https://oktelugu.com/

Preeclampsia: గర్భం దాల్చిన 20 వారాల తర్వాత ప్రీఎక్లంప్సియా వస్తుందా? ఇది ప్రమాదకరమా!

మహిళలు గర్భం దాల్చక ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటారు. ఆరోగ్యం ఎలా ఉందో అన్ని చెక్ చేసుకున్న తర్వాతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తారు. అయితే కొంతమంది మహిళలకు గర్భం దాల్చక ముందు నుంచే కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి.

Written By:
  • Neelambaram
  • , Updated On : August 31, 2024 / 02:23 AM IST

    Preeclampsia

    Follow us on

    Preeclampsia: గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ అయ్యేవరకు గర్భిణులు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తారు. మరీ ముఖ్యంగా ఆహార విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే.. ఏదో ఒక సమస్య గర్భిణులను వేంటాడుతూనే ఉంటుంది. గర్భ దాల్చిన తర్వాత మహిళలకు చాలా సమస్యలు వస్తాయి. అలాంటివాటిలో ప్రీఎక్లంప్సియా ఒకటి. ఈమధ్య కాలంలో ఈ సమస్య బారిన పడుతున్న మహిళలు సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు కూడా తెలుపుతున్నాయి. అసలు ఈ ప్రీఎక్లంప్సియా అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? ఈ వ్యాధి వస్తే ప్రమాదకరమా? అనే విషయాలు తెలుసుకుందాం.

    ప్రీఎక్లంప్సియా అంటే?
    మహిళలు గర్భం దాల్చక ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటారు. ఆరోగ్యం ఎలా ఉందో అన్ని చెక్ చేసుకున్న తర్వాతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తారు. అయితే కొంతమంది మహిళలకు గర్భం దాల్చక ముందు నుంచే కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి. మహిళలకు గర్భం దాల్చక ముందు లేదా దాల్చిన తర్వాత అధిక రక్తపోటు, మూత్రం వల్ల అధిక ప్రోటిన్ వెళ్లిపోతుంది. దీనినే ప్రీఎక్లంప్సియా అంటారు. సాధారణంగా ప్రీఎక్లంప్సియా అనేది గర్భం దాల్చిన 20వారాలకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య వచ్చిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, చికిత్స తీసుకోవాలి. లేకపోతే గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే పుట్టే బిడ్డ కూడా బలహీనంగా పుడతారని చెబుతున్నారు. వీటితో పాటు కిడ్నీ, కాలేయ సమస్యలు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు. కొంతమందిలో ప్లేట్‌లేట్స్ తగ్గడం, తల్లికి ఫిట్స్‌, అధిక రక్తస్రావం, రక్తం గడ్డకట్టే తత్వాన్ని కోల్పోవడం, బీపీ పెరగడం, మూత్రపిండాలు, మెదడు వంటి భాగాలపై కూడా ప్రభావం చూపుతుంది.

    ఇది రావడానికి కారణం?
    ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో ప్రీఎక్లంప్సియా రావడం, కడుపులో కవలలు ఉండటం, ప్రెగ్నెన్సీకి ముందు డయాబెటిస్ రావడం, వంశపారంపర్యం వంటి కారణాల వల్ల వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి దీనిని వెంటనే గుర్తించి డాక్టర్‌ను సంప్రదించాలి. నిరంతరంగా తలనొప్పి, పొత్తికడుపులో నొప్పి, బరువు పెరగడం, వాంతులు, వికారం, తల తిరగడం, మూత్రం తక్కువగా రావడం, కంటిచూపు మసకబారడం, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది చేతులు వాపుగా మారడం వంటి లక్షణాలన్నీ కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. దీన్ని తగ్గించడానికి ప్రొటీన్యూరియా, రక్త, మూత్ర పరీక్షలు, మూత్రపిండాలు, నాన్ స్ట్రెస్ టెస్ట్, ఫీటస్ ఆల్ట్రాసౌండ్ కాలేయ పరీక్షలు చేయించుకోవాలి. వచ్చిన ఫలితాలను బట్టి వైద్యులు చికిత్స చేస్తారు. అయితే నెలలు నిండకుండా డెలివరీ అయిన మహిళల్లో ఈ ప్రీఎక్లంప్సియా ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి సమస్యను వెంటనే గుర్తించి చికిత్స తీసుకోవాలి. లేకపోతే తల్లి, బిడ్డకి ప్రమాదమే.