌లోకి వెళ్లిన, అటు నుంచి ఇటు వచ్చిన వాళ్లను కూడా ఈ మార్గంలోనే పంపిస్తారు. నార్తర్న్ రైల్వే జోన్‌లో ఈ స్టేషన్ ఉండగా.. ఫిరోజ్‌పూర్ డివిజన్ దీన్ని చూస్తుంటుంది. ప్రతి ఏడాది స్వాతంత్ర దినోత్సవానికి రెండు దేశాల సైనికులు స్వీట్స్ ఇచ్చుకుని విషెష్ చెప్పుకుంటారు. రెండు దేశాల మధ్య శాంతియుతమైన ఒప్పందాలు ఏవైనా జరిగితేనే మళ్లీ ఈ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు ఉండే అవకాశం ఉంటుంది.